For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi June 12th Episode: అనుకున్నది చేసిన తులసి.. అభికి తెలిసిన నిజం.. అంతలోనే ఘోరం

  |

  చాలా రోజులుగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో రన్ అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మీ' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మీ' శనివారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో చూద్దాం పదండి!

   శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. అగ్రిమెంట్ మీద సంతకం పెట్టించుకోవడం కోసం ఇంటికొచ్చిన లాస్యకు తులసి భారీ షాక్ ఇస్తుంది. దీంతో తిరిగి వెళ్లి నందూను రెచ్చగొడుతుందామె. ఆ తర్వాత నందూనే నేరుగా అక్కడకు వస్తాడు. అతడిని కూడా తులసి దారుణంగా అవమానిస్తుంది. మరోవైపు, అంకిత ప్రెగ్నెంట్ అన్న విషయం అభికి తెలిసిపోయేలోగా ఆమె తప్పించుకుంటుంది.

   అన్నీ అడిగి సంతకం చేసిన తులసి

  అన్నీ అడిగి సంతకం చేసిన తులసి

  నందూ.. తులసి మధ్య గొడవతో ఈరోజు ఎపిసోడ్ ప్రారంభం అవుతుంది. సంతకం కోసం వచ్చిన భర్తను తులసి అడగాల్సివన్నీ అడుగుతుంది. అప్పుడు నందూ ‘వంద రూపాయలు ఇస్తే నీ పనులన్నీ పని మనిషి చేసేది' అంటాడు. దీంతో కోపంతో రగిలిపోయిన తులసి ‘మరి సంతకం కూడా అలానే పెట్టించుకోండి' అంటూ ఫైర్ అవుతుంది. చివరకు అగ్రిమెంట్‌పై సైన్ చేసి పంపించేస్తుంది.

  అబార్షన్ ముందు అంకిత పొరపాటు

  అబార్షన్ ముందు అంకిత పొరపాటు

  అంకితకు అబార్షన్ చేయించడం కోసం ఆమె తల్లి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. దీనిపై ఇద్దరి మధ్య సంభాషణ జరుగుతుంది. అప్పుడు అంకిత.. ‘అభికి తెలిస్తే ప్రాబ్లం అవుతుంది. నువ్వు ఒక్కసారి ఆలోచించు మమ్మీ' అంటూ చెబుతుంది. కానీ, ఆమె తల్లి మాత్రం అస్సలు వినిపించుకోదు. ‘నీ కెరీర్ కావాలంటే అడ్డంగా ఉన్న వాటిని తప్పించాలి' అంటూ ఆఖరికి అబార్షన్‌కు ఒప్పిస్తుంది.

   అనుకున్న దాన్ని సాధించిన తులసి

  అనుకున్న దాన్ని సాధించిన తులసి

  తులసి ఇంట్లో తయారు చేసిన డిజైన్స్‌ను పరిశీలించడానికి అమిత్ మిశ్రా కంపెనీకి చెందిన ఉద్యోగులు వస్తారు. అప్పుడు వీళ్లు తయారు చేసిన బట్టలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలిస్తారు. అనంతరం అవన్నీ బాగున్నాయని చెప్పి తులసిని అభినందిస్తారు. దీంతో సంతోష పడుతూ.. ‘ఏమీ చేతకాదని ఎంతో మంది అవమానించారు. వాళ్లకిప్పుడు సమాధానం దొరికింది' అని అంటోంది తులసి.

   గుడ్ న్యూస్ చెప్పిన మిశ్రా కంపెనీ

  గుడ్ న్యూస్ చెప్పిన మిశ్రా కంపెనీ

  తులసి తయారు చేయించిన డిజైన్స్ అన్నీ బాగుండడంతో మిశ్రా కంపెనీ ప్రతినిధులు ఆమెకు మనీ పంపిస్తామని చెబుతారు. అలాగే, ఇప్పుడు ఇచ్చిన కాంట్రాక్టును పొడిగించడంతో పాటు దీన్ని మరో ఐదు రెట్టు ఎక్కువగా పెంచి డిజైన్స్ ఇస్తామని అంటారు. దీంతో పక్కనే ఉన్న శృతి కూడా ఆనందంతో మురిసిపోతుంది. వెంటనే తులసిని గట్టిగా పట్టుకుని మరీ అభినందిస్తుంది.

  Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
   అబార్షన్ తర్వాత అభికి తెలిసిన నిజం

  అబార్షన్ తర్వాత అభికి తెలిసిన నిజం

  తన తల్లితో మాట్లాడుతోన్న సమయంలో డాక్టర్‌కు పంపించబోయి.. పొరపాటున తన ప్రెగ్నెన్సీ రిపోర్టులన్నీ అభి మెయిల్‌కు సెండ్ చేస్తుంది అంకిత. దీంతో అతడికి అసలు నిజం తెలిసిపోతుంది. అయితే, అప్పటికే అంకితకు అబార్షన్ అయిపోతుంది. డాక్టర్‌తో ఆమె మాట్లాడుతున్న సమయంలోనే అభి ఫోన్ చేస్తాడు. కానీ, ఏ సమాధానం చెప్పాలో తెలీక అంకిత మాత్రం కాల్ లిఫ్ట్ చేయదు.

  తల్లి ముందు దివ్య కోరిక.. శృతికి క్లాస్

  తల్లి ముందు దివ్య కోరిక.. శృతికి క్లాస్


  తులసి దగ్గరకు వచ్చి దివ్య తనకు కొత్త లాప్‌టాప్ కొనివ్వమని అడుగుతుంది. దీనికి రూ. 50 అవుతుందని చెబుతుంది. దీంతో ఆమె లెక్కలు వేసుకుంటుండగా.. శృతి వచ్చిన తన ఫ్రెండ్ దగ్గర వాడని ఓ లాప్‌టాప్ ఉందని.. దాన్ని దివ్యకు తెచ్చివ్వనా అని అడుగుతుంది. కానీ, దీనికి తులసి ఒప్పుకోదు. పరాయి సొమ్ము పాములాంటిది అని చెప్పి శృతికి కాసేపు క్లాస్ పీకుతుందామె.

  English summary
  Intinti Gruhalakshmi Episode 344: Amith Misra Company Liked Tulasi Designs and They Gave Another Contract to Her. Ankitha Went to Hospital for abortion.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X