Intinti Gruhalakshmi: రాజ్యలక్ష్మి మరో ప్లాన్.. విక్రమ్‌ను రెచ్చగొట్టిన దివ్య.. లాస్య రాకతో షాక్

దాదాపు రెండున్నర దశాబ్దాలుగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రం ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' సోమవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే:శనివారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. నీరసంగా ఉన్నా నీళ్లు మోసుకొచ్చి అభిషేకం చేస్తుంది. తర్వాత అఖండ దీపాన్ని చేతిలో పట్టుకుని హోమంలో వేయాలని చెప్తారు. ఆ సమయంలో దివ్య 'ఈ పూజ మా నాన్న కోసం చేస్తున్నా' అనగానే రాజ్యలక్ష్మి షాక్ అవుతుంది. ఆ తర్వాత కోర్టులో లాస్యకు వ్యతిరేకంగా ఆమె మాజీ భర్త, భాగ్య సాక్షాలు చెప్తారు. దీంతో నందూ శిక్షను రద్దు చేయడంతో పాటు లాస్యను జడ్జ్ మందలిస్తారు. తర్వాత వీళ్లిద్దరినీ కలిసి ఒక నెల ఉండమని చెప్తారు. నందూ విడుదలైన విషయాన్ని విక్రమ్‌కు ఫోన్ చేసి తులసి చెప్పడంతో సంతోషిస్తారు.

Intinti Gruhalakshmi Serial Today Episode June 12th 2023

ఫస్ట్ నైట్ గురించి మాట్లాడుతూ:పూజ చేసిన తర్వాత నీరసంతో పడుకున్న దివ్య దగ్గరికి వచ్చిన విక్రమ్ ఆమె నుదుటన ముద్దు పెడతాడు. దీంతో దివ్య ఎంత ధైర్యం అంటుంది. ఆమె మాటకు షాకైన విక్రమ్ ఎందుకు అని అడుగుతాడు. దీంతో దివ్య 'పట్టపగలు తలుపులు తెరిచి ఉండగా ఇలా ధైర్యం చేసి ముద్దు పెట్టారు కదా అందుకు. అయినా మీ అమ్మగారు తప్పు చేస్తున్నారు. అన్ని సమస్యలకి పరిష్కారాన్ని ఆలోచించే ఆవిడ.. ఎందుకు మన ఫస్ట్ నైట్ గురించి ఆలోచించలేకపోతున్నారు' అని రెచ్చగొడుతుంది.

Intinti Gruhalakshmi Serial Today Episode June 12th 2023

భరించలేకపోయిన రాజ్యలక్ష్మి:దివ్య మాటలకు విక్రమ్ 'ఆవిడ నా మంచి కోరే మనిషి. ఎప్పటికీ మనకు అన్యాయం చేయదు' అంటాడు. దీంతో దివ్య 'ఆవిడ మంచిది కాదని అనటం లేదు. ఆవిడను ఎవరో తప్పుతోవ పట్టిస్తున్నారు అంటున్నాను. కాస్త మనసుతో ఆలోచించు' అని చెప్తుంది. దీంతో విక్రమ్ సరే అని చెప్పి దివ్యకు సూప్ తాగిస్తాడు. అప్పుడు దివ్య 'నాన్నను చూడాలని ఉంది' అనగానే విక్రమ్ 'పూజ కోసమే వెయిట్ చేశాం. అయిపోయింది కదా వెళ్దాంలే' అంటాడు. వాళ్లిద్దరూ అలా నవ్వుతూ మాట్లాడుకోవడాన్ని చూసి రాజ్యలక్ష్మి భరించలేక పోతుంది.

Intinti Gruhalakshmi Serial Today Episode June 12th 2023

లాస్యను చూసి వాళ్లు షాకింగ్:జైలు నుంచి ఇంటికి వచ్చిన నందూతో పాటు తులసికి అనసూయ దిష్టి తీయబోతుంది. అప్పుడే అక్కడకు లాస్య షడన్‌గా వస్తుంది. అంతేకాదు, 'దిష్టి తీయవలసింది మా ఇద్దరికీ.. కావాలనే మా కాపురంలో చిచ్చు పెట్టాలని చాలా మంది చూస్తున్నారు' అంటూ తులసి వైపు చూస్తుంది. మరోసారి లాస్య తమ ఇంటికి రావడంతో అనసూయ, పరందామయ్య షాక్ అవుతారు. అప్పుడు అత్త మళ్లీ ఎందుకు దాపరించావు అంటూ లాస్యను తిడుతుంది. అనంతరం ఇష్టం లేకపోయినా లాస్య, నందూకు దిష్టి తీసి లోపలికి వెళ్లమంటుంది.

మనసు మారొచ్చుగా అంటూ:అనసూయ కోపంగా ఉండడంతో లాస్య 'నేను మీ అబ్బాయి రమ్మంటే ఇక్కడికి రాలేదు. మీ ఆయనతో వెళ్లి కాపురం చేసుకో అని కోర్టు తీర్పు ఇచ్చింది కాబట్టే వచ్చాను' అంటూ అత్తమామలకి చెప్పి తన రూమ్‌కు వెళ్లిపోతుంది. లాస్య మాటలు అర్థంకాక తెల్ల మొహం వేసిన తల్లిదండ్రులకు నందూ జరిగిందంతా చెప్తాడు. దీంతో పరందామయ్య 'మళ్లీ మాకు ఏంటి ఈ తల నొప్పులు' అంటాడు. దీంతో తులసి 'ఏమో మావయ్యా... ఈ నెల రోజుల్లో ఎవరి మనసులు ఎలా మారుతాయో ఎవరికి తెలుసు' అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.

Intinti Gruhalakshmi Serial Today Episode June 12th 2023

శాశ్వతంగా దూరం చేయాలి:ఇక, బాధపడుతున్న బసవయ్య దగ్గరికి వచ్చిన రాజ్యలక్ష్మి ఏం జరిగింది అని అడుగుతుంది. దీనికతడు 'దివ్యను అణగదొక్కటానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటే అది రివర్స్ అయి మనకే చుట్టుకుంది. దానికి తోడు దివ్య వాళ్ళ నాన్న రిలీజ్ అయ్యాడు. కూతురుకి ముక్కు మీద కోపం ఉంటే ఆ బాహుబలికి ఒళ్లంతా కోపమే. ఇప్పుడు ఏం చేయటం' అంటాడు. దీంతో రాజ్యలక్ష్మి 'ఇక్కడ అంత చేతకాని వాళ్ళు ఎవరు లేరు. ఇన్నాళ్లు విక్రమ్.. దివ్యను అసహ్యించుకుంటే చాలు అనుకున్నాను. కానీ వాడి జీవితంలో దాన్ని లేకుండా చేయాలి. పూజ విషయంలో ఫెయిల్ అయినంత మాత్రాన బాధపడవలసిన అవసరం లేదు' అని ధైర్యం చెప్తుంది.

Intinti Gruhalakshmi Serial Today Episode June 12th 2023

బ్లాక్‌మెయిల్ చేసిన లాస్య:జైలు నుంచి ఇంటికి వచ్చిన కొడుకుకు అనసూయ ప్రేమగా అన్నం వడ్డిస్తూ ఉంటుంది. అప్పుడు లాస్య వచ్చి 'మీరు భోజనం వడ్డిస్తే భార్యగా నేనేం అయిపోవాలి? ఈ నెల రోజులు నాకు చాలా కీలకమైనవి. నేను నా భర్త అభిమానాన్ని సంపాదించుకోవాలి' అంటుంది. దీంతో అనసూయ 'అబ్బో మొగుడు మీద పుట్టుకొచ్చింది ప్రేమ.. అయినా నా కొడుక్కి నేను ఒడ్డించుకుంటే నీకేంటి నొప్పి' అంటుంది. దీంతో లాస్య 'మా భార్యాభర్తలను కలవనివ్వడం లేదు అని చెప్పి మళ్ళీ కోర్టుకు వెళ్తాను. అప్పుడు మీ ఇద్దరినీ జైల్లో వేస్తారు' అని బ్లాక్‌మెయిల్ చేస్తుంది.

Intinti Gruhalakshmi Serial Today Episode June 12th 2023

జైల్లో కూర్చుంటారు అంటూ:లాస్య మాటలకు అనసూయ భయపడిపోయి పక్కకు తప్పుకుంటుంది. ఆ వెంటనే లాస్య వచ్చి నందూ ప్లేట్‌లో అన్నం వడ్డిస్తుంది. ఆ సమయంలో లాస్య 'జాగ్రత్తగా ఆలోచించుకో.. పెట్టింది తింటే నీ తల్లిదండ్రులకే మంచిది. లేదంటే వాళ్ళు తిన్నగా జైల్లో కూర్చుంటారు' అంటుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X