Intinti Gruhalakshmi Today Episode: ప్రేమ్‌ కోసం అంకిత షాకింగ్ నిర్ణయం.. అభి ఉచ్చుకు చిక్కుకోవడంతో!

సుదీర్ఘ కాలంగా తెలుగు బుల్లితెపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి భారీ నుంచి అతి భారీ స్థాయిలో స్పందన దక్కుతుంది. సుదీర్ఘ కాలంలో ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' సోమవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరు కూడా ఓ లుక్కేయండి!

Photos Courtesy: Star మా and Disney+Hotstar

శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

శనివారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. తాను పని మనిషిగా చేస్తున్నానని తెలుస్తుందని శృతి భయపడిపోతుంది. కానీ, అతడికి కనిపించకుండా తప్పించుకుంటుంది. మరోవైపు, అంకిత తులసిని కలుస్తుంది. ఆ తర్వాత ఆమెకు క్షమాపణలు చెబుతుంది. ఆ సమయంలో తులసి ఆమె ముందు ఎన్నో విలువైన మాటలను చెబుతుంది. ఇక, మప్పీ లహరికి పాట రాసి ఇచ్చిన ప్రేమ్‌.. డబ్బులు అడగకుండానే వచ్చేస్తాడు. ఇక, తులసి, అంకిత కలిసి వస్తున్న సమయంలో శృతి ఓ ఇంట్లో పని చేస్తున్నది చూస్తారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేస్తారు.

శృతి మాటలకు ఏడ్చిన తులసి

శృతి మాటలకు ఏడ్చిన తులసి


శృతి పని చేస్తున్న విషయం తెలిసి తులసి, అంకిత ఆమెతో మాట్లాడతారు. అప్పుడు శృతి 'పిల్లలను కనగలం కానీ.. వాళ్ల జాతకాలను కనలేము అంటారు. మా జాతకంలో అలా రాసిపెట్టి ఉంది. అందుకే అలా జరుగుతోంది. అనుభవించాలి కదా ఆంటి' అని చెబుతుంది. అప్పుడు అంకిత.. శృతి.. నువ్వు పనిమనిషిగా చేస్తున్నావని ప్రేమ్‌కు తెలుసా అని అడుగుతుంది. దీనికామె తెలియదు అంటుంది. మరేం చెప్పావంటే.. ఏదో ప్రైవేటు ఆఫీసులో చేస్తున్నానని మేనేజ్ చేశా అంటుంది. అప్పుడు తులసి మిమ్మల్ని ఇలా చూడటానికా నేను బతికుంది' అని ఏడుస్తుంది.

ఐదు లక్షల గురించి చెప్పింది

ఐదు లక్షల గురించి చెప్పింది

తులసి బాధ పడడంతో శృతి 'మాకు తెలుసు ఆంటి.. పరిస్థితులు మనకు అనుకూలంగా లేనప్పుడు తల వంచి బతకడం మీదగ్గరే నేర్చుకున్నాను. అదే ఇప్పుడు మాకు పనికొస్తుంది. పని కోసం ఎంతో మంది కాళ్లు పట్టుకున్నాడు. అయినా లాభం లేకపోయింది' అంటుంది. అప్పుడు తులసి కాళ్లు పట్టుకోవడం కాదు.. తనను తాను నిరూపించుకోవాలి అని చెబుతుంది. దీనికి శృతి 'అందుకే ప్రేమ్ ప్రయత్నాలు చేశాడు. తనను తాను నిరుపించుకోవాలంటే.. ఆల్బమ్ చేయాలి. దానికి 5 లక్షలు ఖర్చు అవుతుంది. డబ్బుల కోసం ఎక్కడ తిరిగినా లాభం లేదు' అంటుంది.

డబ్బులిచ్చేందుకు అంకిత రెడీ

డబ్బులిచ్చేందుకు అంకిత రెడీ


శృతి తన అవసరం గురించి చెప్పగానే అంకిత ఆ 5 లక్షలు నేను ఇస్తాను అంటుంది. దీంతో తులసి వద్దు నువ్వు ఇవ్వకూడదు అంటుంది. అప్పుడు అంకిత 'ఆంటి.. నేను డబ్బు ఇవ్వాలనుకుంటోంది.. ఇచ్చేది ప్రేమ్‌కు.. మీకు కాదు. దయచేసి నాకు అడ్డు చెప్పకండి ప్లీజ్. అవసరానికి ఉపయోగపడని డబ్బు నా దగ్గర ఉండి లాభం ఏంటి ఆంటి. మీరు కనుక నో అంటే.. ఈ ఆస్తి మీద హక్కును వదులుకుంటాను. నేనే ఆస్తిని అభి పేరు మీదకు ట్రాన్స్‌ఫర్ చేయమంటాను. ఆ తర్వాత మీ ఇష్టం' అంటుంది. దీంతో తులసి నీ ఇష్టం అంకిత అంటుంది.

అలా మాట తీసుకున్న అంకిత

అలా మాట తీసుకున్న అంకిత

ప్రేమ్‌కు డబ్బులు ఇచ్చేందుకు తులసి ఒప్పుకోగానే అంకిత 'హమ్మయ్య.. కోడలి హోదాలో మొదటి సారి నేను చెప్పిన దానికి ఆంటి ఒప్పుకునేలా చేశాను' అంటుంది. దీనికి తులసి అంటే ఏంటి.. మీ అత్త గారు మొండిది మాట వినదు అని నీ ఉద్దేశమా అంటుంది. అప్పుడు అంకిత 'అయ్యో అలా కాదు ఆంటి. ఆ 5 లక్షలు.. నేను ఇస్తున్నట్టు ప్రేమ్‌కు చెప్పకు. ఎవరో ఫ్రెండ్ దగ్గర ఆ డబ్బు తెచ్చినట్టుగా చెప్పు. అలాగే, నువ్వు ఈ పనిమనిషిగా చేయడం కూడా మానేయ్' అంటుంది. దీంతో శృతి 'మానేస్తాను కానీ.. ఇప్పుడు కాదు.. ఆల్బమ్ రిలీజ్ అయ్యాక.. ప్రేమ్‌కు పేరు వచ్చాక మానేస్తాను' అంటుంది. దీంతో తులసి 'కనీసం నువ్వు పనిమనిషిగా చేస్తున్నావని అయినా చెప్పు' అంటుంది.

భార్య కోసం అభి ఎదురుచూపు

భార్య కోసం అభి ఎదురుచూపు

మరోవైపు ఇంట్లో ఒంటరిగా ఉన్న అభి ఆస్తి తన పేరు మీదికి రాలేదని టెన్షన్ పడుతూ ఉంటాడు. అంతేకాదు, సొంత పెళ్లాంతో మాట్లాడటానికి కూడా ఇంతలా వెయిట్ చేయాల్సి వస్తోంది అని మనసులో అనుకుంటాడు. ఇంతలో అంకిత వస్తుంది. ఆమె రావడమే నీకోసమే ఎదురుచూస్తున్నాను.. మాట్లాడుదాం అని అంటాడు. దీంతో చెప్పు అంటుంది. అప్పుడు అభి ఈవెనింగ్ నుంచి ఇంట్లో లేవు.. ఎక్కడికి వెళ్లావు అని అడుగుతాడు. దీంతో ఆంటి దగ్గరికి వెళ్లాను అంటుంది అంకిత. దీనికి అభి అంత అర్జెంట్‌గా మామ్‌ను ఎందుకు కలిశావు అని ఆరా తీసే ప్రయత్నం చేస్తాడు.

అంకితను డబ్బు అడిగిన అభి

అంకితను డబ్బు అడిగిన అభి

తులసిని ఎందుకు కలిశానన్న విషయాన్ని అంకిత.. అభికి చెప్పదు. అప్పుడు అతడు 'సరే కానీ.. నాకు ఒక విషయంలో నీ హెల్ప్ కావాలి. నేను నా వాళ్లకు కొంత ఎమౌంట్ హెల్ప్ చేద్దామనుకుంటున్నాను. వాళ్లేమో అనవసరంగా నువ్వు ఇంకొకరి ముందు మాకోసం చేయి చాపాలి వద్దులే అన్నారు. కానీ.. పెద్దకొడుకుగా నా బాధ్యత' అని అంటాడు. దీంతో అంకిత ఆ హెల్ప్ ప్రేమ్ కోసమే అనుకుని 'నీ వాళ్లకు, నీ ఫ్యామిలీకి నువ్వు హెల్ప్ చేస్తానంటే నేనెందుకు అడ్డు పడతాను. నీ వాళ్లు నా వాళ్లు కాదా.. ఎప్పుడూ సపోర్ట్ చేస్తాను' అనగానే అతడు సంతోషిస్తాడు.

అభి మాటలకు నందూ హ్యాపీ

అభి మాటలకు నందూ హ్యాపీ

అభి ఎంతకీ ఏ విషయం చెప్పకపోవడంతో నందూ మూడీగా ఉంటాడు. అప్పుడు లాస్య 'నా వల్ల కావడం లేదు. ఈ టెన్షన్‌ను నేను తట్టుకోలేకపోతున్నాను. ఏదో ఒకటి అభి ఫోన్ చేసి అయినా చెప్పాలి కదా. ఆవేశంగా అడుగుతానని అన్నాడు కదా' అంటుంది. ఇంతలో అభి ఫోన్ చేసి.. 'డాడ్ కంగ్రాట్స్ మన మిషన్ గ్రాండ్ సక్సెస్. మీ కంపెనీకి డబ్బులు ఇవ్వడానికి అంకిత ఒప్పుకుంది' అంటాడు. దీంతో నందూ, లాస్య సంతోషిస్తారు. మరోవైపు, బొమ్మలను చూస్తూ బాధపడుతుంది తులసి. ఆ సమయంలో పరందామయ్య రాగానే ఆయనతో తన బాధలను చెప్పుకుంటుంది. దీంతో ఆయన కొన్ని సలహాలు ఇస్తాడు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X