Intinti Gruhalakshmi: నందూకు నిజం చెప్పిన తులసి.. దివ్యకు మరో దెబ్బ.. రాజ్యలక్ష్మి అలా చేయడంతో!

చాలా భాషలతో పోల్చుకుంటే తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రం ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' మంగళవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

సోమవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే:సోమవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. పూజ చేసిన తర్వాత తన దగ్గరకు వచ్చిన విక్రమ్‌ను రెచ్చగొట్టేలా దివ్య మాట్లాడుతుంది. కానీ, అతడు మాత్రం తన తల్లి మంచిదనే అంటాడు. ఆ తర్వాత భార్యతో సన్నిహితంగా ఉంటాడు. అది చూసి రాజ్యలక్ష్మి రగిలిపోతుంది. ఇక, కోర్టు నుంచి నేరుగా నందూతో కలిసి ఇంటికి వచ్చిన లాస్యను చూసి ఇంట్లో వాళ్లు షాక్ అవుతారు. అందుకు తగ్గట్లుగానే ఆమె కూడా వాళ్లను బ్లాక్‌మెయిల్ చేస్తుంది. ఇక, దివ్యను విక్రమ్‌కు శాశ్వతంగా దూరం చేయాలని రాజ్యలక్ష్మి ప్లాన్ చేస్తుంది. ఈ విషయం చెప్పి బసవయ్యలో ధైర్యాన్ని నింపుతుంది.

Intinti Gruhalakshmi Serial Today Episode June 13th 2023

లాస్య వార్నింగ్.. తులసి కూల్:మంచి భార్యను అనిపించుకోవాలని ప్లాన్ చేసిన లాస్య.. నందూకు అన్నం వడ్డించాలని చూస్తుంది. దీనికి అనసూయ అడ్డు చెప్పడంతో 'నేను పెట్టిన భోజనం తినకపోతే నీ తల్లిదండ్రులను జైలుకు పంపించిన వాడివి అవుతావు' అంటూ బ్లాక్‌మెయిల్ చేస్తుంది. దీంతో నందూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత లాస్యకు అనసూయ చీవాట్లు పెడుతుంది. దీనికి లాస్య 'నందు ఈ ఇంట్లో భోజనం చేస్తే అది నా చేత్తోనే చేయాలి' అని వెళ్లిపోతుంది. అప్పుడు తులసి 'అనవసరంగా సమస్యలను పెద్దది చేసుకోవద్దు అత్తయ్య మనమే నష్టపోవాలి' అంటుంది.

Intinti Gruhalakshmi Serial Today Episode June 13th 2023

ఆవిడ ఎత్తులను తిప్పి కొడతా:పూజ చేసి అలసిపోయిన దివ్య దగ్గరకు విక్రమ్ వాళ్ల తాతయ్య వస్తాడు. దీంతో ఇద్దరూ కలిసి రాజ్యలక్ష్మి చేస్తున్న పనుల గురించి మాట్లాడుకుంటారు. అప్పుడే అక్కడకు ప్రియ వచ్చి 'అత్తగారి ఆగడాలు రోజురోజుకి శృతిమించుతున్నాయి. నిన్ను పుట్టింటికి వెళ్ళకుండా చేసి నిన్ను ఒంటరిని చేయాలని చూస్తుంది' అంటుంది. దీంతో దివ్య 'ఆవిడ అలా చేస్తే ఇక్కడ ఊరుకునే వాళ్ళు ఎవరూ లేరు. దివ్య నీరసంగా మాత్రమే ఉంది. నిరాశలో లేదు. ఆవిడ చేసే ప్రతి ఎత్తుని తిప్పి కొడతాను' అని వాళ్లతో చెబుతుంది.

తులసిని వాళ్లు ప్రశ్నంచగా:భోజనం చేయకుండా ఉన్న అత్తమామలకు తులసి జ్యూస్ ఇస్తుంది. అప్పుడు పరందామయ్య 'ఇప్పుడు మాకు కావలసింది ఆకలి తీర్చడం కాదు. మాకున్న కష్టాలు తీర్చడం. నందూను అలా చూస్తూ ఉండలేకపోతున్నాము. వాడు నీకు ఎప్పుడైతే విడాకులు ఇచ్చాడో అప్పటి నుంచే వాడి పతనం ప్రారంభమైంది' అంటాడు. అప్పుడు అనసూయ 'తను అన్ని తప్పులు చేస్తుంటే నువ్వు కనీసం లాస్య చేసింది తప్పని ఒక ముక్క కూడా ఎందుకు అనలేదు' అంటూ తులసిని నిలదీస్తుంది. దీనికి తులసి 'నేనేంటో తెలిసి కూడా నన్ను ఆవేశంలో ఇంత మాట అన్నారు. అలాంటిది లాస్య ఆవేశంలో ఉంది. తనను కెలకకుండా ఉండటమే మనకి మంచిది' అంటుంది. దీంతో వాళ్లు వాడి జీవితం అంతే ఇంకా బాగుపడదు అంటూ బాధతో వెళ్లిపోతారు.

Intinti Gruhalakshmi Serial Today Episode June 13th 2023

విక్రమ్ ముందు తల్లి ప్లాన్‌గా:నందూను చూడ్డానికి పుట్టింటికి బయలుదేరిన దివ్య అత్తగారి పర్మిషన్ తీసుకోలేదు ఏమంటారో అని విక్రమ్‌తో అంటుంది. దీనికతడు 'మా అమ్మ రాక్షసి కాదు.. తనకు కూడా పుట్టింటి విలువ తెలుసు. అయినా నిన్ను పుట్టింటికి పంపించే బాధ్యత నాది' అని తల్లి దగ్గరికి తీసుకు వస్తాడు. ఆ వెంటనే దివ్య తన పుట్టింటికి వెళ్తుంది అని తల్లితో చెప్తాడు. దీనికి రాజ్యలక్ష్మి 'అదేంటి బాబు నువ్వు తోడుగా వెళ్ళవా' అని అడుగుతుంది. దీనికతడు 'లేదమ్మా నాకు పొలంలో కొంచెం పని ఉంది. వచ్చేటప్పుడు నేను తీసుకొని వస్తాను' అని చెబుతాడు.

Intinti Gruhalakshmi Serial Today Episode June 13th 2023

బట్టలు తీసుకు వెళ్లమని:విక్రమ్ చెప్పగానే రాజ్యలక్ష్మి ప్రియను పిలుస్తుంది. అప్పుడామెతో 'ఆ గదిలో స్వీట్స్ బట్టలు ఉంటాయి తీసుకొని రా' అని చెప్తుంది. రాజ్యలక్ష్మి చెప్పినట్లే అవన్నీ ప్రియ తీసుకు వస్తుంది. అప్పుడు రాజ్యలక్ష్మి 'వీటిని తీసుకొని నువ్వు కూడా దివ్యకి తోడుగా వెళ్ళు' అని చెబుతుంది. అది చూసిన ఇద్దరు కోడళ్ళు షాక్ అయిపోతారు. తర్వాత విక్రమ్ 'చూశావా మా అమ్మ ప్రేమ ఎంత గొప్పదో. మనసు నిండిపోవాల్సిందే' అంటాడు. ఇంతలో నందూ దివ్యకు ఫోన్ చేసి 'నేను పని మీద బయటకు వెళ్తున్నాను నువ్వు ఇక్కడికి రావద్దు వీలు చూసుకుని నేనే వస్తా' అని చెప్తాడు.

Intinti Gruhalakshmi Serial Today Episode June 13th 2023

దివ్యపై కోప్పడిన నందూ:నందూ చెప్పిన మాటలకు దివ్య బాధ పడుతుంది. అప్పుడామె 'ఇవి నీ నోటి నుంచి వచ్చిన మాటలు కాదు. ఒకసారి నీ ఎదురుగా ఉన్న అమ్మకు ఫోన్ ఇవ్వు' అంటుంది. దీంతో నందూ 'నేనేమి చిన్న పిల్లాడిని కాదు. నన్నెవరూ ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేదు. అలాగే నా ఎదురుగా మీ అమ్మ లేదు. కొంచెం బిజీగా ఉన్నాను తర్వాత ఫోన్ చేస్తాను' అని కాల్ కట్ చేస్తాడు. దీంతో రాజ్యలక్ష్మి మార్పు ఇందుకే వచ్చిందా అని దివ్య అనుకుంటుంది. తర్వాత నందూ చెప్పిన మాటలు విక్రమ్‌కు చెప్పగా.. దివ్యను రెస్ట్ తీసుకోమని అతడు అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

Intinti Gruhalakshmi Serial Today Episode June 13th 2023

నందూకు నిజం చెప్పేసి:దివ్య పుట్టింటికి వెళ్లడం క్యాన్సిల్ అవడంతో రాజ్యలక్ష్మి లోలోపల సంతోషిస్తుంది. అది గమనించిన దివ్య 'ఆ స్వీట్స్ అత్తయ్య గారికి ఇచ్చేయ్ ప్రియా తిని పండగ చేసుకుంటారు' అని వెళ్లిపోతుంది. ఇక, నందూ 'నాతో బలవంతంగా అలా ఎందుకు చెప్పించావు? దివ్య ఎంత బాధ పడిందో ఏంటో' అని తులసితో అంటాడు. అప్పుడు తులసి 'అలా చేయటానికి కారణం ఉంది. మీరు ఆవేశం తెచ్చుకొని గొడవకి వెళ్ళను అని నాకు మాట ఇవ్వండి' అని ప్రామిస్ తీసుకుని రాజ్యలక్ష్మి ప్లాన్‌ను అతడికి వివరిస్తుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X