Intinti Gruhalakshmi June 14th Episode: అతడి కోసం కలవబోతున్న తులసి నందూ.. అభిని మోసం చేసిన అంకిత

ఎంతో కాలంగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో రన్ అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మీ' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మీ' సోమవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో చూద్దాం పదండి!

Recommended Video

Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
 శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

శనివారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. తన భర్తతో గొడవకు దిగిన తులసి అడగాల్సివన్నీ అడిగిన తర్వాత అగ్రిమెంట్‌పై సంతకం చేసేస్తుంది. ఇక, అంకిత చేసిన పొరపాటుతో ఆమె ప్రెగ్నెంట్ అన్న విషయం అభికి తెలిసిపోతుంది. అయితే, అప్పటికే అంకిత అబార్షన్ చేయించుకుంటుంది. ఇక, తులసి పనిని మెచ్చుకున్న మిశ్రా కంపెనీ.. ఆమెకు మరో కాంట్రాక్ట్ ఇస్తున్నట్లు చెబుతుంది.

 శృతికి అండగా ఉంటానన్న తులసి

శృతికి అండగా ఉంటానన్న తులసి

లాప్‌టాప్ గురించి తులసి.. శృతి మధ్య జరుగుతోన్న చర్చతో ఈరోజు ఎపిసోడ్ ప్రారంభం అయింది. పరాయి సొమ్ము గురించి తులసి క్లాస్ పీకడంతో శృతి కన్నీరు పెట్టుకుంటుంది. దీంతో ఏమైందని అడగగా.. తనకు తల్లి గుర్తొచ్చి ఏడ్చానంటూ ఆమె చెబుతుంది. అప్పుడు తులసి 'నీకు తల్లి లేని లోటు నేను తీరుస్తా. ఇంకెప్పుడూ అలా బాధ పడకు' అని శృతికి ధైర్యం చెప్పి ఓదార్చుతుంది.

 అంకితను ఎత్తుకుని తిప్పేసిన అభి

అంకితను ఎత్తుకుని తిప్పేసిన అభి

అంకిత ప్రెగ్నెంట్ అన్న విషయం తెలిసినప్పటి నుంచి అభి ఎంతో సంతోషంగా ఉంటాడు. దీంతో ఆమె ఇంటికి ఎప్పుడు వస్తుందా అని వేయి కళ్లతో వేచి చూస్తుంటాడు. అప్పుడు ఆమె ఇంటికి వస్తుంది. ఆ వెంటనే ఆమెను ఎత్తుకుని తిప్పుతాడు. దీంతో కంగారు పడిపోయిన అంకిత తల్లిదండులు.. ఆమె ఆరోగ్యం బాలేదని, బ్లడ్ తక్కువగా ఉందని అభికి అబద్ధాలు చెబుతారు.

తల్లికి ఫోన్ చేసిన అభి.. ఆ కోరికతో

తల్లికి ఫోన్ చేసిన అభి.. ఆ కోరికతో

అంకిత ప్రెగ్నెంట్ అయిన విషయాన్ని తన తల్లికి ఫోన్ చేసి చెబుతాడు అభి. దీంతో ఆమె కూడా చాలా సంతోష పడుతుంది. అప్పుడు అభి.. 'నాన్నను తీసుకుని రేపు ఇంటికి రండి' అని చెబుతాడు. ఇద్దరూ విడిపోయారని తెలీక అతడు అడిగిన కోరిక గురించి తులసి బాధ పడుతుంది. అప్పుడు శృతితో తన బాధను చెప్పుకుంటుంది. ఇది ఆమె మామగారు పక్కన ఉండి చాటుగా వింటాడు.

 బాధ పడిన అంకిత... అభి కన్నీరు

బాధ పడిన అంకిత... అభి కన్నీరు

తనకు అబార్షన్ జరిగిన విషయాన్ని దాచి ఉంచడాన్ని తలుచుకుంటూ ఏడుస్తుంది అంకిత. ఆ సమయంలో అభి తన భార్య గర్భవతే అనుకుని ఎన్నో జాగ్రత్తలు చెబుతాడు. దీంతో అంకిత 'నీకు పిల్లలంటే అంత ఇష్టమా' అని అడుగుతుంది. అప్పుడు పిల్లలంటే తనకు ఎంతో ఇష్టమని చెబుతూ అభి కూడా ఎమోషనల్ అవుతాడు. భర్త ఏడవడం చూసి మరింత బాధ పడుతుంది అంకిత.

నందూకు ఆ మాట చెప్పిన తండ్రి

నందూకు ఆ మాట చెప్పిన తండ్రి

అభి కోరిన కోరికను చాటు నుంచి విన్న తులసి మామగారు.. నందూకు ఫోన్ చేయాలని డిసైడ్ అవుతాడు. అప్పుడు కొడుకుకి ఫోన్ చేసి అభి తండ్రి కాబోతున్నాడని చెబుతాడు. దీనికి నందూ కూడా సంతోష పడతాడు. ఆ తర్వాత 'మీ ఇద్దరినీ కలిసి అభి రమ్మన్నాడురా. వాడి కోరిక తీర్చడానికి ఓ మెట్టు దిగలేవా. భార్య గురించి కాకుండా కొడుకు గురించి ఆలోచించు' అని అంటాడు.

సుముఖంగా స్పందించిన నందూ

సుముఖంగా స్పందించిన నందూ

తులసి కలిసి వెళ్లాలని తండ్రి చెప్పిన మాటలకు 'వాడు నా కొడుకు నాన్న. వాడి సంతోషం కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. బంధాలు బంధుత్వాలు విలువల గురించి నాకు తెలుసు నాన్న. కాకపోతే తులసితో కలిసి వెళ్లాలంటేనే ఏదోలా ఉంది. దీని గురించి ఆలోచించడానికి నాకు టైమ్ ఇవ్వండి' అని అంటాడు. అప్పుడు తండ్రి 'ఆలోచించి ఓకే అని చెప్పురా' అంటాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X