Intinti Gruhalakshmi: తులసికి నిజం చెప్పిన విక్రమ్.. రాజ్యలక్ష్మికి దివ్య సవాల్.. ఆ టాబ్లెట్లు చూసి!
ఈ మధ్య కాలంలో కొత్త కొత్త కంటెంట్‌తో షోలు వస్తున్నా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రం ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' బుధవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar
మంగళవారం ఎపిసోడ్‌లో జరిగిందిదే:మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. నందూ అన్నం తినడానికి ఇబ్బంది పడుతుండగా లాస్య అందరినీ జైలుకు పంపిస్తా అని వార్నింగ్ ఇస్తుంది. దీంతో అతడు తినకుండానే వెళ్లిపోతాడు. తర్వాత పరందామయ్య, అనసూయ బాధపడుతూ తులసిని ప్రశ్నిస్తారు. కానీ, ఆమె మాత్రం లాస్యను కెలక్కూడదని చెప్తుంది. ఇక, దివ్య తన పుట్టింటికి వెళ్లేందుకు రెడీ అవుతుండగా.. నందూ ఫోన్ చేసి తన దగ్గరకు రావొద్దని చెబుతాడు. దీంతో దివ్య బాధ పడుతుంది. అదే సమయంలో రాజ్యలక్ష్మి ప్లాన్ చేసిందని గ్రహిస్తుంది. దీంతో ఆమెకు బుద్ధి చెప్పాలని డిసైడ్ అయిపోతుంది.

తులసికి రాజ్యలక్ష్మి కంప్లైంట్:దివ్య గురించి తులసికి రాజ్యలక్ష్మి ఫోన్ చేస్తుంది. అప్పుడామె 'నేను మీకు ఎన్నిసార్లు హెచ్చరించిన మీరు పట్టించుకోవడం లేదు. కూతుర్ని అచ్చోసిన ఆంబోతు లాగా వదిలేసారు' అని సీరియస్ అవుతుంది. దీంతో తులసి 'అలాంటిదేమీ లేదు వదిన గారు. మీరు చెప్పిన దగ్గర నుంచి తనను పుట్టింటికి రానివ్వడం లేదు. కనీసం ఫోన్ కూడా చేయలేదు' అని చెబుతుంది. దీంతో రాజ్యలక్ష్మి 'అయినా కూడా లెక్కచేయకుండా మీ ఇంటికి బయలుదేరుతుంది. తన మొండితనం వల్లే ఇప్పటి వరకు వాళ్లకి మొదటి రాత్రి కూడా జరగలేదు' అని చెప్తుంది.
కూతురికి పద్దతి నేర్పండని:
ఆ తర్వాత రాజ్యలక్ష్మి 'శాంతి పూజ చేస్తే మంచిది అని చెప్తే వినిపించుకోవడం లేదు. మొగుడి కోసం పూజ చేయకపోయినా కనీసం విలువ ఇవ్వాలి కదా' అంటుంది. దీనికి తులసి 'తను ఎప్పుడూ అలా చేయదు' అనగానే.. రాజ్యలక్ష్మి 'అంటే నేను అబద్ధం చెపుతున్నానా? అటు మా వాడిని ఇటు నన్ను ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు. ఇకనైనా మీ కూతురికి పద్ధతులు నేర్పించండి. లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది' అని వార్నింగ్ ఇచ్చి కాల్ కట్ చేస్తుంది. ఈ విషయం నందూకు చెప్పగా అతడు నమ్మడు. దీంతో తులసి జాగ్రత్తగా ఉండటం మంచిది కదా అంటుంది.

దివ్యకు రాజ్యలక్ష్మి వార్నింగ్:అత్తగారు చేస్తున్న పనులకు దివ్య కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అంతేకాదు, 'నేను ఎంత ఎలా ఉన్నా నా కన్నా రెండు అడుగుల ముందే ఉంటున్నారు అత్తగారు' అనుకుంటుంది. అంతలోనే ఆమె దగ్గరికి జ్యూస్ తీసుకువచ్చిన రాజ్యలక్ష్మి 'కూల్ అవ్వు కోడలు పిల్లా.. నువ్వు ఎన్ని గంతులు వేసినా నా ముందు చెల్లవు. నాకు ఎంత ధైర్యం లేకపోతే శత్రువు అయిన నిన్నే ఇంటి కోడలుగా చేసుకుంటాను. నా కాలి కింద చెప్పు లాగా పడి ఉండు లేకపోతే పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది' అంటూ వార్నింగ్ ఇస్తుంది.
అత్తతో చాలెంజ్ చేసిన దివ్య:
రాజ్యలక్ష్మి మాటలకు దివ్య 'అలా ఎప్పటికీ జరగదు. నా భర్తకు మీరంటే ఎంత ప్రేమో అంతకన్నా నేనంటే ఇంకా ఎక్కువ ప్రేమ' అంటుంది. దీనికామె 'ఎంత నీ కొంగు పట్టుకుని తిరిగినా చివరికి వాడు చూసేది నా వైపే' అని అంటుంది. దీంతో దివ్య 'మీది దొంగ ప్రేమ అని త్వరలోనే నా భర్తకి అర్థమయ్యేలాగా చేస్తాను. ఈ ఇంటిలోంచి పారిపోయే పరిస్థితికి తీసుకు వస్తాను' అంటూ అత్తతో ఛాలెంజ్ చేస్తుంది. అప్పుడు రాజ్యలక్ష్మి 'ముందు నీ మొగుడు నువ్వు చెప్పింది నమ్మేలాగా చూసుకో. తర్వాత చూద్దాం' అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

తులసి ప్లాన్‌తో కడుపు నింపి:ఇక, ఇంట్లో అందరూ భోజనాలు చేస్తూ ఉండగా రాములమ్మ వచ్చి 'ఈరోజు నా కూతురు పుట్టినరోజు. అందుకే గారెలు పులిహార తీసుకువచ్చాను' అంటూ తులసి, పరందామయ్య, అనసూయలకు వడ్డిస్తుంది. దీంతో తులసి అదేంటి మా ముగ్గురికే తీసుకొచ్చావా అని అడగ్గా.. అందరికీ తెచ్చానమ్మా కానీ లాస్యమ్మ గారు వాళ్ళు ఏమంటారో అంటుంది. దీంతో లాస్య 'మాకు కూడా వడ్డించు' దీంతో అందరూ కలిసి వాటిని తింటారు. అప్పుడు పరందామయ్య వాళ్లు నవ్వుతుండగా.. నందూ 'ఇదంతా తులసి పని. తనే ప్రతిసారి నన్ను ఆదుకుంటుంది' అని కడుపు నిండా అన్నీ తినేస్తాడు.

విక్రమ్ ద్వారా నిజం అడిగి:విక్రమ్‌ను బయటకు రమ్మని తులసి సీక్రెట్‌గా కలుస్తుంది. అతడితో 'ఏమీ లేదు బాబు. కోర్టు గొడవల వల్ల ఇన్నాళ్లు మిమ్మల్ని పట్టించుకోలేదు. మీరు బాగానే ఉన్నారు కదా. దివ్య వల్ల మీరేమీ ఇబ్బంది పడటం లేదు కదా' అని అడుగుతుంది. దీనికతడు 'లేదు అత్తయ్య.. ఎంతైనా ఆడపిల్ల కదా. తనకి కూడా పుట్టింటి మీద ఆశ ఉంటుంది. మా అమ్మ కూడా తనకి బాగా సపోర్టు ఇస్తుంది' అంటాడు. ఆ సమయంలోనే ఫస్ట్ నైట్, శాంతి పూజ గురించి అతడిని అడుగుతుంది. అప్పుడు విక్రమ్ నిజాలు చెప్పడంతో రాజ్యలక్ష్మి చెప్పింది అబద్దాలు అని తెలుసుకుంటుంది. వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోతుంది. దీంతో అసలు తనను అత్తగారు ఎందుకు రమ్మని అడిగిందో విక్రమ్‌కు అర్థం కాదు.

టాబ్లెట్ల గురించి తెలుసుకుని:ఇక, మామగారి రూమ్ నుంచి వస్తున్న నర్స్‌ను చూసిన దివ్య ఏం చేస్తున్నావు? ఆ టాబ్లెట్స్ ఏంటి? అని అడుగుతుంది దివ్య. దీనికామె కంగారు పడిపోతూ 'ఇవి రోజంతా మత్తులో ఉంచే మాత్రలు. ఇదంతా ఇంట్లో వాళ్ళకి తెలిసే జరుగుతుంది. నా గురించి మాత్రం బయట పెట్టొద్దు' అని బ్రతిమాలుతుంది. దీంతో దివ్య అత్తగారి ఆ టాబ్లెట్స్ చూసి అవి స్లో పాయిజన్‌లా పని చేస్తాయని తెలుసుకొని వాటిని కోపంతో బయటకు విసిరేస్తుంది. అది అప్పుడే ఇంట్లోకి వస్తున్న విక్రమ్ పాదాల ముందు పడతాయి. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











