Intinti Gruhalakshmi: భర్త ముందు దోషిగా దివ్య.. వాళ్లకు ప్రాణాపాయం.. తులసికి కొత్త టెన్షన్

జనరేషన్లు మారుతూ ఉన్నా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రం ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' గురువారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!

Photos Courtesy: Star మా and Disney+Hotstar

Intinti Gruhalakshmi Serial Today Episode June 15th 2023

బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే: బుధవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. తులసికి ఫోన్ చేసిన రాజ్యలక్ష్మి.. దివ్య గురించి లేనిపోనివి అన్నీ చెబుతుంది. అంతేకాదు, ఆమెను జాగ్రత్తగా ఉండేలా చూడండి అంటూ వార్నింగ్ కూడా ఇస్తుంది. ఆ తర్వాత దివ్య దగ్గరకు వచ్చి పొగరుగా మాట్లాడుతుంది.

దీంతో ఆమె కూడా అత్తగారికి ధీటుగానే మాట్లాడడంతో పాటు ఛాలెంజ్ చేస్తుంది. ఇక, రాములమ్మ తెచ్చినట్లు కొన్ని ఆహార పదార్థాలను నందూకు వడ్డిస్తుంది తులసి. అది తెలిసిన అతడు కడుపు నిండా తినేస్తాడు. ఇక, విక్రమ్ తండ్రికి స్లో పాయిజన్ టాబ్లెట్లు ఇస్తున్నారని తెలుసుకున్న దివ్య గొడవ చేస్తుంది.

Intinti Gruhalakshmi Serial Today Episode June 15th 2023

విక్రమ్‌కు నిజం చెప్పిందిగా: నర్స్ చేతిలో నుంచి టాబ్లెట్లను తీసుకున్న దివ్య వాటిని విసిరేస్తుంది. అవి విక్రమ్ ఎదుట పడతాయి. దీంతో వాటిని తీసుకున్న విక్రమ్ ఏమైందని అడుగుతాడు. అప్పుడు దివ్య 'ఇవి టాబ్లెట్స్ కాదు.. ఒకరకంగా పాయిజన్' అని చెప్తుంది.

దీంతో విక్రమ్ 'ఇవి ఇక్కడికి ఎందుకు వచ్చాయి? ఈ ఇంట్లో ఎవరిని ఎవరు చంపాలి అనుకుంటున్నారు' అని ప్రశ్నిస్తాడు. దీంతో దివ్య 'అది మీ అమ్మను అడుగు. ఇవి మావయ్య గారికి వాడుతున్న మందులు. నిన్న, మొన్నటి నుంచి కాదు కొన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారు' అని చెబుతుంది.

Intinti Gruhalakshmi Serial Today Episode June 15th 2023

దివ్యనే ఇరికించేసిన నర్స్: ఆ తర్వాత దివ్య 'ఇంట్లో వాళ్ళకు తెలియకుండానే ఇది జరుగుతుందా' అని ప్రశ్నిస్తుంది. దీంతో విక్రమ్ ఇదంతా నీకు ఎవరు చెప్పారు అని అడగ్గా.. పక్కనే ఉన్న సిస్టర్‌ను పిలిచి జరిగిందంతా చెప్పు అంటుంది.

కానీ, అప్పటికే ఆమెకు రాజ్యలక్ష్మి కనుసైగ చేయడంతో మాట మార్చేసిన నర్స్ 'ఆవిడ ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. అయినా అయ్యగారికి వాడే టాబ్లెట్లు బయటికి ఎందుకు తీసుకు వస్తాను. ఈ టాబ్లెట్లు అమ్మ గారి చేతిలోనే చూశాను' అంటూ దివ్యను ఇరికిస్తుంది.

భార్యను అసహ్యించుకుని: ఆ నర్స్ లోపలికి వెళ్లి విక్రమ్ తండ్రికి వాడే మందులను తీసుకొస్తుంది. అవి చూసిన సంజయ్ 'నాన్నకు రెగ్యులర్‌గా వాడే మందులే కదా. అబద్దాలు చెప్పటానికి సిగ్గుగా లేదా వదినా? అమ్మ చూడు ఎంత బాధ పడుతుందో' అంటాడు. అప్పుడు విక్రమ్‌తో 'వాళ్ళు అబద్ధం చెబుతున్నారు. ఆ టాబ్లెట్స్ గురించి ఆ సిస్టర్ నాతో చెప్పింది' అంటుంది.

దీంతో రాజ్యలక్ష్మి 'ఎందుకమ్మా నా మీద నీకు అంత పగ. నువ్వు నీ భర్తకు దగ్గరవుతే నాకు ఇష్టమే. అందుకోసం నాకు నా కొడుక్కి మధ్యలో దూరం పెంచకు. భర్తను చంపుకునే అంత కసాయి దానిలాగా కనిపిస్తున్నానా' అంటూ ఏడుస్తూ వెళ్లిపోతుంది. దీంతో విక్రమ్ కూడా దివ్యను అసహ్యించుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.

Intinti Gruhalakshmi Serial Today Episode June 15th 2023

నందూను బెరిదించిన లాస్య: నందూను లాస్య కెఫేకు వెళ్దాం.. జరిగిందంతా మర్చిపోదాం అంటుంది. ఇందుకోసం కెఫే డాక్యూమెంట్లు ఇవ్వబోతుంది. కానీ, నందూ వాటిని తీసుకోడు. పైగా 'కెఫేకు నువ్వు వెళ్ళాలి లేకపోతే నేను వెళ్ళాలి అంతే కానీ కలిసి వెళ్లే ప్రసక్తి లేదు' అంటాడు.

దీనికామె 'నీ మొండితనంతో నా మొండితనాన్ని మరింత రెచ్చగొట్టొద్దు. అలా చేస్తే నేను ఎంత దూరమైనా వెళ్తాను. అసలే అత్తయ్య మామయ్య ఆరోగ్యం బాగోలేదు. ఒంటినిండా బీపీలు, షుగర్లు ఉన్నాయి. అలా కాకుండా వాళ్ళు మెట్ల మీద నుంచి జారిపోవచ్చు, బయటికి వెళ్ళినప్పుడు యాక్సిడెంట్ అవ్వచ్చు, మొత్తానికే నీకు దక్కకుండా పోవచ్చు' అని బెదిరిస్తుంది.

భయపడిపోయిన తులసి: లాస్య బెదిరింపులకు నందూ 'ఏంటి బెదిరిస్తున్నావా నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో నా తల్లిదండ్రులను ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు' అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దీంతో లాస్య 'ప్రేమగా చెప్పినప్పుడు వినకపోతే నేను మాత్రం ఏం చేస్తాను. నేను ఏది చేయాలో అదే చేస్తాను' అనుకుంటుంది. ఆ మాటలన్నీ అనుకోకుండా తులసి వింటుంది. అప్పుడామె 'లాస్య మొండిది.. ఎంతకైనా తెగిస్తుంది. కొంపదీసి అత్తయ్య మామయ్య గారిని ఏమైనా చేసినా చేస్తుంది' అని భయపడిపోతుంది.

Intinti Gruhalakshmi Serial Today Episode June 15th 2023

చెంప పగలగొట్టేవాడినని: తనను అసహ్యించుకుంటున్న విక్రమ్ దగ్గరకు వచ్చిన దివ్య అతడికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుంది. కానీ, అతడు మాత్రం తల్లి వైపే మాట్లాడతాడు. అంతేకాదు, 'ఇక్కడ నువ్వు మా అమ్మ మీద నిందలు వేస్తున్నావు అనుకుంటే.. అక్కడ మీ అమ్మ కూడా అలాగే మాట్లాడుతుంది' అంటాడు.

దీంతో దివ్య అమ్మ ఏం చేసింది అంటుంది. దీనికతడు 'నువ్వు అమాయకురాలివట.. నీ చుట్టూ ఏం జరుగుతుందో నన్ను తెలుసుకోమంటుంది. మీ ఇద్దరికీ మా అమ్మ అంత రాక్షసి లాగా కనిపిస్తుందా? నీవల్ల మా అమ్మ కన్నీరు పెట్టుకుంది. నీ స్థానంలో వేరొకరు ఉండి ఉంటే లాగి చెంప మీద కొట్టేవాడిని' అని వెళ్లిపోతాడు.

చెప్పుతో సమాధానం చెప్పి: రాజ్యలక్ష్మి కిచెన్‌లో కూరగాయలు కట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే బయటకు వెళ్తున్న దివ్యను చూసి చాకుని సౌండ్ చేస్తుంది. అయినా దివ్య పట్టించుకోదు. దీంతో బసవయ్య 'ఆ సౌండ్‌కు అర్థం నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని అక్క అడుగుతుంది' అంటాడు.

దీంతో దివ్య చెప్పుతో సౌండ్ చేస్తుంది. ఆ వెంటనే 'ఈ సౌండ్‌కు అర్థం మీకు తెలియదా? చెప్పను అని అర్థం' అని బసవయ్యతో అంటుంది. దీంతో వాళ్లిద్దరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X