Intinti Gruhalakshmi Today Episode: లక్కీ డ్రా గెలిచిన తులసి.. లాస్యకు మరో ఘోర అవమానం

తెలుగు బుల్లితెపై సుదీర్ఘ కాలంగా ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి భారీ నుంచి అతి భారీ స్థాయిలో స్పందన దక్కుతుంది. సుదీర్ఘ కాలంలో ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' గురువారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరు కూడా ఓ లుక్కేయండి!

Photos Courtesy: Star మా and Disney+Hotstar

బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

బుధవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. లక్కీ, నందూ మాల్‌కు వెళ్లి సరదాగా తిరుగుతుంటారు. ఆ సమయంలో లాస్య ఫోన్ చేయగానే లక్కీకి ఫోన్ ఇచ్చి మాట్లాడమంటాడు. దీంతో ఆ చిన్నారి తల్లికి అసలు విషయం చెప్పగానే నందూకు మొబైల్ ఇవ్వమంటుంది. ఇవ్వగానే అతడితో మంచిగా మాట్లాడుతుంది. అనంతరం ప్రేమ్, శృతి ఐస్‌క్రీమ్ పోటీ పెట్టుకుంటారు.

మరోవైపు, ఫ్యామిలీ అందరూ సంతోషంగా ఆడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత అభి, ప్రేమ్ తారస పడతారు. ఆ సమయంలో అభి, ప్రేమ్‌కు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడని అంకిత వాళ్లకు చెబుతుంది.

 లక్కీ చేసిన పనికి బుక్కైన నందూ

లక్కీ చేసిన పనికి బుక్కైన నందూ

షాపింగ్‌ మాల్‌లో తులసిని చూసిన తర్వాత నందూ తెగ టెన్షన్ పడుతుంటాడు. అప్పుడతను లాస్య వచ్చేలోపు లక్కీని తులసి దగ్గర నుంచి దూరంగా తీసుకెళ్లాలని అనుకుంటాడు. ఇందుకోసం 'ఇందాక కూల్ డ్రింక్ కావాలన్నావు కదా.. వెళ్లి తాగి వద్దాం పదా' అని అంటాడు. కానీ, లక్కీ మాత్రం తాను రానని అంటాడు. అంతేకాదు కూల్ డ్రింక్ వద్దు అంటాడు. దీంతో నందూకు టెన్షన్ స్టార్ట్ మరింతగా పెరిగిపోతుంది. అప్పుడాయన 'వీడికి ఇలా దొరికిపోయానేంటి. వీడికి నేను దగ్గరవుదామనుకుంటే.. వీడేంటి.. నన్ను లాస్యకు దూరం చేసేలా ఉన్నాడు' అని అనుకుంటాడు.

లాస్య ఫోన్.. నందూకు మరో షాక్

లాస్య ఫోన్.. నందూకు మరో షాక్

అప్పటికే షాపింగ్ మాల్‌లో ఉన్న తులసి అభి, ప్రేమ్‌ రావడాన్ని చూస్తుంది. ఆ తర్వాత అభి తండ్రిని పలకరిస్తాడు. దీంతో దివ్య 'ఫ్యామిలీ మొత్తం ఒకేచోట కలుస్తారు. అందరం భలే కలిశాం కదా' అని అంటుంది. అప్పుడు నందూ 'ఏదో ఈదురు గాలి అనుకున్నాను.. పెద్ద తుఫానే వచ్చేలా ఉంది.

అందరూ కట్టగట్టుకొని ఒకేచోటుకు రావాలా' అని మనసులోనే అనుకుంటాడు. అంతేకాదు, లాస్య ఫోన్ చేయకూడదు.. ఇక్కడికి రాకూడదు అని అనుకుంటూ ఉంటాడు. ఇంతలో లాస్య మాల్‌లోకి వస్తుంది. నందూకు ఫోన్ చేస్తుంది. దీంతో ఫోన్ చూసి నందూ షాక్ అవుతాడు.

మాల్‌లో లాస్య.. నందూ భయం

మాల్‌లో లాస్య.. నందూ భయం

నందూ ఫోన్ లిఫ్ట్ చేయగానే లాస్య ఎక్కడున్నావ్ అని అడుగుతుంది. దీనికి నందూ నువ్వు ఎక్కడున్నావు అని అడుగుతాడు. అప్పుడు లాస్య ఇప్పుడే మాల్‌లోకి ఎంటర్ అయ్యాను అంటుంది. దీంతో నందూ 'నువ్వు అక్కడే ఉండు.. ఎలాగోలా వాడిని బతిమిలాడి తీసుకొస్తాను' అంటాడు. దీంతో లాస్య 'ఏం అక్కర్లేదు.. మీరు గేమ్ జోన్‌లో ఉండి ఉంటారు.

నేనే అక్కడికి వస్తున్నాను' అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. అప్పుడు నందూ 'ఇంకాసేపట్లో మూడో ప్రపంచ యుద్ధం ప్రారంభం కాబోతుంది. నేనేం చేయలేను. నా చేతుల్లో ఏం లేదు' అని మనసులో అనుకుంటాడు.

తులసిని చూసి లాస్య ఆగ్రహం

తులసిని చూసి లాస్య ఆగ్రహం

మరోవైపు, లక్కీ.. ఆంటి నేను మీకు ఒక గేమ్ నేర్పిస్తాను అంటాడు. తర్వాత బైక్ ఎక్కి.. తులసి లక్కీతో పాటు గేమ్ ఆడుతుంది. ఇంతలో లాస్య వచ్చి.. తులసితో ఉన్న లక్కీని చూసి షాక్ అవుతుంది. ఆ వెంటనే లక్కీ.. అంటూ గట్టిగా అరుస్తుంది. దీంతో లక్కీ, తులసి షాక్ అవుతారు. అక్కడేం చేస్తున్నావు అని అడుగుతుంది. దీంతో గేమ్ ఆడుకుంటున్నా మమ్మీ అంటాడు లక్కీ.

అప్పుడు లాస్య 'అయినా నిన్ను కాదు అనాల్సింది.. నిన్ను ఈ మాల్‌కు తీసుకొచ్చిన ఈయన్ను అనాలి' అని నందు వైపు సీరియస్‌గా చూస్తుంది. అప్పుడు లక్కీ 'పాపం అంకుల్ ఇరుక్కుపోయినట్టున్నాడు' అని మనసులో అనుకుంటాడు. తర్వాత లాస్య 'నువ్వు ఆడుకోవాల్సింది ఇక్కడ కాదు.. నాతో రా' అని లక్కీని తీసుకెళ్లి వేరే గేమ్ ఆడిస్తుంది.

లాస్యను శని అన్న అనసూయ

లాస్యను శని అన్న అనసూయ

నందూ, లాస్య పక్కకు వెళ్లిపోగానే అభి కూడా వాళ్లతో వెళ్తాడు. దీంతో తులసి బాధ పడుతుంది. అప్పుడు అనసూయ 'ఏదో ప్రశాంతంగా గడుపుదామని ఇక్కడికి వస్తే.. ఇక్కడ కూడా శని తప్పేట్టు లేదు' అంటుంది. దీంతో ఎవరిని శని అంటున్నావు అంటుంది లాస్య. అప్పుడామె అర్థం అవ్వాల్సినోళ్లకు అర్థం అవుతుందిలే అంటుంది.

దీంతో లాస్య నందూను ఇప్పుడు మంచిగా ఉందా నీకు అంటుంది. అక్కడే ఉన్న అభి 'డాడ్ నిజాయితీ ఉన్నవాళ్లతో మనసు విప్పి మాట్లాడొచ్చు కానీ.. లోపల ఒకటి పెట్టుకొని బయటికి ఇంకోలా మాట్లాడేవాళ్లతో మనం ఎంత మాట్లాడినా వేస్ట్' అంటాడు. దీనికి పరందామయ్య 'అవును మరి.. మీ లాస్య ఆంటి నిజాయితీపరురాలని ఊరంతా అనుకుంటున్నారు' అంటాడు.

అంకిత సందేహం.. అభి ఔట్

అంకిత సందేహం.. అభి ఔట్

అభి మాటలకు అంకిత 'ప్రేమ్‌కు హెల్ప్ చేస్తానన్న అభి.. ఆంటిని ఎందుకు ద్వేషిస్తున్నాడు. ఇలాంటి వాడు ప్రేమ్‌కు మనీ హెల్ప్ చేయాలని ఎలా అనుకున్నాడు. అసలేమీ అర్థం కావడం లేదు. ఈ అభి ఎప్పుడు ఎలా ఉంటాడో ఏంటో' అని అనుకుంటుంది. మరోవైపు లాస్య 'అసలు నాకు చెప్పకుండా లక్కీని నువ్వు ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు.

అంతా నీ వల్లే. నేను వచ్చేదాన్ని కాదు కదా. లక్కీ.. ఆడింది చాలు పదా' అంటూ వాళ్లను తీసుకెళ్తుంది. అప్పుడు ఆమెతో పాటు నందూ, అభి కూడా వెళ్లిపోతారు. దీంతో గొడవ సర్ధుమణిగిపోతుంది.

లక్కీ డ్రా విజేత అయిన తులసి

లక్కీ డ్రా విజేత అయిన తులసి

మాల్‌లో పలు విభాగాల్లో లక్కీ డ్రాలో పాల్గొన్న వాళ్ల పేర్లలో విజేత ఎవరన్న దానిపై డ్రా తీస్తుంటారు. అప్పుడు మొదటి లక్కీ విజేతగా నంద గోపాల్ నిలుస్తాడు. తర్వాత అభి పేరు వస్తుంది. ఫైనల్ లక్కీ విన్నర్ పేరు ఎవరా అని యాంకర్ ఊరించి ఊరించి తులసి పేరు చెబుతుంది. దీంతో అక్కడున్న వాళ్లంతా చప్పట్లతో ఆమెను అభినందిస్తారు. గెలిచిన వాళ్లను అందరినీ పిలిచి వాళ్లతో ఫోటో దిగుతారు. లాస్యకు మాత్రం తన పేరు రాలేదని కోపం వస్తుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X