Intinti Gruhalakshmi: దివ్యకు నిజం చెప్పిన నందూ.. రాజ్యలక్ష్మి బుట్టలో పడ్డ విక్రమ్.. మరోసారి కేసు

దాదాపు ఇరవై ఏళ్లకు పైగానే తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రం ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శుక్రవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే:గురువారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. నర్స్ చేతిలో ఉన్న టాబ్లెట్లు స్టో పాయిజన్‌లా పని చేస్తాయని, వాటిని మామయ్య గారికి ఇస్తున్నారని విక్రమ్‌తో దివ్య చెప్తుంది. కానీ, ఆ నర్స్ మాత్రం దివ్యకు వ్యతిరేకంగా చెప్తుంది. దీంతో విక్రమ్ ఆమెను అసహ్యించుకుంటాడు. మరోవైపు, తాను చెప్పినట్లు వినకపోతే మీ అమ్మానాన్నలకు ఏదైనా అవుతుందని నందూను లాస్య బెదిరిస్తుంది. దీంతో తులసి భయపడిపోతుంది. ఆ తర్వాత దివ్య వెళ్లి విక్రమ్‌కు నిజం చెప్పే ప్రయత్నం చేయగా అతడు పట్టించుకోడు. పైగా వేరే ఎవరైనా అయితే చెంప పగలగొట్టేవాడిని అని అంటాడు.

Intinti Gruhalakshmi Serial Today Episode June 16th 2023

పుట్టింట్లో పడిపోతావు అంటూ:దివ్య వెళ్తుండగా సౌండ్లు చేసిన రాజ్యలక్ష్మికి చెప్పుతో సమాధానం చెప్తుంది. అయితే, ఆమె చెప్పు ద్వారా చేసిన సౌండ్స్ అర్థం కావు. అప్పుడు దివ్య 'మీ అక్క చేసిన సౌండ్‌కు అర్థం తెలుసు కానీ.. నేను చేసిన సౌండ్‌కు అర్థం తెలియదా? చెప్పను అని చెప్పుతో సమాధానం చెప్తున్నాను' అంటుంది. దీంతో బసవయ్య 'ఏం మాట్లాడుతున్నావు? మా అక్క సహనంతో ఊరుకుంటుంది కానీ కోపంతో జూలు విదిలించిందంటే వెళ్లి పుట్టింట్లో పడతావు' అంటాడు. దీంతో దివ్య 'ఇప్పుడు నేను అక్కడికే వెళ్తున్నా.. జూలు విదల్చండి క్యాబ్ డబ్బు మిగులుతుంది' అంటుంది.

దివ్యను బుక్ చేయాలని ప్లాన్:దివ్య మాటలకు రాజ్యలక్ష్మి 'ఏంటి ఇచ్చిన డోసు ఇంకా సరిపోలేదా' అని అడుగుతుంది. దీంతో దివ్య 'నాకు కూడా టైం వస్తుంది అప్పుడు నేను కూడా డబల్ డోస్ ఇస్తాను' అని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు దివ్య మాటలకు రాజ్యలక్ష్మి నవ్వుతూ ఉంటుంది. అది చూసిన బసవయ్య షాక్ అవుతాడు. అంతేకాదు, 'కాళ్లు విరగొట్టి ఇంట్లో కూర్చోబెట్టడం మానేసి ఎందుకలా నవ్వుతున్నావు' అని ఆమెను అడుగుతాడు. దీంతో రాజ్యలక్ష్మి 'తను వెళ్ళటమే మనకు కావలసింది. వచ్చేటప్పటికి చూడు ఏం జరుగుతుందో నువ్వే చూడు' అంటుంది.

Intinti Gruhalakshmi Serial Today Episode June 16th 2023

దివ్యకు నిజం చెప్పిన తండ్రి:ఇంటికి వచ్చిన దివ్యను చూసి తులసి షాక్ అవుతుంది. అప్పుడు దివ్య వెళ్లి తల్లిని ఆప్యాయంగా కౌగిలించుకుని ఏడుస్తుంది. తులసి కూడా ఎమోషనల్ అయినా బయటకు కనిపించకుండా కవర్ చేసుకుంటుంది. అంతేకాదు, 'నిన్ను రావద్దు అని చెప్పాను కదా ఎందుకు వచ్చావు' అని అరుస్తుంది. అంతలోనే నందూ రావటంతో తండ్రిని హత్తుకొని 'అమ్మ చెప్పిందని నన్ను మెడ పట్టుకుని బయటికి గెంటేస్తావా' అని అడుగుతుంది. దీనికి నందూ 'అలా ఎందుకు చేస్తాను నువ్వు మీ అమ్మని అపార్థం చేసుకుంటున్నావు' అని జరిగింది మొత్తం దివ్యకు వివరిస్తాడు.

నేనే పరిష్కరించుకుంటాను:ఆ తర్వాత దివ్య 'మా అత్త రాక్షసి అయి ఉండవచ్చు కానీ.. మీ అల్లుడు దేవుడు' అని చెప్తుంది. దీంతో తులసి అదే మా ధైర్యం అంటుంది. దీంతో నందూ 'కానీ అదే ధైర్యం తల్లికి లొంగిపోతే మనం ఏమి చేయలేము' అంటాడు. దీనికి దివ్య 'మీరేమీ భయపడకండి నాన్న.. నా సమస్యను నేనే పరిష్కరించుకుంటాను' అని వెళ్లిపోతుంది. ఇదంతా చూసిన లాస్య 'రాజ్యలక్ష్మి కోడల్ని అదుపులో పెట్టుకున్నాను అని చెప్పింది ఇదేనా పెట్టుకోవడం' అని ఆమెకు ఫోన్ చేస్తుంది. దీంతో రాజ్యలక్ష్మి 'అవును చెప్పే వచ్చింది తను ఇంటికి వచ్చేసరికి ఒక సర్ప్రైజ్ వెయిట్ చేస్తుంది' అని ఫోన్ పెట్టేస్తుంది.

Intinti Gruhalakshmi Serial Today Episode June 16th 2023

విక్రమ్ ముందు నాటకాలు:విక్రమ్ కిందకు రావడాన్ని గమనించిన బసవయ్య, రాజ్యలక్ష్మి ప్లాన్ అమలు చేస్తుంటారు. ఇందులో భాగంగానే అక్క చేతికి బసవయ్య కట్టు కడుతూ నాటకంగా ఏడుస్తుంటాడు. అది చూసిన విక్రమ్ కంగారుగా కిందకు వస్తాడు. ఏం జరిగింది అని అడగ్గానే బసవయ్య ఏదో చెప్పబోతాడు. అప్పుడు రాజ్యలక్ష్మి కావాలనే ఆపి 'తను చిన్నపిల్ల కావాలని ఏమి చేయలేదు' అని మంచితనాన్ని నటిస్తుంది. దీంతో బసవయ్య 'నువ్వు ఊరుకో అక్క. అన్నివేళలా మంచితనం పనికిరాదు. నిన్ను ప్రాణంగా ప్రేమించే నీ కొడుక్కి అయినా నిజం చెప్పు' అంటాడు.

Intinti Gruhalakshmi Serial Today Episode June 16th 2023

దివ్యపై చాడీలు చెప్పడంతో:వాళ్ల మాటలు అర్థం కాకపోవడంతో విక్రమ్ అసలు ఏం జరిగిందో చెప్పండి అంటూ కోప్పడతాడు. దీంతో బసవయ్య 'ఈరోజు పనిమనిషి రాలేదు. వంట చేస్తున్న మీ అత్తగారికి సాయం చేయమ్మా అని దివ్యతో అంటే పుట్టింటికి వెళ్తుంటే నన్ను ఆపేస్తారా అంటూ కోపంతో చిందులు తొక్కింది. చేతిలో ఉన్న చాకుని విసిరేసింది. నేరుగా వచ్చి అక్కకు తగిలి ఇంత పెద్ద గాయం అయింది. అయినా ఆగలేదు పుట్టింటికి వెళ్ళిపోయింది' అని చెప్తారు. అది విని కోపంతో రగిలిపోయిన విక్రమ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దీంతో బసవయ్య, రాజ్యలక్ష్మి సంతోషిస్తారు.

Intinti Gruhalakshmi Serial Today Episode June 16th 2023

మళ్లీ కేసు పెడతానని చెప్పి:ఇంట్లో పని చేసుకుంటున్న అత్తగారి దగ్గరికి వచ్చి 'మీరైనా మీ అబ్బాయికి చెప్పండి తనను కూడా నాతో పాటు కెఫేకు రమ్మనండి' అని చెప్తుంది. దీంతో అనసూయ తులసి వైపు చూస్తుంది. అది గమనించిన లాస్య 'దీనికి కూడా మీ రింగు మాస్టర్ పర్మిషన్ ఇవ్వాలా? బుద్ధిగా నడుచుకోమని నువ్వైనా నీ మాజీ మొగుడికి చెప్పు. లేదంటే గృహహింస చట్టం అనేది మళ్లీ మళ్లీ పెట్టుకోవచ్చు. అనవసరంగా నేను టెన్షన్ పడి తర్వాత మిమ్మల్ని టెన్షన్ పెట్టి ఇదంతా అవసరమా' అంటుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X