For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi June 17th Episode: అంకిత అబార్షన్‌కు శృతే కారణం.. అలా అభి పరువు తీసేసిన భార్య

  |

  చాలా ఏళ్లుగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో రన్ అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మీ' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మీ' గురువారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరూ చూడండి!

  బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  బుధవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. అభి తండ్రి కాబోతున్నాడన్న విషయం తెలిసి నందూ, తులసి అంకిత ఇంటికి వస్తారు. అయితే, అప్పటికే ఆమెకు అబార్షన్ అయినట్లు గాయత్రి బాంబ్ పేల్చుతుంది. దీంతో అభి.. అంకితను కొట్టి అత్తమామలతో గొడవకు దిగుతాడు. ఆ సమయంలో నందూ, తులసిని గాయత్రి ఆమె భర్త ఘోరంగా అవమానిస్తారు. దీంతో వాళ్లు బాధగా వెళ్లిపోతారు.

  ఇంట్లో వాళ్లకు విషయం చెప్పిన తులసి

  ఇంట్లో వాళ్లకు విషయం చెప్పిన తులసి

  అభి దగ్గర నుంచి బాధగా ఇంటికి వచ్చిన తులసిని అందరూ ఏమైందని ప్రశ్నిస్తుండడంతో ఈరోజు ఎపిసోడ్ ప్రారంభం అయింది. అప్పుడామె ఏడుస్తూ అంకిత అబార్షన్ చేయించుకుందని చెబుతుంది. దీంతో అందరూ షాక్‌కు గురవుతారు. ‘అభికి తెలియకుండానే ఇలా జరిగే సరికి వాడు తట్టుకోలేకపోయాడు. దీంతో అంకిత మీద చేయి చేసుకుని గొడవ పడ్డాడు' అని చెబుతుంది.

   అంకిత అబార్షన్‌కు శృతే కారణమంటూ

  అంకిత అబార్షన్‌కు శృతే కారణమంటూ

  ఒకవైపు తులసి అక్కడ జరిగిన విషయాలు చెబుతుండగా.. అనసూయ మధ్యలోకి వస్తుంది. ‘అంకితకు అబార్షన్ అవడానికి శృతే కారణం. ఈమె ఇంట్లోకి రావడం వల్లే అంకిత వాళ్ల ఇంటికి వెళ్లిపోయింది. ఇప్పుడేమో కడుపు పోగొట్టుకుంది' అంటూ మాట్లాడుతుంది. అప్పుడు తులసి ‘అందరం బాధలో ఉన్నప్పుడు ఇలాంటి మాటలు అవసరమా అత్తయ్య' అంటూ కోప్పడుతుంది.

  తప్పు చేశానని బాధ పడుతోన్న నందూ

  తప్పు చేశానని బాధ పడుతోన్న నందూ


  అంకిత ఇంట్లో తనకు జరిగిన అవమానాన్ని తలుచుకుంటూ బాధ పడుతుంటాడు నందూ. అప్పుడు లాస్య ‘అక్కడ అలాంటి అవమానం జరుగుతుందని నాకు తెలుసు. అందుకే నిన్ను వెళ్లొద్దని అన్నా' అంటుంది. దీనికి అతడు ‘నా గురించి నేను బాధ పడడం లేదు. అభికి పిల్లలంటే ఇష్టం. అంకిత చేసిన పనికి బాధ పడుతున్నా. అయినా వాళ్లంతా నా ఫ్యామిలీ కదా' అని బదులిస్తాడు.

  అబార్షన్‌కు కారణమెంటో చెప్పిన అంకిత

  అబార్షన్‌కు కారణమెంటో చెప్పిన అంకిత

  అబార్షన్ తలుచుకుంటూ బాధ పడుతోన్న అభి దగ్గరకు అంకిత వస్తుంది. అప్పుడు అతడు పదే పదే అబార్షన్ ఎందుకు చేయించుకున్నావ్ అని అడుగుతాడు. దీనికి ‘నీ చేతకాని తనం వల్లే ఈ పని చేశా. మెడిసిన్ చేసినా సెటిల్ కాలేకపోతున్నావ్. మా అమ్మానాన్న సంపాదన మీద ఎన్నేళ్లు బతకాలి. అలాంటి టైమ్‌లో మనకి పిల్లలు అవసరమా' అంటూ కోప్పడగా.. అభి ఏడుస్తాడు.

  తప్పు మొత్తం మా ఇద్దరే అన్న తులసి

  తప్పు మొత్తం మా ఇద్దరే అన్న తులసి


  అంకిత చేసిన పని గురించి తులసి తన మామగారితో మాట్లాడుతుంటుంది. అప్పుడు ‘అభి పరిస్థితి ఇలా అవడానికి మేమే కారణం మావయ్యా. మేము మంచిగా ఉంటే వాడికీ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. తప్పంతా మాదే' అంటుంది. అప్పుడు మామగారు ‘తప్పు నీ మీద ఎందుకు వేసుకుంటావ్ అమ్మా. నందూ వల్లే ఇలా అయింది. వాడే దీనంతటికీ కారణం' అని అంటాడు.

   అందరూ ఉన్నా అనాథలా మారిన అభి

  అందరూ ఉన్నా అనాథలా మారిన అభి


  వీళ్లు మాట్లాడుతోన్న సమయంలో తులసి ‘అభి ఆ ఇంట్లో అందరూ ఉన్నా అనాథలా అయిపోయాడు. భార్య ఒకలా అత్తమామలు మరోలా వాడిని బాధ పెడుతున్నారు. గాయత్రి వాడికి తెలియకుండా అబార్షన్ చేయించింది. ఆ తర్వాత ఎలాంటి ఘోరమైన పనులు చేస్తుందో అని భయంగా ఉంది మావయ్య' అని అంటుంది. అప్పుడు శృతి.. అభితో మీరు మాట్లాడండి ఆంటీ అంటుంది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 348: Tulasi Told Shocking News to her Family. Then Abhi Questioning to her Wife. But She Unexpected Answered to her Husband.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X