Intinti Gruhalakshmi: తులసికి ఫోన్ చేసిన ప్రియ.. లాస్యకు రాములమ్మ సపోర్ట్.. అంతలోనే ఝలక్ ఇచ్చేలా!

తరాలు మారుతూ ఉన్నా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రం ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శనివారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే:శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. అత్త పర్మీషన్ లేకుండానే దివ్య తన ఇంటికి వెళ్తుంది. అక్కడ ఆమెను చూసి తులసి వాళ్లు బాధ పడతారు. అప్పుడు నందూ.. గతంలో తులసికి రాజ్యలక్ష్మి ఫోన్ చేసిన విషయాన్ని దివ్యకు చెప్పేస్తాడు. దీంతో దివ్య ఆమె సంగతి చూసుకుంటానని వచ్చేస్తుంది. అప్పటికే దివ్య తనపైకి కత్తి విసిరేసిందని విక్రమ్‌కు రాజ్యలక్ష్మి కంప్లైంట్ చేస్తుంది. దీంతో అతడు కోపంతో రగిలిపోతూ ఉంటాడు. మరోవైపు, నందూను తన వైపు తిప్పుకునేందుకు లాస్య ప్రయత్నిస్తుంది. చెప్పినట్లు వినకపోతే గృహ హింస కేసు పెడతానని అందరినీ బెదిరిస్తుంది.

Intinti Gruhalakshmi Serial Today Episode June 17th 2023

లాస్యకు రాములమ్మ సపోర్ట్:నందూ తన మాట వినకపోవడంతో లాస్య ఇంట్లోని వాళ్లతో 'ఇప్పుడు కోర్టులు, గొడవలు ఎందుకు? నేను కేవలం నందూ మనసులో చిన్న స్థానాన్ని మాత్రమే కదా అడుగుతున్నాను. అది కూడా ఇవ్వలేకపోతే ఎలా? నందూకు నచ్చజెప్పితే ఇంకే గొడవలు ఉండవు కదా' అంటుంది. అప్పుడే అక్కడకు వచ్చిన రాములమ్మ 'ఇందాకటి నుంచి వింటున్నాను. లాస్యమ్మగారు అడిగిన దాంట్లో అర్థం ఉన్నాది కదా. అప్పుడు తులసమ్మ గారు నందూ బాబు విడిపోయినప్పుడు కూడా మీరు ఏం చేయలేకపోయారు. కనీసం వీళ్ళనైనా కలపండి. తప్పు చేసిన తర్వాత క్షమాపణ అడిగితే క్షమించాలి' అని లాస్యకు సపోర్టు చేస్తుంది. దీంతో అనసూయ ఆమెపై కోప్పడుతుంది.

విక్రమ్ ముందు నాటకాలు:రాజ్యలక్ష్మి చేతిని పట్టుకొని విక్రమ్ నొప్పెడుతుందా అమ్మా అని ఎమోషనల్ అవుతాడు. అప్పుడు రాజ్యలక్ష్మి 'నా కోసం నువ్వు దివ్యతో గొడవ పెట్టొద్దు. నాకు సారీ చెప్పమని బలవంతం చేయొద్దు. అలా చేస్తే మీ ఇద్దరి మధ్య గొడవలు వచ్చేస్తాయి కదా' అని నాటకం ఆడుతుంది. అంతలోనే దివ్య అక్కడకు వచ్చి ఏం జరిగింది అని ప్రశ్నిస్తుంది. దీంతో అప్పటికే కోపంలో ఉన్న విక్రమ్ 'ఏం జరగడం ఏంటి అంత నువ్వే చేశావు. వంట చెయ్యను అని చెప్పి అమ్మ మీదకు కత్తి విసిరి చెప్పకుండా పుట్టింటికి వెళ్లాల్సిన అవసరం ఏంటి' అని తిడతాడు.

Intinti Gruhalakshmi Serial Today Episode June 17th 2023

దివ్య ఏడుపు... అత్త హ్యాపీ:

విక్రమ్ మాటలతో షాకైన దివ్య 'నేను మీ అమ్మ మీదకి కత్తి విసరలేదు. నువ్వు ఆవిడ మాటలు నమ్ముతున్నావు కానీ.. నా మాటలు ఎందుకు నమ్మడం లేదు? నీకు నిజం ఎందుకు కనపడట్లేదు' అని ప్రశ్నిస్తుంది. దీంతో విక్రమ్ 'మా అమ్మనే అనుమానిస్తున్నావా' అంటూ దివ్య మీద చేయి లేపుతాడు. దీంతో మరోసారి షాకైన దివ్య 'అందరి ముందు నా పరువు తీస్తేనే ఆవిడ మనసు చల్లారుతుంది. నువ్వు కూడా నన్నే దోషిని చెయ్. ఇంకెన్ని అవమానాలు భరించాలో' అని ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోతుంది. దీంతో రాజ్యలక్ష్మి మనసులో నవ్వుకుంటుంది.

Intinti Gruhalakshmi Serial Today Episode June 17th 2023

లాస్యకు రాములమ్మ షాక్:తనకు సపోర్ట్ చేసిన రాములమ్మ దగ్గరకు వచ్చిన లాస్య బంగారపు ఉంగరం ఇవ్వబోతుంది. అంతేకాదు, 'ఇప్పటివరకు ఇంట్లో నాకు ఎవరూ తోడు లేరు కానీ.. ఇప్పుడు నువ్వు ఉన్నావు. నాకోసం నిలబడ్డావు' అని అంటుంది. దీనికి రాములమ్మ 'మీరు నా గురించి తప్పుగా అనుకోవద్దు. నేను ఎప్పుడూ తులసమ్మ పార్టీనే. కాకపోతే నేను మీ వైపు నిలబడింది మీ మీద ప్రేమతో కాదు నందూ బాబు మీద జాలితో. చివరి వరకు ఆయనతోనే ఉండాలి అనుకున్న మీ నిర్ణయం నాకు నచ్చింది. అంతేగాని నా నుంచి ఇంకేం ఆశించొద్దు' అంటుంది. దీంతో లాస్య వెళ్లిపోతుంది.

Intinti Gruhalakshmi Serial Today Episode June 17th 2023

తులసికి ఫోన్ చేసిన ప్రియ:

దివ్యకు ఇంట్లో జరుగుతున్న అన్యాయం చూసిన ప్రియ తులసికి ఫోన్ చేసి జరిగిన విషయం మొత్తం వివరించి చెప్తుంది. అంతేకాదు 'ఇలాంటి సమయంలో నేను ఉన్నా ఓదార్చలేని పరిస్థితి. మీరైనా మాట్లాడండి. దివ్యకు ధైర్యం చెప్పండి' అని చెప్తుంది. నిజం తెలిసి బాధ పడిన తులసి వెంటనే దివ్యకు ఫోన్ చేస్తుంది. కానీ, ఆమె మాత్రం ఏమీ జరగలేనట్టు సంతోషంగా మాట్లాడుతుంది. దీంతో తులసి 'కన్నీళ్లు తుడుచుకొని మాట్లాడుతున్నావు కదమ్మా. ఎందుకు బాధను దాచుకుంటున్నావు' అని అడుగుతుంది.

Intinti Gruhalakshmi Serial Today Episode June 17th 2023

బాధ చెప్పుకున్న దివ్య:తులసితో మాట్లాడుతూ దివ్య 'అందరూ నన్నే దోషగా చూస్తున్నారమ్మా. ఆవిడ నా మీద పగ పట్టేసింది. విక్రమ్ కూడా ఆవిడ మాయలోనే పడిపోతున్నారు. ఈసారి విక్రమ్ మాట్లాడే వరకు నేను మాట్లాడను' అని అంటుంది. దీంతో తులసి 'అలా కాదమ్మా మీ ఇద్దరి మధ్య దూరాన్ని పెంచుకోవద్దు. మళ్లీ కొత్త సమస్యలు వస్తాయి' అని చెప్తుంది. దీంతో దివ్య 'ఎందుకమ్మా ఎప్పుడూ అమ్మాయిలే తలదించుకోవాలి. నాకు విక్రమ్ ముందు తలదించుకోవడానికి ఎటువంటి సమస్య లేదు. కానీ ఇప్పుడు నేను తలదించితే అత్తయ్య దగ్గర తలదించినట్టు అవుతుంది' అంటుంది.

Intinti Gruhalakshmi Serial Today Episode June 17th 2023

ఓడిపోవడం ఇష్టం లేదు:ఆ తర్వాత దివ్య 'ఈ గొడవలో నేను ఓడిపోవడం నాకు ఇష్టం లేదు. నేను ఓడిపోవడం నీకు కూడా ఇష్టం లేదు. నా సమస్య నేను తేల్చుకుంటాను. ఏడుస్తున్నాను కానీ కృంగిపోవడం లేదు. ఏదో ఒకటి చేస్తాను' అని కాల్ కట్ చేస్తుంది. దీంతో తులసి 'ఏం జరగకూడదు అనుకున్నాను అదే జరుగుతుంది' అనుకుంటుంది. ఆ తర్వాత విక్రమ్ డాబా మీద ఒంటరిగా ఉంటాడు. రాజ్యలక్ష్మి వచ్చి దివ్య ఏది అని అనగా నాకేం తెలుసు ఎక్కడున్నదో అని అంటాడు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X