Intinti Gruhalakshmi Today Episode: చెక్ చూసి షాకైపోయిన అభి.. ఇల్లు వదిలి వెళ్లిపోయిన అంకిత

సుదీర్ఘ కాలంగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి భారీ నుంచి అతి భారీ స్థాయిలో స్పందన దక్కుతుంది. సుదీర్ఘ కాలంలో ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శుక్రవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరు కూడా ఓ లుక్కేయండి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

గురువారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. లక్కీ, నందూ మాల్‌కు వెళ్లి సరదాగా తిరుగుతుంటారు. ఆ సమయంలో లాస్య ఫోన్ చేసి అక్కడకు వస్తున్నా అని అంటుంది. దీంతో నందూ తెగ టెన్షన్ పడుతుంటాడు. ఆ తర్వాత ఆమె అక్కడకు రాగానే లక్కీ.. తులసితో కలిసి ఆడుకుంటూ ఉంటాడు. ఇది చూసిన లాస్య షాకై నందూపై కోప్పడుతుంది. ఆ సమయంలో తులసి ఫ్యామిలీకి లాస్యకు గొడవ జరుగుతుంది. ఇక, చివర్లో మాల్‌లో నిర్వహించిన లక్కీ డ్రాలో నందూ, అభిని దాటేసి తులసి విజేతగా నిలుస్తుంది. దీంతో అందరూ ఆమెను అభినందించగా.. లాస్య కుళ్లుకుంటుంది.

లక్కీ డ్రాలో లాస్యకు అవమానం

లక్కీ డ్రాలో లాస్యకు అవమానం

లక్కీ డ్రాలో తులసి ఫ్యామిలీకి చెందిన వాళ్లే విజేతలుగా నిలవడంతో పరందామయ్య 'అనుకోకుండా ఒకే ఫ్యామిలీ వాళ్లను సెలెక్ట్ చేశారు.. చాలా థాంక్స్' అని అంటాడు. దీంతో లాస్య 'ఈ లక్కీ డ్రా అంతా బోగస్. కావాలని డబ్బులు తీసుకొని ఒకే ఫ్యామిలీని సెలెక్ట్ చేశారు' అంటూ ఆరోపణలు చేస్తుంది. అప్పుడు నిర్వహకులు 'మాకు అలాంటి అవసరం లేదు. కావాలంటే బౌల్‌లోని స్లిప్స్‌ను మరోసారి వెరిఫై చేసుకోండి' అని అంటారు. దీంతో తన పేరు ఉందా అని చెక్ చేసుకుంటుంది. అందులో పేరు ఉండడంతో అందరి ముందు పరువు పోగొట్టుకుంటుంది.

బంధం గురించి చెప్పిన తులసి

బంధం గురించి చెప్పిన తులసి

లాస్య స్లిప్పులు వెతికిన తర్వాత నిర్వహకులు విజేతలను స్టేజ్ మీదకు రమ్మని పిలుస్తారు. దీంతో తులసి, నందూ, ప్రేమ్, అభిలు వెళ్లి నిలబడతారు. ఆ తర్వాత వాళ్లను ఫోటో తీస్తారు. అనంతరం ఫ్యామిలీ బంధం గురించి చెప్పమని నిర్వహకులు అడుగుతారు. దీనికి తులసి 'బంధం అనేది రెండు అక్షరాల మాట కాదు.. నూరేళ్లు జీవితం' అంటూ వివరిస్తుంది. ఆ తర్వాత నిర్వాహకురాలు నందూ దగ్గరికి వెళ్లి మీ ఉద్దేశంలో భార్య అంటే ఎవరు అని అడుగుతుంది. కానీ, అతడు ఏం చెప్పడు. దీంతో పరందామయ్య కొడుకును వెటకారం చేస్తూ మాట్లాడతాడు.

కశ్మీర్ టూర్.. లాస్యకు అసహనం

కశ్మీర్ టూర్.. లాస్యకు అసహనం


విజేతలను ప్రకటించిన తర్వాత నిర్వహకులు వాళ్లకు కశ్మీర్ టూర్‌కు వెళ్లేందుకు ప్లైట్ టికెట్లను పంపుతామని చెబుతారు. ఆ తర్వాత దివ్య అందరూ కలిసి సెల్ఫీ దిగుదామని అంటుంది. దీంతో నందూ కూడా అక్కడే ఉంటాడు. అప్పుడు లాస్యకు కోపం వస్తుంది. ఆ వెంటనే లక్కీని తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. దీంతో నందూ కూడా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. లాస్య అని పిలుస్తున్నా కూడా పట్టించుకోకుండా ఆమె వెళ్లిపోతుంది. ఆ తర్వాత నందూ ఒంటరిగా మాల్ బయట ఉంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన పరందామయ్య 'ఏరా ఒంటరివాడివయ్యావా? జీవితంలో ఓడిపోవడం అంటే ఇలా ఒంటరిగా మిగిలిపోవడమే' అంటాడు. దీంతో నందూ ఏం మాట్లాడకుండా మౌనంగానే ఉండిపోతాడు.

లాస్య, నందూ మధ్య వాగ్వాదం

లాస్య, నందూ మధ్య వాగ్వాదం

రాత్రి అవగానే లాస్య.. లక్కీని పడుకోబెట్టి మాల్‌లో జరిగిన దాని గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో నందూ రూమ్‌లోకి వస్తాడు. అప్పుడు అతడిని లైట్ ఆఫ్ చేయమని చెబుతుంది. దీనికి నందూ చీకటిగా ఉందని అంటాడు. అప్పుడామె 'నీకెందుకు మేము చీకట్లో ఉంటే' అంటూ అతడిపై చిరాకు పడుతుంది. దీంతో నందూ ఏమైందని అడుగుతాడు. అంతేకాదు 'సెల్ఫీ కోసం దివ్య ఉండి పొమ్మంటే.. బాగుండదని దిగాను. మాల్‌లో జరిగిన దానికి సారీ' అంటాడు. దీనికి లాస్య 'అసలు మా వంక అయినా చూశావా.. నీ ఫ్యామిలీ కనిపించే సరికి.. నువ్వు వాళ్ల చెంత చేరావు. నువ్వు రా లాస్య.. వచ్చి నా పక్కన నిలుచో అని ఎందుకు నన్ను అనలేదు' అని నిలదీస్తుంది.

అభికి చెక్ అందించిన అంకిత

అభికి చెక్ అందించిన అంకిత

మరోవైపు, తన తండ్రి బిజినెస్‌కు సహాయం చేయాలని చూస్తోన్న అభి.. అంకితతో ఎలాగైనా చెక్‌పై సంతకం చేయించుకోవాలని చూస్తుంటాడు. అప్పుడే అంకిత అతడి దగ్గరకు వస్తుంది. దీంతో అభి 'నువ్వు చెక్ ఇస్తే వాళ్లకు ఇచ్చి వస్తాను' అంటాడు. దీనికి అంకిత 'ఇప్పటికే చెక్ రాసి పెట్టాను. తెచ్చి ఇస్తా ఆగు' అంటుంది. ఆ వెంటనే ఇదిగో చెక్ అంటూ 'ఇప్పుడే కాదు.. ఎప్పుడూ మీ వాళ్ల గురించి ఇలాగే ఆలోచిస్తూ ఉండు' అంటుంది. ఇంతలో గాయత్రి వచ్చి 'మీరిద్దరిని చూస్తుంటే నాకు చాలా ముచ్చటేస్తుంది' అంటుంది. అప్పుడు 'మీరు కూడా అంకిత మనసును అర్థం చేసుకోవాలి' అని అంటాడు.

ఆ చెక్ చూసి షాకైపోయిన అభి

ఆ చెక్ చూసి షాకైపోయిన అభి

అంకిత ఇచ్చిన చెక్‌లో రూ. 5 లక్షలే రాసి ఉంటుంది. దీంతో అభి డబ్బు తప్పు రాశావు అంటాడు. అప్పుడు అంకిత ఆల్బమ్ కోసం కావాల్సింది 5 లక్షలే కదా అంటుంది. దీనికి అభి 'ఆల్బమ్ ఏంటి? నేను సాయం చేయాల్సింది ప్రేమ్ కోసం కాదు.. డాడీకి' అంటాడు. దీంతో అంకితకు కోపం వచ్చి నీ మైండ్ సెట్ ఇంకా మారలేదు అంటుంది. అప్పుడు గాయత్రి.. అంకితపై చిరాకు పడుతుంది. దీంతో ఆమె నా ఆస్తి నా ఇష్టం అంటుంది. దీనికి గాయత్రి 'ఆస్తి మీద పవర్ ఆఫ్ అటార్నీ నేను తీసుకుంటా. చేతికి డబ్బు రాగానే మారిపోయింది. ఐహేట్‌యు అంకిత' అంటుంది.

ఇల్లు వదిలి వెళ్లిపోయిన అంకిత

ఇల్లు వదిలి వెళ్లిపోయిన అంకిత


అభి, గాయత్రి అన్న మాటలకు ఫీలైపోయిన అంకిత 'నేను నీ దగ్గర ఉండను. నా దారి నేను చూసుకుంటాను' అంటుంది. దీనికి అభి 'అంకిత ఇప్పుడు నేను ఏమన్నాను. డాడీ బిజినెస్ కోసం హెల్ప్ చేయమన్నాను అంతే కదా' అంటాడు. దీంతో ఆమె 'నన్ను కంట్రోల్ చేయడానికి ప్రయత్నించకండి.. అది జరిగే పని కాదు' అని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. తర్వాత రోజు ఉదయాన్నే తులసి పిల్లలకు సంగీతం నేర్పిస్తూ ఉంటుంది. ఇంతలో ఒక మహిళ.. కొందరు పిల్లలను తీసుకొచ్చి వాళ్లకు మ్యూజిక్ నేర్పించాలని అడుగుతుంది. ఆ తర్వాత అంకిత.. తులసి ఇంటికి వస్తుంది. తనను చూసి తులసి షాక్ అవుతుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X