Intinti Gruhalakshmi Today Episode: ప్రేమ్‌కు దొరికిన స్పాన్సర్.. తులసి కోసం లాస్య క్రిమినల్ ప్లాన్

మిగిలిన భాషలతో పోల్చుకుంటే తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి భారీ నుంచి అతి భారీ స్థాయిలో స్పందన దక్కుతుంది. సుదీర్ఘ కాలంలో ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శనివారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరు కూడా ఓ లుక్కేయండి!

Photos Courtesy: Star మా and Disney+Hotstar

శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. లక్కీ డ్రాలో తులసి ఫ్యామిలీకి చెందిన వాళ్లే విజేతలుగా నిలవడంతో లాస్య నిర్వహకులపై ఆరోపణలు చేస్తుంది. దీంతో వాళ్లు మరోసారి టెస్ట్ చేసుకోమంటారు. అందులో లాస్య విఫలం అవడంతో అందరిలో అవమాన పడుతుంది. అనంతరం నందూ.. తులసి ఫ్యామిలీతో సెల్ఫీ దిగడంతో లాస్య అతడితో గొడవ పడుతుంది. ఇక, ప్రేమ్‌కు అనుకుని 5 లక్షలు చెక్ రాసిచ్చిన అంకితపై గాయత్రి, అభి ఫైర్ అవుతారు. దీంతో అంకితకు కోపం వచ్చి ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది. ఆ తర్వాత తులసి ఇంటికి చేరుకుంటుంది.

తులసి టీచింగ్‌కు పెరిగిన ఆదరణ

తులసి టీచింగ్‌కు పెరిగిన ఆదరణ

సంగీతం టీచర్‌గా పని చేస్తున్న తులసికి రోజురోజుకూ ఆదరణ పెరుగుతూ ఉంటుంది. ఇప్పటికే ఆమె కొంత మంది పిల్లలకు శిక్షణ ఇస్తూ ఉంటుంది. అది చూసిన దివ్య ఎంతగానో సంతోషిస్తుంటుంది. ఆ తర్వాత ఇంకాస్త మంది కూడా వచ్చి క్లాస్‌లో జాయిన్ అవుతారు. దీంతో పిల్లలు క్రమంగా పెరుగుతూ ఉండడంతో స్థలం సరిపోవడం లేదని తులసి ఆలోచిస్తుంటుంది. అప్పుడు ఏం చేయాలో అర్థం కాదు. దీంతో సంగీతాన్ని నేర్పించేందుకు ఏదైనా చేయాలని ఆమె అనుకుంటుంది. అందుకోసం తనలో తానే సరికొత్త ఐడియాలను వేసుకుంటుంది.

 ప్రేమ్‌తో శృతి సరదా.. రొమాన్స్‌తో

ప్రేమ్‌తో శృతి సరదా.. రొమాన్స్‌తో

మరోవైపు ప్రేమ్ ఫోన్‌లో తన ఫ్యామిలీ ఫోటోను చూస్తుంటాడు. అందులో తులసిని చూస్తూ ఉంటాడు. శృతి వచ్చి ఏమైంది అని అడుగుతుంది. అంతేకాదు, 'పెళ్లయిన మగాళ్లు మొబైల్‌లో పెళ్లాల ఫోటోలు చూస్తూ కూర్చోవాలి కానీ.. అమ్మ ఫోటో చూడటం కాదు' అంటుంది. దీనికామె 'నాకు మా అమ్మ తర్వాతనే ఎవరైనా. మా అమ్మే నిన్ను ఇచ్చి పెళ్లి చేసింది' అంటాడు. దీనికి శృతి 'అదే కదా.. నిన్ను కాకుండా ఎవరైనా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ ను చేసుకున్నా అమెరికాలో ఏంచక్కా ఎంజాయ్ చేసేదాన్ని' అని సరదాగా అంటుంది. తర్వాత ఇద్దరూ రొమాన్స్ చేస్తారు.

ప్రేమ్ ఆల్బమ్‌కు స్పాన్సర్ రెడీగా

ప్రేమ్ ఆల్బమ్‌కు స్పాన్సర్ రెడీగా

ప్రేమ్, శృతి ఏకాంతంగా మాట్లాడుకుంటూ ఉండగానే అతడి స్నేహితుడు వస్తాడు. వచ్చీ రావడమే అతడు నీ ఆల్బమ్ కోసం నేను ఒక స్పాన్సర్‌ను ఒప్పించాను అంటాడు. దీంతో ప్రేమ్, శృతి చాలా సంతోషిస్తారు. కాకపోతే ఒక కండిషన్ అంటూ ముందు ఒక సంవత్సరం పాటు వాళ్ల కంపెనీలో గిటార్ ప్లేయర్‌గా వర్క్ చేయమన్నారు అంటాడు. దీనికి ప్రేమ్ 'అలా అయితే నాకు ఒక సంవత్సరం వేస్ట్ అవుతుంది కదా' అంటాడు. అప్పుడు శృతి 'మా ఫ్రెండ్ వందన తన ఇల్లు అమ్మకానికి పెట్టింది. ఆ ఇల్లు అమ్ముడుపోగానే 5 లక్షలు ఇస్తానన్నది' అని చెబుతుంది. దీంతో ప్రేమ్ 'అలా అయితే వెంటనే ఆల్బమ్ పనులు మొదలు పెట్టాలి' అని అంటాడు.

తులసికి పరందామయ్య ప్రశ్నలు

తులసికి పరందామయ్య ప్రశ్నలు


తులసి.. సంగీతాన్ని నేర్చుకోడానికి వచ్చే పిల్లల కోసం విశాలవంతంగా ఉండే స్థలం కోసం కసరత్తులు ప్రారంభిస్తుంది. ఇందుకోసం ఇంట్లో ఉన్న స్థలాన్ని కొలుస్తుంటుంది. అప్పుడే అక్కడకు వచ్చిన పరందామయ్యతో పిల్లలకు ఎండ తగలకుండా షెడ్ ఏర్పాటు చేయాలి అని అంటుంది. దీనికాయన అది సరే కానీ.. ఎంత మందికి షెల్టర్ వేస్తావు అంటాడు. అప్పుడు తులసి 10 నుంచి 15 మందికి అంటుంది. దీంతో ఆయన ఒకవేళ పిల్లలు పెరిగితే ఎలా అంటాడు. దీనికి తులసి 'ఎంతమంది ఉంటారు మామయ్య. నాకు 15 మంది కంటే ఎక్కువ ఎక్కడొస్తారు' అంటుంది.

లోన్ తీసుకోమంటూ మామ సలహా

లోన్ తీసుకోమంటూ మామ సలహా

తులసి మాటలకు పరందామయ్య 'వచ్చే నెల 50 మంది వస్తే ఏం చేస్తావు' అని అడుగుతాడు. దీంతో తులసి నా క్లాస్ కోసం అంతమంది పిల్లలు ఎక్కడ నుంచి వస్తారు అంటుంది. అప్పుడు పరందామయ్య 'పెద్ద షెడ్డు వేసి మ్యూజిక్ స్కూల్ పెడదాం. బ్యాంక్ లోన్ తీసుకుందాం. మన ప్రయత్నం మనం చేద్దాం. ఆ పైన దేవుడు దారి చూపిస్తాడు. నాకు తెలిసిన రిటైర్డ్ బ్యాంక్ ఆఫీసర్ ఉన్నాడు. ఆయన్ను అడిగి చెబుతాను' అంటాడు. దీంతో తులసి ఆలోచనలో పడిపోతుంది. చాలా సేపు తనలో తాను ఆలోచించిన తర్వాత పరందామయ్య మాటలకు ఓకే అంటుంది.

తులసి ప్లాన్ లీక్ చేసేసిన బ్రోకర్

తులసి ప్లాన్ లీక్ చేసేసిన బ్రోకర్

లాస్యను కలిసేందుకు భాగ్య ఆమె ఇంటికి వెళ్తుంది. అంతలో బ్రోకర్ భాస్కర్ ఆమెకు ఫోన్ చేస్తాడు. అప్పుడతను 'బ్యాంకులో లోన్ అరేంజ్ చేసే బ్రోకర్‌ను మేడం. నన్ను గుర్తు పట్టారా? తులసి మేడమ్ గారు.. ఎప్పుడైనా లోన్ కోసం కాంటాక్ట్ చేస్తే మీకు ఇన్ఫార్మ్ చేయమన్నారు కదా. నాకు డబ్బు ఇచ్చారు కదా. తను మళ్లీ నాకు ఈరోజు ఫోన్ చేశారు. మ్యూజిక్ స్కూల్ కోసం లోన్ కావాలని అడిగారు. లోన్ ఇవ్వడం కుదరదు అని చెప్తాను' అంటూ తులసి ఐడియాను భాగ్య దగ్గర లీక్ చేసేస్తాడు. అయితే, అక్కడే ఉన్న లాస్య లోన్ శాంక్షన్ అయ్యేలా చూడమని చెబుతుంది.

లాస్య క్రిమినల్ ప్లాన్.. అంకిత రాక

లాస్య క్రిమినల్ ప్లాన్.. అంకిత రాక

బ్రోకర్ మాటలు విన్న తర్వాత లాస్య.. తులసికి లోన్ రావాలని అంటుంది. అంతేకాదు, 'ఫేక్ డాక్యుమెంట్లు పెట్టి తులసికి లోన్ వచ్చేలా చేస్తాను. బ్రోకర్ ను అడ్డు పెట్టుకొని తులసి సైన్ చేసిన బ్లాంక్ చెక్‌ను తీసుకొని.. లోన్ అమౌంట్ తులసి అకౌంట్‌లో పడగానే నేను ఆ బ్లాంక్ చెక్‌తో నా అకౌంట్‌లో వేసుకుంటాను' అని క్రిమినల్ ప్లాన్ వేస్తుంది. మరోవైపు అంకిత.. తన ఇంటిని వదిలి తులసి ఇంటికి వెళ్లడం కోసం బయలుదేరుతుంది. అభి ఎంత బతిమిలాడినా వినదు. గాయత్రి చెప్పినా కూడా వినదు. అప్పుడామె 'నీ ఆలోచన, నీ నిందలు తప్పు అని చెప్పడానికే నేను ఆంటి ఇంటికి వెళ్తున్నా' అని గాయత్రితో అంటుంది. ఆ తర్వాత తులసి మాటలు గుర్తు చేసుకుని ఆ ఇంట్లో అడుగు పెడుతుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X