Intinti Gruhalakshmi: కాఫీలో విషం కలిపిన లాస్య.. వాళ్లిద్దరూ విగత జీవులుగా.. చివర్లో మరో ట్విస్ట్

ఎన్నో ఏళ్లుగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రం ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి'
సోమవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే : శనివారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. లాస్య మాటలకు రాములమ్మ సపోర్ట్ చేస్తుంది. దీంతో అనసూయ ఆమెను అరవడంతో వెళ్లిపోతుంది. తర్వాత రాజ్యలక్ష్మిని చేయి ఎలా ఉందని విక్రమ్ అడగ్గా.. దివ్యతో గొడవ పెట్టుకోమని పరోక్షంగా రెచ్చగొడుతుంది. అప్పుడే అక్కడకు వచ్చిన దివ్యపై విక్రమ్ కోప్పడడంతో పాటు కొట్టేందుకు చేయి లేపుతాడు. దీంతో ఆమె ఏడుస్తూ వెళ్లిపోతుంది. తర్వాత ప్రియ జరిగిందంతా తులసికి ఫోన్ చేసి చెప్పగా.. ఆమె దివ్యకు కాల్ చేసి ధైర్యం చెప్తుంది. దీంతో నా సమస్యను నేనే పరిష్కరించుకుంటాను అని తల్లికి భరోసాను కల్పిస్తుంది.

Intinti Gruhalakshmi:

విక్రమ్‌ను పంపించిన తల్లి: ఒంటరిగా ఉన్న విక్రమ్ దగ్గరకు వచ్చిన రాజ్యలక్ష్మి 'దివ్య భోజనం చేయకుండా బాధపడుతుంది వెళ్లి తనని ఓదార్చి భోజనం పెట్టు' అని నాటకం మొదలు పెడుతుంది. దీంతో విక్రమ్ 'మొండితనం తనకేనేంటమ్మా నాకు కూడా ఉంది. అయినా తను నా ముందే నిన్ను ఇంతలా అవమానిస్తుంది అంటే.. నేను లేనప్పుడు ఇంకా ఎంత చేస్తుందో నువ్వేమో నాకు ఏమీ చెప్పవు. నీలా మనసులో బాధను పెట్టుకొని బయటికి ప్రేమగా మాట్లాడలేను' అంటాడు.

Intinti Gruhalakshmi:

తల్లి కోసం ఒప్పుకున్నాడు: విక్రమ్ మాటలకు రాజ్యలక్ష్మి 'పోనీలే తను చిన్న పిల్ల. తను ఏదో తప్పు చేసిందని బంధాన్ని వదిలేసుకుంటామా? మీ ఇద్దరికీ మనస్పర్ధలు వస్తే సవతి తల్లి కాబట్టి చూస్తూ ఊరుకుంది.. లేదంటే ఇద్దరికీ సర్దుబాటు చేసేది కదా అని జనాలు నన్ను నిందిస్తారు' అంటూ ఎమోషనల్‌గా బ్లాక్‌మెయిల్ చేస్తుంది. దీంతో ఇక తప్పదు అనుకుని విక్రమ్ దివ్య దగ్గరికి వెళ్తాడు. కానీ ఆమె పట్టించుకోదు. అప్పుడతను 'నేను వచ్చిన పట్టించుకోలేదు తనలో ఇంత పొగరు ఉంది అనుకోలేదు' అనుకుంటాడు. తర్వాత గొంతు సకిలించినట్లు సైగ చేస్తాడు.

Intinti Gruhalakshmi:

నా మీద ప్రేమతో రాలేదా: విక్రమ్ గొంతు విన్న తర్వాత దివ్య 'నాకు ఒక పేరు ఉంది. ఆ పేరు పెట్టి పిలవచ్చు' అంటుంది. దీనికతడు 'నేను పిలిస్తేనే గాని నాతో మాట్లాడవా? నేను వచ్చినట్లు నీకు తెలుసు కదా' అంటాడు. దీంతో దివ్య 'నువ్వు దేనికి వచ్చావు నాకు ఎలా తెలుస్తుంది' అనగా.. 'నాకు తెలుసు నీ పొగరు సంగతి. అయినా అమ్మ మాట కాదనలేక వచ్చాను' అని చెప్తాడు. అప్పుడు దివ్య 'అంటే నా మీద ప్రేమతో రాలేదన్న మాట. ఇప్పుడు మాత్రం ఎందుకు రావడం మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించకండి దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపో' అనగా వెళ్లిపోతాడు.

Intinti Gruhalakshmi:

విషయం కలిపి ఇచ్చాను: నందూ కోసం లాస్య టీ తీసుకు వస్తుంది. దీంతో అతడు నాకు ఇష్టం లేదు అంటాడు. దీనికామె 'నేను ఇష్టం లేదా? టీ ఇష్టం లేదా' అని అడగ్గా.. నువ్వు తెచ్చిన టీ ఇష్టం లేదు అంటాడు. దీంతో లాస్య 'ఎందుకు నామీద అంత కోపం? నీ మనసులో కాస్త చోటు అడిగాను అంతే కదా. అయినా మాట వినకపోయేసరికి నీ మొండితనంతో నువ్వు బ్రతికి పోయావు. కానీ నీ తల్లిదండ్రులు అలా కాదు ప్రేమగా కాఫీ ఇచ్చేసరికి తాగేశారు. అందులో విషయం కలిపిన సంగతి వాళ్లకి తెలియదు. నీ కాపీలో కూడా విషయం కల్పాను కానీ నువ్వు తాగకుండా బ్రతికి పోయావు' అంటుంది.

మరో షాకిచ్చేసిన లాస్య: లాస్య మాటలు విని షాకైన నందూ.. కంగారుగా తన తల్లిదండ్రుల దగ్గరకు పరుగు పెడతాడు. అప్పటికే వాళ్లు స్పృహ లేకుండా పడిపోయి ఉండడం చూసి చనిపోయారని ఏడుస్తాడు. కోపంతో లాస్య పీక పట్టుకొని ఊగిపోతుంటాడు. అప్పుడే లాస్య వాళ్ళిద్దరూ బ్రతికే ఉన్నారు. ఊపిరి కూడా ఆడుతుంది అని చెబుతుంది. దీంతో నందూ 108కి ఫోన్ చేయబోతాడు. అంతలో ఆ ఫోన్ లాక్కొని లాస్య 'నేను వాళ్ళ కాఫీలో విషం కలపలేదు. కేవలం నిద్ర మాత్రలు మాత్రమే కలిపాను. కాసేపట్లో వాళ్లే నిద్రలేస్తారు. నేను ఇదంతా నీ మీద కోపంతో చేయటం లేదు. నీ మీద పిచ్చి ప్రేమతో చేస్తున్నా. చెప్పిన మాట వినకపోతే నీ తల్లిదండ్రులు ఇంకేదైనా కూడా చేస్తాను' అని బెదిరిస్తుంది.

విక్రమ్‌తో తులసి అలా: విక్రమ్ కారులో వెళ్తుండగా తులసి రోడ్డు మీదకు వచ్చి అడ్డుగా నిలబడుతుంది. అప్పుడు అతడు కారు దిగి వచ్చి 'ఇలా రోడ్డు మీద మాట్లాడుకోవడం ఏమీ బాగోలేదు. అయితే మీ ఇంటికి పదండి.. లేకపోతే మా ఇంటికి రండి' అంటాడు. దీనికి తులసి 'అలాంటి పరిస్థితి లేదు కాబట్టి ఇలా రోడ్డు మీద మాట్లాడవలసి వస్తుంది. నా కూతుర్ని మీరు చూసుకుంటారని ఇన్నాళ్లు ధైర్యంగా ఉన్నాము. కానీ ఇప్పుడు తన మీద చేయి ఎత్తే పరిస్థితి వచ్చింది తన మాటల్లో కాస్తయినా నిజం ఉందేమో కొంచెం ఆలోచించండి' అని రిక్వెస్ట్ చేస్తుంది.

మా అమ్మనే అంటారా: తులసి మాటలకు విక్రమ్ 'తను మా అమ్మ మీద కంప్లైంట్ చేస్తుంది. అంటే మా అమ్మ రాక్షసిలాగా కనిపిస్తుందా? అయినా ప్రతిసారి ఎందుకు నన్నే కన్విన్స్ చేయాలని చూస్తారు. మీ కూతురికి భర్తతో ఎలా మెలగాలో నేర్పించండి' అని వెళ్లబోతాడు. దీంతో తులసి అతడికి దండం పెట్టి మాట్లాడుతుండగా.. 'రోడ్డు మీద ఎందుకు పరువు తీస్తున్నారు' అంటూ కోపంగా వెళ్లిపోతాడు. ఇక, లాస్య బెదిరింపులకు భయపడిన నందూ.. తన వాళ్లకు హాని కలిగించకపోతే చెప్పినట్లు వింటానని అంటాడు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X