Intinti Gruhalakshmi Today Episode: లాస్యకు అంకిత బిగ్ షాక్.. ప్రేమ్ గురించి తులసికి తెలిసిన నిజం

టెలివిజన్ హిస్టరీలోనే తెలుగు బుల్లితెపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి భారీ నుంచి అతి భారీ స్థాయిలో స్పందన దక్కుతుంది. సుదీర్ఘ కాలంలో ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' బుధవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరు కూడా చూసేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

మగళవారం ఎపిసోడ్‌లో జరిగిందిదే

మగళవారం ఎపిసోడ్‌లో జరిగిందిదే

మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. అర్ధరాత్రి అవుతున్నా తులసి నిద్ర పోకుండా ఉంటుంది. అలాగే, పరందామయ్య కూడా మెలకువగానే ఉండడంతో ఆయనను హిప్నటైజ్ చేస్తుంది. కానీ, ఆయన నటించలేనని అంటాడు. ఇక, 12 గంటలు అవగానే అంకితకు ఫోన్ చేసి తులసి శుభాకాంక్షలు చెబుతుంది. దీంతో వాళ్లను పార్టీకి రమ్మని ఆహ్వానిస్తుంది. అనంతరం అభి, అంకిత కోసం నక్లెస్ తీసుకు వస్తాడు. ఇక, అంకితకు ఇచ్చేందుకు తులసి చీరను కుడుతుంది. ఆ సమయంలో అందరూ వచ్చి అడగ్గా.. మనం రాకపోతే పార్టీ వద్దని అంకిత అంటున్నట్లు తులసి చెబుతుంది.

లాస్యకు భారీ షాకిచ్చిన అంకిత

లాస్యకు భారీ షాకిచ్చిన అంకిత


అంకిత పుట్టినరోజు వేడుకలు ప్రారంభం అవుతాయి. ఆమె కోసం లాస్య ఓ విలువైన పట్టు చీరను తీసుకొచ్చి ఇస్తుంది. అంతేకాదు, నా గిఫ్ట్ ఎలా ఉంది అని అడుగుతుంది. కానీ అంకిత మాత్రం మౌనంగానే ఉంటుంది. ఆ తర్వాత గాయత్రి వచ్చి 'బేబీ.. నేను నీకోసం తీసుకున్న డ్రెస్ కంటే ఇది చాలా బాగుంది. ఫంక్షన్‌కు ఈ చీర కట్టుకో' అంటుంది. దీంతో అంకిత పర్లేదు మామ్.. ఈ డ్రెస్ బాగుంది అంటుంది. కానీ, అక్కడున్న అందరూ లాస్య తెచ్చిన పట్టుచీరనే కట్టుకో.. అదే బాగుంది అంటారు. దీంతో అంకితకు ఏం మాట్లాడాలో, ఏం చేయాలో కూడా అర్థం కాదు.

తులసి ఫ్యామిలీ రాకతో కోపంగా

తులసి ఫ్యామిలీ రాకతో కోపంగా

వాళ్ల మధ్య అలా చర్చ జరుగుతుండగానే తులసి ఫ్యామిలీ అక్కడకు వస్తుంది. ఆమెను అక్కడ చూసిన గాయత్రి, లాస్య, నందుకు కోపం వస్తుంది. ఆ తర్వాత ప్రేమ్, శృతి కూడా వస్తారు. అప్పుడు లాస్య 'తులసిని పిలవద్దు అనుకున్నాం కదా.. ఎందుకు పిలిచావు' అని నందూను అడుగుతుంది. దీనికతడు నేను పిలవలేదు అంటాడు. అప్పుడు లాస్య 'అమ్మ మీద ప్రేమతో అభి పిలిచి ఉంటాడు. ముందు వాళ్లను లోపలికి రాకుండా చూడు' అని అంటుంది. లాస్య చెప్పగానే గాయత్రి వాళ్ల దగ్గరికి కోపంగానే వెళ్లి ఎందుకొచ్చావు తులసి అని సూటిగా అడుగుతుంది.

తులసికి అంకిత మద్దతు ఇస్తూ

తులసికి అంకిత మద్దతు ఇస్తూ


గాయత్రి మాటలకు తులసి 'పార్టీకి మేము ఎందుకు రాకూడదు' అని అడుగుతుంది. దీనికి గాయత్రి 'ఫంక్షన్‌కు ఇన్వైట్ చేసినవాళ్లే రావాలి కానీ.. ఇలా పిలవని వాళ్లు రాకూడదు' అని అవమానిస్తుంది. ఇంతలో అక్కడికి వచ్చిన అంకిత.. ఆంటిని నేనే పిలిచాను అని అంటుంది. ఆ తర్వాత ఆమెను హత్తుకుంటుంది. ఆ సమయంలో అంకితకు అందరూ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతారు. తర్వాత అంకితను గాయత్రి పక్కకు తీసుకెళ్లి 'వద్దు అనుకున్నవాళ్లను ఎందుకు పిలిచావు' అని అడుగుతుంది. ఎందుకు పిలవకూడదు అని ప్రశ్నిస్తుంది.

తులసి చీర తీసుకున్న అంకిత

తులసి చీర తీసుకున్న అంకిత


వాళ్లు మాట్లాడుకున్న తర్వాత తులసి.. అంకిత కోసం తెచ్చిన చీరను తనకు ఇస్తుంది. ఆ చీర ఆమెకు బాగా నచ్చుతుంది. అంతేకాదు, కేక్ కట్ చేసే టైమ్‌కు ఈ చీరనే కట్టుకుంటాను అంటుంది. దీంతో లాస్య, గాయత్రికి కోపం వస్తుంది. అప్పుడు గాయత్రి 'అదేంటి లాస్య ఆంటి తెచ్చిన చీర కట్టుకుంటానని చెప్పావు కదా అది చాలా గ్రాండ్‌గా ఉంటుంది' అంటుంది. దీంతో నాకు ఇదే బాగుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్తుంది అంకిత. లాస్య, నందూకు చాలా చిరాకు వస్తుంది. అప్పుడు 'ఆ తులసిని ఎందుకు పిలిచారో ఏమో.. మన ప్లానంతా రివర్స్ అయింది' అంటారు.

లాస్య, నందూకు గాయత్రి హామీ

లాస్య, నందూకు గాయత్రి హామీ

ఆ తర్వాత నందూతో లాస్య 'ఇప్పుడు మన టార్గెట్ అభి కాదు.. అంకిత ఎలాగైనా తనను దారిలోకి తెచ్చుకోవాలి' అంటుంది. ఇంతలో గాయత్రి వస్తుంది. ఏమైంది అని అడుగుతుంది. అంకిత చేస్తున్న చేష్టలు లాస్యకు నచ్చడం లేదు అంటాడు నందూ. దీనికి గాయత్రి 'నువ్వేం టెన్షన్ పడకు లాస్య. కేక్ కట్ చేసే టైమ్‌లో నీ చీర కట్టుకునేలా చేస్తా' అంటుంది. మరోవైపు అభి.. ప్రేమ్‌ను చూసి హత్తుకుంటాడు. అప్పుడు శృతి 'చూడటానికి ముచ్చగా ఉంది కదా. ఒకరికొకరు ప్రాణంగా కలిసి ఉండేవారు. ఇప్పుడు ఎవరికి వారు అయిపోయారు. కలవడమే కష్టంగా అయిపోయింది. మీకు బాధగా అనిపించడం లేదా' అని తులసిని ప్రశ్నిస్తుంది.

ప్రేమ్ గురించి నిజం చెబుతూ

ప్రేమ్ గురించి నిజం చెబుతూ

ఆ తర్వాత శృతి 'గాయత్రి ఆంటి.. అంకితలకు ఒకరి పద్ధతులు మరొకరికి నచ్చవు. అయినా సరే.. తన కూతురు తన దగ్గరే ఉండాలని కోరుకుంటుంది. మీకు నాతో మాట్లాడటం కూడా ఇష్టం లేదు. అయినా కూడా మీకు ఇష్టం లేని కొన్న విషయాలు చెప్పడానికి వచ్చాను. మీరు ఏదైతే అనుకొని ప్రేమ్‌ను బయటికి పంపించారో అది జరగడం లేదు. మీ ఆలోచనలకు దూరంగా ఉండాలని ప్రేమ్‌ను దూరంగా ఉంచాను. కానీ, అప్పటికంటే ఇప్పుడే ప్రేమ్ ఇంకా ఎక్కువగా మీ గురించి ఆలోచిస్తున్నాడు. ఈ పరిస్థితుల్లో ప్రేమ్ జాబ్ పోగొట్టుకున్నాడు. జాబ్‌తో పాటు తన మీద ఉన్న నమ్మకాన్ని కూడా పోగొట్టుకున్నాడు. ఏం చేయాలో.. ప్రేమ్‌కు ఎలా సర్దిచెప్పాలో అర్థం కాక సతమతమవుతున్నాను. లైఫ్‌లో నేను ఓడిపోయాను ఆంటి. మీరే ఏదోకటి చేయాలి' అంటుంది.

శృతికి విలువైన మాటలు చెప్పి

శృతికి విలువైన మాటలు చెప్పి

శృతి చెప్పిన విషయాలను శ్రద్దగా విన్న తులసి.. 'జీవితం అంటే ఎదురు దెబ్బలు.. జీవితం అంటే ముళ్ల దారి. ప్రయాణం సాఫీగా సాగదు. కాలు జారిన ప్రతీసారి చేయి కోసం చూడకూడదు. నడక అమ్మ నేర్పిస్తుంది. జీవితంలోనూ అంతే. ఎవరూ ఎవరి వెంట రారు. నువ్వు బాధలో ఉన్నప్పుడు ఓదార్చుతారు. మగాడికి పెళ్లికాకముందు మాత్రమే అమ్మ. ఆ తర్వాత భార్యే అన్ని. అర్థం అయింది అనుకుంటాను' అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆ తర్వాత ప్రేమ్ 'అసలు నేను ఈ ఫంక్షన్ కు రాకూడదని అనుకున్నాను. నా అనే వాళ్ల పలకరింపునకు దూరం అయ్యాను' అంటూ బాధ పడుతుంటాడు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X