Intinti Gruhalakshmi: లాస్యకు కోలుకోలేని షాక్.. నందూ కేసు రీఓపెన్.. దివ్యకు అవమానం జరగడంతో!
తరాలు మారుతున్నా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రం ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి.
అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' గురువారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే: బుధవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. తల్లి నడిచేలా చేసినందుకు దివ్యకు విక్రమ్ గులాబీ పువ్వు ఇవ్వడంతో అతడిపై ఫైర్ అవుతుంది. తర్వాత నందూ, తులసి కోర్టుకు బయలుదేరుతుండగా లాస్య వచ్చి గొడవ పడుతుంది. అప్పుడు అందరూ కలిసి వెళ్తారు.
ఆ సమయంలో లాస్య ఫోన్‌లో వీడియో డిలీట్ అయినట్లు తులసి చెప్తుంది. దీంతో అప్పుడు షాకైనట్లు నటించిన లాస్య.. కోర్టులో మాత్రం ఆ వీడియోను చూపిస్తుంది. దీంతో జడ్జ్ అతడికి జైలు శిక్షను విధిస్తాడు. దీంతో అందరూ షాక్‌కు గురవుతారు. అదే సమయంలో లాస్యకు నందూ గట్టి వార్నింగ్ ఇచ్చేసి వెళ్లిపోతాడు.

రాజ్యలక్ష్మికి లాస్య గుడ్ న్యూస్: నందూ జైలుకు వెళ్లిపోయిన తర్వాత రాజ్యలక్ష్మికి లాస్య ఫోన్ చేస్తుంది. అప్పుడు 'ఇక నుంచి నీ కోడలు ఒంటరిది. ఆమె తండ్రి జైలుకెళ్లాడు. ఇంక తనకి బ్యాక్ బోన్ లేనట్టే. నీ ఇష్టం వచ్చినట్లు ఆడుకో' అని గుడ్ న్యూస్ చెప్తుంది. ఆ మాటలకు రాజ్యలక్ష్మి సంతోషిస్తుంది.
దీంతో బసవయ్య విషయం ఏంటి అని అడుగుతాడు. దీనికామె 'దివ్య తండ్రి జైలుకు వెళ్ళాడంట. ఇకనుంచి దివ్య ఒంటరి పక్షి. దాన్ని నేను ఒక ఆట ఆడిస్తాను' అంటుంది. దీనికి బసవయ్య 'తను ఒంటరిగా ఎందుకు అవుతుంది? తోడుగా నీ కొడుకు ఉన్నాడు కదా' అంటాడు. దీంతో రాజ్యలక్ష్మి 'వాడు నా చేతిలో కీలుబొమ్మ' అని అంటుంది.

ఇంత రాక్షసత్వంద ఉందా?: కోర్టు నుంచి ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తోన్న తులసి దగ్గరికి వచ్చిన లాస్య 'ఇప్పటికైనా మించి పోయింది లేదు. నందూను నా దగ్గరికి వచ్చేలాగా చేయు' అని అడుగుతుంది. దీంతో తులసి 'అరిగిపోయిన రికార్డు లాగా ఎందుకు పదేపదే అదే చెప్తావు? తెలిసి తెలియని తనంతో చేస్తున్నవేమో అనుకున్నాను. కానీ నీలో ఇంత రాక్షసత్వం ఉందనుకోలేదు. భర్తను జైలుకు పంపించినందుకు కాస్త కూడా బాధ లేదా' అంటూ క్లాస్ పీకుతుంది. తర్వాత ఈ కేసును రీ ఓపెన్ చేయించి నీ అన్యాయం బయట పెడతాను అంటూ ఆమెకు వార్నింగ్ ఇస్తుంది.

దివ్యను అవమానించేలా ప్లాన్: ఇక, రాజ్యలక్ష్మి 'దివ్య నాకైతే కన్నీరు పెట్టించింది. ఇప్పుడు చూడు దాంతో ఎలా ఆడుకుంటాను' అని అంటుంది. దీంతో బసవయ్య 'మేము తోడందుకుంటాంలే అక్కయ్య' అంటాడు. అంతలోనే దివ్య, విక్రమ్ అక్కడకు వస్తారు.
అప్పుడు రాజ్యలక్ష్మి, బసవయ్య కలిసి నందూ జైలుకు వెళ్లిన విషయాన్ని ప్రస్తావించి దివ్యను అవమానిస్తారు. దీంతో ఆమె తనలో తాను బాధ పడుతుంది. అయినా విక్రమ్ మాత్రం ఏమీ మాట్లాడడు. ఇక, తట్టుకోలేక చివరికి అక్కడి నుంచి తన గదిలోకి వెళ్లిపోతుంది. దీంతో దివ్యను ఓదార్చమని విక్రమ్‌కు రాజ్యలక్ష్మి చెబుతుంది.

తల్లడిల్లిపోయిన తల్లి తండ్రి: పరందామయ్య, అనసూయ ఇంట్లో కూర్చుని నందూ ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటారు. అంతలోనే తులసి వాళ్లు అక్కడకు చేరుకుంటారు. అప్పుడు నందూ ఎక్కడ ఉన్నాడు అని వరుసగా ప్రశ్నలు వేస్తూ ఉంటారు. అప్పుడు మోహన్ 'బావగారు 5 ఏళ్ల తర్వాత వస్తారు' అని చెప్తాడు. దీంతో విషయం తెలుసుకున్న పరందామయ్య, అనసూయ తీవ్ర మనస్థాపానికి గురవుతూ వెక్కి వెక్కి ఏడుస్తుంటారు.

విక్రమపై ఫైర్ అయిన దివ్య: దిగులుగా ఉన్న దివ్య దగ్గరికు విక్రమ్ టీ తీసుకొని వస్తాడు. దీంతో ఆమె నాకేమీ అక్కర్లేదు అంటుంది. అప్పుడు విక్రమ్ వాళ్ల మాటలు పట్టించుకోవద్దు అంటాడు. దీనికి దివ్య 'నేను బాధపడుతున్నది వాళ్ళు ఏదో అన్నారని కాదు. కానీ వాళ్ళను నువ్వు వెనకేసుకొస్తున్నావే అందుకు బాధపడుతున్నాను.
నేను కూడా మీ అమ్మ వాళ్ళను నాలుగు మాటలు అంటాను. అప్పుడు ఇలాగే తేలిగ్గా తీసుకుంటావా? ఈ ఇంట్లో తాతయ్య గారికి ఎలాంటి గౌరవం లభిస్తుందో.. మీ నాన్నగారిని ఎవరు ఎంతలా పట్టించుకుంటున్నారో నాకు తెలుసు' అని సీరియస్ అవుతుంది.
వాళ్లిద్దరి దూరం తగ్గేలా ఉంది: ఆ తర్వాత దివ్య 'ఇవన్నీ నిలదీసి అడిగితే తల ఎక్కడ పెట్టుకుంటారు. చేయని తప్పుకు మా నాన్న జైలుకు వెళ్లారు' అని ఏడుస్తుంది. దీంతో విక్రమ్ 'మళ్లీ ఇలాంటి పరిస్థితి రాకుండా చూసుకుంటాను' అని హామీ ఇస్తాడు.
ఇక, బసవయ్య 'మనం దివ్యను మాటలాడటం కాదు గాని వాళ్ళిద్దరి మధ్య దూరం తగ్గేలాగా ఉంది. ఈవిడ గారు ఏడవటము ఆయన గారు భుజాలు ఇవ్వడం' అని మాట్లాడతాడు. దీనికి అతడు భార్య 'అవును దివ్య వాళ్ళు గదిలోకి వెళ్లి చాలాసేపు అయింది ఇప్పటికీ బయటకు రాలేదు' అనుకుంటుంది. ఇలా ఈ ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











