twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Intinti Gruhalakshmi Today Episode: అంకిత కోసం తులసి యూటర్న్.. నందూకు నిజం చెప్పేసిన అభి

    |

    ఇండియాలోని అన్ని భాషలతో పోల్చుకుంటే తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ నుంచి అతి భారీ స్థాయిలో స్పందన దక్కుతుంది. సుదీర్ఘ కాలంలో ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' సోమవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరు కూడా ఓ లుక్కేయండి!

    Photos Courtesy: Star మా and Disney+Hotstar

    శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

    శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

    శనివారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. ప్రేమ్ ఆల్బమ్ చేయడానికి శృతి తన స్నేహితురాలు సహాయం చేయబోతుందని చెప్తుంది. దీంతో ఇద్దరూ సంతోషంగా గడుపుతారు. ఆ తర్వాత తులసి తన దగ్గరకు సంగీతం నేర్చుకోడానికి వచ్చే పిల్లల సంఖ్య పెరుగుతుండడంతో వాళ్ల కోసం షెడ్ ఏర్పాటు చేయాలని అనుకుంటుంది. ఇందుకోసం బ్యాంకులో లోన్ తీసుకోవాలని నిర్ణయించుకుంటుంది.

    అయితే, ఈ విషయం బ్రోకర్ ద్వారా లాస్యకు తెలుస్తుంది. దీంతో ఆమె క్రిమినల్ ఐడియాతో ఓ ప్లాన్‌ను కూడా రెడీ చేస్తుంది. దీనికి భాగ్య కూడా జత కలుస్తుంది.

    డ్రెస్ కిందకు జరిపి షాకిచ్చిన రాశీ ఖన్నా: టాప్ అందాలు కనిపించేలా ఘోరంగా!డ్రెస్ కిందకు జరిపి షాకిచ్చిన రాశీ ఖన్నా: టాప్ అందాలు కనిపించేలా ఘోరంగా!

    తులసి ఇంటికి వచ్చేసిన అంకిత

    తులసి ఇంటికి వచ్చేసిన అంకిత

    అంకిత బ్యాగ్ తీసుకుని తులసి ఇంటికి రావడంతో పరందామయ్య, దివ్య, అనసూయ షాక్ అవుతారు. అప్పుడే కిచెన్‌లో నుంచి వచ్చిన తులసి కూడా ఆమెను చూసి షాక్ అవుతుంది. తను బ్యాగ్ పట్టుకొని రావడం ఏంటి అని అనుకుంటుంది. అంతేకాదు, అంకితను తన ఇంటికి రావద్దని ముందే చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకుంటుంది. అప్పుడు అంకిత 'మీ పర్మిషన్ లేకుండా ఈ ఇంట్లోకి అడుగు పెట్టాలనుకోలేదు. అటువంటి అవసరం ఒకటి వస్తుందని కూడా అనుకోలేదు. కానీ, తప్పలేదు. ఆ ఇల్లు వదిలి ఈ ఇంటికి రావాల్సిన పరిస్థితి వచ్చింది' అని చెబుతుంది.

    అంకిత ప్రశ్నలకు తులసి మౌనం

    అంకిత ప్రశ్నలకు తులసి మౌనం

    తులసితో అంకిత 'మీరు ఆదరిస్తారన్న ఆశతో ధైర్యంగా మరోదారి లేక వచ్చాను. ఏం చేయమంటారు ఆంటి' అని అడుగుతుంది. అప్పుడు తులసి 'ఏం చేయాలో.. ఏం చేయకూడదో ఆరోజే చాలా స్పష్టంగా చెప్పాను. పైగా అందరి ముందు చెప్పాను. నేను నా మాటకు కట్టుబడి ఉంటాను' అంటుంది. దీంతో అంకిత 'ఆరోజు పరిస్థితి వేరు.. ఈరోజు పరిస్థితి వేరు.. దయచేసి మీ మనసును మార్చుకోండి ఆంటి' అని బ్రతిమాలుతుంది.

    కానీ, తులసి తన మనసు మార్చుకోవాల్సిన అవసరం లేదు అంటుంది. అప్పుడు అంకిత 'మీ కొడుకే మీ పొజిషన్‌లో ఉంటే ఏం చేస్తారు ఆంటి' అని ప్రశ్నిస్తుంది. దీనికి అనసూయ 'హారతి ఇచ్చి ఇంట్లోకి ఆహ్వానిస్తుంది' అంటుంది. దీంతో అంకిత ఇది న్యాయమేనా అంటుంది. తులసి మాత్రం మౌనంగా ఉంటుంది.

    న్యూడ్ ఫొటో షేర్ చేసిన శ్రీయ: బట్టలు లేని పిక్ వదలడంపై విమర్శలున్యూడ్ ఫొటో షేర్ చేసిన శ్రీయ: బట్టలు లేని పిక్ వదలడంపై విమర్శలు

     అభి గురించి నిజం చెప్పేసింది

    అభి గురించి నిజం చెప్పేసింది

    తులసి మాట్లాడకపోవడంతో అంకిత 'ఆరోజు నీ కొడుకును అత్తవారింటికి పంపించడానికి నీ సాయం అడిగారు. నీ మాటకు తలవంచి వెళ్లిపోయాను. ఆరోజు నీ మాట కాదని ఉంటే.. ఈరోజు ఇక్కడ నిలిచి ఉండేదాన్ని కాదు.. కాదంటారా ఆంటి. మీరు తీసుకున్న నిర్ణయానికి శిక్ష నన్ను అనుభవించమంటారా ఆంటి' అని బాధ పడుతుంది. అప్పుడు పరందామయ్య 'అసలు ఏం జరిగింది.. అభి ఏడి.. ఒక్కదానివే ఎందుకు వచ్చావు' అని అడుగుతాడు.

    దీనికి అంకిత 'ఆ ఇంట్లో నాకు స్వేచ్ఛ లేదు. నన్ను అసలు మనిషిగా కూడా చూడటం లేదు. బెదిరిస్తున్నారు. నా నోట్లో గుడ్డలు కుక్కి మాట్లాడమంటున్నారు. చేతులు నావే అయినా చేతలు వాళ్లవే కావాలంటున్నారు. కోట్ల ఆస్తి నా పేరు మీద పెట్టారు' అంటూ నిజాలు చెప్పేస్తుంది.

    అభిని వదిలేసి రాలేదు అంటూ

    అభిని వదిలేసి రాలేదు అంటూ

    అభి గురించి అంకిత 'మీకొడుకు కూడా వాళ్ల వైపు చేరాడు. ఇక నేను అక్కడ ఎలా బతకాలి. అందుకే.. అన్నీ వదిలేసి నాకు ఇష్టమైన మనుషుల దగ్గరికి వచ్చాను' అంటుంది. అప్పుడు తులసి 'నేనూ ఆడదాన్నే. అంకిత కష్టం నాకు తెలుసు. ఆ ఇంట్లో అంకిత ఎంత ఇబ్బంది పడుతోందో నేను ఊహించగలను. తను తన వాళ్లను మాత్రమే కాదనుకొని రాలేదు.. తన భర్తను కూడా వదిలేసి వచ్చింది' అంటుంది. దీంతో అంకిత 'నేను అభిని వదిలేసి రాలేదు.

    తనే నాతో రావడానికి సిద్ధంగా లేడు. అభి స్వార్థంతో నన్ను ఆ ఇంట్లో ముళ్ల కంప మీద బతకమంటారా? ఆడదానికి ఒక రూలు.. మగాడికి ఒక రూలు ఉంటుందా ఆంటి. మీరు కూడా ఒక మగాడి వల్ల ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు కదా' అని అడుగుతుంది.

    హాట్ షోలో హద్దు దాటిన పూజా హెగ్డే: లోదుస్తులు లేకుండా షాకింగ్ ఫోజులుహాట్ షోలో హద్దు దాటిన పూజా హెగ్డే: లోదుస్తులు లేకుండా షాకింగ్ ఫోజులు

    అంకిత ఉండేందుకు తులసి ఓకే

    అంకిత ఉండేందుకు తులసి ఓకే

    అంకితకు నచ్చజెప్పేలా తులసి 'ఇప్పుడు నువ్వు గడప దాటి ఇక్కడి రావడం వల్ల సమస్య తీరిపోదు. దానికి ఇంకా వంద సమస్యలు వస్తాయి' అంటుంది. దీనికి పరందామయ్య ఇలాంటి సమస్యలు ఎదుర్కోకుండానే ఇన్నాళ్లు నీ జీవితం గడిచిందా అని అడుగుతాడు. దీంతో తులసి ఏం సమాధానం చెప్పలేకపోతుంది. అప్పుడు తులసి నీ జీవితం నా జీవితంలా అవ్వకూడదు.. అర్థం అవుతోందా అని అడుగుతుంది తులసి.

    దీనికి అంకిత 'అర్థం అయింది ఆంటి.. మీరు ఈ ఇంట్లోకి నన్ను రానివ్వకపోతే.. ఎక్కడైనా ఆశ్రయం పొందుతా కానీ.. మా మామ్ ఇంటికి మాత్రం వెళ్లను.. నిర్ణయం మాత్రం నీదే' అంటుంది. అందరూ బతిమిలాడినా కూడా తులసి ఒక్కమాట కూడా అనదు. దీంతో అంకిత ఇంట్లో నుంచి వెళ్లిపోయే సమయంలో ఒప్పుకుంటుంది.

    రెంట్ కట్టేందుకు నందూ కష్టం

    రెంట్ కట్టేందుకు నందూ కష్టం

    ఇంటి అద్దె ఇవ్వలేదని ఓనర్ వచ్చి నందూను ప్రశ్నిస్తాడు. రెండు రోజుల్లో నేనే రెంట్ తీసుకొచ్చి ఇస్తాను అంటాడు. దీంతో ఓనర్ ఈసారికి ఊరుకుంటున్నాను. త్వరగా నా అద్దె డబ్బులు అరేంజ్ చేయండి అంటాడు. మరోవైపు లాస్య వచ్చి 'నందూ కొద్దిగా వాటర్ తెచ్చి ఇవ్వవా ప్లీజ్. ఆఫీసులో అలసిపోయి వచ్చాను' అంటుంది. దీంతో వెళ్లి తెచ్చుకో అంటాడు. అప్పుడామె ఏమైంది నందూ అలా ఉన్నావు అంటుంది.

    దీంతో 'చేయడానికి జాబ్ లేదు. హౌస్ రెంట్ కట్టడానికి కూడా డబ్బులు లేవు. అప్పు చేసి మరీ బర్త్ డేలు అంటూ తగలెట్టావు. ఇప్పుడు ఏమైంది' అని ఆమెపై ఫైర్ అవుతాడు.

    మళ్లీ రెచ్చిపోయిన జాన్వీ కపూర్: పైన ఏమీ లేకుండానే అందాల ఆరబోతమళ్లీ రెచ్చిపోయిన జాన్వీ కపూర్: పైన ఏమీ లేకుండానే అందాల ఆరబోత

    అంకిత గురించి చెప్పేసిన అభి

    అంకిత గురించి చెప్పేసిన అభి

    నందూ మాటలతో లాస్య అవన్నీ చేసింది నీ బిజినెస్ కోసమే కదా అంటుంది. ఇంతలో నందూ కోపంతో అభికి ఫోన్ చేస్తాడు. అప్పుడతను 'అంకిత ఇంట్లో లేదు.. సూట్‌కేసు సర్దుకొని అత్తవారింటికి వెళ్లిపోయింది' అని చెప్తాడు. ఇంతలో గాయత్రి ఫోన్ తీసుకొని 'మనం అనుకున్నదే జరిగింది. అంకితను అలాగే వదిలేస్తే తులసి కోసం ఆస్తి మొత్తం హారతికర్పూరంలా కరిగించేస్తుంది. వెంటనే తన దగ్గరికి వెళ్దాం పదా. అభిని రమ్మంటే రాడు' అంటుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

    English summary
    Intinti Gruhalakshmi Episode 663: Tulasi and her Family Questions to Ankitha about her Problem. After That Nandhu and Lasya Shocked about Ankitha Decision.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X