Intinti Gruhalakshmi: దివ్యకు ఎదురు తిరిగిన తాత.. నందూ తీరుతో వాళ్లంతా షాక్.. తులసికి కొత్త కష్టం

రెండు మూడు దశాబ్దాలుగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రం ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' మంగళవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

సోమవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే:
సోమవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. గొడవ తర్వాత రాజ్యలక్ష్మి వచ్చి దివ్యతో మాట్లాడమని విక్రమ్‌కు చెప్తుంది. అతడు అఇష్టంగానే వెళ్లడంతో దివ్య వెళ్లిపోమని పంపేస్తుంది. ఇక, నందూ దగ్గరకు కాఫీ పట్టుకుని వచ్చిన లాస్య.. తాగమని అడుగుతుంది. దానికి అతడు ఒప్పుకోకపోవడంతో మీ అమ్మనాన్నలకు విషం కలిపిన టీ ఇచ్చానని చెప్తుంది. దీంతో కంగారు వెళ్లిన నందూ వాళ్లను స్పృహ తప్పి ఉండడం చూసి ఏడుస్తాడు. కానీ, వాళ్లకు మత్తు మందు మాత్రమే ఇచ్చానని అంటుంది. ఇక, తులసి రోడ్డు మీద మాట్లాడే ప్రయత్నం చేయగా విక్రమ్ కోప్పడతాడు.

Intinti Gruhalakshmi Serial Today Episode June 20th 2023

కండీషన్లకు ఒప్పుకున్న నందూ:లాస్య బెదిరింపులకు భయపడిన నందూ 'నా నుంచి నువ్వు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావో చెప్పు' అంటాడు. దీంతో లాస్య 'మనిద్దరం కలిసి ఉండాలి అదే విషయాన్ని కోర్టులో చెప్పు. మనిద్దరం కలిపి వేరు కాపురం పెట్టాలి' అంటుంది. దీంతో నందూ ఈ ఒక్క విషయాన్ని ఒప్పుకోను అంటాడు. దీనికి లాస్య 'మనం కలిసి ఉండడం వాళ్లకి ఇష్టం లేదు. కలిసి ఉండి కొట్టుకోవడం కంటే విడిగా ఉండే వాళ్లకి కావాల్సినవన్నీ సమకూర్చితే.. వాళ్ళు, మనం అందరం హ్యాపీగా ఉంటాము' అని వివరిస్తుంది. దీంతో నందూ అన్ని కండిషన్స్ కి ఒప్పుకుంటాడు.

Intinti Gruhalakshmi Serial Today Episode June 20th 2023

తులసిపై ఫైర్ అయిన విక్రమ్:తులసి తనతో మాట్లాడిన మాటలను గుర్తు చేసుకుంటూ విక్రమ్ దివ్య దగ్గరకు వస్తాడు. వచ్చీ రావడమే అతడు 'మీ అమ్మ నా గురించి ఏమనుకుంటుంది? నా చేతులు పట్టుకొని బ్రతిమాలి నన్ను విలన్ను చేయాలి అనుకుంటుందా' అని మాట్లాడతాడు. దీంతో దివ్యకు ఏమీ అర్థంకాకపోవడంతో 'మధ్యలో మా అమ్మ ఏం చేసింది? అయినా కూతురు కోసం తపన పడటం నీకు తప్పుగా అనిపిస్తుందా' అంటూ తిరగబడుతుంది. అలా ఇద్దరూ మాటకు మాట అనుకుని గొడవకు దిగుతారు. దీంతో విక్రమ్ కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

Intinti Gruhalakshmi Serial Today Episode June 20th 2023

అత్తమామలకు లాస్య షాక్‌తో:బయటికి వెళ్తున్న నందూతో అనసూయ, పరందామయ్య ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతారు. అప్పుడే అక్కడకు వచ్చిన లాస్య 'ఎక్కడికి వెళ్తున్నావు కాదు.. ఎక్కడికి వెళ్తున్నారు అని అడగండి. మా ఇద్దరినీ వేరు చేసి మాట్లాడుతారు ఎందుకు? ఇద్దరం కలిసి కెఫేకు వెళ్తున్నాం' అని అంటుంది. దీంతో పరందామయ్య 'అదేంటి కెఫేకు నీకు ఎలాంటి సంబంధం లేదని చెప్పావు కదా' అంటాడు. దీంతో లాస్య 'నేను చెప్పానా మనిద్దరం కలిసి కెఫేకు వెళ్తున్నాము అంటేనే ఇంత రియాక్షన్ ఇస్తున్నారు. అలాంటిది మనం విడిగా కలిసి ఉండబోతున్నాము అంటే ఇంకెంత రియాక్షన్ ఇస్తారో' అని వెటకారంగా మాట్లాడుతుంది.

మిమ్మల్ని తీసుకురాలేదా?:లాస్య మాటలకు పరందామయ్య 'అవునా.. నందూ, లాస్య చెప్పేది నిజమేనా? ఇది తన నిర్ణయమా? నీ నిర్ణయమా' అని అడుగుతాడు. దీంతో నందూ 'ఇద్దరం కలిసి తీసుకున్న నిర్ణయం' అని చెప్తాడు. దీంతో తులసి, ఆమె అత్తమామలు షాక్ అవుతారు. అప్పుడు అనసూయ 'వాడిని బలవంతంగా లొంగ తీసుకున్నట్లు ఉన్నావు' అని అంటుంది. దీంతో లాస్య 'మీ మొగుడు పెళ్ళాలు ఇద్దరు గొడవపడి మామయ్య ఇంట్లోంచి బయటికి వెళ్లిపోతే.. మీరు సర్దుబాటు చేసి ఇంట్లోకి తీసుకు రాలేదా. మీరు చేస్తే ఒప్పు నేను చేస్తే తప్పా' అంటూ నిలదీస్తుంది.

Intinti Gruhalakshmi Serial Today Episode June 20th 2023

తులసిని నిలదీయడంతో:ఆ తర్వాత లాస్య 'తులసితో నేను ఈ ఇంట్లోకి వచ్చినప్పుడు భర్తను ప్రేమతో లొంగ తీసుకోవాలి అని చెప్పావు కదా. ఇప్పుడేమంటావు' అని ప్రశ్నిస్తుంది. దీంతో నందూ లాస్యను ఏమి అనలేక కోపంగా అక్కడ నుంచి తీసుకెళ్లిపోతాడు. వాళ్లు వెళ్లిపోయిన తర్వాత పరందామయ్య, అనసూయ 'నువ్వు ఏమి మాట్లాడవని తెలిసి వాడిని లాస్య బలవంతంగా తన వైపు తిప్పుకుంది. మేము మాట్లాడినప్పుడు నువ్వు నాకు సపోర్టుగా మాట్లాడి ఉంటే బాగుండేది కదా' అని నిలదీస్తారు.

Intinti Gruhalakshmi Serial Today Episode June 20th 2023

దిక్కుతోచని స్థితిలో తులసి:అత్తమామలు ప్రశ్నించడంతో తులసి 'లాస్య కలిసి వెళ్తానన్న ఆయన నిర్ణయాన్ని ముందుగా మీతో చెప్పారా మామయ్య? ఆయన మనసులో ఏముందో చెప్పకపోతే మనం మాత్రం ఏం చేస్తాము? అక్కడ దివ్య పరిస్థితి అలాగే ఉంది. ఇక్కడ పరిస్థితి అలాగే ఉంది. తెగించి ఒక నిర్ణయానికి రాలేని పరిస్థితి. ఏం చేయటానికి దిక్కుతోచటం లేదు' అని తల పట్టుకుంటుంది. దివ్య మామగారికి అన్నం పెట్టడానికి వెళ్లగా.. అప్పటికే తాతయ్య ఆయనకు అన్నం తినిపిస్తూ ఉంటాడు.

Intinti Gruhalakshmi Serial Today Episode June 20th 2023

భర్తను వదిలేస్తున్నావు కదా:అన్నం తినిపిస్తున్న తాతయ్యతో దివ్య 'అదేంటి తాతయ్య మీరు భోజనం పెడుతున్నారు? నేను ఉన్నాను కదా' అంటుంది. దీనికాయన 'ఎవరి మీద ఎక్కువగా నమ్మకాన్ని పెంచుకోకూడదమ్మ. ఎవరు ఎన్ని రోజులు ఎక్కడ ఉంటారో తెలియదు కదా. అందుకే మా బ్రతుకులు మమ్మల్ని బ్రతకని. మాకు ఈ చీకటి బ్రతుకులు అలవాటే' అని అంటాడు. దీంతో 'ఎందుకు తాతయ్య నన్ను పరాయిదాన్ని చేసి మాట్లాడుతారు? ఈ బాధ్యత నాకు లేదా నేను మావయ్యను వదులుకుంటానా' అంటుంది. దీనికాయన 'నువ్వు భర్తనే వదులుకోవటానికి సిద్ధపడుతున్నావు' అనగా దివ్య షాక్ అవుతుంది. ఇలా రోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X