For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi Today Episode: అతడిని చంపుతానని అంకిత హెచ్చరిక.. శృతికి నిజం తెలియడంతో టెన్షన్

  |

  తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతుంది. సుదీర్ఘ కాలంలో ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' బుధవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరు కూడా ఓ లుక్కేయండి!

  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  మంగళవారం ఎపిసోడ్‌లో జరిగిందిదే

  మంగళవారం ఎపిసోడ్‌లో జరిగిందిదే

  మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. అభినే తలుచుకుంటూ అంకిత బాధ పడుతూ ఉంటుంది. ఇది చూసిన దివ్య ఆమెను నవ్వించే ప్రయత్నం చేస్తుంది. కానీ, వర్కౌట్ కాదు. ఆ తర్వాత అనసూయ, పరందామయ్య కూడా అదే ప్రయత్నం చేస్తారు. చివరకు తులసి వచ్చి హెల్మెట్ అంటూ ఏదో చెప్పగానే నవ్వుతుంది.

  ఆ తర్వాత నందూ, గాయత్రి, లాస్యలు అక్కడకు వస్తారు. అంకితను తులసే అక్కడకు తెచ్చుకుందని ఆమెపై నిందలు వేస్తారు. దీనికి తులసి సరైన విధంగానే బదులిస్తుంది. చివర్లో అభి ఎంట్రీ ఇచ్చి తన తల్లిని నోటికొచ్చిన మాటలు అంటాడు.

  యాంకర్ ప్రదీప్ క్యారెక్టర్ బయట పెట్టిన ఢీ డ్యాన్సర్.. ఫోన్ చేస్తే అలా అన్నాడంటూ ఎమోషనల్

  అభిని చంపేస్తానని అన్న అంకిత

  అభిని చంపేస్తానని అన్న అంకిత

  తులసిని అభి నిందిస్తుండడంతో అంకిత మధ్యలోకి వస్తుంది. అప్పుడామె 'నేనే ఆంటి ప్లేస్ లో ఉండి ఉంటే.. ముందు నీ చెంప పగులగొట్టేదాన్ని. ఇంకెప్పుడూ నువ్వు ఆంటిని మామ్ అని పిలవకు. ఆ అర్హత నువ్వు కోల్పోయావు. ఇందాక ఏమన్నావు.. ఆంటి నన్ను మరో తులసిని తయారు చేస్తుందనా.. నిజంగా అలా జరిగితే నా అంత అదృష్టవంతులు ఎవరూ ఉండరు. అది నాకు దేవుడు ఇచ్చిన గొప్ప వరం అనుకుంటాను. కానీ, ఒక్కటి.. నువ్వు నందగోపాల్‌లా మారితే మాత్రం నేను చూస్తూ ఊరుకోను. ఆంటిలా నీ కాళ్లు పట్టుకొని బతిమిలాడను.. చంపేస్తాను' అంటుంది.

  గొడవ తర్వాత పడిపోయిన తులసి

  గొడవ తర్వాత పడిపోయిన తులసి

  అంకిత అప్పటితో ఆపకుండా అభిని నిందిస్తూ 'నీలాంటి వాళ్లను చంపకపోతే వందల మంది నందగోపాల్‌లు పుట్టుకొస్తారు. బెదిరింపులతో కాపురాలు నిలబడవు లేకపోతే నువ్వు ఒంటరిగా మిగిలిపోతావు. నేను కాదు. నన్ను అక్కున చేర్చుకునేవాళ్లు చాలామంది ఉన్నారు. కానీ, నేను లేకుండా నీ అత్తారింట్లో నీకు వాల్యూ అస్సలు ఉండదు. అప్పుడు నీకు చివరికి మిగిలేది ఈ ఇల్లే' అంటూ ఫైర్ అవుతుంది. దీంతో అక్కడి నుంచి నందూ, లాస్య, గాయత్రి, అభిలు వెళ్లిపోతారు. ఆ వెంటనే తులసి అక్కడే కుప్పకూలిపోతుంది. అప్పుడు బిగ్గరగా వెక్కి వెక్కి ఏడుస్తుంటుంది.

  Bigg Boss 6: బిగ్ బాస్‌లోకి టాలీవుడ్ వారసుడు.. అందుకోసమే ఒప్పుకున్న యంగ్ హీరో

  అభి మాటలకు బాధ పడిన తులసి

  అభి మాటలకు బాధ పడిన తులసి

  తులసి కుప్పకూలిపోయి ఏడుస్తుండడంతో అందరూ ఆమె చుట్టూ నిలబడతారు. అప్పుడు అంకిత ఊరుకోండి ఆంటి.. ఏడవకండి అంటుంది. దీనికి తులసి 'జీవితంలో నేను అనుభవించిన ఏ కష్టం పెట్టనంత బాధ ఈరోజు నా బిడ్డ వల్ల కలిగింది. నేను గుండెల్లో పెట్టుకొని పెంచిన బిడ్డ నా గుండెల్లో గునపాన్ని దింపాడు. నా బిడ్డల కోసం నేను నా జీవితాన్ని త్యాగం చేస్తే నాది మొండితనం, మూర్ఖత్వం అన్నాడు. నిజమేనా మామయ్య.. అభి చెప్పినట్టు తప్పు చేశానా? నా జీవితాన్ని నాశనం చేశానా? మీ జీవితాన్ని కూడా నేనే నాశనం చేస్తున్నానా' అని అడుగుతుంది.

  నా వల్ల మీరు బాధపడుతున్నారని

  నా వల్ల మీరు బాధపడుతున్నారని

  తులసి మాటలకు అంకిత అదేం లేదు ఆంటి అంటుంది. దీంతో తులసి మరి ఎందుకమ్మా వాడు అంతలా అసహ్యించుకుంటున్నాడు అని అడుగుతుంది. దీనికి పరందామయ్య 'నువ్వు వాడి మాటలు ఏం పట్టించుకోకమ్మా' అంటూ ధైర్యం చెబుతాడు. దివ్య కూడా తులసిని ఓదార్చుతుంది. అప్పుడు అంకిత 'ఈ గొడవ అంతా నా వల్లే ఆంటి.. చెప్పినా వినకుండా ఇంట్లో ఉండిపోయాను. నా వల్ల మీరు బాధపడుతున్నారు. నేను అసలు ఇక్కడికి రాకుండా ఉంటే ఇదంతా జరిగేది కాదు. సారీ ఆంటి' అంటుంది. దీంతో తులసి కూల్ అయిపోతుంది.

  ఉల్లిపొర లాంటి బట్టల్లో దిశా పటానీ రచ్చ: అవి కూడా కనిపించేలా.. ఆమెనిలా చూస్తే!

  శృతికి ఇంట్లో గొడవ చెప్పిన ప్రేమ్

  శృతికి ఇంట్లో గొడవ చెప్పిన ప్రేమ్

  శృతి ఏదో పని చేసుకుంటూ సెల్‌లో పాటలు వింటూ ఉంటుంది. ఇంతలో ప్రేమ్ వస్తాడు. చాలా కోపంగా ఉంటాడు. ఏమైంది అని అనుకుంటుంది. ఆ తర్వాత ఆమె దగ్గరకు వచ్చి సెల్‌లో పాట ఆపేస్తాడు. దీంతో శృతి 'బయట గొడవలు, బయట చిరాకులు ఇంట్లోకి తీసుకురావద్దని ఎన్నిసార్లు చెప్పాను' అంటుంది. అప్పుడు ప్రేమ్ 'ఇది బయటి గొడవ కాదు.. ఇంట్లో సమస్య' అంటూ అభి గురించి చెప్తాడు. అంతేకాదు, 'అసలు వీడు అత్తవారింటికి వెళ్లి కూర్చోవడమే తప్పు.. అది కాదని.. అంకిత పుట్టిల్లును వదిలేసి అత్తవారింటికి వచ్చిందట. అమ్మే కావాలని అంకితను ఇంటికి పిలిపించుకుందంటూ అందరూ అమ్మను బ్లేమ్ చేస్తున్నారు' అని చెప్తాడు.

  గొడవ ప్రేమ్ గురించే అనుకుంటూ

  గొడవ ప్రేమ్ గురించే అనుకుంటూ

  ప్రేమ్ గొడవ గురించి చెప్పగానే శృతి 'ప్రేమ్‌కు డబ్బు ఇస్తానని అంకిత మాట ఇచ్చింది. ఆ విషయంలోనే గొడవ అయిందా? విషయం ఏంటో.. అంకితకు కాల్ చేద్దామా.. వద్దులే అంకిత మాట్లాడే వరకు వెయిట్ చేస్తా' అని మనసులో అనుకుంటుంది. ఇంతలో ప్రేమ్ మాత్రం 'నేను రేపే వెళ్లి అభిని దులిపేస్తాను' అంటాడు. అప్పుడు శృతి 'అలాంటి పిచ్చిపని నువ్వు చేయకు ప్రేమ్. ఇప్పుడు నువ్వు వెళ్లి గొడవ పెట్టినా.. తులసి ఆంటినే రెచ్చగొట్టి పంపించింది అని అనుకుంటారు' అంటుంది. దీంతో ప్రేమ్ 'కొడుకును అయి ఉండి అమ్మను పట్టించుకోకుండా చేతులు ముడుచుకొని కూర్చోమంటావా. నీలాగా నేను చేతులు ముడుచుకొని కూర్చోలేను' అని కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

  డ్రెస్ కిందకు జరిపి షాకిచ్చిన రాశీ ఖన్నా: టాప్ అందాలు కనిపించేలా ఘోరంగా!

  అంకితకు శృతి ఫోన్.. నందూ ఫైర్

  అంకితకు శృతి ఫోన్.. నందూ ఫైర్

  గొడవ ఎందుకు జరిగిందో తెలుసుకునేందుకు అంకితకు శృతి ఫోన్ చేస్తుంది. అప్పుడు అసలు జరిగిన విషయం మొత్తం ఆమెకు చెప్తుంది. అంతేకాదు, తన తల్లి గురించి తెలుసుకున్నాకే ఆంటీ దగ్గరకు వచ్చేశానని అంటుంది. దీంతో తులసి 'నా కోడళ్లను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది అంటుంది తులసి. సమస్యను ఇద్దరూ అర్థం చేసుకొని సర్దుకుపోతున్నారు. ఇదే కావాల్సింది. తల్లీకొడుకుల మధ్య సఖ్యత లేదు.. కానీ.. తోడి కోడళ్ల మధ్య సఖ్యత ఉంది. ఇది చాకలమ్మా ఈ కుటుంబం నిలబడటానికి' అంటుంది. మరోవైపు, నందూ డబ్బుల కోసం లాస్యతో గొడవ పెట్టుకుంటాడు. దీంతో రెండు రోజులు వేచి చూడమని అంటుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 665: Ankitha Fires On Abhi for Tulasi. After That She Falls Down And Cry for That. Other Side, Prem Fire on Abhi about his Behaviour.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X