Intinti Gruhalakshmi: కోర్టులో రాములమ్మ ట్విస్ట్.. వీడియోలో అసలు రహస్యం.. విడాకులపై ఊహించని తీర్పు
ఇండియాలో చాలా ఇండస్ట్రీలు ఉన్నా.. తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రం ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' గురువారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar
బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే:బుధవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. విక్రమ్‌ను దూరంగా ఉంచి దివ్య తప్పు చేస్తుందని తాతయ్య ఆమెను హెచ్చరిస్తాడు. దీంతో దివ్యకు అసలు విషయం అర్థం అవుతుంది. ఆ వెంటనే విక్రమ్ కోసం టీ తీసుకుని వెళ్లి అతడికి దగ్గర అవ్వాలని చూస్తుంది. కానీ, అంతలోనే రాజ్యలక్ష్మి వచ్చి విక్రమ్‌ను ఇంకా రెచ్చగొడుతుంది. ఇక, నందూ, లాస్య కోర్టుకు వెళ్లేందుకు రెడీ అవుతారు. అప్పుడు లాస్య మేము అటు నుంచి అటే వెళ్లిపోతాము అని వాళ్లతో అంటుంది. దీంతో అందరూ బాధ పడుతూ ఉంటారు. లాస్య, నందూ వేరే ఉండబోతున్నారని రాజ్యలక్ష్మి.. దివ్యకు చెబుతుంది.

వాడు ఎప్పటికీ నా కొడుకే:నందూ వాళ్ల కేసు విచారణ ఉందని రాజ్యలక్ష్మి చెప్పగానే విక్రమ్ 'నాకు ఖాళీ లేదు. తనకు ఇష్టమైతే వెళ్ళమనండి నాకేమీ అభ్యంతరం లేదు' అని వెళ్లిపోతాడు. అప్పుడు రాజ్యలక్ష్మి దివ్య వైపు గర్వంగా చూస్తూ 'వాడు ఎప్పటికీ నా కొడుకే. నీకు మొగుడు కాలేడు' అని అంటుంది. దీంతో దివ్య ఏమీ మాట్లాడకుండానే కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు బసవయ్య 'ఏంటక్కా ఉప్పు నిప్పులా ఉండే నందూ, లాస్య కలిసి కాపురం చేయబోతున్నారా? ఇది ఎలా సాధ్యం' అని అడుగుతాడు. దీంతో అది లాస్య గొప్పదనం అని అతడికి చెబుతుంది.

తులసిని నిలదీసిన దివ్య:కోర్టుకు వచ్చిన దివ్య వెళ్లి తులసి పక్కన కూర్చుటుంది. అప్పుడు 'మనం కోర్టుకి ఎందుకు వచ్చామమ్మా? నాన్నకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికా? నువ్వు ఎప్పుడూ చెప్తావు కదా కాస్త లేట్ అయినా న్యాయమే గెలుస్తుందని. మరి ఎందుకమ్మా నాన్న ఓడిపోతున్నారు. ఎందుకు నువ్వు చూస్తూ ఊరుకున్నావు? ఆయనను వదిలేసావా' అని తల్లిని నిలదీస్తుంది. దీనికి తులసి 'అడిగిన వాళ్ళకు సలహా ఇస్తే విలువ ఉంటుంది. అడగకుండా సలహా ఇస్తే సలహా ఇచ్చిన వాళ్ళకు కూడా విలువ పోతుంది' అని చెబుతుంది. ఇదంతా చూస్తున్న లాస్య సంతోషిస్తూ ఉంటుంది.

లాస్య ఓవర్ కాన్ఫిడెన్స్:లాస్య సంతోషిస్తూ ఉండగానే లాస్య పక్కనే ఉన్న రాములమ్మ 'తులసమ్మను తక్కువ అంచనా వేయకండి అమ్మా. ఆవిడ ఓటమిని అంత త్వరగా ఒప్పుకోరు' అని అంటుంది. అప్పుడు లాస్య 'ఏడ్చి ఏడ్చి దివ్య గొంతు ఆరిపోయి ఉంటుంది. కాస్త మంచినీళ్లు ఇవ్వు' అని రాములమ్మకి చెప్తుంది. అంతలోనే నందూ వాటర్ బాటిల్ తీసుకువచ్చి దివ్యకు ఇచ్చి వాళ్ళ పక్కనే కూర్చుంటాడు. దీంతో రాములమ్మ 'అదేంటమ్మా నందూ బాబు అక్కడ కూర్చున్నారు' అనగా.. ఇప్పటి నుంచే నా పక్కన కూర్చుంటే కుళ్ళుకొని చస్తారు. కాసేపు కూర్చోనివ్వు అంటుంది.

లాస్య సహా అంతా షాక్:టైం అవడంతో జడ్జ్ వచ్చి 'మీకు ఇచ్చిన నెల రోజులు గడువు ముగిసింది. మీ మనసులు మారాయా లేకపోతే డైవర్స్‌కు సిద్ధంగా ఉన్నారా' అని అడుగుతాడు. అప్పుడు లాస్య 'నా మనసు మారలేదు సార్. నా ఆఖరి ఊపిరి ఉన్నంత వరకు నా భర్తతోనే ఉండాలని నా ఆశ. ఈ తాళిబొట్టు లాగే నా భర్తను కూడా నా గుండెల్లో పెట్టి చూసుకుంటాను' అంటుంది. అప్పుడు జడ్జ్ 'మరి నీ సంగతి ఏంటి నందగోపాల్' అని అడగ్గా.. మోహన్ వచ్చి 'అతడి నిర్ణయంలో మార్పు లేదు. ఇప్పటికీ నా క్లయింట్ విడాకులే కోరుకుంటున్నాడు' అని చెప్తాడు. దీంతో అంతా షాక్ అవుతారు.

బెదిరించింది అంటూ:మోహన్ ఆ మాట అనగానే నందూ 'అదేంటి నా నిర్ణయం చెప్పిన తర్వాత కూడా మోహన్ ఇలా మాట్లాడుతున్నాడు' అని మనసులో అనుకుంటాడు. ఆ తర్వాత మోహన్ 'అతను భార్యతో కలిసి ఉండటానికి సిద్ధపడిన మాట నిజమే. కానీ అందుకు బలమైన కారణం ఉంది. ఆమె తనతో కలిసి ఉండకపోతే నందూ తల్లిదండ్రులను చంపేస్తాను అంటూ బెదిరించింది' అంటాడు. దీంతో లాస్య 'అలాంటిదేమీ లేదు సార్. కావాలంటే మా ఇంటి పనిమనిషి రాములమ్మను అడగండి. తను ఇంటికి నమ్మకమైన మనిషి' అని చెబుతుంది.

రాములమ్మ బిగ్ ట్విస్ట్:లాస్య మాట వినగానే రాములమ్మను బోనులోకి వచ్చి నిజాలు చెప్పమంటారు. దీంతో అప్పటి వరకూ లాస్య వైపు మాట్లాడిన రాములమ్మ.. ట్విస్ట్ ఇస్తూ 'నందూ బాబును చాలా టార్చర్ పెట్టారు. ఆ ముసలి వాళ్లకి టీలో మత్తు మందు కలిపి ఇచ్చారు. అందుకు నేనే సాక్ష్యం' అంటుంది. దీంతో లాస్య ఒక్కసారిగా షాక్‌కు గురవుతుంది. అంతేకాదు, 'తను అబద్ధం చెప్తుంది సార్. ఆమె మాటలు నమ్మొద్దు' అంటుంది. దీంతో జడ్జ్ కూడా 'ఆమె చెప్పిన మాటలు నిజం అనటానికి సాక్ష్యం ఏమిటి' అని మోహన్‌ను ప్రశ్నిస్తాడు.

విడాకులు మంజూరు:జడ్జ్ సాక్ష్యం అడగ్గానే తులసి తన దగ్గర ఓ ఆధారం ఉందని వీడియోను చూపిస్తుంది. అది చూసిన తర్వాత జడ్జ్ 'ఒకసారి నీ భర్త మీద ఫేక్ గృహహింస కేసు పెట్టి.. ఇప్పుడు కూడా అదే తప్పు చేస్తున్నావు. నువ్వు చాలా డేంజరస్‌గా ఉన్నావు' అంటూ లాస్య ఎంత బ్రతిమాలుతున్నా వినిపించుకోకుండా విడాకులు మంజూరు చేస్తారు. దీంతో అందరూ ఎంతో సంతోషిస్తారు. బయటికి వచ్చిన తర్వాత దివ్య ఎంతో ఆనంద పడిపోతుంది. దీంతో తులసి ఎందుకు అంత ఎగ్జైట్ అవుతున్నావు అనగా.. ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్న రోజు ఇది. మా నాన్నను మాకు కాకుండా చేసింది. ఇప్పుడు ఆ పీడ విరగడ అయిపోయింది' అంటుంది. అది చూసిన లాస్య కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇలా ఈ ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











