For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi Today Episode: లాస్య ఉచ్చులో తులసి.. 20 లక్షలకు మోసం.. ప్రేమ్ కోసం సంతకం

  |

  దాదాపు రెండు దశాబ్దాలుగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతుంది. సుదీర్ఘ కాలంలో ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' గురువారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరు కూడా ఓ లుక్కేయండి!

  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  బుధవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. తులసిని అభి నోటికొచ్చినట్లు మాట్లాడడంతో అంకితకు కోపం వస్తుంది. ఆ వెంటనే ఆమె చెంప పగలగొడతానంటూ ఫైర్ అవడంతో పాటు నందూలా చేస్తే చంపేస్తానంటూ వార్నింగ్ ఇస్తుంది. ఆ తర్వాత అభి వ్యవహరించిన తీరుతో తులసి కుప్పకూలిపోయి తెగ ఏడ్చేస్తుంది.

  దీంతో ఆమెకు అందరూ ధైర్యం చెప్పి ఓదార్చుతారు. అనంతరం ఇంట్లో గొడవ జరిగిన విషయాన్ని ప్రేమ్, శృతికి చెప్తాడు. అంతేకాదు, అభిని వదలనని కోపం వెళ్లిపోతాడు. దీంతో శృతి.. అంకితకు ఫోన్ చేసి అక్కడ జరిగిన విషయాన్ని మొత్తం వివరిస్తుంది.

  పూరీ జగన్నాథ్‌పై బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు: ఆకాశ్ నీ కొడుకు కాదా.. చాలా మంది ఉన్నారంటూ!

  పైకి ఎక్కిన తులసి.. టెన్షన్ టెన్షన్

  పైకి ఎక్కిన తులసి.. టెన్షన్ టెన్షన్

  సంగీతాన్ని నేర్చుకోడానికి వచ్చే పిల్లలకు ఎండ పడకుండా ఉండేందుకు తులసి గార్డెన్ ఏరియాలో టెంట్ కడుతూ ఉంటుంది. దీనికోసం ఆమె నిచ్చెనతో పైకి ఎక్కుతుంది. అది చూసి కుటుంబ సభ్యులు అందరూ భయపడతారు. అప్పుడు వాళ్లు 'నువ్వు అలా పైకి ఎందుకు ఎక్కావు. కిందికి దిగు ముందు. నువ్వు ఒక్కదానివే ఎందుకు అంత కష్టపడుతున్నావు.

  మమ్మల్ని కూడా పిలిస్తే సాయం చేసేవాళ్లం కదా. మన తలరాత బాగోలేకపోతే ఏం చేస్తాం. నువ్వు కింద పడితే ఇంకా ఏమైనా ఉందా. ఇంట్లో ఇల్లాలు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి' అంటారు. ఆ తర్వాత ఏం చేయాలో తులసిని అడిగి అందరూ తలో పని చేస్తూ ఉంటారు.

  లోన్ ఇచ్చేందుకు ఒప్పుకుంటూ

  లోన్ ఇచ్చేందుకు ఒప్పుకుంటూ

  తులసితో పాటు ఆమె కుటుంబ సభ్యులంతా షెడ్ పనుల్లో బిజీగా ఉండగా.. అక్కడకు బ్యాంక్ ఏజెంట్లు వస్తారు. వాళ్లను ఇంట్లోకి తీసుకెళ్లి మ్యూజిక్ స్కూల్ పెట్టాలనుకుంటున్నాం అని చెబుతారు. దీంతో బ్యాంక్ ఏజెంట్ దర్జాగా తీసుకోండి. దానిలో ఏముంది అని అంటాడు. అప్పుడు అంకిత ఎంత లోన్ వస్తుంది అని అడుగుతుంది. దీంతో ఆయన మీకు ఎంత అవసరం ఉంటే అంత తీసుకోండి అంటాడు. దీనికి పరందామయ్య మాకు ఇన్ కమ్ ఏం లేదు కదా.. ఎలా ఇస్తారు అని అడుగుతాడు. దీంతో ఆ ఏజెంట్ మీకు మంచి పేరు ఉంది కదా చాలు అంటాడు.

  ఇన్నర్స్ లేకుండా షాకిచ్చిన పాయల్: వామ్మో ఆరబోతలో హద్దు దాటేసిందిగా!

  ప్రేమ్‌కు సాయం చేయాలని ప్లాన్

  ప్రేమ్‌కు సాయం చేయాలని ప్లాన్

  బ్యాంక్ ఏజెంట్లు అడిగిన దాని ప్రకారం తులసి కావాల్సిన డాక్యుమెంట్స్ తీసుకొచ్చి ఇస్తుంది. అన్ని డాక్యుమెంట్స్ వెరిఫై చేసి మళ్లీ వస్తాం అని చెప్పి వాళ్లు అక్కడి నుంచి వెళ్లిపోతారు. 20 లక్షల లోన్ రాగానే ముందు 5 లక్షలు ప్రేమ్‌కు ఇవ్వాలి అని తులసి ప్లాన్ చేసుకుంటుంది. మరోవైపు ప్రేమ్ సంతోషంతో ఇంటికి వస్తాడు. శృతి అని పిలుస్తాడు. కానీ, ఆమె ఇంట్లో ఉండదు. అప్పుడే బయటి నుంచి బిందెలో మంచినీళ్లు తీసుకొస్తూ ఉంటుంది. ఆమెను చూసి అదేంటి నువ్వు నీళ్లు తీసుకొస్తున్నావు ఇటు ఇవ్వు అంటూ తను బిందె తీసుకొని కింద పెడతాడు.

  ప్రేమ్ ముందు ఇరుక్కున్న శృతి

  ప్రేమ్ ముందు ఇరుక్కున్న శృతి

  తనకు ఓ బంపర్ ఆఫర్ దొరికిందని ప్రేమ్, శృతితో చెబుతాడు. 'నాకు ఒక షాపు అతడు పరిచయం అయ్యాడు. 25 శాతంలో అన్ని ఇన్‌స్ట్రుమెంట్స్ ఇస్తా అన్నాడు' అని చెబుతాడు. అయితే, శృతికి మాత్రం డబ్బు దొరకలేదని ఎలా చెప్పాలో అర్థం కాదు. అప్పుడు ప్రేమ్ నీ ఫ్రెండ్‌కు ఫోన్ చేసి డబ్బులు ఎప్పుడు అరేంజ్ చేస్తారో అడుగు అంటూ ఫోన్ తెచ్చి ఇస్తాడు. కానీ.. ఎవరికి ఫోన్ చేయాలో శృతికి అర్థం కాదు. ఇంతలో తులసి నుంచి ఫోన్ వస్తుంది. అప్పుడు ప్రేమ్ ఎవరు చేశారు అని అడుగుతాడు. దీంతో శృతి అతడికి వందనే చేసిందని అబద్ధమే చెబుతుంది.

  యాంకర్ ప్రదీప్ క్యారెక్టర్ బయట పెట్టిన ఢీ డ్యాన్సర్.. ఫోన్ చేస్తే అలా అన్నాడంటూ ఎమోషనల్

  శృతికి శుభవార్త చెప్పిన తులసి

  శృతికి శుభవార్త చెప్పిన తులసి

  తులసి ఫోన్ చేయగానే శృతి లిఫ్ట్ చేస్తుంది. కానీ, వందన అంటుంది. వందన ఏంటి నేను తులసిని మాట్లాడుతున్నాను అంటుంది. సరే చెప్పు అంటుంది. నీకో శుభవార్త అని అంటుంది. ప్రేమ్ ఆల్బమ్‌కు డబ్బులు నేను అరేంజ్ చేస్తాను అని తులసి చెబుతుంది. దీంతో శృతి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఆ తర్వాత తులసి 'బ్యాంక్ లోన్ అప్లయి చేశాను.. త్వరలోనే డబ్బులు వస్తాయి. వచ్చిన వెంటనే నీకు ఇస్తాను' అని అంటుంది. దీంతో శృతికి ఏం మాట్లాడాలో అర్థం కాదు. ఆ తర్వాత తులసి పేరు చెప్పకుండా డబ్బులు వస్తాయని ప్రేమ్‌కు చెప్పడంతో సంతోషిస్తాడు.

  అంకిత గురించి గాయత్రి చర్చ

  అంకిత గురించి గాయత్రి చర్చ

  అంకిత.. తులసి ఇంటికి వెళ్లిపోవడంతో ఆమె విషయం ఏం చేద్దాం అని అభిని గాయత్రి అడుగుతుంది. దీనికి అతడు 'ఏం చేద్దాం ఆంటి.. నాకు అర్థం కావడం లేదు. నేను కావాలంటే అదే ఇంటికి రావాలని నన్ను అంటోంది' అంటాడు. అప్పుడు గాయత్రి 'వెళ్లు.. నువ్వు ఎలాగూ తనను దారిలోకి తెచ్చుకోలేకపోయావు కదా. నువ్వైనా దాని దారిలోకే వెళ్లు' అని వెటకారంగా అంటుంది. అప్పుడు అభి 'మీ పెంపకంలో 20 ఏళ్లలో మీ మాట వినని అంకిత.. 5 ఏళ్ల మా పరిచయంలో నా మాట ఎక్కడ వింటుంది' అని గట్టిగా బదులిచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

  Bigg Boss 6: బిగ్ బాస్‌లోకి టాలీవుడ్ వారసుడు.. అందుకోసమే ఒప్పుకున్న యంగ్ హీరో

  బ్యాంక్ ఏజెంట్‌తో లాస్య ప్లాన్స్

  బ్యాంక్ ఏజెంట్‌తో లాస్య ప్లాన్స్

  లాస్యకు బ్యాంక్ ఏజెంట్ భాస్కర్ ఫోన్ చేసి.. 'మీరు చెప్పినట్టే ఫేక్ డాక్యుమెంట్లతో అప్లికేషన్ రెడీ చేశాను' మేడమ్ అని చెప్తాడు. దీనికి లాస్య మరి ఇంకేంటి.. వెంటనే అప్లికేషన్‌ను బ్యాంక్‌లో సబ్మిట్ చేయి అంటుంది. చేస్తా మేడమ్ అంటాడు. మరోవైపు అనసూయకు ఒంట్లో నలతగా ఉంటే చెకప్ కోసం అంకితను తీసుకొని వెళ్తుంది. పరందామయ్య కూడా ఉండడు. ముగ్గురూ కలిసి హాస్పిటల్‌కు వెళ్లడంతో ఎవరూ లేరని సమయం చూసుకొని బ్యాంకు వాళ్లు తులసి ఇంటికి వెళ్తారు. ఇంట్లో తులసి ఒక్కతే ఉంటుంది. అప్పుడు ఏం చేయాలో ఆమెకు అర్థం కాదు.

  తులసిని మోసం చేసిన ఏజెంట్

  తులసిని మోసం చేసిన ఏజెంట్

  ఇంటికి వచ్చిన ఏజెంట్ 'లోన్ డాక్యుమెంట్స్ అన్నీ పూర్తయ్యాయి. ఈ ఫైల్స్ మీద సంతకం చేస్తే మేము తీసుకెళ్లి బ్యాంకులో సబ్మిట్ చేస్తాం' అంటాడు. అప్పుడు తులసి 'కానీ.. ఇంట్లో ఎవరూ లేరు.. వాళ్లు వచ్చి చూశాక నేను సంతకాలు పెట్టి ఇస్తా' అంటుంది. దీంతో ఏజెంట్ 'బ్యాంక్ మేనేజర్ లీవ్‌లో ఉన్నాడు.. మీ అప్లికేషన్ కోసమే వెయిట్ చేస్తున్నాడు.. వారం రోజులు రాడు' అని చెప్తాడు.

  దీంతో లేట్ అయితే ప్రేమ్‌కు ప్రాబ్లమ్ అవుతుందని అనుకొని వెంటనే వాళ్లు ఎక్కడ చెబితే అక్కడ సంతకాలు పెడుతుంది. చివరలో ఒక బ్లాంక్ చెక్ కూడా కావాలి మేడమ్ అంటాడు. దీనికి తులసి ఎందుకు అని ప్రశ్నిస్తుంది. మీకు అకౌంట్ ఉందని బ్యాంక్ వాళ్లకు ప్రూఫ్ కావాలి అంటాడు. దీంతో తెచ్చి దాని మీద సంతకం పెట్టి ఇస్తుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 666: Tulasi Gives Some Good News to Shruthi. Lasya Executed her Plan with Bank Employee Against Tulasi.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X