Intinti Gruhalakshmi: లాస్యకు వరుస షాక్‌లు.. తండ్రికి దివ్య రిక్వెస్ట్.. వాళ్లు మళ్లీ కలుస్తారా!

జనరేషన్లు చేంజ్ అవుతున్నా.. తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రం ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శుక్రవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే: గురువారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. కోర్టులో నందూ కేసు ఉందని చెప్పినా విక్రమ్ వెళ్లడానికి ఇష్టపడడు. దీంతో రాజ్యలక్ష్మి వాడు ఎప్పటికీ నా కొడుకే అంటూ దివ్య ముందు పొగరుగా మాట్లాడుతుంది. ఆ తర్వాత కోర్టులో విచారణ మొదలైన తర్వాత నందూ విడాకులు కోరుకుంటున్నాడని చెప్పి మోహన్ అందరికీ షాకిస్తాడు. అంతేకాదు, లాస్య అతడిని బ్లాక్‌మెయిల్ చేసిందని ఆరోపిస్తాడు. అప్పుడే రాములమ్మ వచ్చి లాస్యకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పగా.. తులసి ఓ వీడియోను జడ్జ్‌కు చూపిస్తుంది. ఇదంతా చూసిన తర్వాత నందూకు విడాకులు మంజూరు చేస్తారు.

Intinti Gruhalakshmi

నోరు మూయించిన రాములమ్మ: నందూకు విడాకులు వచ్చిన తర్వాత లాస్య పీడ విరగడ అయిందని అందరూ సంతోషంగా ఉంటారు. అప్పుడే రాములమ్మ కూడా వాళ్ల దగ్గరకు వెళ్లబోతుంది. అప్పుడు లాస్య ఆమె జుట్టు పట్టుకుని లాగి 'నాకే నమ్మక ద్రోహం' చేస్తావా అని ప్రశ్నిస్తుంది. దీంతో రాములమ్మ 'అది నీ దగ్గరే నేర్చుకున్నాను. తులసమ్మతో మంచిగా ఉంటూ నందూ బాబును లాక్కున్నావు అది నమ్మకద్రోహం కాదా? డబ్బుకు ఆశపడి దివ్యమ్మ జీవితాన్ని తాకట్టు పెట్టావు.. అది నమ్మకద్రోహం కాదా' అంటూ లాస్యను ప్రశ్నిస్తుంది.

నేను హనుమంతుడి టైపంటూ: రాములమ్మ మాటలకు లాస్య 'చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. నువ్వు ఇంటి పనిమనిషివి. అది గుర్తుపెట్టుకో' అంటుంది. దీనికి రాములమ్మ 'నాకు ఆ హోదా అయిన ఉంది. నీకు ఆ హోదా కూడా లేదు. మా ఇంట్లో వాళ్ళందరూ మంచి వాళ్లు. నమ్మకంగా ఉంటే పని మనిషిని కూడా నెత్తిన పెట్టుకుంటారు. చదువు లేని వాళ్ళకు తెలివి ఉండదని నేను తులసమ్మకు ద్రోహం చేస్తానని ఎలా అనుకున్నావు? తులసమ్మ శ్రీరామచంద్రుడైతే.. నేను ఆంజనేయ స్వామిని. చూసి రమ్మంటే కాల్చి వచ్చేస్తాను' అని ఇప్పటి వరకూ తులసి చేసిన మంచి గురించి చెప్తుంది.

Intinti Gruhalakshmi

వాళ్లందరికీ లాస్య ఛాలెంజ్‌లు:ఆ తర్వాత రాములమ్మ 'అలాంటి మనిషి మీద కూడా నీకు విశ్వాసం లేదంటే నీది ఏం జన్మ' అని లాస్యను అసహ్యించుకుంటుంది. దీంతో లాస్య 'పని మనిషిని నా మీద ఎగదోసి తమాషా చూస్తున్నావ్ కదా. గెలిచానని సంతోషిస్తున్నారేమో ఆ సంతోషాన్ని ఎక్కువ రోజులు ఉండనివ్వను. నేను బాగుపడకపోయినా పర్వాలేదు.. కానీ నిన్ను మాత్రం బాగుపడనివ్వను' అని నందూతో ఛాలెంజ్ చేస్తుంది. దీనికతను నీకు నచ్చినట్లు చేసుకో అని లాస్య చేతిలో కారు తాళాలు లాక్కొని ఆమె లగేజ్ తీసుకువచ్చి విసిరేస్తాడు. దీంతో లాస్య అక్కడి నుంచి కోపంగా వెళ్లిపోతుంది.

దివ్య సంతోషం.. దిగనంటూనే: రాములమ్మను 'మీ నందూ బాబు జీవితాన్ని ఒక మలుపు తిప్పావు' అని పొగుడుతారు. దీనికామె 'మీరందరూ సంతోషంగా ఉండటమే నాకు కావాలి' అంటుంది. తర్వాత వాళ్లు కోర్టు నుంచి వెళ్లేప్పుడు దివ్య తండ్రి పక్కన తులసిని కూర్చోబెట్టి తను వెనక సీట్లో కూర్చుంటుంది. కారు వెళ్లేటప్పుడు సైలెంట్‌గా ఉన్న తల్లిదండ్రులను చూసి కాసేపు సరదాగా మాట్లాడొచ్చు కదా అంటుంది. అప్పుడు తులసి 'మనం దారిలో దివ్య డ్రాప్ చేయాలి' అనగా.. అక్కడ మా అత్తగారు ఇక్కడ నువ్వు ఇద్దరికి ఇద్దరు బాగా సరిపోయారు నేను కారు దిగను అంటూ దివ్య నవ్వుతుంది.

Intinti Gruhalakshmi

కూతురికి మంచి మాటలతో: దివ్య మాటలకు నందూ మా బెంగ అంతా నీ గురించే అంటాడు. దీనికామె 'నా గురించి బెంగ మానేయండి. మీరు కొత్త జీవితాన్ని ప్రారంభించండి' అంటుంది. దీనికి నందూ 'ఇంటి నుంచి కోర్టుకు బయలుదేరేటప్పుడు పూర్తిగా జీవితం మీద ఆశలు వదిలేసుకుని బయలుదేరాను. కానీ మీ అమ్మ నాకు కొన్ని జీవితాన్ని ఇచ్చింది' అని ఎమోషనల్ అవుతాడు. అంతలోనే దివ్య వాళ్ల ఇల్లు వస్తుంది. అప్పుడు వాళ్లను ఇంట్లోకి రమ్మనగా 'ఇప్పుడు వద్దు మీ అత్తగారి మాటలు భరించలేము. మరెప్పుడైనా వస్తాము' అని అంటారు.

రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని రిక్వెస్ట్: దివ్య ఇంట్లోకి వెళ్లే ముందు ఆపిన తులసి 'నీకు నాలుగు మంచి మాటలు చెప్పాలనిపిస్తుంది ఓపికగా విను' అంటూ అత్తగారితో ఎలా మసులుకోవాలో వివరిస్తుంది. అలాగే, కాపురాన్ని ఎలా సరిదిద్దుకోవాలో దివ్యకి చెప్తుంది. అనంతరం తులసి వెళ్లి కారులో కూర్చుంటుంది. అప్పుడు దివ్య తండ్రితో మనసు విప్పి మాట్లాడతూ 'అమ్మ తన జీవితం కోసం చాలా బాధపడుతుంది. తను నీకోసం చాలా చేసింది. నువ్వు ఆమెకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి కదా' అంటుంది.

Intinti Gruhalakshmi

మీరు కలిసి ఉండాలి అంటూ: దివ్య అడిగిన దానికి నందూ 'నేను ఎంత చేసినా అది తులసి ముందు ఎందుకు పనికిరావు' అంటాడు. దీంతో దివ్య 'నీ భుజాన్ని అమ్మకు ఎందుకు ఆసరా ఇవ్వకూడదు. అమ్మకు కొత్త జీవితాన్ని ఇవ్వచ్చు కదా. నీ దగ్గర ఉన్న చనువుతో ఇలా మాట్లాడుతున్నాను. మీ ఇద్దరు కలిసి ఉంటే నేను సంతోషిస్తాను' అని తండ్రికి చెప్పి ఈ విషయం మర్చిపోవద్దు అంటూ రిక్వెస్ట్ చేస్తుంది. దీంతో నందూ సరే అన్నట్లుగా సైగ చేస్తాడు. ఇక, రాములమ్మ అన్న మాటలు తలుచుకొని లాస్య కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X