Intinti Gruhalakshmi: రాజ్యలక్ష్మితో లాస్య కొత్త ప్లాన్.. నందూకు తులసి ఐడియా.. ఫుల్ జోష్‌లో దివ్య
తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రం ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శనివారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే: శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. కోర్టు విడాకులు ఇచ్చిన తర్వాత రాములమ్మతో లాస్య గొడవకు దిగుతుంది. దీంతో లాస్య గతంలో చేసిన తప్పులు మొత్తాన్ని ఎత్తి చూపిస్తూ ఓ రేంజ్‌లో క్లాస్ పీకుతుంది. తర్వాత నందూ కూడా ఆమెకు గెంటేస్తాడు.
అనంతరం దివ్య, నందూ, తులసి కలిసి కారులో వెళ్తారు. అప్పుడు దివ్యను అత్తగారి ఇంటి దగ్గర దించేస్తారు. ఆ సమయంలో తులసికి ఏమైనా సహాయం చేయమని నందూను కోరుతుంది. అంతేకాదు, వీలైతే మీరు మళ్లీ కలవాలని కోరుకుంటుంది. దీంతో నందూ తులసికి అండగా ఉండే ప్రయత్నం చేస్తానని హామీ ఇస్తాడు.

లాస్యకు రాజ్యలక్ష్మి కాల్ చేసి: విడాకుల తర్వాత ఒంటరిగా వెళ్తున్న లాస్య.. రాములమ్మ అన్న మాటలను గుర్తు చేసుకుని రగిలిపోతూ ఉంటుంది. అప్పుడే ఆమెకు రాజ్యలక్ష్మి ఫోన్ చేస్తుంది. 'ఎక్కడున్నావు? ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? అసలు ఏం చేయాలనుకుంటున్నావు' అని అడుగుతుంది.
ఆమె ప్రశ్నలకు సమాధానం చెప్పిన తర్వాత లాస్య 'దెబ్బకి దెబ్బ తీయాలని అనుకుంటున్నాను. నన్ను తలవంచుకునేట్టు చేసిన వాళ్లను జీవితాంతం తల ఎత్తుకునే పరిస్థితి లేకుండా చేద్దాం అని అనుకుంటున్నాను' అని అంటుంది.
చీ సిగ్గులేకపోతే సరి అంటూ: లాస్య మాటలకు రాజ్యలక్ష్మి 'చీ సిగ్గులేకపోతే సరి.. ఆప్ట్రాల్ ఆ పనిమనిషి చేతిలో పరువు పోగొట్టుకున్నావు. అయినా నీ గుట్టు మొత్తం దాని చేతిలో పెట్టడమేనా? నీ తెలివి, నీ చేతకానితనానికి మాటలు పడాల్సిందే పడు' అని తిడుతుంది. దీంతో లాస్య 'నా సంగతి సరే. నువ్వు మాత్రం నీ కోడలి చేతిలో ఓడిపోలేదా? తల వంచుకోలేదా' అని కౌంటర్ ఇస్తుంది.
దీనికామె 'అందుకే కదా.. నువ్వేదో చేస్తావు అనుకున్నాను. నువ్వు నందూతో వేరే కాపురం పెట్టిస్తే.. దివ్య కుంగిపోతుంది. ఆ టైంలో రెచ్చగొడితే నోరు జారుతుంది. అప్పుడు విక్రమ్‌ను వాడుకుని దాని జీవితంతో ఆట ఆడుకుందామనుకున్నా. కానీ, నువ్వు ఆ అవకాశం లేకుండా చేశావు' అని దెప్పుతుంది.

వాళ్లకు దివ్యను దూరం చేస్తా: రాజ్యలక్ష్మి తిట్టగానే లాస్య 'అవును రాజ్యలక్ష్మీ ఒప్పుకుంటాను. నాకిది ఎదురుదెబ్బే. అలాగని ఓడిపోయినట్టు కాదు. జీవితం లెక్కలు ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. మన ప్లాన్‌లు మార్చుకుని యుద్దం చేయాలి. నందూను నాకు దూరం చేశారు కాబట్టి బదులుగా వారికి దివ్యను దూరం చేస్తాను' అంటుంది.
దీంతో రాజ్యలక్ష్మి 'దివ్య బాగా తెలివిమీరింది. వాళ్ల నాన్న గెలిచాడని ఉత్సాహంలో ఉంది' అని చెప్తుంది. దీంతో లాస్య 'ఉండనివ్వు.. ఇన్నాళ్లు నేను దివ్య పక్కన చేరి యుద్దం చేస్తా' అంటూ ఏదో ప్లాన్ చెప్పగా.. రాజ్యలక్ష్మి దానికి ఒప్పుకుంటుంది.

జీవితంలో ఓడిపోయానంటూ: నందూ ఇంటికి రావడంతో అందరూ సంతోషంగా ఉంటారు. అప్పుడతను 'నేను సాధించడం కాదు.. నన్ను సాధించాలనుకున్న లాస్యను వదిలించుకున్నానంతే. నిజం చెప్పాలంటే నేను జీవితంలో సాధించింది ఏమీ లేదు. కానీ, పోగొట్టుకున్నవి.. దూరం చేసుకున్నవే ఎక్కువ ఉన్నాయి. కోర్టు కేసులో గెలిచానేమో కానీ జీవితంలో ఓడిపోయాను. ఒంటరినయ్యాను. నా ప్రయాణం గమ్యం లేని ప్రయాణం' అంటాడు. దీనికి తులసి 'నేను కూడా గమ్యం లేని ప్రయాణమే చేస్తున్నాను. కానీ మీలా ఆలోచిస్తే నా ప్రయాణం ఎప్పుడో ముగిసేది' అని బదులిస్తుంది.

ఫుల్ జోష్‌లో దివ్య.. గుద్దేసి: తండ్రికి విడాకులు రావడంతో దివ్య ఫుల్ జోష్‌లో ఉంటుంది. అంతేకాదు, తోడికోడలు ప్రియను పట్టుకుని తెగ తిప్పేస్తుంది. తర్వాత విక్రమ్ తాతతోనూ విషయం చెప్తుంది. దీనికాయన 'అందరికీ చెప్తున్నావు కానీ.. నీ భర్తకి చెప్పావా? మొదటిగా నీ సంతోషాన్ని పంచుకోవాల్సింది మీ ఆయనతో వెళ్లి వెంటనే చెప్పు' అంటాడు.
దీంతో కంగారుగా వెళ్తున్న దివ్య బసవయ్యను గుద్ది కింద పడేస్తుంది. అప్పుడు 'బాబాయ్.. నాకు గుడ్ న్యూస్ మీకు బ్యాడ్ న్యూస్.. మీ అక్క ఫ్రెండ్ లాస్యకు మా నాన్నకి కోర్టు విడాకులు ఇచ్చేసింది. మీరు మసుగేసుకుని ఏడ్వండి' అంటుంది.
నందూకు తులసి సలహా: కోర్టు తీర్పు ప్రకారం లాస్యకు భరణం ఎలా చెల్లించాలి అన్న దానిపై ఇంట్లో వాళ్లు చర్చించుకుంటూ ఉంటారు. అప్పుడు అనసూయ భరణం ఇవ్వలేనని చెప్పొచ్చు కదా అంటుంది. దీనికి తులసి 'అది చట్టం అత్తయ్యా.. ఏ ఆధారం లేకుండా లాస్య ఎలా బతుకుతుంది? నా విడాకులు అప్పుడు భరణం నేను వద్దనుకున్నాను అత్తయ్యా.. ఆయన వద్దనుకున్నప్పుడు.. ఆయనిచ్చే భరణం ఎందుకనుకున్నాను' అని వాళ్లకు చెబుతుంది. తర్వాత నందూ సంపాదన కోసం కెఫేను మళ్లీ రన్ చేయమని తులసి సలహా ఇస్తుంది. దీంతో అందరూ సంతోషిస్తారు.
తిట్టిన భర్తనే పడేసిన దివ్య: తండ్రికి విడాకులు వచ్చిన విషయం అందరికీ చెప్పిన తర్వాత దివ్య.. విక్రమ్ దగ్గరకు వెళ్తుంది. కానీ, అతడు కోపంలో చెడామడా తిట్టేస్తాడు. దీంతో విషయం చెప్పకుండానే దివ్య వెళ్లిపోతుంది. కానీ, ఆ తర్వాత ఒకే డ్రింక్‌లో రెండు స్ట్రాలు పెట్టుకుని వచ్చి అతడిని టెంప్టింగ్ చేస్తుంది. దీంతో నిగ్రహాన్ని కోల్పోయిన విక్రమ్ భార్య పక్కన చేరిపోతాడు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











