For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi Today Episode: సంతకం పెట్టి బుక్కైన తులసి.. ప్రేమ్‌కు బంపర్ ఆఫర్ ఇచ్చిన అభి

  |

  సుదీర్ఘ కాలంగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతుంది. సుదీర్ఘ కాలంలో ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శుక్రవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరు కూడా ఓ లుక్కేయండి!
  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  గురువారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. తన దగ్గర సంగీతాన్ని నేర్చుకోడానికి వచ్చే పిల్లల కోసం తులసి స్వయంగా టెంట్ వేస్తుంటుంది. దీనికోసం నిచ్చెన ఎక్కగా.. అది చూసిన కుటుంబ సభ్యులు ఆమెను వారించడంతో పాటు సహాయం చేస్తారు. ఆ సమయంలోనే బ్యాంక్ ఏజెంట్లు వచ్చి తులసికి లోన్ ఇచ్చేందుకు అంగీకరిస్తున్నట్లు చెబుతారు. తర్వాత ఈ విషయాన్ని లాస్యకు చెప్పగా ఆమె సలహా మేరకు తులసి ఒంటరిగా ఉన్న సమయంలో వచ్చి బ్లాంక్ చెక్ తీసుకుంటారు. మరోవైపు, అంకిత గురించి అభి, గాయత్రి మధ్య వాడివేడి చర్చలు జరుగుతుంటాయి.

  స్విమ్మింగ్ పూల్‌లో నందినీ రాయ్ అందాల ఆరబోత: వామ్మో మరీ ఇంత హాట్‌గానా!

  లాస్య ప్లాన్ అమలు చేసిన ఏజెంట్

  లాస్య ప్లాన్ అమలు చేసిన ఏజెంట్

  తులసి బ్యాంక్ లోన్ డాక్యుమెంట్ల మీద సంతకాలు చేసిన తర్వాత.. ఏజెంట్ ఒక బ్లాంక్ చెక్ కావాలని అడుగుతాడు. దీంతో తులసి అది ఎందుకు అని ప్రశ్నిస్తుంది. దీనికి అతడు ‘మీ సెక్యూరిటీ కోసమే.. మీకు మా బ్యాంక్‌లో అకౌంట్ ఉందని వాళ్లకు ప్రూఫ్ ఇవ్వాలి' అంటాడు. దీంతో చాలా ఆలోచనలు చేసిన తర్వాత తులసి చెక్ మీద సంతకం పెట్టి ఇస్తుంది. కానీ, ఆమెకు ఎందుకో ఓవైపు టెన్షన్ పడుతూ ఉంటుంది. అందుకే ‘ప్రాబ్లమ్ ఏం ఉండదు కదా' అని అడగ్గా.. ఏజెంట్ ‘ఏం ఉండదు. రేపటి లోగా మీ అకౌంట్ లో 20 లక్షలు పడతాయి. నేను గ్యారెంటీ' అంటాడు.

  నందూ ఫ్రెండ్‌ను రమ్మన్న లాస్య

  నందూ ఫ్రెండ్‌ను రమ్మన్న లాస్య

  నందూను కలిసేందుకు అతడి స్నేహితుడు ఇంటికి వస్తాడు. అప్పుడు నందూ తన మనసులో ‘వీడేంటి చెప్పాపెట్టకుండా వచ్చాడు. నేను సమయానికి డబ్బు సర్ధుబాటు చేయలేకపోయానని పరువు తీస్తాడా ఏంటి' అని అనుకుంటాడు. తర్వాత ఆ ఫ్రెండ్ చెప్పరా విషయం ఏంటో అంటాడు. దీనికి నందూ ‘అదేంటి.. నేను నిన్ను పిలవలేదు కదా. నన్నే చెప్పమంటున్నావేంటి' అని ఆశ్చర్యంగా అడుగుతాడు. దీనికి ఫ్రెండ్ నువ్వే కాల్ చేసి రమ్మన్నావు కదా అంటాడు. అప్పుడు అక్కడకు ఎంట్రీ ఇచ్చిన లాస్య.. ఆయన కాదు.. నేనే రమ్మన్నాను అని చెబుతుంది.

  ఇన్నర్స్ లేకుండా షాకిచ్చిన పాయల్: వామ్మో ఆరబోతలో హద్దు దాటేసిందిగా!

  20 లక్షలు ఇస్తానని చెప్పిన లాస్య

  20 లక్షలు ఇస్తానని చెప్పిన లాస్య

  లాస్య మాటతో నందూ ఫ్రెండ్ ఏరా నీకు ఇదేమన్నా పద్ధతిగా ఉందా అని అడుగుతాడు. దీంతో లాస్య ‘రెండు రోజుల్లో ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ 20 లక్షలు మీ చేతుల్లో పెట్టబోతున్నాం' అంటుంది. దీనికి అతడు ఇలాంటి హామీలు మేము చాలా విన్నాం.. ఇప్పుడైనా నమ్మొచ్చా అంటాడు. దీంతో లాస్య నమ్మొచ్చు.. అగ్రిమెంట్ కూడా చేసుకుందాం అంటుంది. అప్పుడు అతడు.. నందూను అగ్రిమెంట్ పేపర్స్ మీద సైన్ చేయి అంటాడు. కానీ నందూ సైన్ పెట్టడానికి ఆలోచిస్తుంటాడు. అప్పుడు లాస్య ‘నందూ.. కానివ్వు సైన్ చేయి' అంటుంది. దీంతో అతడు బలవంతంగా సంతకం పెడతాడు. అనంతరం ఫ్రెండ్ ‘ఓకే నందూ వెళ్లి వస్తాను. రెండు రోజుల్లో రండి మా ఆఫీసులో కలుద్దాం సరేనా' అని వెళ్లిపోతాడు.

  డబ్బు గురించి హామీ ఇచ్చిన లాస్య

  డబ్బు గురించి హామీ ఇచ్చిన లాస్య

  తన ఫ్రెండ్ వెళ్లిపోయిన వెంటనే నందూకు ఏం జరిగిందో అర్థం కాదు. దీంతో లాస్యను ‘నీకేమైనా పిచ్చి పట్టిందా.. డబ్బులు లేవని అభి చేతులెత్తేశాడు. ఇప్పుడు నువ్వు 20 లక్షలు ఎక్కడి నుంచి తెచ్చిస్తావు' అంటూ ఫైర్ అవుతాడు. దీనికి లాస్య ‘డబ్బు ఎక్కడి నుంచి రావాలో అక్కడి నుంచే వస్తుంది. ఎవరు ఇవ్వాలో వాళ్లే ఇస్తారు. డబ్బు విషయం నాకు వదిలేసి మిగితా విషయాలు నువ్వు చూసుకో. నువ్వు ధైర్యంగా ఉండు' అని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. కానీ, నందూకు మాత్రం తనకు తెలియకుండా అసలేం జరుగుతుందో అర్థం కాదు.

  Chor Bazaar Twitter Review: ఆకాశ్ సినిమాకు అలాంటి టాక్.. అదొక్కటే మైనస్.. ఫైనల్‌గా ఎలా ఉందంటే!

  ప్రేమ్‌ను హెల్ప్ చేమయన్న అభి

  ప్రేమ్‌ను హెల్ప్ చేమయన్న అభి

  ప్రేమ్ తన ఇంట్లో కూర్చుని లిరిక్స్ రాసుకుంటూ ఉంటాడు. అప్పుడు అతడిని చూసి శృతి మురిసిపోతూ ఉంటుంది. అప్పుడే అక్కడకు అభి వస్తాడు. దీంతో వాళ్లిద్దరూ షాక్ అవుతారు. అప్పుడు ప్రేమ్ ఇంట్లో కూర్చోవడానికి కుర్చీ కూడా లేదు. శృతి చాప తీసుకురా అంటాడు. దీంతో అభి అవసరం లేదు. నేను ఇక్కడే కూర్చొంటాను అంటాడు. తర్వాత ప్రేమ్‌ను సహాయం చేయమని అడుగుతూ ‘నాకు కావాల్సింది డబ్బు సాయం కాదు.. మాట సాయం. నా వల్ల కాక.. నా చేతగాక నిన్ను అడుగుతున్నాను అంతే. నా గురించి చెడుగా పబ్లిసిటీ చేసి మామ్ నా కాపురం చెడగొట్టింది. అంకితను ఎమోషనల్ గా లాక్ చేసి తన దగ్గర ఉంచేసుకుంది. నువ్వు అంకితతో మాట్లాడి నా దగ్గరకు తీసుకు రావాలి' అంటాడు.

  ఒప్పుకోని ప్రేమ్.. వెళ్లిపోయిన అభి

  ఒప్పుకోని ప్రేమ్.. వెళ్లిపోయిన అభి


  అంతేకాదు, ప్రేమ్‌తో అభి ‘మామ్‌కు నచ్చజెప్పి అంకిత నాదగ్గరికి వచ్చేలా చేస్తే నీ ఆల్బమ్ విషయంలో నేను హెల్ప్ చేస్తాను' అంటాడు. దీనికి ప్రేమ్‌ ‘నాతో డీల్ మాట్లాడటానికి వచ్చావా. నీకు అత్తారింటి గాలి బాగానే వంటపట్టింది' అంటాడు. అప్పుడు అభి నన్ను వదిలి అంకిత దూరంగా ఉండటం మీకు సంతోషమా అంటాడు. దీంతో శృతి ‘మీ సమస్యను మీరే సాల్వ్ చేసుకోండి. భార్యాభర్తల మధ్య మూడో మనిషి అవసరం లేదు' అంటుంది. అప్పుడు ప్రేమ్ ‘నా ఆల్బమ్ విషయంలో నీ సాయం నాకు అస్సలు అవసరం లేదు' అంటాడు. దీంతో అభి ‘నువ్వు ఎప్పటికీ జీవితంలో బాగుపడవు' అని అక్కడి నుంచి కోపంగా వెళ్లిపోతాడు.

  యాంకర్ ప్రదీప్ క్యారెక్టర్ బయట పెట్టిన ఢీ డ్యాన్సర్.. ఫోన్ చేస్తే అలా అన్నాడంటూ ఎమోషనల్

  Recommended Video

  Sammathame,Chor Bazaar Movie Review | Kiran Abbavaram | Akash Puri *Reviews |FilmiBeat Telugu
  హుషారుగా తులసి.. వాళ్లకు చెప్పి

  హుషారుగా తులసి.. వాళ్లకు చెప్పి

  లోన్ అప్లై చేసిన తర్వాత తులసి చాలా హుషారుగా ఉంటుంది. బ్యాంకులో డబ్బులు పడిపోతున్నాయని సంతోషపడుతుంది. డబ్బులు పడగానే ఏం చేయాలో లిస్టు రాస్తుంటుంది. ఇంతలో అంకిత, పరందామయ్య, అనసూయలు ఇంటికి వస్తారు. అప్పుడామె రండి రండి.. మీకోసమే ఎదురు చూస్తున్నాను అంటుంది. ఆ తర్వాత అంకిత ఏంటి ఆంటి ఇంత హడావుడి చేస్తున్నారు అని అంటుంది. దీంతో తులసి ‘రేపటిలోగా బ్యాంక్ లోన్ తాలుకు డబ్బు నా అకౌంట్ లో పడిపోతుంది' అని చెబుతుంది. దీంతో అందరూ సంతోషిస్తారు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 667: Bank Employee Executes Lasya's Plan On Tulasi. After That Tulasi Shares Loan Matter With Her Family Members.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X