India
  For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi Today Episode: తులసి 20 లక్షలు మాయం.. అసలు నిజం చెప్పిన బ్యాంక్ మేనేజర్

  |

  చాలా భాషలతో పోల్చుకుంటే తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతుంది. సుదీర్ఘ కాలంలో ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శనివారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరు కూడా ఓ లుక్కేయండి!

  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. బ్యాంక్ ఏజెంట్లు అడిగిన వెంటనే తులసి బ్లాంక్ చెక్ మీద సంతకం చేసి ఇస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో అని తెగ టెన్షన్ పడుతూ ఉంటుంది. మరోవైపు, నందూ ఇంటికి అతడి ఫ్రెండ్‌ను పిలిపించిన లాస్య.. 20 లక్షలు ఇచ్చేస్తామని అగ్రిమెంట్ల మీద సంతకం కూడా చేయించుకుంటుంది.

  ఇక, ప్రేమ్ ఇంటికి వచ్చిన అభి.. అంకితకు ఎలాగైనా నచ్చజెప్పి తనతో కలిసేలా చేయమని అడుగుతాడు. ఇందుకోసం ఆల్బమ్‌కు కావాల్సిన డబ్బులు ఇస్తానని ఆఫర్ కూడా ఇస్తాడు. కానీ, దీనికి ప్రేమ్, శృతి మాత్రం ఒప్పుకోరు.

  డెలివరీ తర్వాత ఊహించని లుక్‌లో ప్రణీత: ఆమెనిలా చూశారంటే షాకే!

  నందూకు నిజం చెప్పేసిన లాస్య

  నందూకు నిజం చెప్పేసిన లాస్య

  అగ్రిమెంట్ మీద సంతకం పెట్టిన తర్వాత నందూకు, లాస్యకు వాదన జరుగుతుంది. ఆ తర్వాత అతడు పాటలు పెట్టుకుని వింటుండగా.. లాస్య చిరాకు పడుతుంది. దీంతో ఏమైందని ప్రశ్నిస్తాడు. అప్పుడు 'మీ తులసికి మ్యూజిక్ ఇష్టమని తెలిసినప్పటి నుంచి దానిపై నాకు ఇష్టం పోయింది. నీకో విషయం తెలుసా నందూ? తులసి మ్యూజిక్ స్కూల్ పెడుతోంది. దాని కోసం బ్యాంక్ లోన్ అప్లయి చేసింది' అని చెబుతుంది. దీంతో నందూ తనకు ఎవరు ఇస్తారు లోన్ అంటాడు. దీనికి లాస్య వస్తుంది.. ఖచ్చితంగా వస్తుంది అంటుంది. దీంతో నందు షాక్ అవుతాడు.

   తులసి అకౌంట్‌లోకి 20 లక్షలు

  తులసి అకౌంట్‌లోకి 20 లక్షలు

  తులసి డబ్బులు ఇస్తానని కన్ఫమ్ చేయడంతో ప్రేమ్‌ను శృతి వస్తువులు కొనుక్కో అని చెబుతుంది. దీంతో ప్రేమ్ తనకు ఏం కావాలో లిస్ట్ రాసుకుంటూ ఉంటాడు. మరోవైపు తులసి.. అకౌంట్‌లో పడే డబ్బుల గురించి ఫోన్‌నే చూస్తూ ఉంటుంది. దీంతో ఇంటి సభ్యులు షాక్ అవుతారు. దీంతో ఏమైంది ఫోన్‌ను అప్పటి నుంచి పట్టుకొని కూర్చొన్నావు అని అడుగుతారు. దీనికామె 'బ్యాంకులు తెరవగానే డబ్బులు అకౌంట్‌లో పడుతాయి అని చెప్పాడు. ఇంకా డబ్బులు పడలేదేంటి' అంటుంది. ఇంతలో తులసి మెసేజ్ వస్తుంది. దివ్య చూసి 20 లక్షలు క్రెడిట్ అయ్యాయంటుంది.

  శృతి మించిన యాంకర్ స్రవంతి గ్లామర్ ట్రీట్: ఉల్లిపొర లాంటి డ్రెస్‌లో అలా అందాల కనువిందు!

  ఫ్యామిలీ ఫుల్ హ్యాపీ... 5 లక్షలు

  ఫ్యామిలీ ఫుల్ హ్యాపీ... 5 లక్షలు

  తులసి అకౌంట్‌లో రూ. 20 లక్షలు క్రెడిట్ అవడంతో ఆమెతో పాటు కుటుంబ సభ్యులు అందరూ ఫుల్ హ్యాపీగా ఉంటారు. అప్పుడు పరందామయ్య 'నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సంతోష సమయంలో నాకు చలివిడి తినాలని ఉంది' అంటాడు. ఇక, అంకిత 'డబ్బులు పడ్డాయి కదా.. ఇక ప్రశాంతంగా ఉండండి ఆంటీ' అని తులసితో అంటుంది. తులసి మాత్రం తన మనసులో 'అర్జెంట్‌గా వాడికి రూ.5 లక్షలు ఇస్తే కానీ.. నా మనసు ప్రశాంతంగా ఉండదు' అనుకుంటుంది. ఇందుకోసం ఆమె శృతి దగ్గరకు నేరుగా వెళ్లి ఈ విషయం చెప్పాలని అనుకుంటుంది.

  శృతికి గుడ్ న్యూస్ చెప్పేసింది

  శృతికి గుడ్ న్యూస్ చెప్పేసింది

  శృతి దగ్గరకు వెళ్లాలనుకున్న తులసికి ఆమె ఫోన్ చేస్తుంది. దీంతో తులసి 'శృతి.. నీకోసమే ఎదురు చూస్తున్నాను. లోన్ వచ్చేసింది. మన కష్టాలన్నీ తీరిపోయినట్టే. త్వరగా వచ్చేస్తే డబ్బులు తీసుకెళ్లిపోవచ్చు. నువ్వు త్వరగా వచ్చేయ్' అంటుంది. దీనికి శృతి 'నాకు ఇవాళ చాలా సంతోషంగా ఉంది ఆంటి. మీరు నాకోసం ఎదురు చూస్తున్నా అని చెప్పడం మరింత ఆనందాన్ని కలిగిస్తుంది ఆంటీ' అంటుంది. ఆ తర్వాత ఆమె డబ్బు రెడీ అయిన విషయాన్ని ప్రేమ్‌కు కాల్ చేసి చెప్పనా? వద్దులే.. డైరెక్ట్‌గా ప్రేమ్ చేతుల్లోనే వాటిని పెడితే బెటర్ అని అనుకుంటుంది.

  స్విమ్మింగ్ పూల్‌లో నందినీ రాయ్ అందాల ఆరబోత: వామ్మో మరీ ఇంత హాట్‌గానా!

  అకౌంట్‌లో 20లక్షలు మాయం

  అకౌంట్‌లో 20లక్షలు మాయం

  లోన్ అమౌంట్ రావడంతో తులసి ఫ్యామిలీ చాలా సంతోషంగా ఉంటుంది. అందరూ నోరు తీపి చేసుకుంటారు. ఇంతలో తులసి ఫోన్‌కు బ్యాంక్ నుంచి మళ్లీ ఏదో మెసేజ్ వస్తుంది. ఏంటా అని చూస్తుంది అంకిత. ఆ వెంటనే షాకైన ఆమె తులసితో '20 లక్షలు మీ అకౌంట్‌లో నుంచి డెబిట్ అయినట్టు మెసేజ్ వచ్చింది ఆంటి' అంటుంది.

  దీంతో తులసి సహా అందరూ షాక్ అవుతారు. అప్పుడే అక్కడికి శృతి వస్తుంది. అంకిత చెప్పిన మాట విని నిర్ఘాంతపోతుంది. కాసేపు ఎవరికీ ఏమీ అర్థం కాదు. అప్పుడు తులసి అంటే.. బ్యాంకు వాళ్లు వెనక్కి తీసుకున్నారా అంటుంది. దీనికి అంకిత 'లేదు ఆంటి.. వేరే ఏదో బ్యాంక్ అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ అయ్యాయి' అంటుంది అంకిత. దీంతో శృతి వెంటనే బ్యాంక్ మేనేజర్ కు ఫోన్ చేయండి అంటుంది.

  అసలు నిజం చెప్పిన మేనేజర్

  అసలు నిజం చెప్పిన మేనేజర్

  తులసి వెంటనే బ్యాంక్ మేనేజర్‌కు ఫోన్ చేస్తుంది. అప్పుడు మీరు లీవ్ లో ఉన్నట్టున్నారు.. డిస్టర్బ్ చేసినందుకు సారీ అంటుంది. దీనికి ఆయన నేను అసలు లీవ్‌లో లేను అంటాడు. తర్వాత తులసి 'నా పేరు తులసి.. మీ బ్యాంక్‌లో లోన్ తీసుకున్నాను' అంటుంది.

  దీంతో ఆయన అవును.. 20 లక్షలు మీ అకౌంట్‌లో క్రెడిట్ అయ్యాయి కదా అంటాడు. దీనికి తులసి 'మళ్లీ డబ్బులు కట్ అయినట్టు మెసేజ్ వచ్చింది' అంటుంది. దీనికి మేనేజర్ 'అవును.. మీరే చెక్ ఇచ్చారు కదా.. ఆ చెక్ ద్వారా డబ్బులు డ్రా చేసుకున్నారు కదా' అంటాడు. దీంతో తులసికి అర్థం కాదు.

  ఇన్నర్స్ లేకుండా షాకిచ్చిన పాయల్: వామ్మో ఆరబోతలో హద్దు దాటేసిందిగా!

  ఆ మోసాన్ని గుర్తించిన తులసి

  ఆ మోసాన్ని గుర్తించిన తులసి

  తులసి ఫోన్ కట్ చేశాక.. అంకిత ఆంటి మీరు ఎవరికైనా చెక్ ఇచ్చారా అని అడుగుతుంది. దీంతో బ్యాంక్ ఏజెంట్‌కు బ్లాంక్ చెక్ ఇచ్చా అని చెబుతుంది. అప్పుడు ఆమె 'బ్యాంక్ మేనేజర్ లీవ్‌లో ఉన్నాడని వాడు చెప్పింది కూడా అబద్ధమే. అంతా ఆ బ్రోకరే చేశాడు' అని అంటుంది. తర్వాత అంకిత మీరు సంతకం పెట్టిన డాక్యుమెంట్స్ జీరాక్స్ కాపీలు మీ దగ్గర ఉన్నాయా అని అడుగుతుంది. దీంతో ఇచ్చాడు అనగా.. అంకిత అవి ఒకసారి ఇవ్వండి అంటుంది. తర్వాత వాటిని చూసి షాక్ అయిన ఆమె అవన్నీ ఫేక్ డాక్యుమెంట్స్ అంటుంది. ఇలా ఈ ఎపిసోడ్ పూర్తైంది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 668: Tulasi Lost Her Money. Then Family Was Shocked. After That Bank Manager Told The Truth About Loan Money to Tulasi.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X