Intinti Gruhalakshmi: తల్లికి షాకిచ్చిన విక్రమ్.. నందూకు తెలిసిన నిజం.. లాస్యపై హత్యాయత్నం

చాలా కాలంగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రం ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' సోమవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే
శనివారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. రాములమ్మ చేసిన అవమానం తలచుకుంటూ వెళ్తున్న లాస్యకు రాజ్యలక్ష్మి కాల్ చేస్తుంది. అప్పుడు ఇద్దరూ తమ తప్పుల గురించి వాదించుకుంటారు. చివరికి ఒక్కటై దివ్య ఆట కట్టించే ప్లాన్‌ను రెడీ చేసుకుంటారు. ఇక, తండ్రికి విడాకులు వచ్చాయన్న సంతోషంలో ఉన్న దివ్యకు విక్రమ్ తన మాటలతో షాక్ ఇస్తాడు. మరోవైపు, లాస్యకు భరణం చెల్లించడం గురించి తులసి వాళ్లు మాట్లాడతారు. అప్పుడు కెఫేను మళ్లీ స్టార్ట్ చేయమని తులసి నందూకు సలహా ఇస్తుంది. ఇక, దివ్య భర్తను రెచ్చగొడుతూ తన వైపు లాక్కుంటుంది.

Intinti Gruhalakshmi

ఆ మాటతో విక్రమ్ కూడా హ్యాపీ
దివ్య చేసే పనులకు టెంప్ట్ అయిపోయిన విక్రమ్.. ఆమె చెంతన చేరిపోతాడు. ఆ తర్వాత కాసేపు భర్తను రొమాన్స్‌తో ఉడికించిన దివ్య 'మా నాన్నకు లాస్య నుంచి విముక్తి దొరికింది. కోర్టు విడాకులు ఇచ్చేసింది' అని చెబుతుంది. దీనికతడు అవునా.. పీడ విరగడైందిగా అని అంటాడు. దీనికి దివ్య అవును విక్రమ్.. మా ఇంటికి పట్టిన శని వదిలింది అనగా.. మనం కూడా కాస్త ప్రశాంతంగా ఉండొచ్చు అంటాడు. దీంతో దివ్య అంతేగా అంతేగా అని దివ్య తెగ సిగ్గుపడిపోతుంది. ఆ తర్వాత ఇద్దరూ ఒకే డ్రింక్‌లో రెండు స్ట్రాలు వేసుకుని తాగుతారు.

లాస్య కోసం అత్త కొత్త నాటకం
తన ఆస్పత్రిలో పని చేసే మేనేజర్‌ను ఇంటికి పిలిచిన రాజ్యలక్ష్మి.. అతడి చెంప చెల్లుమనిపిస్తుంది. దీంతో అతడు ఆమె కాళ్లపై పడతాడు. దీంతో రాజ్యలక్ష్మి 'క్షమించడానికి నువ్వు చేసింది చిన్న తప్పు కాదు.. మా హాస్పటల్ మేనేజర్ అయుండి.. ఇక్కడ సీక్రెట్స్ అన్నీ మా లీక్ చేశావు. దాని వల్ల మాకు ఎంత నష్టం జరిగిందో తెలుసా? అరేయ్ సంజయ్.. పోలీస్ కంప్లైంట్ ఇవ్వరా. వీడ్ని లోపల వేయిస్తా' అంటుంది. దీనికి మేనేజర్ 'ప్లీజ్ మేడమ్.. మీరు కేసు పెడితే నా పరువు పోతుంది. నాకెవరూ ఉద్యోగం ఇవ్వరు. నా ఫ్యామిలీ రోడ్డున పడుతుంది' అని బ్రతిమాలతాడు.

Intinti Gruhalakshmi

ఉద్యోగం నుంచి తీసేయాలని
మేనేజర్ బ్రతిమాలుతుండగా విక్రమ్ 'సరేలే అతడిని వదిలేయండమ్మా. వాడి పాపాన వాడే పోతాడు. జాబ్‌లో నుంచి తీసేద్దాం' అని అంటాడు. దీంతో సంజయ్.. 'వీడిని జాబ్‌లో నుంచి తీసేస్తే కష్టం అవుతుంది అన్నయ్యా. తీసేయడం పెద్ద పని కాదు. మన హాస్పటల్ వివరాలు మొత్తం వీడికి తెలుసు. కానీ ఇప్పటికిప్పుడు అంత ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్లు దొరకడం చాలా కష్టం కదా. అందుకే ఒక నెల రోజులు ఇతన్నే కంటిన్యూ చేద్దాం' అంటాడు. కానీ విక్రమ్.. 'మోసం చేసిన వాళ్లని నమ్మక ద్రోహం చేసిన వాళ్లని నేను క్షమించను. అతడిని పంపేయండి' అంటాడు.

Intinti Gruhalakshmi

లాస్యను పెట్టుకుందామంటూ
మేనేజర్‌ను తీసేయగానే బసవయ్య 'వాడిని పంపేశారు సరే.. ఇప్పటికిప్పుడు మనకు అంత అనుభవం ఉన్న వాళ్లు ఎలా దొరుకుతారు' అని అంటాడు. దీంతో రాజ్యలక్ష్మి 'దొరికారు.. లాస్య ఉంది కదా.. తనకు అకౌంట్స్‌లో మంచి అనుభవం ఉంది. అన్నింటికి మించి ప్రస్తుతం ఖాళీగా ఉంది. నేనంటే ఎంతో గౌరవం. ఈ పోస్ట్‌కు ఆమె సరిగ్గా సరిపోతుంది' అని చెప్తుంది. దీంతో బసవయ్య 'ఓహో.. ఓ దిక్కులేని ఆడదానికి దిక్కు చూపిస్తున్నావా అక్కా' అంటాడు. దీంతో విక్రమ్ 'మామయ్యా.. మనకు ఇప్పుడు కావాల్సింది పుణ్యం కాదు.. నిజాయితీ' అని అంటాడు.

లాస్య వద్దని చెప్పిన విక్రమ్
విక్రమ్ మాటలకు రాజ్యలక్ష్మి 'లాస్య నిజాయితీపై నాకు ఎలాంటి అనుమానం లేదు. పైగా మీ ఇద్దరి పెళ్లి విషయంలో తను చాలా హెల్ప్ చేసింది. మీరూ ఆ రుణం తీర్చుకోవాలి' అని అంటుంది. దీంతో దివ్య 'మా రుణానిది ఏముందిలే అత్తయ్యా.. ఈ పాటికి మీరు తీర్చేసుకునే ఉంటారు కదా' అని అనగా అంటే ఏంటి నీ ఉద్దేశం అంటుంది. దీంతో దివ్య 'మీ మంచితనం గురించి నాకు బాగా తెలుసు కదా.. వెంటనే ఏదో సాయం చేసి ఉంటారు కదా' అని అంటుంది. అప్పుడు విక్రమ్.. 'రుణాల సంగతి పక్కన పెట్టండి.. ఆవిడ వల్ల సమస్య వస్తుంది. లాస్యపై నమ్మకం లేదు.. ఆమె రావడం దివ్యకి కూడా ఇష్టం లేదు. మామయ్యా నేను నిర్ణయం తీసుకున్నాను కదా.. మళ్లీ మళ్లీ అడగొద్దు. వేరే ఎవరినైనా చూడు సంజయ్' అని వెళ్లిపోతాడు.

Intinti Gruhalakshmi

అత్తకు కౌంటర్.. తల్లికి ఫోన్
విక్రమ్ వెళ్లిపోగానే దివ్య 'ఏంటి అత్తా.. నా కొడుకు నా మాట కాదనడని అన్నావు కదా.. ఇప్పుడేమన్నాడో చూశావు కదా. నీ మాట కాదనడమే కాదు.. నాకిష్టం లేదని వద్దన్నాడు. అయ్యయ్యో ఎంత అవమానం జరిగిపోయింది అత్తయ్యా. కొద్దికొద్దిగా నీ కొడుకును నా దారిలోకి తెచ్చుకుంటున్నా. మీకు తెలుస్తుందా? మీరు మీ మేనేజర్‌ని లాస్య కోసం కావాలనే పీకేశారని నాకు తెలుసు. లాస్యను నేనే కాదు మీ అబ్బాయి కూడా రానివ్వడు. మీరు ఆశలు పెట్టుకోవద్దు. అక్కడ కోర్టులో మా నాన్న గెలిచాడు.. ఇక్కడ నేను గెలిచాను' అంటుంది. తర్వాత తులసికి ఫోన్ చేసి విషయం చెప్తుంది.

Intinti Gruhalakshmi

లాస్యకు నందూ వార్నింగ్
నందూకు విడాకులు రావడంతో అంతా సంతోషంలో ఉండగా.. దివ్య చెప్పింది విని నందూ కోపంతో ఊగిపోతాడు. ఆ వెంటనే లాస్య ఇంటికి వెళ్తాడు. అప్పుడామె బాధతో మందు తాగుతూ ఉంటుంది. అతడిని చూసి వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. అప్పుడు నందూ వచ్చి లాస్య పీక పట్టుకుని నొక్కుతాడు. అంతేకాదు, 'నా కూతురి జోలికి రావొద్దని చెప్పాను.. అయినా వినకుండా పదే పదే అదే చేస్తున్నావు. తాచుపాము తోక తొక్కింది నేను కాదు నువ్వు.. అందుకే పగపట్టి వచ్చాను.. నిన్ను పైకి పంపాలని డిసైడ్ అయ్యే వచ్చాను. ఇంకోసారి ఇది రిపీట్ అయితే.. నిన్ను చంపి జైలుకి పోతాను. మాజీ పెళ్లం అని కూడా చూడను. చంపిపడేస్తా' అని వార్నింగ్ ఇస్తాడు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X