Intinti Gruhalakshmi Today Episode: నందూ దగ్గర నిజం దాచిన లాస్య.. లాయర్‌ను కలవడంపై తులసి వెనకడుగు
చాలా ఏళ్లుగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' సోమవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరు కూడా ఓ లుక్కేయండి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే
శనివారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. బ్యాంక్ అకౌంట్‌లో 20 లక్షలు ఎప్పుడు పడతాయా అని తులసి ఫ్యామిలీ వేచి చూస్తుంది. అప్పుడే ఆ డబ్బు క్రెడిట్ అయినట్లు మెసేజ్ వస్తుంది. దీంతో అందరూ సంతోషిస్తారు. ఇక, తులసి ఆ డబ్బు నుంచి 5 లక్షలు ప్రేమ్‌కు ఇవ్వాలని అనుకుంటుంది. ఇందుకోసం శృతికి ఫోన్ చేసి రమ్మంటుంది. అంతా సంతోషిస్తున్న సమయంలోనే ఆమె డబ్బు మాయం అవుతుంది. దీంతో తులసి మేనేజర్‌కు ఫోన్ చేయగా.. చెక్ ద్వారా డబ్బు డ్రా చేసుకున్నారని అంటాడు. దీంతో తాను మోసపోయానన్న విషయాన్ని తులసి గ్రహిస్తుంది.

శృతికి క్షమాపణ చెప్పిన తులసి
బ్యాంక్ ఏజెంట్ చేతిలో మోసపోయానని తెలుసుకున్న తర్వాత తులసి ఎంతగానో బాధ పడుతూ ఉంటుంది. ఆ సమయంలో అందరూ ఆమెను ఓదార్చుతారు. పరందామయ్య, అనసూయ 'నువ్వు ఇంత అమాయకంగా ఉంటే ఎలా బతుకుతావమ్మా. కొంచెమైన నీలో మార్పు వస్తే బాగుంటుంది' అని అంటారు. ఆ తర్వాత తులసి 'నీకు డబ్బులు ఇస్తానని మాటిచ్చి ఆశ పెట్టాను. ఇప్పుడు ఆ మాటను నిలుపుకోలేకపోతున్నాను. దయచేసి నన్ను క్షమించమ్మా' అని శృతితో చెబుతుంది. దీనికామె ముందు మీ గురించి ఆలోచించండి ఆంటీ అని ఓదార్చుతుంది.

లాస్య హ్యాపీ.. నందూకు చెప్పేసి
మరోవైపు లాస్య 'తులసిని సక్సెస్ ఫుల్‌గా మోసం చేశాను. అనుకున్నది సాధించాను. లాస్య నువ్వు గ్రేట్' అంటూ చాలా సంతోషంగా ఉంటుంది. ఇది చూసి నందూ షాక్ అవుతాడు. ఆ సమయంలో లాస్య అతడిని పరిగెత్తుకుంటూ వెళ్లి హగ్ చేసుకుంటుంది. దీంతో నందూ ఏంటి ఇంత ఆనందం అంటాడు. దీనికి లాస్య 'మన ప్రియమైన శత్రువు తులసి మరోసారి రోడ్డు మీద పడింది. తులసికి 20 లక్షల బ్యాంక్ లోన్ సాంక్షన్ అయింది. డబ్బు అకౌంట్‌లో క్రెడిట్ అయిన మరుక్షణంలోనే ఆ డబ్బు మాయమైంది' అని చెప్తుంది. కానీ, తానే ఆ పని చేశానని చెప్పదు.

నందూను రెచ్చగొట్టేసిన లాస్య
తులసి డబ్బు పోగొట్టుకుందని లాస్య చెప్పగానే నందూ చాలా సంతోషిస్తాడు. అప్పుడు ఆయన 'ఇన్ని రోజులకు నాకు చాలా సంతోషం అనిపించింది. మరి ఒకసారి సరదాగా తనను పరామర్శించి వద్దామా. వద్దులే..' అని అంటాడు. అప్పుడు లాస్య 'తులసి ఇప్పుడు ఇదివరకు తులసి కాదు.. చాలా మారిపోయింది. తెలివితోనే అంకితను పక్కన పెట్టుకుంటుంది కదా. తులసిని గట్టెక్కించడానికి అంకిత ఉంది కదా' అంటూ అతడిని ఎంతగానో రెచ్చగొడుతుంది. దీంతో నందూ 'తులసికి అంకిత ఎలా తనకు డబ్బు ఇస్తుందో నేను చూస్తాను' అని వెళ్తాడు.

తులసి బాధగా... ప్రేమ్ ఫోన్‌తో
20 లక్షల రూపాయలు మాయం అయిన తర్వాత ఏం చేయాలో తులసికి అర్థం కాదు. ఎవరినైనా అడ్వకేట్‌ను సంప్రదిద్దామా అని పరందామయ్య అడుగుతాడు. దీంతో ఎవరో ఎందుకు మన అల్లుడే ఉన్నాడు కదా అని అనసూయ అంటుంది. అప్పుడు తులసి వద్దు.. ఈ విషయం నలుగురికి తెలియకూడదు అంటుంది. ఇంతలో శృతికి ప్రేమ్ ఫోన్ చేస్తాడు. దీంతో నేను వెళ్లి వస్తా అంటుంది శృతి. దీంతో వెళ్లిరా.. వాడికి ఏం తెలియనీయకు అంటుంది తులసి. దీంతో సరే అని చెప్పి అక్కడి నుంచి శృతి వెళ్లిపోతుంది. అంకిత కూడా ఏం చేయాలి అని ఆలోచిస్తుంటుంది.

నందూ ఎంట్రీ.. నిందలు వేస్తూ
తర్వాత తమను మోసం చేసిన వాళ్లు నాశనం అయిపోతారని అందరూ తిట్టుకుంటూ ఉంటారు. అంతలో కోపంతో ఊగిపోతోన్న నందూ అక్కడకు వస్తాడు. వచ్చీ రావడమే 'ఈ సూత్రం అందరికీ వర్తిస్తుంది. ఒకరిని మోసం చేసి బతకాలనుకుంటే ఇలాగే అవుతుంది. ఇంతవరకు నువ్వు ఏం సాధించావు. నీ చేతకానితనంతో నీతో పాటు నిన్ను నమ్ముకున్న వాళ్లను కూడా నట్టేట ముంచావు. ఏదో ఫ్యాక్టరీని ఉద్ధరిస్తానని బయలుదేరావు. ఆ తర్వాత మధ్యలోనే ఫ్యాక్టరీని వదిలేశావు. మా నాన్న ఆపరేషన్ కోసం అని అప్పు చేశావు. చివరకు ఆ ఇంటిని పోగొట్టావు.. తినడానికి సంపాదించుకోవడానికే కిందా మీదా పడుతున్నావు. అదే అహంకారం ఇంకా పోలేదు. 20 లక్షల లోన్ తీసుకొని ఆ డబ్బు కూడా ఎటూ కాకుండా చేశావు' అంటూ నిందలు వేస్తాడు.

మీ ముందు చేతులు చాచాలా
అక్కడితో ఆగని నందూ నా వల్లను కూడా కష్టపెడుతున్నావు అంటాడు. దీంతో తులసి 'మీ బాధ ఏంటో నాకు అర్థం కావడం లేదు. దేహీ అంటూ మీ ముందు నేను చేతులు చాచానా. ఎందుకు నా విషయంలో ఇంత ఆసక్తి చూపిస్తున్నారు. ఎందుకు నా ఇంటి మీద పడి గోల చేస్తున్నారు. లోన్ తీసుకున్నాను అది నా ఇష్టం. మోసపోయాను.. అది నా కర్మ. ఆ లోన్ మిమ్మల్ని కట్టమని అడగలేదే.. అడిగినా మీరు కట్టలేరు కూడా. ఎందుకంటే.. ఎంతో పెద్ద చదువులు చదివినా నాకన్నా నిస్సహాయ పరిస్థితుల్లో ఉన్నారు మీరు' అంటూ సరైన సమాధానం చెబుతుంది.

నన్ను మోసం చేసింది మీరేగా
తులసి మాటలకు నందూకు ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడు తులసి 'ఎందుకు నా గురించి అంత ఆలోచిస్తున్నారు. నేను మీ మాజీ భార్యను' అంటుంది. దీంతో నందూ నా వాళ్లంతా నీ దగ్గర ఉన్నారు కాబట్టి ఆలోచిస్తున్నాను అంటాడు. దీనికామె 'వాళ్లు నా వాళ్లు కూడా. నా జీవితంలో మొట్టమొదటిసారిగా నన్ను మోసం చేసింది ఆయనే అని మీ అబ్బాయికి చెప్పండి మామయ్య. ఏవేవో ఊహించుకొని ఊరికే నిందలు వేయకండి నంద గోపాల్ గారు. నా అప్పు, నా బాధ్యత నేనే తీర్చుకుంటాను' అంటుంది. ఆమె మాటలకు కుటుంబ సభ్యులు సపోర్ట్ చేస్తారు. ఆ తర్వాత ఇంటికి వెళ్లిన శృతి ఏడుస్తూ ఉంటుంది. దీంతో ప్రేమ్‌కు ఆమె డబ్బులు తీసుకు రాలేదని అర్థం అవుతుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











