Intinti Gruhalakshmi: తొలిసారి మాట్లాడిన ప్రకాశం.. చేయి విరిచిన దివ్య.. పాపం బుక్కైపోయిందిగా!
వేరే భాషలతో పోల్చుకుంటే తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రం ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' మంగళవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar
సోమవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే:సోమవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. విక్రమ్‌ను దివ్య ఎలాగోలా తన వైపునకు తిప్పుకుంటుంది. తర్వాత మేనేజర్ మోసం చేశాడని నిందిస్తూ ఇంట్లో రాజ్యలక్ష్మి గొడవ చేస్తుంది. అంతేకాదు, అతడి స్థానంలో లాస్యను తీసుకొచ్చి పెడతానని అంటుంది. కానీ, దీనికి విక్రమ్ ఒప్పుకోడు. పైగా దివ్య కూడా ఇష్టం లేదంటూ ఆమెకు సపోర్టుగా మాట్లాడతాడు. దీంతో దివ్య అత్తకు బుద్ది చెబుతుంది. తర్వాత ఈ విషయం తులసికి ఫోన్ చేసి చెప్తుంది. అదంతా విన్న నందూ.. లాస్య దగ్గరకు కోపంగా వెళ్తాడు. అంతేకాదు, ఆమెను చంపేస్తానని వార్నింగ్ కూడా ఇచ్చేస్తాడు.

ప్రకాశాన్ని తీసుకు వచ్చిన దివ్య:దివ్య చొరవ తీసుకుని మందులు ఇవ్వడం వల్ల విక్రమ్ తండ్రి కోలుకుంటాడు. మాటలు కూడా వస్తాయి. దీంతో ఆయనను వీల్ చైర్‌లో తీసుకు వచ్చి రాజ్యలక్ష్మి ముందు ఉంచుతుంది. అప్పుడాయన దివ్యను చూపిస్తూ ఇన్నేళ్లకి నిన్ను అడిగే నోరు పుట్టుకొచ్చింది అని అంటాడు. దీనికి రాజ్యలక్ష్మి 'నోరెత్తినందుకు నీకు ఏ గతి పట్టిందో ఆ నోటికి కూడా అదే గతి పడుతుంది' అని అంటుంది. అప్పుడు బసవయ్య 'ఎక్కువ ఆవేశపడొద్దు బావగారూ.. మీకు ఇప్పుడిప్పుడే మాటలొస్తున్నాయి.. రాజ్యలక్ష్మి నమోనమహ: అని స్మరించుకోండి.. మీకు మంచింది' అని అంటాడు.

దివ్య కాళ్లు విరగ్గొడతానన్న అత్త:ఆ తర్వాత దివ్య 'నేను మామయ్య గారికి బయటి ప్రపంచం చూపిస్తానంటే ఎందుకు భయపడుతున్నారు? ఆయన కోలుకోవడం మీకు ఇష్టం లేదా? ఆయన మిగిలిన జీవితం అయినా సంతోషంగా గడపడం మీకు ఇష్టం లేదా' అని నిలదీస్తుంది. దీంతో అత్త 'ఈ ఇంట్లో నీ జీవితానికే దిక్కులేదు. ఆయన జీవితాన్ని ఉద్దరించడానికి బయల్దేరావా? పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే కాళ్లు విరగ్గొడతా' అంటుంది. దీంతో ప్రకాశం రాజ్యలక్ష్మీ అని అరుస్తాడు. అప్పుడామె 'మీ కోడలికి చెప్పండి.. నాతో పెట్టుకుంటే మీ పక్కన దానికి కూడా ఒక వీల్ చైర్ తప్పదని' అంటుంది.

మామ కోసం అత్తకు వార్నింగ్:రాజ్యలక్ష్మి బెదిరించడంతో ప్రకాశం తనను ఇంట్లోకి తీసుకెళ్లమని అంటాడు. దీనికామె 'మిమ్మల్ని లోపలికి తీసుకుని వెళ్లడానికి కాదు మామయ్యా బయటకు తీసుకుని వచ్చింది' అని అంటుంది. దీంతో ఆయన గొడవలు వద్దని అనగా.. 'నేను గొడవ పడను.. నాతో గొడవపడితే మాత్రం చూస్తూ ఊరుకోను' అంటుంది. దీంతో రాజ్యలక్ష్మి 'ఏం చేస్తావ్' అనగా దివ్య కోపంగా చూస్తుంది. దీంతో సంజయ్ మర్యాదగా ఉండమంటాడు. అప్పుడు దివ్య 'మర్యాద అంటే అర్ధమే తెలియని మీకు మర్యాద ఇచ్చి ఆ మర్యాద పరువు తీయాలని అనుకోవడం లేదు' అంటుంది.
అతడి చేయి విరిచేసిన దివ్య:వీల్ చైర్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు దివ్య ప్రయత్నించగా.. రాజ్యలక్ష్మి 'ఆగవే.. అడుగు ముందుకు వేస్తే బాగోదు.. తమ్ముడు చూస్కో' అంటుంది. దీంతో అతడు అడ్డుగా వస్తాడు. అప్పుడు దివ్య 'బాబాయ్ ఈ వయసులో మీ ఎముకల్లో బలం ఉండదు. గట్టిగా పట్టుకుంటే పుటుక్కుమంటాయి. నీకు అవసరమా' అంటుంది. కానీ, రాజ్యలక్ష్మి చెప్పడంతో బసవయ్య అలాగే అడ్డు నిలబడతాడు. దీంతో దివ్య అతడి చేయి పట్టుకుని వెనక్కి తిప్పేస్తుంది. అప్పుడు బసవయ్య అమ్మో నా చేయి నా చేయి అని నొప్పితో విలవిల్లాడతాడు. దీంతో అందరూ షాక్ అయిపోతారు.

విక్రమ్‌కు అబద్దాలు చెప్పారు:అంతలోనే అక్కడకు విక్రమ్ వస్తాడు. అప్పుడు బసవయ్య దివ్య తనను తోసేసినట్లుగా కింద పడిపోయి యాక్టింగ్ చేస్తాడు. అంతేకాదు, 'ఏంటి అల్లుడూ.. నీ భార్యకు పెద్దా చిన్నా తేడా లేదా? నాపై దౌర్జన్యం చేస్తుందిరా' అని అబద్దం చెప్తాడు. దీంతో దివ్య లేదు విక్రమ్ అదంతా నాటకం అని అంటుంది. అప్పుడు బసవయ్య 'ఎందుకమ్మా అబద్దాలు చెప్తావు? నాది నాటకాలాడే వయసా? అబద్దం చెప్పినా అతికినట్టు ఉండాలి' అని అంటాడు. అప్పుడే రాజ్యలక్ష్మి తమ్ముడూ నువ్వు ఊరుకో అనగా విక్రమ్ 'ఏంటి దివ్యా ఇది..? పెద్దావాళ్లపై నీ దౌర్జన్యం ఏంటి? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ' అని నిలదీస్తాడు. దీంతో రాజ్యలక్ష్మి 'ఏదో చిన్న పిల్లరా? తెలిసీ తెలియక చేస్తుంది. నేను నచ్చజెప్తాలే. నువ్వు వెళ్లు' అని డ్రామా ఆడుతుంది.

దివ్యపై విక్రమ్ సీరియస్‌గా:రాజ్యలక్ష్మి మాటలకు బసవయ్య 'ఎన్నిసార్లు నచ్చచెప్తావు అక్కా.. ఇంతకు ముందు వరకూ మాటలతో సరిపెట్టింది.. ఇప్పుడు చేతలకి దిగింది' అంటాడు. అప్పుడు దివ్య, రాజ్యలక్ష్మి ఏం జరిగిందో చెప్తాం అంటారు. దీంతో విక్రమ్ 'దివ్యా నువ్వు ఆగు.. అమ్మను చెప్పనివ్వు.. పక్షపాతం లేకుండా ఉన్నది ఉన్నట్టు చెప్తుంది. నువ్వు చెప్పమ్మా' అంటాడు. దీంతో రాజ్యలక్ష్మి 'ఏం లేదురా.. మీ నాన్న చీకట్లో మగ్గుతున్నారనే జాలితో బయటకు తీసుకుని వెళ్లాలని దివ్య బయల్దేరింది. డాక్టర్ వెలుతురులోకి తీసుకుని వెళ్లొద్దని చెప్పారు కదా అని అడిగాను. దానికి దివ్య నేనూ డాక్టర్‌ను నాకంటే తెలుసా? అని మీ మామయ్యపై దౌర్జన్యం చేసింది. దివ్య ఉద్దేశం మంచిదే కానీ.. ఆయన ఆరోగ్యం కూడా ముఖ్యమే కదా' అని చెప్పడంతో దివ్యపై విక్రమ్ కోప్పడతాడు.

మామ కన్నీరు తుడిచింది:విక్రమ్ మాటలు ఇచ్చిన ధైర్యంతో బసవయ్య.. ప్రకాశం వీల్ చైర్‌ను తీసుకుని ఆయన గదిలోకి తీసుకు వెళ్తాడు. అంతేకాదు, 'బావగారూ బయల్దేరదామా? రాజ్యలక్ష్మి నమో నమః మంత్రం మాత్రం మర్చిపోకండే' అని వెటకారం ఆడతాడు. ఇక, గదిలోకి వెళ్లిన తర్వాత ప్రకాశం ఏడుస్తూ ఉంటాడు. అతడి కన్నీళ్లు తుడిచిన దివ్య మామకు ధైర్యం చెబుతుంది. అప్పుడాయన దివ్యను, ఆమె తల్లి తులసిని పొగుడుతాడు. అలాగే, మనకు కూడా మంచి రోజులు వస్తాయని అంటాడు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











