Intinti Gruhalakshmi: దివ్యకు షాకిచ్చిన లాస్య.. అడ్డంగా దొరికిన విక్రమ్.. కథలో ఊహించని మలుపులు
ఇండియాలోని మిగిలిన భాషల కంటే తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రం ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' గురువారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar
బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే:బుధవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. ఎలాగైనా అత్తకు బుద్ది చెబుతానని మామయ్యకు దివ్య ధైర్యం చెబుతుంది. అనంతరం రాజ్యలక్ష్మి, బసవయ్య, సంజయ్‌లు కలిసి దివ్యపై దొంగతనం అభియోగం చేయాలని ప్లాన్ చేస్తారు. అది విన్న దివ్య.. వాళ్లు డబ్బు తీసుకెళ్తుండగా విక్రమ్‌ను తీసుకు వెళ్తుంది. కానీ, అక్కడ వాళ్లు ఫ్లేట్ ఫిరాయించి దివ్యనే బుక్ చేస్తారు. దీంతో విక్రమ్ భార్యపై కోప్పడుతూ తల్లికి సపోర్టు చేస్తాడు. మరోవైపు, తులసి, నందూ కలిసి కెఫేను రీ ఓపెన్ చేస్తారు. కానీ, అక్కడకు ఎవరూ రారు. అప్పుడు లాస్య ఎంట్రీ ఇచ్చి వాళ్లిద్దరికీ బిగ్ షాక్‌ను ఇచ్చేస్తుంది.

దివ్య మాటలను హైలైట్ చేస్తూ:దివ్య చేసిన హడావిడి వల్ల సంజయ్ తన దగ్గరున్న రూ. 20 లక్షలను విక్రమ్‌కు ఇస్తాడు. దీంతో విక్రమ్ 'వదిన అన్న మాటలకు హర్ట్ అయ్యావు కదా.. అందుకే ఈ డబ్బు తిరిగి ఇచ్చేస్తున్నావు. నాకు అర్థం అయింది' అని అంటాడు. దీంతో రాజ్యలక్ష్మి అదే అయుంటుందిరా.. నాకు అంతకు మించి కారణం కనిపించడం లేదు అంటుంది. అప్పుడు దివ్య 'బాగుంది అత్తయ్యా.. అప్పటి పరిస్థితుల్ని బట్టి నోరు జారి ఉంటాను. దాన్ని ఇష్యూ చేస్తున్నారేంటి' అని ప్రశ్నిస్తుంది. దీనికి సంజయ్ దివ్య మీద ఫైర్ అయిపోతాడు.

వదినవు కాబట్టి ఊరుకున్నాను:ఆ తర్వాత సంజయ్ 'అన్నయ్య భార్యవు కాబట్టి నిన్ను గౌరవంతో వదినా అని పిలుస్తున్నా. కానీ నువ్వు నాకంటే చిన్నదానివి. వదిన అనే హోదాను అడ్డం పెట్టుకుని నన్ను మాటలు అంటున్నావు. నాకు కోపం రాదు కానీ.. మనసుకి బాధ అనిపిస్తుంది.. కాదంటావా అన్నయ్యా' అని ప్రశ్నిస్తాడు. దీనికి దివ్య 'చూడు సంజయ్.. నీపై కోపం లేదు ద్వేషం లేదు. దయచేసి అర్ధం చేసుకో' అనగా.. ద్వేషం లేకపోయినా నీలో చిన్నతనం కనిపిస్తుంది అంటాడు. దీనికామె 'నన్ను చిన్నపిల్ల అనేంత పరిణితి నీలో లేదు. ఏదో ఒక విషయంలో పొరపాటు జరిగినంత మాత్రాన నన్ను తీసిపారేయాల్సిన అవసరం లేదు. ఐ యామ్ ఏ డాక్టర్. పెద్దవాళ్లకి కూడా ధైర్యం చెప్పే పొజిషన్‌లో ఉన్నాను' అని సీరియస్ అవుతుంది.
దివ్యకు ఎదురు తిరిగిన మరిది:దివ్య మాటలతో సంజయ్ 'నువ్వే కాదు.. నేనూ డాక్టర్‌నే.. హార్ట్ స్పెషలిస్ట్‌ను కూడా. ఎవరి మనసులో ఏం ఉందో ఇట్టే తెలుసుకోగలను. నన్ను కూడా తీసిపారేయకు' అని అంటాడు. దీంతో రాజ్యలక్ష్మి నటిస్తూ.. 'ఏయ్ సంజయ్.. వదినాతో ఇలాగేనా మాట్లాడేది. ఎప్పటికైనా తల్లి తర్వాత స్థానం వదినదే.. తనను గౌరవించి తీరాల్సిందే' అని చెబుతుంది. దీనికతడు 'నాకు వదినంటే గౌరవం ఉందమ్మా.. కానీ సందర్భం వచ్చింది కాబట్టి చెప్పానంతే. తప్పుగా మాట్లాడి ఉంటే సారీ వదినా' అని చెప్తాడు.

డబ్బు తీసుకుంటాను అంటూ:సంజయ్ వెళ్లిపోతూ క్యాష్ బ్యాగ్ తీసుకుని వెళ్లను అంటాడు. దీంతో రాజ్యలక్ష్మి, విక్రమ్ మాట్లాడినా అతడి వినిపించుకోడు. అంతేకాదు, నాకు పని ఉంది.. నువ్వే తీసుకు వెళ్లు అంటాడు. దీంతో దివ్యకు డౌట్ వస్తుంది. అప్పుడు 'ఈ క్యాష్ వర్కర్స్ జీతాలు కోసమే కదా.. ఒకరోజు లేటుగా ఇస్తే ఏమవుతుంది' అని అనగా.. విక్రమ్ 'అలా వద్దు.. మనకది ఒకరోజే కావచ్చు.. కానీ జీతాలపై ఆధారపడే వాళ్లకి అది 24 గంటలు. ఎవరి అవసరాలు వాళ్లకు ఉంటాయి. ఆ డబ్బులు ఇలా ఇవ్వు నేను తీసుకుని వెళ్తా. నువ్వు కాన్ఫిరెన్స్‌కు వెళ్లు' అని సంజయ్ దగ్గర నుంచి తీసుకుంటాడు.

దివ్య ముందు రాజ్యలక్ష్మి ప్లాన్:తనకు తెలియకుండా వీళ్లు ఏదో ప్లాన్ చేశారు అని దివ్య అనుకుంటుంది. అంతలోనే రాజ్యలక్ష్మి వచ్చి 'ఏంటి కోడలు షాక్‌లు తట్టుకోలేకపోతున్నావా? నిన్నగాక మొన్న వచ్చావు. అప్పుడే ఈ కొండను ఢీ కొట్టాలని చూస్తున్నావా' అంటుంది. దీంతో దివ్య 'మీరు కొండే.. అనకొండ కాదు కదా.. చిట్టెలుకలు కూడా కొండను తవ్వేస్తాయి' అంటుంది. దీనికి అత్త 'ఏడ్చినట్టు ఉంది నీ తెలివి.. నా ముందు.. నీ తెలివితేటలు ఏం పనికొస్తాయ్. నిన్న రాత్రి ఏం జరిగిందో చూశావ్ కదా. నువ్వు ఎంత చెప్పినా విక్రమ్ నమ్మడు. నీ మొగుడు ఆస్తి మొత్తం కృష్ణార్పణం' అని అంటుంది.

దిగజారకు.. నిన్ను తొక్కిపడేస్తా:రాజ్యలక్ష్మి మాటలకు దివ్య 'తల్లి ప్రేమతో కొడుకును మోసం చేయడానికి నీకు మనసు ఎలా వస్తుంది? ఆడదానివి అయుండి.. అమ్మ అనే మాటను అడ్డం పెట్టుకుని ఇంత దారుణమా? విక్రమ్ చాలా మంచివాడు. అడుక్కుంటే ఆస్తి ఇచ్చేస్తాడు. దాని కోసం దిగజారకు' అని అంటుంది. దీనికామె 'ఏంటే బెదిరింపులు వదిలేసి వేదాంతం మొదలుపెట్టావు. ఏ వణుకు మొదలైందా? విక్రమ్‌పై ఆశపై వదులుకున్నావా' అంటుంది. ఆ మాటతో దివ్య 'నన్ను తక్కువ అంచనా వేయకు.. నువ్వేంటో విక్రమ్‌కు తెలిసేట్టు చేస్తాను. నిన్ను తొక్కిపడేస్తాడు' అని అంటుంది.

పోలీసులకు దొరికేసిన విక్రమ్:దివ్యతో మాట్లాడిన తర్వాత లాస్యకు రాజ్యలక్ష్మి ఫోన్ చేస్తుంది. అప్పుడామె 'నీ తండ్రి బాధితురాలిని గుర్తు పట్టావా' అంటూ మొదలుపెట్టి.. నీ ఆస్పత్రిలో చేరుతున్నా.. కాసేపట్లో విక్రమ్ ఏడుస్తూ ఫోన్ చేస్తాడు చూడు' అంటాడు. ఆ తర్వాత విక్రమ్ రూ. 20 లక్షలు తీసుకుని వెళ్తుండగా పోలీసులు ఆపి డబ్బుల లెక్కలు అడుగుతారు. అవి విక్రమ్ చూపించకపోవడంతో అరెస్ట్ చేస్తామని అంటారు. దీంతో అతడు రాజ్యలక్ష్మికి ఫోన్ చేయగా ఏమీ తెలియనట్లు మాట్లాడుతుంది. తర్వాత పోలీసులతో మాట్లాడడంతో వాళ్లు వదిలేస్తారు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











