For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi June 2nd Episode: దివ్యను నందూ ఇంటికి పంపిన తులసి.. లాస్యకు దిమ్మదిరిగే షాక్!

  |

  ఎంతో కాలంగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో రన్ అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మీ' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మీ' బుధవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో చూద్దాం పదండి!

  మంగళవారం ఎపిసోడ్‌లో జరిగిందిదే

  మంగళవారం ఎపిసోడ్‌లో జరిగిందిదే

  మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. అభి భార్య అంకిత ప్రెగ్నెంట్ అన్న విషయం తెలుస్తుంది. అయితే, అబార్షన్ చేయించుకోమని ఆమె తల్లి బలవంతపెడుతుంది. ఆ తర్వాత లాస్య - తులసి మధ్య వాడీవేడీగా ఫోన్ సంభాషణ జరుగుతుంది. అప్పుడే ఇద్దరి మధ్య సవాళ్లు కనిపిస్తాయి. ఎపిసోడ్ చివర్లో ప్రేమ్ ఇంటికి వస్తాడు. వచ్చీ రావడమే తన తండ్రి దగ్గరకు వెళ్లి గొడవ పడతాడు.

  ప్రేమ్ చేసిన పనిపై తులసి అసహనం

  ప్రేమ్ చేసిన పనిపై తులసి అసహనం

  ఇంటికి రావడం రావడమే తండ్రి దగ్గరకు వెళ్లి గొడవ పడతాడు ప్రేమ్. ఈ విషయాన్ని పని మనిషి తులసికి చెబుతుంది. దీంతో ఆమె కొడుక చేసిన పనికి అసహనం వ్యక్తం చేస్తుంది. దీనిపై ప్రేమ్ మంచిగానే వివరణ ఇస్తాడు. అంతలో తాత వచ్చి అతడిని వెనకేసుకుని వస్తాడు. అయినప్పటికీ తులసి మాత్రం అలాంటివి ప్రోత్సహించకూడదు అని అక్కడున్న అందరికీ చెబుతుంది.

  శృతిని ఆటపట్టించిన దివ్య.. సిగ్గుపడి

  శృతిని ఆటపట్టించిన దివ్య.. సిగ్గుపడి

  ప్రేమ్ చేసిన పనికి తులసి బాధ పడుతోన్న సమయంలోనే దివ్య అక్కడకు వస్తుంది. వచ్చీ రావడమే అన్నయ్యను హగ్ చేసుకుని.. ‘పాపం శృతి గారూ నువ్వు లేకపోయే సరికి దిగులుగా ఉన్నారు. ఇప్పుడు నువ్వు వచ్చావు కదా ఆమె హ్యాపీ' అంటూ అంటోంది. ఆ తర్వాత తులసి కూడా అదే మాట అనడంతో అప్పుడు శృతి సిగ్గు పడిపోతుంది. దీంతో ప్రేమ్ రొమాంటిక్‌గా చూస్తాడు.

  అంకిత పట్ల ఎమోషనల్ అయిన అభి

  అంకిత పట్ల ఎమోషనల్ అయిన అభి

  అబార్షన్ గురించి దిగులు చెందుతోన్న అంకితకు జ్వరం వస్తుంది. అప్పుడు అభి ఆమెకు ఇంజక్షన్ చేస్తాడు. ఆ సమయంలో తనకు ఉన్న సందేహాలను నివృత్తి చేసుకుంటుందామె. ‘నేను నీకు ఓ పెద్ద నిజం చెప్పకుండా దాచేస్తే ఏం చేస్తావ్' అని అంకిత.. అభిని ప్రశ్నిస్తుంది. అప్పుడతను ‘నిజమైన ప్రేమకు నిజాయితీనే ఆధారం' అంటాడు. దీంతో తనలో తాను కుమిలిపోతోంది అంకిత.

  ఫూల్‌లో శృతి, ప్రేమ్ మధ్యన రొమాన్స్

  ఫూల్‌లో శృతి, ప్రేమ్ మధ్యన రొమాన్స్

  స్విమ్మింగ్ ఫూల్ దగ్గర కూర్చుని గిటార్ వాయిస్తుంటాడు ప్రేమ్. ఆ సమయంలో శృతి అక్కడకు వస్తుంది. అప్పుడు ఇద్దరి మధ్య చిన్న వాదన జరుగుతుంది. దీంతో ఆమెను నీళ్లలోకి తోసేస్తాడు. ఇలా ఇద్దరూ కాసేపు అందులో రొమాన్స్ చేస్తారు. ఆ తర్వాత తడిచిన బట్టలతో బయటకు వస్తుండగానే తులసికి దొరికిపోతారు. అనంతరం ప్రేమ తాత వచ్చి అతడిని మరింత ఎంకరేజ్ చేస్తాడు.

  దివ్యను తండ్రి దగ్గరకెళ్లమన్న తులసి

  దివ్యను తండ్రి దగ్గరకెళ్లమన్న తులసి

  దివ్య సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం కాలేజ్‌కు మొదటిసారి వెళ్లాలని డిసైడ్ అవుతుంది. అప్పుడు తల్లి దగ్గరకు వచ్చి ఆశీర్వదించమని కోరుతుంది. దీంతో కొత్తగా ఏంటమ్మా ఇది అనగా.. ఫస్ట్ డే కాలేజ్‌కు వెళ్తున్నా మామ్ అంటుంది. అప్పుడే ప్రేమ్ కూడా వచ్చి నా కాళ్లు కూడా పట్టుకో అంటాడు. అలా మాట్లాడిన తర్వాత తులసి.. దివ్యను తండ్రి దగ్గరకు వెళ్లమని చెప్పి పంపిస్తుంది.

  Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
  లాస్య కన్నింగ్ ప్లాన్.. షాకిచ్చిన దివ్య

  లాస్య కన్నింగ్ ప్లాన్.. షాకిచ్చిన దివ్య

  తల్లి కోరిక మేరకు ఆశీర్వాదం కోసం తండ్రి దగ్గరకు వెళ్తోంది దివ్య. అక్కడకు వెళ్లగానే లాస్య బయటకు వస్తుంది. అప్పుడు ‘నా ఇంటికి ఎందుకు వచ్చావ్? నాన్న కంటే అమ్మే ముఖ్యం అన్నావుగా' అంటూ ఆమె మనసు మార్చేందుకు ప్రయత్నిస్తుంది. కానీ, దివ్య మాత్రం లాస్యకు ధీటైన జవాబులు ఇస్తూ వరుసగా కోలుకోలేని షాక్‌లు ఇస్తుంది. దీంతో ఈరోజు ఎపిసోడ్ పూర్తయిపోయింది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 335: Ankitha Warried About Pregnency. Then Prem And Shruthi Romance in Swimming Pool. After That Divya Went to Nandhus House.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X