Intinti Gruhalakshmi Today Episode: గాయత్రి ప్లాన్‌ను తిప్పికొట్టిన తులసి.. కొడుకు పరువు తీసిన నందూ

మిగిలిన భాషల కంటే తెలుగు బుల్లితెపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి భారీ నుంచి అతి భారీ స్థాయిలో స్పందన దక్కుతుంది. సుదీర్ఘ కాలంలో ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' గురువారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరు కూడా చూసేయండి మరి!

Photos Courtesy: Star మా and Disney+Hotstar

బుధవారం ఎపిసోడ్‌లో జరిగిందిదే

బుధవారం ఎపిసోడ్‌లో జరిగిందిదే

బుధవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. అంకిత పుట్టినరోజు వేడుకలు ప్రారంభం అవుతాయి. అప్పుడామె కోసం లాస్య ఒక చీరను తీసుకుని వస్తుంది. కానీ, అది ఆమెకు నచ్చదు. ఈ విషయాన్ని ముఖం మీదే చెబుతుంది. అంతలోనే అక్కడకు తులసి తన కుటుంబ సభ్యులతో కలిసి వస్తుంది. దీంతో గాయత్రి వెళ్లి ఆమెను అవమానించేలా మాట్లాడుతుంది. అప్పుడు అంకిత వచ్చి తులసికి మద్దతు తెలుపుతుంది. అంతేకాదు, తులసి తెచ్చిన చీరనే కట్టుకుంటానని అంటుంది. ఇక, శృతి.. ప్రేమ్ పడుతున్న కష్టాల గురించి తులసికి వివరించగా.. ఆమె సలహాలు ఇస్తుంది.

పార్టీలో ప్రేమ్ పరువు తీసిన తండ్రి

పార్టీలో ప్రేమ్ పరువు తీసిన తండ్రి

అంకిత పుట్టినరోజు పార్టీలో నందూ.. అభిని పిలిచి 'వీడు నా పెద్ద కొడుకు అభి.. మంచి డాక్టర్. కష్టం విలువ తెలిసిన వాడు. పెద్దలంటే గౌరవం భక్తి. అభి నాకొడుకు అని చెప్పుకోవడానికి నేను గర్వంగా ఫీల్ అవుతాను' అంటాడు. దీంతో అభి అదేంటి నాన్న తమ్ముడిని పరిచయం చేయవా అని అంటాడు. దీంతో నందూ 'వాడు నా రెండో కొడుకు.

ఎందుకు పుట్టాడో తెలియదు. ఏం చేస్తున్నాడో తెలియదు. ఇలాంటి వాడికి తండ్రి అని చెప్పుకోవడానికే సిగ్గు పడుతున్నా' అని అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దీంతో ప్రేమ్ బాధగా అక్కడి నుంచి పక్కకు వెళ్లిపోతాడు.

ఆ చీరతోనే అంకిత.. వాళ్లకు కోపం

ఆ చీరతోనే అంకిత.. వాళ్లకు కోపం

ప్రేమ్‌ను అవమానించిన తర్వాత లాస్య దగ్గరకు వెళ్తాడు నందూ. అప్పుడు ఆమె 'అంకిత కేక్ కట్ చేసేటప్పుడు మనం కొన్న డ్రెస్సే వేయిస్తా అని గాయత్రి నాకు మాటిచ్చింది' అంటుంది. దీనికి నందూ మాత్రం తనకు నమ్మకం లేదు అంటాడు. మరోవైపు అంకిత ఏ డ్రెస్ వేసుకుంటుందో అని దివ్య కూడా ఎదురు చూస్తూ ఉంటుంది. అప్పుడు తులసి 'అంకిత ఏ డ్రెస్ వేసుకుంటే మాత్రం ఏంటి.. మీరు దాన్ని రాద్ధాంతం చేయకండి' అని వాళ్లతో అంటుంది. ఇక, అంకిత మాత్రం తులసి తీసుకొచ్చిన చీరనే కట్టుకుంటుంది. దీంతో గాయత్రి, లాస్యకు కోపం వస్తుంది.

చీర మీద జ్యూస్ పోసిన గాయత్రి

చీర మీద జ్యూస్ పోసిన గాయత్రి

చీరను ఎలాగైనా మార్చాలని అనుకున్న గాయత్రి.. అంకిత దగ్గరకు వచ్చి ఈ జ్యూస్ తాగమ్మా అంటూ చీర మీద కావాలని పోస్తుంది. ఆ తర్వాత ఏమీ తెలియనట్లుగా అయ్యో.. చీర మీద జ్యూస్ పడిందే అంటుంది. ఏంటమ్మా ఇది అంటుంది అంకిత. దీంతో సారీ అమ్మా గ్లాస్ చేజారిపోయింది. చూసుకోలేదు అంటుంది గాయత్రి. దీంతో అంకిత 'మామ్.. నేను ఇక కేక్ కట్ చేయను. నా మూడ్ పాడయిపోయింది' అంటుంది. దీనికి అంకిత 'ఇంత మందిని పిలిచి.. ఇంత గ్రాండ్ గా పార్టీ అరేంజ్ చేశాక.. కేక్ కట్ చేయకపోతే ఎలా. ఇప్పుడు ఏమైంది. వెళ్లి 5 నిమిషాలలో లాస్య ఇచ్చిన చీర కట్టుకొనిరా.. కేక్ కట్ చేద్దువు కానీ' అంటుంది.

 గాయత్రి ప్లాన్ తిప్పికొట్టిన తులసి

గాయత్రి ప్లాన్ తిప్పికొట్టిన తులసి

చీర మార్చుకోమని గాయత్రి చెప్పగానే అంకిత 'నాకు ఈ సారీ చేంజ్ చేసుకోవాలని లేదు' అంటుంది. దీనికి తులసి చీరను మార్చుకోకు అంటుంది. దీంతో అందరూ షాక్ అవుతారు. అప్పుడు తులసి 'ఏం కాదు.. దీని మీద ఏం పడినా బట్ట చెడిపోదు. జస్ట్ తుడిచేస్తే చాలు' చూడండి అని జ్యూస్ పడ్డ ప్రాంతంలో తూడుస్తుంది. దీంతో మరక పోతుంది. ఆ తర్వాత తులసి 'ఇలాంటప్పుడు ఇలాంటి సమస్యలు వస్తాయనే.. ముందు చూపుతో ప్రత్యేకంగా ఈ వెరైటీ చీర తయారు చేశాను. నువ్వు శారీ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు అంకిత. పదా కేక్ కట్ చేద్దాం' అంటుంది. దీంతో థాంక్యూ ఆంటి అంటుంది.

లాస్యకు మరోసారి అంకిత ఝలక్

లాస్యకు మరోసారి అంకిత ఝలక్

తులసి చెప్పినట్లుగానే అంకిత కేక్ కట్ చేస్తుంది. ఆ వెంటనే లాస్యకు తినిపించకుండా తులసి నోట్లో పెడుతుంది. దీంతో గాయత్రికి కోపం వచ్చి.. ఇది పద్ధతి కాదు అంటుంది. అప్పుడు అంకిత 'నా ఇష్ట ప్రకారం నాకు నచ్చినట్టు చేయకుండా.. మీకు నచ్చినట్టు చేయడం కూడా కరెక్ట్ కాదు. వాళ్లను పార్టీ జరపమని నేను అన్నానా లేదే.. పైగా వద్దు అంటూ మీరే గొడవ పెట్టుకొని మరీ ఈ పార్టీ అరేంజ్ చేశారు' అని అంటుంది. ఆ తర్వాత వెళ్లి లాస్యకు కూడా అంకిత కేక్ తినిపిస్తుంది. తర్వాత అంకిత కోరిక మేరకు తులసి పాట పాడుతుంది. అప్పుడంతా చప్పట్లు కొడతారు.

తులసిపై నిందలు.. అభి మౌనం

తులసిపై నిందలు.. అభి మౌనం


ఇక, అంకిత పుట్టినరోజు పార్టీలో చేసిన పనులకు లాస్యకు ఎంతగానో కోపం వస్తుంది. దీని గురించి ఫంక్షన్ అయిపోయిన తర్వాత గాయత్రితో మాట్లాడుతారు. అభి, గాయత్రి ముందు లాస్య ఏడ్చినట్లుగా నటిస్తుంది. ఆ సమయంలో గాయత్రి 'ఇదంతా మీ అమ్మ వల్లనే. ఇదంతా మీ అమ్మే చేసింది' అంటూ తులసిని నిందిస్తుంది. దీనికి లాస్య, నందూ కూడా ఆజ్యం పోస్తారు. అలా అందరూ ఆమెను టార్గెట్ చేస్తారు. అప్పుడు ఈ మాటలు విన్న తులసి 'మీ అమ్మ అలాంటిది కాదు అని చెప్పొచ్చు కదా అభి' అని మనసులో అనుకుంటుంది. ఇలా ఈ ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X