Intinti Gruhalakshmi: ఇరుక్కుపోయిన దివ్య.. విడగొట్టాలని రాజ్యలక్ష్మి ప్లాన్.. లాస్య ఇంటికి రావడంతో!
భారతదేశంలోని చాలా ఇండస్ట్రీల కంటే తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రం ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శుక్రవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar
గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే:గురువారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. నందూను జైలుకు తీసుకు వెళ్లిన వెంటనే ఆ విషయాన్ని రాజ్యలక్ష్మికి లాస్య ఫోన్ చేసి చెప్తుంది. దీంతో దివ్య వచ్చిన వెంటనే ఆమెను అవమానించాలని బసవయ్య వాళ్లు ప్లాన్ చేసుకుంటారు. అందుకు తగ్గట్లుగానే ఆమె వచ్చిన వెంటనే తండ్రి గురించి మాట్లాడి ఫీల్ చేస్తారు. దీంతో దివ్య బాధ పడుతుంది. అప్పుడు విక్రమ్ వెళ్లి ఆమెను ఓదార్చే ప్రయత్నం చేస్తాడు. దీంతో అతడికి క్లాస్ పీకుతుంది. ఇక, లాస్య తీరును ఎండగట్టిన తులసి.. ఆమెపై సీరియస్ అవుతుంది. అంతేకాదు, కేసును రీఓపెన్ చేయిస్తానని వార్నింగ్ ఇస్తుంది.

దూరం పెంచొచ్చు అని ప్లాన్:విక్రమ్, దివ్య మాటలను విన్న బసవయ్య 'ఈ కొత్త దంపతులను విడదీస్తున్నాం అనుకొని మరింత దగ్గర చేస్తున్నమేమో అని అనుమానంగా ఉందక్కా' అంటాడు. అతడి భార్య కూడా 'నిజమే భార్యాభర్తల మధ్య ఎంతని కాపలా కాస్తాం అసహ్యంగా ఉంటుంది' అంటుంది. దీంతో రాజ్యలక్ష్మి 'చాటుమాటుగా యుద్ధం ఎంతసేపని చేస్తాం? దివ్య కూడా యాక్టివ్ అయింది. తనకి తండ్రి మీద ఉన్న ప్రేమ తనకు శత్రువులా మారబోతుంది. అస్తమానం తన తండ్రి కోసం పరిగెడుతుంటే ఈ అవకాశాన్ని వాడుకొని మనం వాళ్ళిద్దరి మధ్య దూరాన్ని మరింత పెంచొచ్చు' అంటుంది.

కేసును రీఓపెన్ చేయొచ్చని:మోహన్ వచ్చి 'నువ్వే దిగులు పడిపోతే ఎలా? అత్తయ్య మామయ్యలకు ధైర్యం ఎవరు చెప్తారు' అని తులసితో అంటాడు. అప్పుడు తులసి 'వాళ్ళ కొడుకును వాళ్ళ చేతుల్లో పెడతానని మాట ఇచ్చాను. కానీ దాన్ని నిలబెట్టుకోలేకపోయాను. వాళ్ళ బాధ చూడలేకపోతున్నాను అన్నయ్యా. అయినా తప్పు చేయకుండానే ఎందుకు ఆ దేవుడు శిక్ష వేస్తున్నాడు' అంటుంది. దీనికి మోహన్ 'లాస్య పట్ల తప్పు చేయకపోవచ్చు కానీ నీ పట్ల చేసిన తప్పుకు శిక్ష అనుభవిస్తున్నాడు. అయినా లాస్య చిన్న తప్పు చేసిందన్న సాక్ష్యం దొరికితే చాలు కేసు రీఓపెన్ చేయొచ్చు' అంటాడు. దీంతో తులసి అంటే దారులన్నీ మూసుకుపోలేదన్న మాట అంటుంది.

తులసి చెప్పినా వినని దివ్య:దివ్య తన తండ్రిని తలుచుకుని బాధ పడుతూ ఉంటుంది. 'చిన్నతనంలో తండ్రికి దూరమై బాధపడ్డాను. ఇప్పుడు ఈ విధంగా దూరమవుతున్నాను. ఐదు సంవత్సరాలు నాన్నను చూడకుండా ఉండడం అంటే నావల్ల జరగని పని' అనుకుంటూ తులసికి ఫోన్ చేస్తుంది. అప్పుడు తల్లితో 'నాకు నాన్నను చూడాలని ఉంది. నేను ఇప్పుడే జైలుకు వెళ్తున్నాను. నువ్వు కూడా అట్నుంచిరా' అంటుంది. దీంతో తులసి 'ఇప్పుడు వద్దు నాన్న గిల్టీగా ఉంటారు. మనతో సరిగ్గా మాట్లాడలేరు' అని చెప్తుంది. అయినా దివ్య ఆమె మాటలను అస్సలు వినిపించుకోదు. దీంతో తులసి 'చెప్పిన మాట వినటం లేదు. అస్తమానం ఇలా పరిగెట్టుకొని వస్తే అత్తింట్లో ఏమైనా సమస్యలు వస్తాయేమో' అని కంగారు పడుతుంది.

దివ్యకు అడ్డొచ్చిన బసవయ్య:ఆ తర్వాత దివ్య అమ్మ వచ్చేస్తూ ఉంటుంది నేను త్వరగా వెళ్ళాలి అనుకుని విక్రమ్ కోసం చూస్తుంది. కానీ, అతడు ఎక్కడా కనిపించకపోవడంతో ప్రియను అడుగుతుంది. దీనికామె 'కారు సర్వీసింగ్‌కు ఇచ్చారు. తీసుకురావడానికి వెళ్లారు' అని చెప్తుంది. దీంతో దివ్య 'ఆయన వస్తే నేను బయటకు వెళ్లాను అని చెప్పు. ఫోన్ చేస్తాను అన్నానని కూడా చెప్పు' అంటూ బయటకు వెళ్లబోతుంది. అంతలో బసవయ్య అడ్డుగా వచ్చి ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాడు. దీనికామె చెప్తే ఒక సమస్య చెప్పకపోతే ఒక సమస్య అని మనసులో అనుకుంటుంది.

అత్తతో గొడవకు దిగిన దివ్య:బసవయ్య అడగ్గానే 'ఎవరి పనులు వారికి ఉంటాయి బాబాయ్.. అన్నీ చెప్పలేము కదా. అట్నుంచి వచ్చాక చెప్తాను' అంటుంది. ఇంతలోనే రాజ్యలక్ష్మి కూడా అక్కడికి వచ్చి.. 'నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను నీ భర్తకు తల్లిని. నువ్వు ఎక్కడికి వెళుతున్నావో చెప్పి నేను పర్మిషన్ ఇస్తేనే బయటకు వెళ్ళాలి' అంటుంది. దీంతో దివ్య 'మా నాన్నగారిని చూడడానికి వెళ్తున్నాను' అంటుంది. దీనికి అత్త 'నువ్విలా అస్తమానం జైలుకు వెళ్తుంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? వెళ్లడానికి నేను ఒప్పుకోను' అంటుంది.

ఎవరి పర్మీషన్ అక్కర్లేదని:తండ్రి దగ్గరకు వెళ్లడానికి రాజ్యలక్ష్మి ఒప్పుకోకపోవడంతో దివ్య 'నాకు ఎవరి పర్మిషన్తోను పనిలేదు' అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు రాజ్యలక్ష్మి నవ్వుతుంది. దీంతో బసవయ్య 'ఏంటి నిన్ను కరివేపాకుని తీసేసినట్లు తీసేస్తుంటే నవ్వుతున్నావు' అని ఆమెను అడుగుతాడు. దీనికి రాజ్యలక్ష్మి 'నాకు కావలసింది కూడా ఇదే. దీన్నే ఇప్పుడు పెద్ద సమస్యను చేస్తాను. విక్రమ్‌ను రెచ్చగొట్టి దివ్యపై గొడవకు పంపుతాను. దీంతో వాళ్లిద్దరి మధ్య దూరం పెరిగిపోతుంది' అని ప్లాన్‌ను వివరిస్తుంది.

తులసిపై లాస్య దౌర్జన్యం:పరందామయ్య వాళ్లు మాట్లాడుకుంటూ ఉండగా లాస్య ఆ ఇంటికి వస్తుంది. అప్పుడు అనసూయ ఎందుకొచ్చావు అని ప్రశ్నిస్తుంది. దీంతో లాస్య ఇది నా ఇల్లు అంటూ తన గదిలోకి వెళ్లబోతుంది. అప్పుడు తులసి 'ఎక్కడికి వెళ్తున్నావు? ఇలా దౌర్జన్యం చేస్తే నేను ఊరుకోను. నా మీద కూడా అక్రమ కేసు పెట్టలేవు కదా' అంటుంది. దీనికి లాస్య 'నీకు తెలియదేమో భర్తతోపాటు అత్తమామల మీద ఆడపడుచుల మీద మాజీ భార్యల మీద కూడా కేసు పెట్టొచ్చు జాగ్రత్త' అంటుంది. ఆ తర్వాత తన గదిలోకి వెళ్లి డాక్యూమెంట్స్ తీసుకుంటుంది. ఇలా ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











