Intinti Gruhalakshmi Today Episode: అంకిత చేతిలో రంజిత్ కాల్ లిస్ట్.. నిజం తెలిసి షాకైపోయిన తులసి

వేరే భాషలతో పోల్చుకుంటే తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' గురువారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరు కూడా ఓ లుక్కేయండి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

బుధవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. తులసి దగ్గర డబ్బు కాజేసిన విషయం గురించి భాగ్య, లాస్య మధ్య చర్చలు జరుగుతాయి. అప్పుడే లాస్య బ్యాంక్ మేనేజర్‌కు ఫోన్ చేసి తులసి మీద కంప్లైంట్ చేస్తుంది. దీంతో వాళ్లు ఆమె ఇంటికి వెళ్లి ఎంక్వైరీ చేస్తారు. ఆ సమయంలో తులసి ఉండదు. కానీ, అంకిత 20 లక్షలకు షూరిటీ సంతకం చేస్తుంది. ఆ తర్వాత తులసి వచ్చిన వెంటనే అంకిత తన దగ్గర నుంచి 20 లక్షలు అప్పు తీసుకోమని తులసిని అడుగుతుంది. కానీ, ఆమె ఒప్పుకోదు. ఇక, ఈ విషయం రంజిత్ ద్వారా తెలుసుకున్న లాస్య.. వెంటనే గాయత్రికి చెబుతుంది.

గాయత్రికి నిజం చెప్పిన లాస్య, భాగ్య

గాయత్రికి నిజం చెప్పిన లాస్య, భాగ్య

అంకిత షూరిటీ సంతకం పెట్టిందని తెలియగానే లాస్య, భాగ్య ఇద్దరూ కలిసి గాయత్రి ఇంటికి వెళ్తారు. వీళ్లు వెళ్లే సరికి ఆమె పేపర్ చదువుతూ ఉంటుంది. అప్పుడు లాస్య 'ఎక్కడో జరుగుతున్న విషయాలను పేపర్ లో చదువుతున్నావు కానీ.. నీ సొంత మనుషులకు ఏం జరుగుతోందో మాత్రం నువ్వు తెలుసుకోవా. అక్కడ తులసి.. కూతురు డబ్బును కోన్ ఐస్ క్రీమ్‌లా నాకేస్తున్నా గాయత్రి పట్టించుకోదా. అక్కడ తులసి డైనోసార్ ను మించిపోతోంది. అంకితను తన గుప్పిట్లో పెట్టేసుకుంటోంది' అంటుంది. అలా ఇద్దరూ కలిసి ఆమెకు అర్థం అయి అర్థం కానట్టుగా మాట్లాడుతారు. ఆ తర్వాత ఏమైందో చెప్పమని గాయత్రి అడగ్గా లాస్య.. 'అంకితను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి తను లోన్ తీసుకున్న 20 లక్షలకు షూరిటీ పెట్టించుకుంది తులసి' అని చెబుతుంది.

గాయత్రిని రెచ్చగొట్టేలా మాట్లాడారు

గాయత్రిని రెచ్చగొట్టేలా మాట్లాడారు


లాస్య, భాగ్య.. అంకిత పెట్టిన షూరిటీ సంతకం గురించి చెప్పగానే గాయత్రి ఒక్కసారిగా షాక్‌కు గురవుతుంది. అంతేకాదు, అప్పుడు లాస్య 'షూరిటీ సంతకం అంటే.. నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు అని చెప్పడం' అని అంటుంది. దీంతో వామ్మో అంటూ మరింతగా రెచ్చగొడుతుంది. దీనికి లాస్య 'ఒకవేళ తులసి లోన్ డబ్బులు కట్టకపోతే.. ఆ డబ్బులు అంకిత కట్టాల్సిందే కదా' అంటుంది. దీంతో గాయత్రి 'నో.. నేను అలా చేయనీయను. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ తులసికి అంత ఛాన్స్ ఇవ్వనీయను' అంటుంది. ఆ వెంటనే గాయత్రి తులసి ఇంటికి కోపంగా వెళ్తుంది.

నిజం చెప్పకూడదని వాళ్లంతా ప్లాన్

నిజం చెప్పకూడదని వాళ్లంతా ప్లాన్

షూరిటీ సంతకం గురించి తెలియని తులసి తన పనులు తాను చేసుకుంటూ ఉంటుంది. కానీ, పరందామయ్య, అంకిత, అనసూయలు మాత్రం తులసికి ఈ విషయం తెలిస్తే ఏం చేయాలి అన్న దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు పరందామయ్య 'మనం వేసే అడుగు గురించి ఆలోచిస్తాం కానీ.. తులసి మాత్రం నాలుగు అడుగులు ముందే వేసి ఆలోచిస్తుంది. ఈ విషయం తెలిస్తే తను బాధ పడుతుంది' అంటాడు. ఇంతలో తులసి వేడి వేడిగా మిరపకాయ బజ్జీలు చేసుకొని తీసుకొస్తుంది. తినండి అంటుంది. దీంతో అందరూ తింటారు. అప్పుడే గాయత్రి వస్తుంది.

గాయత్రి గొడవ... అంకిత జాగ్రత్తగా

గాయత్రి గొడవ... అంకిత జాగ్రత్తగా

తులసి తెచ్చిన మిరపకాయ బజ్జీలను అందరూ తింటూ మంచి టేస్ట్ ఉన్నాయి అని అంటూ ఉంటారు. అప్పుడు గాయత్రి వచ్చి 'ఉంటుంది ఉంటుంది.. టేస్ట్‌గానే ఉంటుంది. నువ్వు తింటున్న మిరపకాయ బజ్జీ ఖరీదు 20 లక్షలు' అని అంకితతో అంటుంది. దీంతో దివ్య మీరు కూడా టేస్ట్ చేద్దురు కానీ.. రండి అంటుంది. దీనికి గాయత్రి 'నాకు అవసరం లేదు. నేను తులసిని నిలదీయడానికి వచ్చాను' అంటుంది. అప్పుడు తులసి 'నీ ఆరాటం తప్పితే నీతో నిలదీయుంచుకునే తప్పు నేనుప్పుడూ చేయను గాయత్రి. ఆవేశం తగ్గించుకో' అంటుంది. ఆ తర్వాత అంకిత 'ఆంటి మీరు లోపలికి వెళ్లండి. అమ్మతో నేను మాట్లాడుతాను' అంటుంది.

నిజం చెప్పిన అంకిత.. తులసి షాక్

నిజం చెప్పిన అంకిత.. తులసి షాక్

అంకిత మాటలకు గాయత్రి 'ఎందుకు మీ ఆంటికి నోటి మాటలు రావా. ఎంతకు తెగించకపోతే ఇంత పబ్లిక్‌గా అబద్ధం ఆడుతావు తులసి' అంటుంది. గాయత్రి మాటలు అర్థం కాని తులసి అబద్ధం ఏంటి.. నేనేం అబద్ధం ఆడాను చెప్పు అంటుంది. దీంతో 'నా కూతురు డబ్బు అవసరం లేదు అంటూనే.. నీ బ్యాంక్‌కు సంబంధించిన లోన్ కోసం అంకితతో ఎందుకు షూరిటీ సంతకం పెట్టించుకున్నావు' అంటుంది. దీనికి తులసి నాకు ఆ అవసరం లేదు అంటూ దివ్య మీద ప్రమాణం చేయబోతుంది. అంతలో అంకిత ఆమెను ఆపుతుంది. దీంతో తులసి మీ అమ్మ చెప్పిందే నిజమా అంటుంది. అప్పుడు అంకిత వాళ్లు వచ్చి పోలీస్ కంప్లయింట్ ఇస్తామంటే షూరిటీ సంతకం పెట్టాను ఆంటి అని నిజం చెప్పేస్తుంది.

అంకిత చేసిన పనికి తులసి బాధగా

అంకిత చేసిన పనికి తులసి బాధగా

నిజం తెలిసి తులసి షాక్ అవుతుండగా గాయత్రి 'అంత రియాక్షన్ అవసరం లేదు తులసి. అంకితకు షూరిటీ ఇచ్చే తప్పని పరిస్థితిని ఇరికించావు. ఎలాగూ నువ్వు బ్యాంక్‌కు డబ్బు కట్టలేవు. షూరిటీ సంతకం పెట్టింది కాబట్టి.. తనే కట్టాల్సి వస్తుంది. చాలా బాగా ప్లాన్ చేశావు' అంటుంది. దీనికి తులసి 'నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. నాకు అంకిత సంతకం పెట్టిన విషయం అస్సలు తెలియదు. తను పెద్ద మనసుతో షూరిటీ సంతకాన్ని నాకు బిక్షగా వేసి ఉంటుంది. చాలా గొప్ప పని చేశావు అంకిత. నీ రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను' అని అంటుంది.

అంకితను పంపించేస్తానని ప్రామిస్

అంకితను పంపించేస్తానని ప్రామిస్


గాయత్రి ఎంతకూ నమ్మకపోవడంతో తులసి 'నా ప్రాణం ఉండగా అంకితకు నా లోన్ తీర్చే అవకాశం రానివ్వను' అంటుంది. అప్పుడు గాయత్రి ఒకవేళ అంకిత ఆ డబ్బులు కట్టాల్సి వస్తే ఏం చేస్తావు అని అడుగుతుంది. దీనికి తులసి 'అప్పుడు నీ దగ్గరికే అంకితను పంపించేస్తాను' అంటూ మాట ఇస్తుంది. దీంతో గాయత్రి ఇప్పటికైనా మాట మీద నిలబడు అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. తర్వాత తులసి 'నువ్వు ఆ నిజాన్ని నా దగ్గర దాచడమే నా గుండెను నలిపేస్తోంది. నేను ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది. రేపు నా కొడుకు అభి కూడా వచ్చి ఇలాగే నిలదీస్తాడు. నాకు చెప్పిందేంటి.. నువ్వు చేసిందేంటి అని నన్ను నిలదీస్తాడు. అప్పుడు నేను ఏం సమాధానం చెప్పగలను. మీరంతా నిజం దాచారు కదా' అని బాధ పడుతుంది.

అంకిత చేతిలో రంజిత్ కాల్ లిస్ట్

అంకిత చేతిలో రంజిత్ కాల్ లిస్ట్


అసలు 20 లక్షలు ఎవరు కాజేశారో తెలుసుకునేందుకు అంకిత.. రంజిత్ కాల్ లిస్టును సంపాదిస్తుంది. ఆ విషయం తులసికి చెబుతూ.. 'ఆ రంజిత్ మీకు కాల్ చేసే ప్రతి సారీ ముందు లాస్య ఆంటికి ఫోన్ చేశాడు. మిమ్మల్ని కలిసి వెళ్లిన ప్రతి సారి కూడా లాస్య ఆంటికి ఫోన్ చేశాడు. అంటే.. ఆ రంజిత్ లాస్య తాలుకు మనిషి అనేదే కదా అర్థం' అంటుంది. దీంతో తులసి 'అవును... అంటే.. ఆ 20 లక్షల మాయం వెనుక లాస్య ఉన్నట్టే కదా. ఇప్పుడు చూడు ఆ లాస్యను ఎలా ఆడిస్తానో' అంటుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X