Intinti Gruhalakshmi: దివ్యపై తులసికి కంప్లైంట్.. రాజ్యలక్ష్మి కొత్త నాటకం.. విక్రమ్‌లో మొదలైన డౌట్

తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రం ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శనివారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే: శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. దివ్య, విక్రమ్ బాగా క్లోజ్ అవుతున్నారని రాజ్యలక్ష్మిని బసవయ్య రెచ్చగొడతాడు. దీంతో ఆమె తండ్రి కోసం ఆమె చేసే పనులతో వాళ్ల మధ్య దూరం పెంచాలని ప్లాన్ చేస్తుంది. ఇక, లాస్య ఏదైనా తప్పు చేసినట్లు కనిపిస్తే కేసును రీ ఓపెన్ చేయించవచ్చని మోహన్ చెప్పడంతో తులసి సంతోషిస్తుంది. ఇక, రాజ్యలక్ష్మి అనుకున్నట్లుగానే దివ్య.. అందరినీ ఎదురించి మరీ తండ్రిని చూడడానికి వెళ్తుంది. ఇక, దౌర్జన్యంగా ఇంట్లోకి వచ్చిన లాస్య.. ఎవరు ఆపినా ఆగకుండానే తన గదిలోకి వెళ్లి కెఫే డాక్యూమెంట్లను తీసుకుంటుంది.

 Intinti Gruhalakshmi

నిన్ను బోను ఎక్కిస్తా అంటూ: తులసి ఇంటికి వచ్చిన లాస్య 'నా భర్తకు సంబంధించినవి ఏవైనా సరే నా దగ్గరే ఉండాలి' అని కేఫ్ డాక్యుమెంట్స్ తీసుకుంటుంది. దీంతో తులసి 'నువ్వు కోర్టు కేసు గెలిచావని ఏం చేసినా చెల్లుతుందని అనుకోకు. పైకి విసిరిన రాయి కిందికి పడాల్సిందే. ఈ తులసి చేతులు ముడుచుకుని కూర్చోదు. నిన్ను బోను ఎక్కిస్తా.. నిజాలు కక్కిస్తా చూస్తూ ఉండు' అని వార్నింగ్ ఇస్తుంది. దీంతో లాస్య 'నీ వల్ల ఏం కాదని నాకు తెలుసు తులసి. ఈ లాస్యను తక్కువ అంచనా వేయకు' అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

తులసికి రాజ్యలక్ష్మి ఫోన్ కాల్: దౌర్జన్యంగా డాక్యూమెంట్లను తీసుకుని లాస్య వెళ్లిపోవడంతో అనసూయ బాధ పడుతుంది. దీంతో తులసి 'అత్తయ్యా.. లాస్య మెడలు ఎలా వంచాలో నాకు బాగా తెలుసు. మీరు బాధపడకండి. నేను మీ అబ్బాయిని కలిసి వస్తాను' అని బయలుదేరుతుంది. ఇంతలో తులసికి రాజ్యలక్ష్మి ఫోన్ చేస్తుంది. ముందుగా ఆమె ఎలా ఉన్నారని మంచి చెడ్డలు అడిగి తెలుసుకుంటుంది. మీరెలా ఉన్నారని తులసి అడగడంతో 'మేం బాగుండాలని అనుకుంటాం.. కానీ కుదరడం లేదు' అనగానే.. తులసి అదేంటి అలా అంటున్నారు.. ఇంతకీ ఏమైంది? అని అడుగుతుంది.

దివ్య మీద తల్లికి కంప్లైంట్స్: తులసి అడగ్గానే రాజ్యలక్ష్మి 'ఏం చెప్పమంటారు? చెప్తే మీకు బాధ.. చెప్పకపోతే మాకు బాధ' అని అంటుంది. దీంతో తులసి 'ఏం పర్లేదు చెప్పండి వదినా.. నా వల్ల ఏదైనా పొరపాటు జరిగి ఉంటే తప్పు దిద్దుకుంటాను' అంటుంది. దీనికి రాజ్యలక్ష్మి.. 'మీ కూతురికి మీకున్న మంచి గుణాల్లో కనీసం సగం అయినా ఉంటాయని అనుకున్నాను. అదేంటో రాను రాను మొండిగా తయారవుతుంది' అని అంటుంది. దీంతో తులసి నా కూతురు అలా చేయదు అంటుంది. అప్పుడు రాజ్యలక్ష్మి 'మీకే కాదు వదిన గారూ.. నాకూ ఆశ్చర్యంగానే ఉంది. ఎందుకిలా ప్రవర్తిస్తుందో తెలియడం లేదు. ఇది నేను మీకు చెప్పానని దివ్యతో చెప్పొద్దు. తాను బాధపడుతుంది. తాను బాధపడితే నేను తట్టుకోలేను' అని యాక్టింగ్ చేస్తుంది. దీంతో సరే చెప్పను అని అంటుంది.

 Intinti Gruhalakshmi:

దివ్యపై బోలెడన్ని చెప్పేసి: ఆ తర్వాత రాజ్యలక్ష్మి 'పుట్టింట్టో ఉన్నంత సేపూ తనకు నచ్చినట్టు ఉండటం బానే ఉంటాయి. అత్తింట్లో కూడా తీరు మార్చుకోలేకపోతే ఎలా? ఎంతసేపూ.. మా అమ్మా మానాన్న ఈ గోల తప్పితే నీ కూతురుకి ఏదీ పట్టదు. నా గురించి పట్టించుకోకపోతే సరే. కనీసం మొగుడుకైనా మర్యాద ఇవ్వాలి కదా. చెప్పినా అర్ధం చేసుకోవడం లేదు. విక్రమ్‌కి దోసె అంటే ప్రాణం. నీ చేత్తో చేసి పెట్టి తల్లీ అని చెప్పాను. కానీ పట్టించుకోకుండా నేను మా నాన్న దగ్గరకు వెళ్లాలి అని వచ్చేసింది. అత్తగారిని కాబట్టి ఇవన్నీ నా కడుపులోనే పెట్టుకున్నా.. తెలుసుకుంటుందిలే అని ఊరుకుంటున్నా' అని అంటుంది. దీంతో తులసి 'నా కూతురు ఇలా చేస్తుందా? చాలా థాంక్స్ వదిన గారూ.. దివ్యను అర్ధం చేసుకుంటున్నందుకు' అని అంటుంది.

అసలు లిటికేషన్ పెట్టింది: దివ్యపై తులసికి అన్నీ చెప్పిన తర్వాత రాజ్యలక్ష్మి 'నాకు తెలిసి మీ కూతురి జీవితం బాగుపడాలంటే ఒకటే మార్గం ఉంది వదిన గారూ. తను ఇకపై పుట్టింటి వైపు చూడకుండా కట్టడి చేయడం. పుట్టింటి గురించి ఆలోచించకుండా వార్నింగ్ ఇవ్వడం. అప్యాయంగా చెప్తారో.. అరిచిచెప్తారో మీ ఇష్టం.. లేకపోతే మీ కూతురి కాపురానికే నష్టం. ఇప్పటికే చాలా మాట్లాడి మీ టైం వేస్ట్ చేశాను. అన్నయ్య గారిని అడిగానని చెప్పండి' అంటూ కాల్ కట్ చేస్తుంది. దీంతో తులసి ఆలోచనలో పడిపోతుంది.

లాయర్‌తో కొత్త నాటకాలు: ఒక లాయర్‌ను రాజ్యలక్ష్మి ఇంటికి పిలిపిస్తుంది. అప్పుడతనికి నందూ కేసు గురించి చెప్పి.. ఆయనను జైలు నుంచి విడిపించే అవకాశం ఉందా అని అడుగుతుంది. దీంతో ఆ లాయర్ 'ఒక విధంగా కష్టమే కానీ.. నా అనుభవంతో ఆయన్ను బయటకు తీసుకుని వస్తా.. విడుదల చేయిస్తా' అని అంటాడు. దీంతో రాజ్యలక్ష్మి 'నందుగోపాల్ బయటకు రాకూడదు.. వీలైతే శిక్ష మరింత పెరిగినా సంతోషమే.. మీరు మావైపే ఉంటూ మమ్మల్ని ఓడించాలి.. అప్పుడు మీకు ఇవ్వాల్సిన ఫీజు కంటే రెట్టింపు ఇస్తాను.. మీరు ఈ కేసుకి సమాధి కట్టాలి' అని కుట్ర పన్నుతుంది. అప్పుడే విక్రమ్ అక్కడకు రావడంతో మామ కోసం లాయర్‌ను మాట్లాడినట్లు చెప్తుంది. తర్వాత బసవయ్యతో కలిసి దివ్యపై ఎక్కించి చెప్తుంది. దీంతో విక్రమ్‌కు డౌట్ పెరిగిపోతుంది.

 Intinti Gruhalakshmi:

లాస్య అలా.. దివ్య ఇలా: భాగ్య దగ్గరకు వచ్చిన లాస్య ఆమెకు డబ్బులు ఇస్తానని నమ్మిస్తుంది. దీంతో నిజమే అనుకుని సంతోషపడుతుండగా.. వీడియో డిలీట్ చేసిన విషయం బయటకు తీస్తుంది. దీంతో భాగ్య 'అంతా ఆ తులసి అక్కే చేసింది. తను నన్ను మాయ చేసింది. అందుకే అలా చేసేశాను' అంటూ ప్రాధేయపడుతుంది. దీంతో లాస్య ఆమెను క్షమిస్తుంది. ఇక, నందూ దగ్గరకు వెళ్లిన తులసి అతడినలా చూసి బాధ పడుతుంది. అప్పుడు దివ్య కూడా అక్కడకు వస్తుంది. అంతేకాదు, లాస్యపై యుద్ధం చేస్తానని అంటుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X