For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi June 4th Episode: బజారుదానా అంటూ తులసి ఫైర్.. తీరబోతున్న ప్రేమ్ లైఫ్ డ్రీమ్

  |

  ఎంతో కాలంగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో రన్ అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మీ' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మీ' శుక్రవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో చూద్దాం పదండి!

  గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇధే

  గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇధే

  గురువారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. లాస్య తిట్టి మరీ దివ్యను ఆశీర్వదిస్తాడు నందూ. ఆ తర్వాత అంకితను అబార్షన్ చేయించుకోమని తల్లిదండ్రులు ఒప్పించే ప్రయత్నం చేస్తారు. అనంతరం తులసి కోసం మహిళా సంఘాలు రాగా.. వాళ్లను తిప్పి పంపించేస్తుంది. ఆ తర్వాత అంజలి అనుకోకుండా వస్తుంది. ఇక, ఎపిసోడ్ చివర్లో డబ్బుల కోసం ఉద్యోగి సాయంతో నందూపైనే కుట్ర చేస్తుంది లాస్య.

  లాస్య ప్లాన్‌ను అర్థం చేసుకోని నందూ

  లాస్య ప్లాన్‌ను అర్థం చేసుకోని నందూ

  ఆఫీస్‌లో పని చేసే వ్యక్తితో లాస్య ప్లాన్ చేయడంతో ఈరోజు ఎపిసోడ్ ప్రారంభం అయింది. వీళ్లిద్దరి మధ్య చాలా సమయం పాటు సీక్రెట్‌గా సంభాషణ జరుగుతుంది. అప్పుడు డబ్బుల పంపకం గురించి ఇద్దరూ డీల్ చేసుకుంటూ ఉంటారు. ఆ సమయంలోనే నందూ అక్కడకు వస్తాడు. కానీ, వీళ్లిద్దరి మధ్యా జరిగిన చర్చను మాత్రం తెలుసుకోలేకపోతాడు. దీంతో లాస్య తప్పించుకుంది.

   తులసికి అండగా ఉంటానన్న అంజలి

  తులసికి అండగా ఉంటానన్న అంజలి

  తన ఇంటికి వచ్చిన అంజలితో తులసి మనసు విప్ప మాట్లాడుతుంది. ఈ క్రమంలోనే మంచి చెడు చర్చించుకుంటారు. అప్పుడు అంజలి.. తులసికి తన అన్న దగ్గర ఉద్యోగం చేయమని చెబుతుంది. కానీ, దీనికి ఆమె ఒప్పుకోదు. దీంతో ఆమె బాధ పడుతుంది. చివరకు ‘నీకు ఎలాంటి సహాయం కావాలన్నా నేను ఉన్నానని గుర్తు పెట్టుకో' అంటూ తులసికి అండగా నిలుస్తుంది.

   లాస్య కన్నింగ్ ప్లాన్.. బజారు మనిషి

  లాస్య కన్నింగ్ ప్లాన్.. బజారు మనిషి

  తులసి ఇంటికి అంజలి వచ్చిన విషయాన్ని భాగ్య ద్వారా తెలుసుకుంటుంది లాస్య. దీంతో ఎలాగైనా ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో తులసికి లాస్య ఫోన్ చేసి రోహిత్ గురించి చెడుగా మాట్లాడుతుంది. అప్పుడు ఆగ్రహించిన తులసి.. ‘బజారు వాళ్లలా పనులు చేసే వాళ్లకు అలాంటి ఆలోచనలే వస్తాయి. ఎవరు ఎలాంటి వాళ్లో అందరికీ తెలుసు' అంటూ ఫైర్ అయిపోతుంది.

  తులసి కీలక నిర్ణయం.. శృతి ఎంకరేజ్

  తులసి కీలక నిర్ణయం.. శృతి ఎంకరేజ్

  ఆర్థికంగా వృద్ధి చెందాలన్న లక్ష్యంతో కుట్టు మిషన్లతో ఏదైనా బిజినెస్ చేయాలని తులసి నిర్ణయించుకుంటుంది. ఇందుకోసం ఖర్చు ఎంత అవుతుందని లెక్కలు వేసుకుంటుంది. ఇంతలో శృతి ఆమె దగ్గరకు వస్తుంది. ఆ తర్వాత తులసి చేయాలనుకున్న దాని గురించి తెలుసుకుంటుంది. దీంతో ఈ నిర్ణయం తీసుకోవడంపై ఆమెను శృతి అభినందిస్తూ.. ఇంకా ఎంకరేజ్ చేస్తుంది.

   నెరవేరబోతున్న ప్రేమ్ చిరకాల కోరిక

  నెరవేరబోతున్న ప్రేమ్ చిరకాల కోరిక

  సంగీత దర్శకుడు అవ్వాలనుకున్న తన కలను నిజం చేసుకోవడంలో ప్రేమ్ ముందడుగు వేస్తాడు. ఈ విషయాన్ని తులసికి, శృతికి ఒకేసారి చెబుతాడు. ‘నాకు ఓ సీరియల్ టైటిల్ సాంగ్‌ కంపోజ్ చేసే అవకాశం వచ్చింది. దీంతో నా డ్రీమ్ నెరవేరబోతుంది' అంటూ సంతోషంగా చెబుతాడు. దీంతో తల్లి ఎంతగానో మురిసిపోతుంది. పక్కనే ఉన్న శృతి కూడా అతడికి కంగ్రాట్స్ చెబుతుంది.

  Jr NTR వదులుకున్న Blockbusters | Happy Birthday NTR || Filmibeat Telugu
   లాస్య పనిని అనుమానించిన నందూ

  లాస్య పనిని అనుమానించిన నందూ

  ఇక, ఆఫీస్‌లో శాలరీల గురించి జరిగిన రాద్దాంతంపై నందూ దీనంగా కూర్చుని ఆలోచిస్తుంటాడు. అంతలో లాస్య కూడా అక్కడకు వస్తుంది. ఆమె వచ్చీ రాగానే ‘ఏమైంది లాస్య. నువ్వు లెక్కలు కరెక్టుగానే చూశావా. ఇప్పుడు మనకు మనీ ప్రాబ్లం ఎందుకు వచ్చింది? ఇలా అయితే నష్టాలు తప్పవు' అని ఆమె పనిని అనుమానిస్తాడు. దీనికి లాస్య ఏదేదో చెప్పి తప్పించుకుంటుంది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 337: Nandhu Facing Financial Problems in Office. Tulasi plan to Start a Small Business. Prem Got Big Offer From TV Serial.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X