For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi June 5th Episode: తులసి విలువైన పేపర్లు మాయం.. లాస్య దెబ్బకు నందూ మైండ్ బ్లాక్

  |

  ఎంతో కాలంగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో రన్ అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మీ' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మీ' శనివారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో చూద్దాం పదండి!

  బీచ్‌లో బికినీతో రచ్చ చేస్తున్న సోఫీ చౌదరి

  శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. ఆఫీస్‌లో తనపై లాస్య చేస్తున్న కుట్రను నందూ కనుక్కోలేకపోతాడు. ఆ తర్వాత తులసి చిన్న వ్యాపారం ప్రారంభించాలని నిర్ణయించుకుంటుంది. అలాగే, ప్రేమ్‌కు మ్యూజిక్ డైరెక్టర్‌గా ఛాన్స్ వస్తుంది. తర్వాత అంజలి ఉద్యోగం ఆఫర్ చేసినా తులసి వద్దంటుంది. లాస్యకు తులసికి ఫోన్‌లో గొడవ జరుగుతుంది. నందూ లాస్యను అనుమానిస్తాడు.

  తులసి బడా ప్లాన్... అత్త అసూయ

  తులసి బడా ప్లాన్... అత్త అసూయ

  తులసి వ్యాపారం చేయాలని నిర్ణయించుకుంటుంది. అందుకు అనుగుణంగానే ప్లాన్లు రెడీ చేసుకుంటుంది. దీని గురించి మాట్లాడేందుకు అంజలికి ఫోన్ చేయగా.. ఆమె లిఫ్ట్ చేయదు. ఆ సమయంలోనే పక్కనే ఉన్న శృతితో వ్యాపారం గురించి చర్చిస్తుంది. అప్పుడే మామగారు కూడా వస్తాడు. దీంతో వాళ్లిద్దరికీ ప్లాన్‌ను వివరిస్తుంది. అప్పుడు అత్త వచ్చి తులసిని నిరాశ పరుస్తుంది.

  ఆస్పత్రి అనగానే అభిపై అంకిత ఫైర్

  ఆస్పత్రి అనగానే అభిపై అంకిత ఫైర్

  తన గర్భం గురించి అభికి ఎలా చెప్పాలా అని ధీనంగా ఆలోచిస్తూ ఉంటుంది అంకిత. ఈ సమయంలోనే అతడు అన్న మాటలన్నీ గుర్తు తెచ్చుకుని బాధ పడుతుంది. అప్పుడే అభి ఇంటికి వస్తాడు. డల్‌గా ఉన్న అంకితను చూసి ఏదో తేడాగా ఉందని గ్రహిస్తాడు. దీంతో ఆమెను పట్టుకుని చూసి ఆస్పత్రికి వెళ్దాం అంటాడు. అక్కడకు వెళ్తే నిజం తెలుస్తుందన్న ఆలోచనతో భర్తతో గొడవ పడింది.

   లాస్య దెబ్బకు నందూ మైండ్ బ్లాక్

  లాస్య దెబ్బకు నందూ మైండ్ బ్లాక్

  ఆఫీసులు ఉద్యోగులకు జీతాలు ఇవ్వాల్సి రావడంతో నందూ డబ్బుల కోసం ఎన్నో ఆలోచనలు చేస్తుంటాడు. ఇది లాస్య కన్నింగ్ ప్లాన్ అని తెలియక అప్పుల కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తుంటాడు. ఈ క్రమంలోనే ఇద్దరు స్నేహితులకు ఫోన్ చేసి డబ్బులు అడుగుతాడు. అందులో ఒకరు వడ్డీకి అయితేనే ఇస్తానని అంటారు. ఇంకొకరు బిజినెస్‌లో వాటా కావాలని అడుగుతారు.

  తులసికి సాయం చేస్తున్న అంజలి

  తులసికి సాయం చేస్తున్న అంజలి

  తులసి ఫోన్‌కు రెస్పాండ్ అవని అంజలి.. ఆ తర్వాత కాల్ బ్యాక్ చేస్తుంది. అప్పుడు తన వ్యాపారం గురించి ఆమెకు క్షుణ్ణంగా వివరిస్తుంది. దీంతో అంజలి ‘అప్పుడే పెద్ద బిజినెస్ చేస్తున్నట్లు మాట్లాడుతున్నావు. నాకు తెలిసిన ఓ వ్యక్తి ఉన్నారు. ఆయన నీలా చిన్న వ్యాపారాలు చేసే వారిని ప్రోత్సహిస్తారు. ఆయనతో మాట్లాడి నీకు సహాయం చేస్తాను' అంటూ ఆమెను ఎంకరేజ్ చేస్తుంది.

   తులసిపై మరో కుట్ర చేస్తున్న లాస్య

  తులసిపై మరో కుట్ర చేస్తున్న లాస్య


  భాగ్య ద్వారా తులసి చేస్తున్న పనులను గురించి తెలుసుకుంటుంది లాస్య. అదే సమయంలో నందూ పడుతోన్న ఇబ్బందుల గురించి ఇద్దరి మధ్య చర్చ జరుగుతుంది. అప్పుడు లాస్య ‘నేను ఇప్పటికే చాలా డబ్బులు వెనకేశాను. కానీ, నాకు కావాల్సింది ఇది కాదు. తులసిని ఒంటరిని చేయడమే. అందుకు ఆమె వ్యాపారాన్ని అడ్డుకోబోతున్నా' అంటూ మరో కుట్రను చేస్తుంది.

  Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
  తులసి విలువైన పేపర్లు మిస్సింగ్

  తులసి విలువైన పేపర్లు మిస్సింగ్

  అంజలి చెప్పిన వ్యక్తి దగ్గరకు వెళ్లే ముందు తన డిజైన్స్ అన్నీ గీసుకుని ఓ ఫైల్ రెడీ చేస్తుంది తులసి. అయితే, ఉదయం లేవగానే ఎంతో విలువైన ఆ పేపర్లు మాత్రం కనిపించవు. దీంతో తులసి, ఆమె మామగారు వాటి గురించి వెతుకుతూ కనిపిస్తారు. అప్పుడే అక్కడకు ఎంట్రీ ఇచ్చిన అనసూయ.. ‘నువ్వు ఎలా వ్యాపారం చేస్తావో చూస్తానే. అవి నేనే దాచా' అంటూ మనసులో అంటుంది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 338: Tulasi Planned to Meet Businessmen For her Small Startup. But Her Designs Are Missing in House. After That Nandhu Asked Money to his Friends.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X