Intinti Gruhalakshmi Today Episode: అంకితకు నిజం చెప్పిన దివ్య.. తులసి ఫ్యామిలీకి బెదిరింపులు

ఇండియాలోని అన్ని ఇండస్ట్రీల కంటే తెలుగు బుల్లితెపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి భారీ నుంచి అతి భారీ స్థాయిలో స్పందన దక్కుతుంది. సుదీర్ఘ కాలంలో ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' సోమవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరు కూడా ఓ లుక్కేయండి మరి!

Photos Courtesy: Star మా and Disney+Hotstar

శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

శనివారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. అంకితను ఇంటికి రానివ్వకుండా తీసుకున్న నిర్ణయంపై తులసి తనలో తాను బాధ పడుతుంది. ఆ తర్వాత తులసిని రోడ్డుపై ఆపిన లాస్య.. గొడవకు దిగుతుంది. నీ ఫ్యామిలీ ముక్కులు అవుతుందని బెదిరిస్తుంది. దీనికి తులసి కూడా సరైన విధంగానే సమాధానాలు చెబుతుంది.

ఇక, పార్టీలో నందూ చేసిన అవమానం గురించి ప్రేమ్ బాధ పడుతూ ఉంటాడు. అప్పుడు శృతి అతడికి ధైర్యం చెబుతుంది. కోట్ల డబ్బు వస్తుందని సంతోషిస్తోన్న అభిని పిలిచి.. తులసి కొన్ని విలువైన సలహాలు, సూచనలు ఇచ్చి జాగ్రత్త చెబుతుంది.

తులసి సలహా.. అభి అసహనం

తులసి సలహా.. అభి అసహనం

అభిని పిలిచిన తులసి 'నిన్ను నమ్మి మీ అత్త గారు నీకు పెద్ద బాధ్యతను అందించారు. ఆ నమ్మకాన్ని నువ్వు నిలబెట్టుకోవాలి. ఎదగడానికి నీకు మంచి అవకాశం వచ్చింది. జాగ్రత్తగా ఉండు' అంటుంది. దీనికి అభి ఎవరితో జాగ్రత్తగా ఉండమంటున్నావు మామ్ అంటాడు. అప్పుడామె పార్టీలు ఇచ్చి దగ్గరవ్వాలని చూస్తారు కదా వాళ్లతో అంటుంది. దీనికి అభి 'నువ్వు మాట్లాడేది డాడ్ గురించే కదా మామ్. ఇంటి నుంచి తరిమేసిన ప్రేమ్‌కు ఇలా ఎప్పుడైనా ఇలా పిలిచి మరీ సలహాలు ఇచ్చావా? ఇవ్వలేదు ఎందుకంటే నీకు వాడి మీద నమ్మకం' అని అసహనం వ్యక్తం చేస్తాడు.

నా మైండ్ మార్చాలని చూడకు

నా మైండ్ మార్చాలని చూడకు

అభి మాటలకు తులసి నీ చుట్టూ ఏం జరుగుతుందో నాకు తెలుసు అంటుంది. దీనికి అభి 'నన్ను ఇన్ ఫ్లూయెన్స్ చేయడానికి చూడకు మామ్. నా మైండ్‌ను పొల్యూట్ చేయకు మామ్ ప్లీజ్' అంటాడు. అప్పుడు తులసి 'నువ్వు కష్టపడి సంపాదించుకున్న డబ్బు నీ డబ్బు అయితే నువ్వు ఏమైనా చేసుకో. కానీ, నీ అత్త గారు నీ పేరు మీద పెట్టిన ఆస్తిని బాధ్యతగా కాపాడుకోవడం నీ వంతు.

ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. తప్పు జరిగినా నిన్ను వాళ్లు అవమానిస్తారు. నువ్వు ఎవరితో ఎలా ఉన్నా.. ఆస్తి విషయంలో మాత్రం జాగ్రత్త. ఏమాత్రం పొరపాటు జరిగినా అత్తారింట్లో నీకు ముఖం ఉండదు. అమ్మను కాబట్టి ఉండబట్టలేక నీకు చెప్పడానికి వచ్చాను. జాగ్రత్త పడు' అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. దీంతో అభి ఆలోచనలో పడతాడు.

నందూ, లాస్య హ్యాపీ.. భాగ్య వల్ల

నందూ, లాస్య హ్యాపీ.. భాగ్య వల్ల

ఆస్తి తమకు వచ్చేస్తుందని నందూ, లాస్య చాలా సంతోషంగా ఉంటారు. అభి, అంకిత వాళ్ల వలలలో పడ్డారని పాటలు పాడుకుంటూ డ్యాన్స్ చేస్తూ అంటారు. అదే సమయంలో భాగ్య అక్కడికి వస్తుంది. వాళ్లను ఆ పొజిషన్‌లో చూసి భాగ్య షాక్ అవుతుంది. వెళ్లి టీవీ ఆఫ్ చేస్తుంది భాగ్య. దీంతో డ్యాన్స్ చేస్తున్న నందూ, లాస్య ఆగిపోతారు. అప్పుడు లాస్య ఎందుకు టీవీ ఆఫ్ చేశావు అంటుంది. దీంతో భాగ్య ఏం సాధించారని మీరు డ్యాన్స్ చేస్తున్నారు అని అడుగుతుంది. దీనికి లాస్య మా బిజినెస్ కోసం కావాల్సిన పెట్టుబడిని సాధించాం అని సమాధానం చెబుతుంది.

వాళ్లిద్దరనీ రెచ్చగొట్టేసిన భాగ్య

వాళ్లిద్దరనీ రెచ్చగొట్టేసిన భాగ్య

లాస్య మాటలకు భాగ్య 'మీరు ఇక్కడ డ్యాన్స్ చేయడం కాదు లాస్య.. అక్కడ అభితో తులసి డ్యాన్స్ చేపిస్తోంది. అర్జెంట్‌గా మాట్లాడాలని అభిని పిలిపించుకొని బ్రెయిన్ వాష్ చేసింది. మీరేంటో.. మీరేం చేయాలనుకుంటున్నారో సినిమా వేసి మరీ అభీకి చూపించింది' అని చెబుతుంది. అంతేకాదు లాస్యకు ఏవేవో సీక్రెట్స్‌ను కూడా చెప్పి 'ఆలు లేదు చూలు లేదు కానీ మీరేమో ఎవరెస్ట్ శిఖరం మీద జెండా పాతినట్టుగా సంబరాలు చేసుకుంటున్నారు. తులసక్క డైరెక్ట్‌గా రంగంలోకి దిగిందంటే.. వార్ తప్పదు. మనం కూడా జాగ్రత్త పడితే మంచిది. బావ గారికి విడాకులు ఇచ్చినా ఇంకా తన ప్రాపర్టీనే అని అనుకుంటుందేమో' అని రెచ్చగొడుతుంది.

 తులసి ఇంటికి నందూ, లాస్య

తులసి ఇంటికి నందూ, లాస్య

భాగ్య మాటలకు కోపంతో రగిలిపోయిన నందూ, లాస్య.. తులసి ఇంటికి వెళ్తారు. వెళ్లడమే నందూ 'అసలు నువ్వు ఏమనుకుంటున్నావు? మమ్మల్ని రోడ్డుకు లాగుదామనుకుంటున్నావా? నాటకాలు ఆడకు' అంటూ కోప్పడతాడు. దీంతో తులసి 'నా పరిస్థితే బాగోలేదు.. మిమ్మల్ని రోడ్డు మీదికి లాగేంత ఓపిక నాకు లేదు' అంటుంది. అప్పుడే అక్కడకొచ్చిన అనసూయ 'బీపీ పెరిగినప్పుడల్లా వాడికి ఈ ఇల్లు గుర్తొస్తుందా? జీవితంలో తులసి చేసిన తప్పు ఒక్కటే.. నిన్ను నమ్మి ప్రేమించి పెళ్లి చేసుకోవడం. ఎలాగూ ఆ తప్పుకు శిక్ష అనుభవిస్తుంది కదా' అని అంటుంది. దీనికి నందూ 'ఇంట్లో ప్రతి వాళ్లను నీ గుప్పిట్లో పెట్టుకొని ఆడిద్దామనుకుంటున్నావా? నా పిల్లలను నాకు దూరం చేద్దామనుకుంటున్నావా' అని ప్రశ్నిస్తాడు.

హెచ్చరించిన నందూ, లాస్య

హెచ్చరించిన నందూ, లాస్య

కోపంతో ఉన్న నందూ అభి నా మాట వింటే చెడిపోతాడా అని అంటాడు. దీనికి పరందామయ్య 'ఖచ్చితంగా చెడిపోతాడు. నేనే అభికి నీ గురించి చెప్పమని చెప్పా' అంటాడు. అప్పుడు తులసి 'మీరు మా విషయంలో నాకు అడ్డు పడకండి. నా గురించి అభికి మీరు చెప్పాల్సింది చెప్పుకోండి.. మీ గురించి నేను చెప్పాల్సింది చెబుతాను. నిర్ణయం వాడిది' అంటుంది. అప్పుడు పరందామయ్య 'అమ్మ లాస్య.. నువ్వు కూడా వాడిని అనవసరంగా రెచ్చగొట్టకు' అంటాడు. దీంతో లాస్య 'వీళ్లకు మాటలతో చెప్పి లాభం లేదు నందూ. చెయ్యాల్సింది చేసి చూపిద్దాం పదా' అని అతడిని అక్కడి నుంచి తీసుకుని వెళ్లిపోతుంది.

అంకితకు తెలిసిపోయిన నిజం

అంకితకు తెలిసిపోయిన నిజం

ఇంట్లో గొడవ జరగడంతో దివ్య.. అంకితకు ఫోన్ చేస్తుంది. అప్పుడామె 'చదువుకున్న నీకన్నా చదువు లేని మామ్ చాలా నయం. డాడ్ అంటే ఎంత ప్రేమ ఉన్నా.. ఆయన తప్పులను ఎత్తి చూపించింది. నువ్వు మాత్రం అన్నయ్యను గాలికి వదిలేశావు. తప్పులు చేస్తున్నాడని తెలిసినా పట్టించుకోవడం లేదు ఎందుకు' అని ప్రశ్నిస్తుంది. ఆ తర్వాత తులసి.. అంకితను ఇంటికి ఎందుకు రావొద్దు అన్నదో అంకితకు నిజం చెప్పేస్తుంది దివ్య. దీంతో ఆమె ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఆ తర్వాత కోపంగా వెళ్లి తల్లితో గొడవ పడుతుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X