Intinti Gruhalakshmi: అడ్డంగా దొరికిన దివ్య.. లాస్య భర్తను దింపాలని.. నందూ, తులసికి పెళ్లి అంటూ!

చాలా ఏళ్లుగానే తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రం ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' మంగళవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!

Photos Courtesy: Star మా and Disney+Hotstar

Intinti Gruhalakshmi Serial Today Episode June 6th 2023

సోమవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే: సోమవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. తులసితో పాటు జైలుకు వచ్చిన దివ్యను ఇకపై తన దగ్గరకు రావొద్దని, ఈ కేసు విషయంలో జోక్యం చేసుకోవద్దని నందూ చెప్తాడు. దీనికి తగ్గట్లుగానే తులసి కూడా మాట్లాడుతుంది. దీంతో దివ్య బాధ పడుతూ ఇంటికి వెళ్తుంది.

అప్పుడే అక్కడ విక్రమ్ అమ్మ నీకోసం లాయర్‌ను తీసుకొస్తే ఎక్కడికి వెళ్లావు అని ఆమెను నిలదీస్తాడు. అప్పుడు దివ్య ఆ లాయర్‌కు ఏమీ తెలియదని అందరి ముందే నిరూపిస్తుంది. తర్వాత విక్రమ్ ఆమె దగ్గరకు వెళ్లి మాట్లాడగా.. క్లాస్ పీకుతుంది. అసలు ఏం జరుగుతుందో ముందు తెలుసుకో అని అంటుంది.

Intinti Gruhalakshmi Serial Today Episode June 6th 2023

తల్లికి బాధ చెప్పుకున్న తులసి: జైలుకు వెళ్లి వచ్చే సరికి ఇంట్లో ఉన్న తల్లిని చూసి తులసి హత్తుకుని ఏడుస్తుంది. అప్పుడు 'నా కన్న కూతుర్ని నా మాటలతో ఇబ్బంది పెట్టాను. తను నన్ను తప్పుగా అనుకుంటుందేమో' అని దివ్య గురించి చెప్పి బాధ పడుతుంది.

దీంతో సరస్వతి 'తను ఎందుకు అలా అనుకుంటుంది? పాతికేళ్ళు పెంచి పెద్ద చేశావు. నువ్వు ఎలాంటి దానివో దానికి తెలుసు కదా' అని ఓదార్చుతుంది. అప్పుడు అనసూయ 'అయినా తనను ఎప్పుడు ఏమీ అనవు కదా. తనను బాధపెట్టే అంతగా తప్పు ఏం చేసింది' అని ప్రశ్నిస్తుంది.

ఇంట్లో వాళ్లకు నిజం చెప్పింది: అనసూయ అడగ్గానే తులసి 'వాళ్ల నాన్న అరెస్టు అయిన దగ్గర నుంచి దివ్య మనసు ఇక్కడే తిరుగుతుంది. దాన్ని అడ్డం పెట్టుకొని ఆ ఇంట్లో వాళ్ళు దాంతో ఆడుకుంటున్నారు. మీ కూతురు చెప్పిన మాట వినటం లేదు అంటూ నాకే కంప్లైంట్ చేశారు. అందుకే దానిని దూరం పెట్టాలని తనని బాధపెట్టేలాగా మాట్లాడాను' అని నిజం చెబుతుంది. ఇది విన్న తర్వాత అనసూయ, సరస్వతి కలిసి తులసికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తారు.

Intinti Gruhalakshmi Serial Today Episode June 6th 2023

విక్రమ్ ముందు తల్లి నాటకం: రాజ్యలక్ష్మి భోజనం తీసుకుని వచ్చి విక్రమ్‌తో 'మీ ఆవిడ నామీద కోపంతో భోజనం చేయలేదు. నాకు తన మీద కోపం లేదు. తనకు ఈ ఇంట్లో నేను తల్లి స్థానంలో ఉన్నాను. మంచి చెడు చెప్పే బాధ్యత ఉంది. అంత మాత్రాన తనంటే నాకు ఇష్టం లేకుండా పోతుందా? అలిగి భోజనం మానేస్తే చూస్తూ ఎలా ఊరుకుంటాను?

వెళ్లి మీ ఆవిడకి తినిపించు' అని నాటకం ఆడుతుంది. దీంతో విక్రమ్ 'ఇప్పుడు తనకు భర్త ప్రేమ కన్నా తల్లి ప్రేమే అవసరం. దయచేసి నువ్వే తినిపించు' అంటాడు. దీనికి రాజ్యలక్ష్మి అలాగే నాన్న దానికి నువ్వు బ్రతిమాలటం ఎందుకు అంటుంది.

Intinti Gruhalakshmi Serial Today Episode June 6th 2023

అపార్థం చేసుకుున్న విక్రమ్: విక్రమ్ అడగడంతో రాజ్యలక్ష్మి ప్లేట్ తీసుకెళ్లి దివ్యతో 'నామీద పెత్తనం చేయాలని చూస్తే ఇలాగే ఉంటుంది. చచ్చినట్లు నేను చెప్పినట్లు విను' అని కోప్పడుతుంది. అయితే, వాళ్లను విక్రమ్ గమనిస్తున్నాడని గ్రహించి వెంటనే నాటకం మొదలెడుతుంది. నవ్వుతూ మాట్లాడినట్లు నటిస్తూ.. తిడుతుంటుంది. దీంతో దివ్య ఆమె చేతిని నెట్టేస్తుంది. అది చూసిన విక్రమ్ 'అమ్మ అంతలా ప్రేమ చూపిస్తుంటే దివ్య మరి ఎక్కువ చేస్తుంది' అనుకుంటాడు.

Intinti Gruhalakshmi Serial Today Episode June 6th 2023

వాడు బలిచ్చే మేక అంటూ: విక్రమ్ చూస్తున్నాడని గ్రహించిన రాజ్యలక్ష్మి.. దివ్యను మరింతగా రెచ్చగొట్టాలని అనుకుంటుంది. ఆ వెంటనే 'నీ మొగుడు ఒక పిచ్చోడు రేపు మాపో బలివ్వబోయే మేక' అంటుంది. దీంతో దివ్య కోపంతో రాజ్యలక్ష్మి చేతిలో ఉన్న అన్నం ప్లేట్ విసిరేస్తుంది. అది చూసిన విక్రమ్ అక్కడకు దివ్యపై కోప్పడతాడు. దీంతో రాజ్యలక్ష్మి సర్ది చెప్పినట్లు యాక్ట్ చేస్తుంది. తర్వాత వీళ్లిద్దరి మధ్య దూరం పెరుగుతుందని సంతోషిస్తుంది.

Intinti Gruhalakshmi Serial Today Episode June 6th 2023

తులసి, నందూను కలపాలని: అనసూయ 'ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య చిక్కుల్లో పడేస్తే.. మాజీ భార్య రక్షించాలని చూస్తుంది. ఇదేమి చిత్రమో' అని సరస్వతితో అంటుంది. అప్పుడామె 'నా కూతురు అంతే సాయం చేయాలనిపిస్తే తన పర భేదం చూపించకుండా చేస్తుంది' అంటుంది.

దీనికి అనసూయ 'నందూ.. లాస్యకు విడాకులు ఇచ్చేసేలాగా ఉన్నాడు. తులసితో తెగిపోయిన బంధాన్ని మళ్లీ ముడి పెడితే బాగున్ను' అంటుంది. దీంతో సరస్వతికి కోపం వచ్చి 'అది జరగని పని.. నా కూతురు కొన్ని విషయాల్లో ఎంత సౌమ్యంగా ఉంటుందో.. కొన్ని విషయాల్లో అంత మొండిగానూ ఉంటుంది. ఈ విషయంలో లేనిపోని అసలు పెట్టుకోవద్దు' అని చెబుతుంది.

లాస్య భర్తను తీసుకు వచ్చి: తర్వాత తులసి 'ఇన్నాళ్లు మనకు లాస్యతోనే సమస్యలు.. ఇప్పుడు రాజ్యలక్ష్మి కూడా తోడైంది. వాళ్లు వాళ్లు ఒకటయ్యే బలం పంచుకున్నారు' అని దీపక్‌తో చెప్తుంది. దీంతో అతడు 'ఇప్పుడు మనం చేయవలసింది కూడా అదే అక్క. లాస్యకు శత్రువులు ఎవరో కనుక్కోవాలి' అంటాడు.

దీనికి తులసి 'లాస్య మాజీ భర్తకు లాస్య అంటే పీకల వరకు కోపం ఉంది. ఆమె గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తి అతనే' అంటుంది. అప్పుడు దీపక్ 'మరి అతడు కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్తాడా? అతనిని ఒప్పించే అంత చనువు నీకు ఉందా' అని అడుగుతాడు. దీంతో తులసి ఉంది అని సమాధానం చెబుతుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X