For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi June 7th Episode: లాస్య ప్లాన్‌తో తులసికి భారీ షాక్.. ఇంట్లో ఆమెకు ఘోర అవమానం

  |

  ఎంతో కాలంగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో రన్ అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మీ' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మీ' సోమవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో చూద్దాం పదండి!

  శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  శనివారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. తులసి వ్యాపారం కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది. అయితే, ఆమె గీచిన డిజైన్స్ అన్నింటినీ అనసూయ మాయం చేస్తుంది. ఇక, లాస్య డబ్బుల కోసం చేసిన మోసం వల్ల నందూ తీవ్ర ఇబ్బందులు పడుతుంటాడు. అతడికి ఎవరూ అప్పు కూడా ఇవ్వరు. మరోవైపు, తన గర్భం గురించి తెలిసిపోతుందేమోనని అంకిత, అభితో గొడవ పడుతుంది.

  మిస్సైన ఫైల్స్‌ను తీసుకొచ్చిన శృతి

  మిస్సైన ఫైల్స్‌ను తీసుకొచ్చిన శృతి

  గార్మెంట్ డీల్ కోసం తులసి డిజైన్ చేసిన ఫైల్స్ కనిపించకుండా పోవడంతో అందరూ కంగారు పడుతుంటారు. దీంతో అక్కడే ఉన్న అనసూయను వాటి గురించి అడగగా.. ఆమె తడబడుతూనే కోప్పడుతుంది. అంతలో వాటిని శృతి అక్కడకు తీసుకొని వస్తుంది. ఇవి ఎక్కడ దొరికాయని అంతా అడడగా.. తులసి ఆంటీ రూమ్‌లోనే ఉన్నాయని చెబుతుంది. దీంతో అంతా ఊపిరి పీల్చుతారు.

   నిజం దాచి అనసూయను కాపాడి

  నిజం దాచి అనసూయను కాపాడి

  వాస్తవానికి తులసి డిజైన్ల ఫైల్‌ను అనసూయనే మాయం చేస్తుంది. దాన్ని ఆమె ఎలా తీసింది? ఎక్కడ దాచింది? అనే దానిని ఈరోజు ఎపిసోడ్‌లో చూపించారు. అనసూయ ఫైల్ తీయడాన్ని శృతి గ్రహిస్తుంది. అంతేకాదు, ఆమె వాటిని ఎక్కడ దాచిందో కూడా తెలుసుకుంటుంది. అందుకే ఆ ఫైల్స్‌ను తీసుకొని వస్తుంది. అయితే, ఈ విషయాన్ని మాత్రం శృతి ఎవరికీ చెప్పకుండా ఉంటుంది.

  ప్రెగ్నెన్సీపై అంకితకు అభి వార్నింగ్

  ప్రెగ్నెన్సీపై అంకితకు అభి వార్నింగ్


  తాను ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని అభికి చెప్పాలని భావిస్తోన్న అంకిత వేరే ప్లాన్ వేస్తుంది. ఇందులో భాగంగానే భర్త దగ్గరకు వచ్చి తన ఫ్రెండ్ ప్రెగ్నెంట్ అని.. అబార్షన్ చేయించుకోవాలని అనుకుంటుంది అని.. దీనిపై సలహా ఇవ్వమని కోరుతుంది. దీంతో అభి దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. ఒక ప్రాణాన్ని తీసే హక్కు ఎవరికీ లేదని చెబుతూనే.. ఆ ఫ్రెండ్‌కు దూరంగా ఉండమంటాడు.

   లాస్య ప్లాన్‌తో తులసికి ఎదురుదెబ్బ

  లాస్య ప్లాన్‌తో తులసికి ఎదురుదెబ్బ

  గార్మెంట్ డీల్ కోసం తులసి ఇంటర్వ్యూకు వెళ్తుంది. అక్కడ కంపెనీ హెడ్ ‘మీతో పాటు ఇంకొకరు కూడా వచ్చారు. ఇద్దరిలో ఎవరి డిజైన్స్ బాగుంటే వాళ్లకే ఛాన్స్ ఇస్తాం' అని చెబుతాడు. ఆ తర్వాత ఇద్దరివి చూస్తాడు. అప్పుడు తులసివి పాతగా ఉన్నాయని.. ఆమెకు పోటీగా వచ్చిన అమ్మాయివి మాత్రం ట్రెండీగా ఉన్నాయని చెబుతాడు. ఆ తర్వాత తులసిని కాదని ఆమెకు ఛాన్స్ ఇస్తాడు.

  లాస్యకు భారీ ఝలక్ ఇచ్చిన తులసి

  లాస్యకు భారీ ఝలక్ ఇచ్చిన తులసి


  డీల్ రాలేదని బాధగా ఇంటికొస్తున్న తులసికి లాస్య కలుస్తుంది. ఆ ఆఫీస్‌లో జరిగిన విషయాలన్నీ తనకు తెలుసని చెబుతూ.. ‘నీకు పోటీగా వచ్చిన అమ్మాయిని పంపించింది నేనే. నీకు ఏదీ దక్కనివ్వకూడదనే ఇలా చేశా' అంటూ షాకిస్తుంది. అప్పుడు తులసి ‘నువ్వు నాకు భయపడబట్టే ఇలా చేశావ్. దానికి నేను బాధపడను. గర్వంగా ఫీల్ అవుతా' అంటూ ఝలక్ ఇచ్చింది.

  ఇంట్లో తులసికి ఘోర అవమానం

  ఇంట్లో తులసికి ఘోర అవమానం

  ఇంటర్వ్యూలో నిరాశ.. లాస్యతో గొడవతో చికాకుగా ఉన్న తులసి ఇంటికి చేరుతుంది. అప్పుడంతా ఏమైందని అడగగా.. అక్కడ జరిగింది చెబుతుంది. అంతలో అనసూయ వచ్చి ఆమెను మరింత బాధ పెడుతుంది. అప్పుడు ప్రేమ్ అడ్డు పడగా.. ‘అసలు మీ అమ్మకు ఏమొచ్చని రోహిత్ ఉద్యోగం ఇచ్చాడురా. నువ్వే ఆలోచించు' అంటూ తులసిని దారుణంగా అవమానించే ప్రయత్నం చేస్తుంది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 339: Tulasi Went Interview for Business Deal. But She Not succeeded. After That Lasya Told her Plan to Tulasi.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X