Intinti Gruhalakshmi: విక్రమ్ తండ్రిపై హత్యాయత్నం.. నందూ కేసు రీ ఓపెన్.. దివ్యకు దెబ్బ మీద దెబ్బ

ఎన్నో భాషలతో పోల్చుకుంటే తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రం ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' బుధవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!

Photos Courtesy: Star మా and Disney+Hotstar

Intinti Gruhalakshmi Serial Today Episode June 7th 2023

మంగళవారం ఎపిసోడ్‌లో జరిగిందిదే: మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. జైలులో దివ్యను తిట్టిన తర్వాత తులసి తనలో తాను బాధ పడుతుంది. దీంతో ఆమెను అనసూయ, సరస్వతి ఓదార్చుతారు. ఆ తర్వాత నందూ, తులసిని మళ్లీ కలపాలని అనసూయ అనగానే సరస్వతి సీరియస్ అవుతుంది.

ఇక, దివ్యను ప్లాన్ ప్రకారం విక్రమ్ ముందు రాజ్యలక్ష్మి ఇరికిస్తుంది. దీంతో అతడు భార్యపై అసహనం వ్యక్తం చేస్తాడు. అంతేకాదు, అసహ్యించుకుంటూ వెళ్లిపోతాడు. ఆ తర్వాత నందూ కేసును రీ ఓపెన్ చేయించేందు కోసం లాస్య మాజీ భర్తను తీసుకు రావాలని తులసి ప్లాన్ చేసుకుంటుంది.

Intinti Gruhalakshmi Serial Today Episode June 7th 2023

దీపక్ సలహా.. మోహన్‌కు కాల్: లాస్య భర్త గురించి చెప్పిన వెంటనే దీపక్.. మోహన్‌కు కాల్ చేయమని సలహా ఇస్తాడు. దీంతో తులసి మోహన్‌కు కాల్ చేసి 'అన్నయ్యా.. మీ బావగారిని జైలు నుంచి విడిపించడానికి బ్రహ్మాస్త్రం దొరికింది. రేపే కేసు రీ ఓపెన్ చేయించండి' అని అంటుంది. దీంతో మోహన్ 'కేసు రీ ఓపెన్ చేయించడం పెద్ద విషయం కాదమ్మా. కేసు ఓపెన్ చేయించిన తర్వాత మన దగ్గర సరైన సాక్ష్యాధారాలు లేక చేతులు ఎత్తేస్తే మళ్లీ మనం కేసును రీ ఓపెన్ చేయించలేం.

ఐదేళ్ల పాటు ఆగాల్సిందే. ఆ తర్వాత ఏం చేసినా మనం బావను జైలు నుంచి తీసుకుని రాలేం' అని అంటాడు. దీంతో తులసి 'అలాంటి భయం అవసరం లేదు అన్నయ్యా.. సాక్ష్యం తీసుకుని వచ్చే బాధ్యత నాది' అంటుంది. దీంతో దీపిక్‌ను కూడా తన వెంట రమ్మని అడుగుతుంది.

Intinti Gruhalakshmi Serial Today Episode June 7th 2023

బసవయ్యతో కలిసి మరో ప్లాన్: దివ్యకు చుక్కులు చూపిస్తుండడంతో రాజ్యలక్ష్మిపై బసవయ్య ప్రశంసల వర్షం కురిపిస్తాడు. 'అద్భుతం అక్కా.. ఆ దివ్యకు దెబ్బ మీద దెబ్బ కొడుతున్నావు. ప్రస్తుతం నీ ట్రాక్‌ నడుస్తుంది. నువ్వు ట్రాక్ మీద ఉన్నప్పుడే తొందరపడాలి. విక్రమ్‌కు దివ్యను దూరం చేస్తున్నావు. లాస్యను అడ్డుపెట్టుకుని నందూను జైలుకి పంపావు.

ఇదే ఫ్లో‌లో వెళ్లిపో తగ్గొద్దు. ఊపు తగ్గకముందే దెబ్బ మీద దెబ్బ కొట్టు' అంటాడు. దీంతో రాజ్యలక్ష్మి 'ఇప్పుడు దెబ్బ కొట్టాల్సింది నేను కాదు తమ్ముడూ నువ్వు' అంటూ ఒక ప్లాన్‌ను అతడికి సైలెంట్‌గానే చెబుతుంది. దీంతో ఓకే అనేస్తాడు.

తులసి ఫోన్.. పుణ్య కార్యానికి: నందూ కేసును రీ ఓపెన్ చేయించేందుకు తులసి ఎవరికో ఫోన్ చేస్తూ ఉంటుంది. కానీ, అవతలి పర్సన్ కాల్ లిఫ్ట్ చేయడు. అలా చాలా సార్లు ట్రై చేసిన తర్వాత అతడు మాట్లాడతాడు. దీంతో తులసి సంతోషిస్తుంది. తర్వాత అనసూయతో 'నేను బయటకు వెళ్తున్నాను.

తిరిగి రావడానికి ఆలస్యం అవుతుంది. టైంకు భోజనం చేసేయండి మందులు వేసుకోండి' అని చెప్తుంది. దీనికామె 'ఇంత హడావిడిగా వెళ్తున్నావు ఎక్కడికమ్మా' అని ప్రశ్నిస్తుంది. దీంతో తులసి 'ఓ పుణ్య కార్యానికి వెళ్తున్నాను.. అది ఏంటనేది ఇప్పుడు అడగొద్దు.. పనయ్యాక చెప్తా' అంటుంది.

Intinti Gruhalakshmi Serial Today Episode June 7th 2023

దివ్యను మళ్లీ తిట్టిన తులసి: తులసి అలా బయలుదేరుతుండగా దివ్య ఫోన్ చేస్తుంది. కాల్ లిఫ్ట్ చేసిన వెంటనే అమ్మా నేను దివ్యను అనగానే.. హా తెలుస్తుంది.. ఏంటో చెప్పు అని కసురుకుంటుంది. దీంతో ఎందుకంత సీరియస్‌గా మాట్లాడుతున్నావ్ అనగా.. నాకు పని ఉంది త్వరగా చెప్పు అంటుంది. అప్పుడు దివ్య 'నేను ఒక్కపూట ఫోన్ చేయకపోతే అల్లాడిపోయేదానివి.

కానీ ఇప్పుడు నేను ఫోన్ చేస్తున్నా మాట్లాడటం లేదు.. నన్ను పలకరించడానికి కూడా టైం లేకుండా పోయిందా? నాన్నను చూడ్డానికి వచ్చిన నన్ను ఇష్టం వచ్చినట్టు తిట్టావు. తర్వాత నేను ఏమైపోయానో పట్టించుకున్నావా? పలకరించావా' అని ప్రశ్నిస్తుంది. ఈ మాటలకు బాధ పడినా తులసి మాత్రం పైకి కఠినంగానే మాట్లాడుతుంది. అలా కాసేపు మాట్లాడి కాల్ కట్ చేస్తుంది.

నీ కూతురు అలాగే అవ్వాలా: కూతురిని తిట్టి కాల్ కట్ చేసిన తర్వాత తులసి ఎంతగానో బాధ పడుతూ ఏడుస్తుంది. దీంతో ఆమెకు అనసూయ క్లాస్ పీకుతుంది. దీంతో తులసి 'నేను ఇలా చెప్పకపోతే మొండికేస్తుంది' అని అంటుంది. అప్పుడే అక్కడకు వచ్చిన దీపక్ ఏమైంది అక్కా అని అడుగుతాడు.

దీనికామె 'ఏం లేదు తమ్ముడూ.. దివ్యను బాధపెట్టేట్టు మాట్లాడాను' అని ఏడుస్తుంది. దీంతో దీపిక్ 'నీకు బాధపడటం అలవాటే.. అది దివ్యకు కూడా అలవాటు చేస్తున్నావా? నీలాగే బతకమంటున్నావా' అంటూ అక్కను నిలదీస్తాడు. దీంతో తులసి సమాధానం చెప్పకుండా వెళ్దాం అంటుంది.

Intinti Gruhalakshmi Serial Today Episode June 7th 2023

విక్రమ్ తండ్రిపై హత్యాయత్నం: రాజ్యలక్ష్మి ప్లాన్ ప్రకారం విక్రమ్ తండ్రిని బసవయ్య మెట్లపై నుంచి పడిపోయేట్టు తోసేస్తాడు. అయితే, దివ్య చివరి నిమిషంలో వచ్చి కాపాడుతుంది. కానీ, ఆమెనే విక్రమ్ తండ్రిని బయటకు తీసుకుని వచ్చి హత్యాయత్నం చేసిందని రాజ్యలక్ష్మి నానా మాటలు అంటుంది.

ఆ సమయంలో దివ్య ఏం చెప్పాలనుకున్న వినిపించుకోదు. దీంతో విక్రమ్ ఆ మాటలనే నిజం అనుకుని నమ్మేస్తాడు. అప్పుడు ఆమెను అసహ్యించుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. తర్వాత దివ్య ఏం చెప్పినా వినిపించుకోడు.

వాళ్లు అలా.. లాస్య ఇలా: నందూను చూసేందుకు పరందామయ్య, అనసూయ జైలుకు వెళ్తారు. అప్పుడు అతడు బాధ పడుతూ మాట్లాడడంతో వాళ్లు కూడా డీలా పడిపోతారు. అంతలోనే తులసి కేసును రీ ఓపెన్ చేయిస్తుందని తెలుసుకుంటుంది. దీంతో తనలో తాను టెన్షన్ పడుతుంది. అప్పుడే ఆమెకు లక్కీ ఫోన్ చేసి ఇంటికి వస్తానని అంటాడు. కానీ, లాస్య కుదరదు అని చెప్తుంది. దీంతో లక్కీ 'అయితే నేను తులసి ఆంటీ ఇంటికి వెళ్తాను' అని అంటాడు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X