For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi June 9th Episode: మోసం చేసేది ఎవరో కనిపెట్టిన నందూ.. ఆమె అలా చేయడం తట్టుకోలేక!

  |

  చాలా కాలంగా తెలుగు టెలివిజన్‌లో ప్రసారం అయ్యే సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో రన్ అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మీ' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మీ' బుధవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో చూద్దాం పదండి!

  ఆచ్చాదన లేకుండా ఎద అందాలను బయట పెట్టేసిన పూజా హెగ్డే

   మంగళవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  మంగళవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. స్టెల్లా తెచ్చిన డిజైన్స్ కాపీ కొట్టినవి అని గ్రహించిన కంపెనీ.. తులసికి డీల్ ఇస్తున్నట్లు చెబుతుంది. నందూ జీతాలు ఇవ్వడానికి తన లాభాలను ఇచ్చేస్తానని చెప్పి ఫ్రెండ్ దగ్గర అప్పు చేస్తాడు. ఆ తర్వాత లాస్యకు స్టెల్లా కంపెనీలో జరిగిన విషయం చెబుతుంది. ఇక, భాగ్య.. లాస్యను పలు రకాలుగా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది.

   తులసి అక్క అనుకుంటే జరిగిపోతుంది

  తులసి అక్క అనుకుంటే జరిగిపోతుంది

  ఫోన్‌లో మాట్లాడిన విధంగానే నందూ.. తన స్నేహితుడితో అగ్రిమెంట్ చేసుకోవడంతో ఈరోజు ఎపిసోడ్ ప్రారంభం అవుతుంది. అది అలా జరుగుతుండగా.. భాగ్య, లాస్య మధ్య సంభాషణ ఉంటుంది. ఇందులో భాగ్య మాట్లాడుతూ.. ‘తులసి అక్క అనుకుంటే సాధిస్తుంది. ఆమె ఏదైనా అనుకుంటూ అయ్యే వరకూ నిద్రపోదు' అని చెబుతుంది. ఆ మాటలను లాస్య మాత్రం లైట్ తీసుకుంటుంది.

  ఇంట్లో బిజినెస్ మొదలు పెట్టిన తులసి

  ఇంట్లో బిజినెస్ మొదలు పెట్టిన తులసి

  కాంట్రాక్ట్ తనకు రావడంతో తులసి ఇంట్లోనే మూడు కుట్టు మిషన్లతో బిజినెస్ మొదలు పెడుతుంది. ముందుగా పూజా చేసుకున్న ఆమె.. ఇంట్లో అందరి నుంచి విషెస్‌ను అందుకుంటుంది. ఆ సమయంలోనే కొత్త బట్టలను అత్తగారికి ఇచ్చి ఆశీర్వదించమని అడుగుతుంది. దీంతో అనసూయ మనసులో తిట్టుకుంటూనే పైకి కోడలిని ఆశీర్వదిస్తుంది. దీంతో పనులు మొదలు పెడుతుంది.

  మోసం చేసే వాళ్లను కనిపించిన నందూ

  మోసం చేసే వాళ్లను కనిపించిన నందూ

  ఫ్రెండ్‌తో అగ్రిమెంట్ చేసుకున్న నందూ రాత్రి సమయంలో ఫుల్లుగా తాగి ఇంటికి వస్తాడు. వచ్చి రావడమే లాస్య లాస్య అంటూ గట్టిగా అరుస్తాడు. అప్పుడు ‘అందరికీ జీతాలు ఇచ్చేశాను. ఎంతో మంచి కాంట్రాక్ట్.. ఇలా లాభం లేకుండా చేయాల్సి వచ్చింది. అయినా నాతోనే ఉంటూ నన్ను మోసం చేసేది ఎవరో కనిపెట్టేశా. అది ఎవరో కాదు నేనే' అంటూ సస్పెన్స్‌గా ఉంచి షాకిచ్చాడు నందూ.

  తులసి అలా చేయడం తట్టుకోలేని భర్త

  తులసి అలా చేయడం తట్టుకోలేని భర్త

  తన మోసాన్ని గుర్తిస్తాడేమోనని భయపడిపోయిన లాస్య.. ఆ తర్వాత ఊపిరి పీల్చుకుంటుంది. అనంతరం తులసి వ్యాపారం చేయడాన్ని తట్టుకోలేని నందూ.. ఆ బాధనంతా లాస్యతో పంచుకుంటాడు. ‘నేనేమో లాభం లేకుండా ఆఫీస్ నడుపుతున్నా.. తులసి మాత్రం సొంతంగా వ్యాపారం మొదలెట్టింది' అంటాడు. అప్పుడు లాస్య అతడిని ఓదార్చే ప్రయత్నం చేస్తుంది.

   నిద్ర కూడా పోకుండా కష్టపడిన తులసి

  నిద్ర కూడా పోకుండా కష్టపడిన తులసి

  వ్యాపారం మొదలు పెట్టిన మొదటి రోజే చెమటలు చిందించేలా కష్ట పడుతుంది తులసి. దీంతో ఓ బ్యాగ్రౌండ్ సాంగ్‌తో కాసేపు ఆమె పని చేయడాన్ని చూపిస్తారు. ఇక, రాత్రైనా నిద్ర పోకుండా వర్క్ చేస్తూనే ఉంటుంది తులసి. దీంతో శృతి అక్కడకు వచ్చి ‘పని చేసింది చాలు.. చాలా సమయం అయింది. ఇంక పడుకోండి ఆంటీ' అంటుంది. కానీ, తులసి మాత్రం పని చేసుకుంటూ ఉంటుంది.

  కళ్లు తిరిగి పడిపోయిన అంకిత... తిట్లు

  కళ్లు తిరిగి పడిపోయిన అంకిత... తిట్లు

  ఇంట్లో ఫోన్ మాట్లాడుతూ తిరుగుతున్న అంకిత.. ఒక్కసారిగా కళ్లు తిరిగి పడిపోతుంది. దీంతో ఆమె పేరెంట్స్ డాక్టర్‌ను పిలుస్తారు. అప్పుడు అంకితను చెక్ చేసిన డాక్టర్.. ఎక్కువ టెన్షన్ పడడం వల్లే ఇలా జరిగిందని చెబుతుంది. ఆ తర్వాత ‘అంకితకు అబార్షన్ చేయించడానికి ఎందుకే లేట్ చేస్తున్నారు? ఆలస్యం అయితే ప్రమాదం అవుతుంది' అంటూ బాంబ్ పేల్చుతుంది డాక్టర్.

  English summary
  Intinti Gruhalakshmi Episode 341: Tulasi Started a Business in her House. Then Nandhu Pay Salaries to his Office Staff. After That Ankitha Fell Down in Her Home.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X