Intinti Gruhalakshmi Today Episode: ప్రేమ్‌కు అభి ఫోన్ కాల్.. నిజం ఎవరికీ చెప్పొద్దంటూ రహస్యంగా!

చాలా కాలంగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ నుంచి అతి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోందన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' గురువారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరు కూడా ఓ లుక్కేయండి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

బుధవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. ప్రేమ్, శృతి ఇంట్లో నుంచి వెళ్లిపోవడంతో అనసూయ ఎంతో బాధగా ఉంటుంది. దీంతో తులసిని అడిగి వాళ్లను వెనక్కి తీసుకు రమ్మని పరందామయ్యకు చెబుతుంది. అప్పుడే నందూ ఆఫీస్‌కు వెళ్తుండగా అతడిని పిలిచి చీవాట్లు పెడుతుంది. ఆ సమయంలో తులసితో నందూ, లాస్య గొడవకు దిగుతారు. ఆ తర్వాత అభి, అంకిత దీని గురించి మాట్లాడుకుంటారు. ఈ క్రమంలోనే అంకితపై తులసి ఫైర్ అవుతుంది. ఇక, రాములమ్మ ప్రేమ్‌కు అద్దె ఇల్లును చూస్తుంది. నెలకు 3000 రూపాయలు చెల్లించేలా ఒప్పందం చేసుకుంటారు.

శాడిజం అంటూ తల్లిపై దివ్య ఫైర్

శాడిజం అంటూ తల్లిపై దివ్య ఫైర్

దివ్య ఎంత బ్రతిమాలినా అన్నం తినదు. అంతేకాదు, 'నేను ఎప్పటికీ ఇలాగే పస్తులు ఉంటాను. ఎవ్వరూ నాదగ్గరికి రావద్దు.. బతిమిలాడొద్దు. నేను ఎవ్వరి మాటా వినను' అంటుంది. దీంతో తులసికి కంగారు పెరుగుతుంది. 'దివ్య అర్థం చేసుకో. కొన్ని రోజుల పాటు ప్రేమ్ అన్నయ్యను మరిచిపో' అంటుంది. దీనికి దివ్య 'కొన్ని రోజులు అంటే ఎన్ని రోజులు చెప్పమ్మా' అని అడుగుతుంది. దీనికామె 'వాడు తప్పు చేశాను.. శిక్ష అనుభవిస్తున్నాడు' అంటుంది. అప్పుడు దివ్య 'కన్న కొడుకును ఇంట్లో నుంచి వెళ్లగొట్టడం శిక్ష కాదు.. శాడిజం' అంటుంది.

నన్ను కూడా పంపించవా అంటూ

నన్ను కూడా పంపించవా అంటూ

తులసి మాటలకు దివ్య మరింతగా రెచ్చిపోతుంది. అప్పుడు 'నిన్ను ఎంతగానో ప్రేమించే అన్నయ్యనే ఇంట్లో నుంచి పంపించావు. కోపం వస్తే నన్ను కూడా ఇంట్లో నుంచి ఎందుకు పంపించవు' అని ప్రశ్నిస్తుంది. దీనికి తులసి 'అభి కూడా తప్పులు చేశాడు. వాడిని శిక్షించానా చెప్పు. కష్టపడి రక్షించుకున్నానా లేదా? నేను ఏం చేసినా వాడి మంచి కోసమే అమ్మా. వాడు కళ్ల ముందు లేకపోతే నేను ఉండగలనా? భరిస్తున్నాను అంతే' అంటుంది. తర్వాత 'ప్రేమ్ బాగు పడాలని తీసుకున్న ఈ నిర్ణయం నన్ను చెడ్డదాన్ని చేస్తుందనుకోలేదు' అనుకుంటుంది.

అన్నం ప్లేట్ విసిరి పడేసిన దివ్య

అన్నం ప్లేట్ విసిరి పడేసిన దివ్య

తులసి మాట్లాడిన తర్వాత దివ్య 'ఇదంతా నీ స్వార్థం కోసమే చేస్తున్నావు కదా' అని అడుగుతుంది. దీంతో తులసి 'అవును.. నా స్వార్థం కోసమే చేస్తున్నా. నువ్వు ఏమైనా అనుకో.. ఇంతకుమించి నీ ప్రశ్నలకు సమాధానాన్ని చెప్పలేను. మన మాటలు మన మధ్య దూరాన్ని పెంచుతున్నాయి. ప్రేమ్ విషయంలో నువ్వు కల్పించుకోకు' అని దివ్యతో అంటుంది. కానీ.. దివ్య మాత్రం వినదు. 'నేను ప్రేమ్ అన్నయ్య కోసం దీక్ష చేస్తాను' అంటుంది దివ్య. దీంతో బలవంతంగా తినిపించబోతే దివ్య తులసి చేతిలోని అన్నం ప్లేట్‌ను తీసుకుని నేలకేసి కొడుతుంది.

కొత్త లైఫ్‌ను ప్రారంభించిన ప్రేమ్

కొత్త లైఫ్‌ను ప్రారంభించిన ప్రేమ్

మరోవైపు, ప్రేమ్, శృతి ఇద్దరూ ఖాళీగా ఉన్న రూమ్‌ను చూస్తారు. దాంట్లో చెత్త ఎక్కువగా ఉండటంతో ఇంటిని క్లీన్ చేయడం ప్రారంభిస్తారు. ఈ రోజు నుంచి ఈ ఇల్లే మన వైకుంఠం అంటాడు ప్రేమ్. ఈ ఇల్లు సముద్రం కాదు.. ఈ రోజు నుంచి మన సంసారం ఒక సముద్రం అంటుంది శృతి. ఆ తర్వాత ప్రేమ్ 'నిన్ను పెద్దింటి నుంచి తీసుకొచ్చి పూరింట్లో తీసుకొచ్చాను. అన్ని సంతోషాలకు దూరం చేశాను' అంటాడు. దీంతో 'భార్యకు కావాల్సింది పెద్ద మేడ కాదు.. భర్త నీడ. నీ చిటికెన వేలు పట్టుకొని ఏడు అడుగులు నడిచినప్పుడే నేను ఫిక్స్ అయ్యా. మనసులో బాధను పెట్టుబడిగా పెట్టి జీవితాన్ని నిర్మించుకుందాం' అంటుంది.

ప్రేమ్‌కు అభి ఫోన్.. అంకిత భయం

ప్రేమ్‌కు అభి ఫోన్.. అంకిత భయం

అభి.. ప్రేమ్‌కు ఫోన్ చేస్తాడు. దీంతో శృతి ఎత్తి మాట్లాడు అంటుంది. దీంతో ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. ఎక్కడున్నావురా ప్రేమ్. నిన్ను చూడాలని ఉంది అంటాడు అభి. దీంతో అమ్మ బాగుందా అని అడుగుతాడు ప్రేమ్. ఆ తర్వాత శృతితో అంకిత మాట్లాడుతుంది. తర్వాత మనం ఎక్కడున్నది మన వాళ్లకు పొరపాటున కూడా తెలియకూడదు అని చెబుతాడు ప్రేమ్. వీళ్లకు తెలిస్తే వీళ్లు వచ్చి వెళ్తే అమ్మకు ప్రాబ్లమ్ అవుతుంది అంటాడు. తర్వాత వాళ్లు చాలా ఇబ్బందుల్లో ఉన్నట్టు అర్థం అవుతోంది అని అభితో అంటుంది అంకిత. అంతేకాదు, ప్రేమ్‌తో మాట్లాడినట్టు ఆంటికి తెలియకూడదు అంటుంది.

నందూ బాధగా.. లాస్య రెచ్చగొట్టి

నందూ బాధగా.. లాస్య రెచ్చగొట్టి

లాస్య, నందూ కారులో వెళ్తుంటారు. అప్పుడు నందూ 'నాకు ఈ మనుషుల వ్యక్తిత్వం ఏంటో నాకు అస్సలు అర్థం కావడం లేదు లాస్య. ఆ ప్రేమ్ గాడు నా కాలర్ పట్టుకున్నాడు. దీంతో ఆ తులసి వాడిని ఇంట్లో నుంచి బయటికి పంపించేసింది. అమ్మ మాత్రం ప్రేమ్ ఎక్కడికి వెళ్లాడో పట్టించుకోవా అని అడుగుతుంది' అంటాడు. అప్పుడు లాస్య 'అందుకే.. ఈ ఇంట్లో మనకు విలువ లేనప్పుడు ఉండటం ఎందుకు? ఇల్లు మారిపోదాం. బయటికెళ్లి మన బతుకు మనం బతుకుదాం' అంటూ రెచ్చగొడుతుంది. అప్పుడు నందూ 'అమ్మ, నాన్న.. తులసిని వదిలి రాలేరు. ఇప్పుడు నేను అమ్మానాన్నను పట్టించుకోకపోతే అందరూ నన్నే వేలెత్తి చూపిస్తారు' అంటాడు.

అంకితను సాయం కోరిన తులసి

అంకితను సాయం కోరిన తులసి

ప్రేమ్ పరిస్థితిని తలచుకుని ఇంట్లో అందరూ ఎవరికి వారే ఏడుస్తూ కూర్చుంటారు. దివ్య అయితే వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది. 'ప్రేమ్ అన్నయ్య మామ్.. ఇది వరకు మామ్ కాదు. నిజంగానే మారిపోయింది. నీ గురించి.. నా గురించి అస్సలు పట్టించుకోవడం లేదు. మామ్ మనసు రాయిలా మారిపోయింది' అని అనుకుంటుంది. మరోవైపు తులసి 'మనసు రాయి చేసుకుంటే కానీ నిన్ను వదిలి ఉండలేకపోతున్నానురా. నా మీద ఉన్న కోపమే నీకు బలంలా మారాలి' అని అనుకుంటుంది. ఆ తర్వాత తులసి అమ్మ.. అంకిత అని పిలుస్తుంది. 'నాకొక సాయం చేస్తావా? ఎంత బతిమిలాడినా, బెదిరించినా దివ్య భోం చేయడం లేదు. నా ముఖం చూస్తేనే కోపగించుకుంటోంది' అంటుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X