Intinti Gruhalakshmi: అమ్మాయితో దొరికిన సంజయ్.. తులసికి తెలిసిపోయిన నిజం.. లాస్య, నందూకు బిగ్ షాక్
దాదాపు రెండు దశాబ్దాలుగా తెలుగు టెలివిజన్‌పై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శుక్రవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే
గురువారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. విక్రమ్‌ను అపార్థం చేసుకున్న తర్వాత తల్లి మాటలతో దివ్య రియలైజ్ అవుతుంది. అప్పుడే విక్రమ్‌కు రాజ్యలక్ష్మి పెళ్లి సంబంధం చూశానని, రేపే పెళ్లి చూపులు అని చెబుతుంది. మరోవైపు, వాసుదేవ్ కోరిక మేరకు తులసిని కాకా పట్టేందుకు నందూ ప్రయత్నాలు చేస్తుంటాడు.
అప్పుడు లాస్య అతడిని అపార్థం చేసుకోగా... జరిగిన విషయం మొత్తం ఆమెకు వివరిస్తాడు. దీంతో లాస్య కూడా నందూకు సపోర్ట్ చేస్తుంది. ఇక, విక్రమ్‌కు పేదింటి అమ్మాయితో పెళ్లి చేస్తాననడంతో వాళ్ల తాత కోప్పడతాడు. దీంతో విక్రమ్ బాధ పడతాడు.

వాళ్ల దగ్గరకు పంపించిన లాస్య
తులసి గుమ్మడికాయ కూర వండుతుందని అనసూయ కాసేపు ఎక్కువ ఎక్సర్‌సైజ్ చేస్తానని అంటుంది. దీంతో పరందామయ్య నవ్వుకుంటూ ఉంటాడు. అప్పుడే లాస్య 'నందూ త్వరగా వెళ్లు. లేదంటే మళ్లీ తులసి వచ్చేస్తుంది. అప్పుడు తన ముందు నీకు మాట్లాడడం కుదరదు' అని నందూను బలవంతం చేస్తుంది. దీంతో అతడు సిగ్గు పడుతూనే తన తల్లిదండ్రుల దగ్గరకు వెళ్తాడు. కానీ, వాళ్లకు విషయం చెప్పడానికి మాత్రం భయపడుతూ ఉంటాడు. దీంతో పరందామయ్య, అనసూయ 'వీడికి ఏమైంది? ఇలా చేస్తున్నాడేంటి' అని అనుకుంటూ ఉంటారు.

అర్థం చేసుకుని వెళ్లిపోయింది
నందూ తన తల్లిదండ్రులకు విషయం చెప్పలనుకుంటూ ఉండగానే తులసి అక్కడకు కాఫీ తీసుకుని వస్తుంది. అప్పుడు పరందామయ్య 'అమ్మా.. నందూ ఏదో చెప్పాలనుకుంటున్నాడు. నువ్వు కూడా కూర్చో కాస్త ధైర్యంగా పడతాడు' అనగానే తులసి కూర్చోవడంతో నందూ లేచి నిలబడతాడు. అంతేకాదు, ఆ సమయంలో నందూ ముఖం ఏదోలా పెట్టడంతో తులసి అతడి పరిస్థితిని అర్థం చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
అప్పుడు నందూ.. అనసూయ పరందామయ్య దంపతులకు ఈరోజు మా ఫ్రెండ్ వాసుదేవ్ నుంచి వస్తున్నాడని విషయం చెప్పేస్తాడు.

నందూను ఘోరంగా తిడుతూ
నందూ వాళ్లకు విషయం చెప్తుండగా లాస్య మాత్రం ఏం జరుగుతుందో అని టెన్షన్ పడుతుంటుంది. అప్పుడే అతడు చెప్పింది విని అనసూయ, పరందామయ్య సీరియస్ అవుతారు. ఆ సమయంలో పరందామయ్య 'ఏరా నీ కంటికి ఎలా కనిపిస్తున్నాము ఏ ముఖం పెట్టుకొని మేము తులసిని అడగాలి' అంటాడు. అలాగే, అనసూయ 'అనసూయ అసలు ఈ దరిద్రపుగొట్టు ఆలోచన నీ మనసుకి ఎలా తట్టింది? కాపురం చేసినన్ని రోజులు చిత్రహింసలు పెట్టావు. ఇప్పుడు మళ్లీ భార్యగా నటించమంటున్నావు. తులసి ఎంత సెన్సిటివో నీకు కూడా తెలుసు కదా? విడాకులు ఇచ్చిన భర్తతో నటిస్తుందని ఎలా అనుకున్నావు' అని చెడామడా తిట్టేస్తుంది. దీంతో నందూ తల దించుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

నేను తులసితో డీల్ చేస్తానని
ఏం జరుగుతుందో అని లాస్య టెన్షన్ పడుతూ ఉండగానే నందూ అక్కడకు వస్తాడు. అప్పుడామె 'వచ్చావా నందూ? అసలు ఏం జరిగింది? అత్తయ్య మామయ్య ఎలా రియాక్ట్ అయ్యారు' అని ప్రశ్నిస్తుంది. దీంతో అక్కడ జరిగింది మొత్తం ఆమెకు వివరిస్తాడు. అంతేకాదు, 'ఇక నా వల్ల కాదు లాస్య.. వాసుదేవు రాగానే నేను నిజం చెప్పేస్తాను' అంటాడు. దీంతో లాస్య 'నువ్వు నిజం చెప్తే ఇంకా అంతే సంగతులు. ఒకప్పుడు నా వల్లే తన పని చేజారిపోయిందని నా మీద పీకల వరకు కోపంతో ఉన్నాడు. ఇప్పుడు నువ్వు అసలైన రూట్లో వెళ్ళావు. నేను రహదారి రూట్‌లో వెళ్ళి ఏకంగా తులసితోనే డీల్ చేస్తాను' అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

దివ్యకు దొరికేసిన సంజయ్
హాస్పిటల్‌లో దివ్య సంజయ్‌తో ఒక ఫైల్ గురించి మాట్లాడడానికి వెళుతూ ఉంటుంది. ఆ సమయంలోనే హాస్పిటల్లో నర్స్‌తో కలిసి సరదాగా రొమాన్స్ చేస్తూ.. అతడు ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఇంతలో దివ్య అక్కడికి వచ్చేసరికి మాటలు వినిపిస్తుంటాడు. దీంతో కర్టెన్ తీసి చూస్తుంది. అప్పుడు అక్కడ సంజయ్ నర్స్‌తో ముద్దులు పెట్టుకుంటూ ఎంజాయ్ చేస్తుంటాడు. అది చూసి దివ్య ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఆ వెంటనే ఆ నర్స్ అక్కడి నుంచి పారిపోతుంది. ఇక, ఆ వెంటనే దివ్య.. సంజయ్ నిలదీస్తూ ఏం జరుగుతుంది సార్ ఇక్కడ అని నిలదీస్తుంది.

దివ్యపై ఫైర్.. లాస్య ప్లాన్‌తో
దివ్య మాటలకు సంజయ్ 'హాస్పిటల్లో ఏ మూల ఏం జరుగుతుందో అని నువ్వు ఎంక్వయిరీ చేస్తున్నావా? నీ పని మానేసి ఇలాంటి చేయడం ఒక తప్పు. నువ్వు నన్ను నిలదీయడం రెండో తప్పు. నేను ఈ హాస్పిటల్ ఎండీని ఏమైనా చేస్తాను. నువ్వు ఆఫ్ట్రాల్ ఎంప్లాయ్‌వు. నీ లిమిట్స్‌లో నువ్వు ఉండు. ఎక్కువగా మాట్లాడితే నీకే నష్టం' అంటూ సీరియస్ అవుతూ వెళ్లిపోతాడు. మరొవైపు తులసి కిచెన్‌లో పనిచేసుకుంటూ ఉండగా ఇంతలో లాస్య అక్కడికి వచ్చి 'నిజం చెప్తున్నాను తులసి నువ్వు చాలా మంచి దానివి. నీ ఓపిక సహనం సిన్సియార్టీ ఇంకొకరికి సాధ్యం అవ్వదు' అని పొగుడుతుంది. దీంతో తులసి సడన్‌గా ఇలా మీకు ఎందుకనిపించిందో తెలుసుకోవచ్చా అనడంతో నీ మీద అభిప్రాయం ఉంది అంటూ లాస్య ప్లాన్ అమలు చేయబోతుంది.

అసలు విషయం చెప్పగానే
లాస్య పనులు చేసిన తులసి డైరెక్ట్‌గా నన్ను ఏదో అడగాలని వచ్చావు అడుగు అంటుంది. అప్పుడు లాస్య టెన్షన్ పడుతూ వాసుదేవ్ వస్తున్న విషయం తెలుసు కదా అంటూ అసలు విషయం చెప్పడంతో తులసి షాక్ అవుతుంది. అప్పుడు తులసి 'ఆయనతో కలిసి జీవించలేక నేను విడాకులు తీసుకున్నాను. అలాంటిది ఆయన పక్కన ఎలా నటిస్తానని అనుకున్నావు? ఆయన ఎదగాలని నేను కోరుకుంటున్నాను కానీ నేను దిగజారాలని అనుకోవడం లేదు. నువ్వు అడిగినది నేను చేయలేనిది చేయకూడని సహాయం' అని ఫైర్ అవుతుంది. ఇదిలా ఉండగా.. విక్రమ్‌తో గొడవ పడిన శిరీష పురుగుల మందు తాగగా దానికి కారణం విక్రమ్ అని దివ్య పొరపాటు పడుతుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











