Intinti Gruhalakshmi Today Episode: దివ్య పరిస్థితి దారుణం.. తులసిలో భయం.. ప్రేమ్ శృతి రొమాన్స్
తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ నుంచి అతి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోందన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శుక్రవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరు కూడా ఓ లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే
గురువారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. తులసిని దివ్య అపార్థం చేసుకుంటుంది. ప్రేమ్‌ను వెనక్కి తీసుకుని వచ్చే వరకూ అన్నం తిననని అంటుంది. తులసి బలవంతంగా తినిపించబోతే ప్లేట్ విసిరి కొడుతుంది. ఆ తర్వాత ప్రేమ్, శృతి అద్దె ఇంటిని శుభ్రం చేసుకుని కొత్త జీవితం మొదలు పెడతారు. అప్పుడే అభి, అంకిత వాళ్లకు ఫోన్ చేసి మాట్లాడతారు. మరోవైపు, నందూ ఇంట్లో జరుగుతున్న పరిణామాలపై అసంతృప్తిగా ఉంటాడు. దీంతో లాస్య ఇల్లు వదిలి వెళ్లిపోదాం అని అంటుంది. కానీ, అతడు నిరాకరిస్తాడు. ఇక, దివ్య బాధ్యతను అంకితకు అప్పగిస్తుంది తులసి.

తులసి తప్పు చేసేసిందన్న అంకిత
దివ్య ఎంత బ్రతిమాలినా భోజనం చేయకపోవడంతో తులసి.. అంకితను పిలిచి ‘దివ్య భోజనం చేయడం లేదు. నేను ఎంత బతిమిలాడినా తినడం లేదు. ఏదోలా నచ్చజెప్పి దివ్యతో నువ్వే అన్నం తినిపించాలమ్మా. అది పీకల దాకా నా మీద కోపం పెంచుకుంది. ఏం చేయాలి చెప్పు. ఈ జీవితంలో నాకు మిగిలిందే పిల్లలు. కానీ, వాళ్లే నా మాట వినకపోతే నేను ఏం చేయాలి చెప్పు' అంటుంది. దీంతో అంకిత ‘సరే ఆంటి.. నేను దివ్యకు నచ్చజెప్పుతాను. కానీ, ప్రేమ్ విషయంలో మాత్రం మీరు చేసింది కరెక్ట్ అనిపించలేదు ఆంటి' అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

తులసికి శశికళ ఫోన్.. కోపంగా పెట్టేసి
అంకిత వెళ్లిపోగానే తులసి ‘వాళ్ల మంచి కోసం నేనే చెడ్డదాన్ని అవుతున్నా. ఏది ఎప్పుడు వదులుకోవాలో తెలుసుకోవడమే వైరాగ్యం' అని అనుకుంటుంది. ఇంతలో శశికళ ఫోన్ చేస్తుంది. ఏమైంది అని అడుగుతుంది తులసి. దీనికామె ‘టైమ్ దగ్గర పడుతోంది కదా.. అందుకే ఒకసారి గుర్తు చేద్దామని ఫోన్ చేశా' అంటుంది. అప్పుడు తులసి నా ప్రయత్నాల్లో నేను ఉన్నాను అంటుంది. దీంతో ‘నేను కూడా నా ప్రయత్నాల్లో ఉన్నాను. ఒకవేళ నువ్వు డబ్బులు కట్టకపోతే నేను ఇల్లు అమ్మాలి కదా' అంటుంది శశికళ. అప్పుడు తులసి ‘అటువంటి ప్రయత్నాలు నువ్వు వెంటనే మానుకో' అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది.

స్పృహతప్పి కింద పడిపోయిన దివ్య
తులసి ఇంటికి మాధవి వచ్చి ‘నువ్వు తప్పు చేశావేమో వదిన. ప్రేమ్ విషయంలో తొందరపడ్డావేమో' అంటుంది. దీంతో తులసి ‘నువ్వు కూడా అందరిలాగే ఆలోచిస్తున్నావు' అంటుంది. మరోవైపు, అన్నం తినమని అడిగిన అంకితతో దివ్య ‘అమ్మ ఎంత మొండిగా ఉంటే నేను అంతకంటే ఎక్కువ మొండిగా ఉంటాను. నేను అస్సలు అన్నం తినను. నాకు వద్దు. నేను అస్సలు తగ్గను. నేను ఒక్క ముద్ద కూడా తినను. ప్రేమ్ అన్నయ్య ఇంటికి తిరిగి వస్తేనే నేను అన్నం తింటాను. లేకపోతే తినను. వెళ్లి అమ్మకు చెప్పు' అని ఆవేశంగా అంటూ కళ్లు తిరిగి పడిపోతుంది.

తులసిని షాకింగ్ న్యూస్ చెప్పడంతో
దివ్య కళ్లు తిరిగి పడపోగానే అంకిత రూమ్‌లోకి తీసుకెళ్లి బీపీ చెక్ చేస్తుంది. తులసి వచ్చి ఎలా ఉందని అడగ్గా.. ‘ఎంత చెప్పినా దివ్య వినడం లేదు. తినకపోవడం వల్లే ఈ కళ్లు తిరుగుడు.. చాలా వీక్ అయిపోయింది' అని అంటుంది. అప్పుడు తులసి దివ్యను పట్టుకోగా విదిలించుకుంటుంది. దీంతో తప్పు దివ్య అలా చేయకూడదు అంటుంది మాధవి. అప్పుడామె ‘ముందు మామ్‌కు చెప్పండి ఆ విషయం. ఇన్నాళ్లు ఎప్పుడూ మా మామ్‌కు ఎదురు తిరగలేదు' అంటుంది. అప్పుడు మాధవి ‘మీ కోసం అంతగా ఆలోచించే తను.. ప్రేమ్ విషయంలో ఒక నిర్ణయం తీసుకుందంటే అది మంచిదే అయి ఉండొచ్చు కదా' అంటుంది.

ప్రేమ్ వస్తేనే తింటాను అన్న దివ్య
దివ్య ఎంత చెప్పినా వినకపోవడంతో మాధవి ‘ప్రేమ్.. ప్రస్తుతానికి మాత్రమే ఇంట్లో నుంచి వెళ్లాడు. ఇది శాశ్వతం మాత్రం కాదు. ఏదో ఒక రోజు ప్రేమ్ ఇంటికి తిరిగి వస్తాడు' అంటుంది. దీనికి దివ్య ‘అయితే.. ప్రేమ్ అన్నయ్యను ఇంట్లో నుంచి పంపించడం మీరు సపోర్ట్ చేస్తున్నారా? మీరే కాదు.. అందరూ వ్యతిరేకిస్తున్నారు. ఏదో ఒక రోజు నేను అత్తారింటికి వెళ్లాల్సిందే. అలా అని ఇప్పటి నుంచే నేను అన్నయ్యకు దూరంగా ఉండాలా? చిన్న కోరిక నాది. ప్రేమ్ అన్నయ్య వచ్చి తినిపిస్తేనే నేను తింటాను. కానీ, మీరే ఒప్పుకోవడం లేదు' అంటూ కండీషన్ పెడుతుంది.

మామ్ రక్తమే.. పరందామయ్య సలహా
ఎవరు చెప్పిన వినని దివ్య మరింత మొండికేస్తుంది. ‘నాలో ఉన్నది మామ్ రక్తమే. మామ్ మొండితనమే నాకు వచ్చింది అనుకోండి. చూడండి.. అత్తయ్య నాకు మాట్లాడే ఓపిక లేదు. నన్ను ఒంటరిగా వదిలేయండి. అందరూ నా ముందు నుంచి వెళ్లిపోండి' అంటుంది. దివ్య కూల్ డౌన్ అన్నా కూడా వినకుండా అరుస్తుంది. అప్పుడు పరందామయ్య ‘పెద్ద వాళ్లకు అనుకూలంగా చిన్నవాళ్లు నడుచుకోనప్పుడు.. చిన్నవాళ్లకు అనుకూలంగా పెద్దవాళ్లు నడుచుకోవాల్సి వస్తుంది. వేరే దారి లేదమ్మా' అని సలహా ఇస్తాడు. దీంతో తులసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

తులసి బాధ.. ప్రేమ్, శృతి రొమాన్స్
దివ్య మాటలకు తులసి ‘ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది మాధవి. పిల్లలు లేని వాళ్లే హాయిగా ఉంటారని' అంటుంది. దీంతో ఎందుకు అలా మాట్లాడుతున్నావు వదిన అంటుంది మాధవి. చూశావు కదా దాని పంతం అంటుంది. దానితో ఎలా మాట్లాడాలో.. ఎలా తినిపించాలో అయోమయంగా ఉంది మాధవి అంటుంది తులసి. మరోవైపు, తాము తీసుకున్న రూమ్‌ను క్లీన్ చేస్తుంటారు ప్రేమ్, శృతి. మధ్యమధ్యలో రొమాన్స్ చేసుకుంటూ ఇద్దరూ సరదాగా పని చేస్తారు. ‘అక్కడ ఎంత పెద్ద ఇల్లు ఉన్నా ఏదో ఇరుకుగా ఉండేది. కానీ.. ఇక్కడ మాత్రం చాలా ఇరుక్కుగా ఉన్నా ఎంతో విశాలంగా ఉన్నట్టు అనిపిస్తోంది' అంటుంది శృతి.
Recommended Video

నందూ సీరియస్‌గా.. దివ్య పంచ్
దివ్య కళ్లు తిరిగి పడిపోయిందన్న విషయం తెలిసి నందూ కోపంగా వస్తాడు. వచ్చీ రావడమే దివ్యకు ఎలా ఉంది అని తల్లిని అడుగుతాడు. అప్పుడామె మమ్మల్ని అడగడం ఎందుకు వెళ్లి చూసుకో అంటూ బదులిస్తుంది. అలా లోపలికి వెళ్లిన నందూతో దివ్య ‘మేము డాడీ లేడనుకోవడం కాదు.. మీరే మమ్మల్ని వద్దనుకున్నారు. మీ గొడవల వల్ల మేము బలవుతున్నాము' అంటుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











