Intinti Gruhalakshmi Today Episode: తులసికి నందూ ప్రామిస్.. అంతలోనే షాక్.. లాస్య బుట్టలో పడ్డ దివ్య
సుదీర్ఘ కాలంగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ నుంచి అతి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోందన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శనివారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరు కూడా ఓ లుక్కేయండి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే
శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. దివ్యకు అన్నం పెట్టమని తులసి.. అంకితను కోరుతుంది. దీంతో ఆమె వెళ్లి అడగ్గా తిననని చెబుతుంది. అంతలో ఆమె కళ్లు తిరిగి పడిపోతుంది. బీపీ తక్కువగా ఉండడం వల్లే ఇలా జరిగిందని తులసికి అంకిత చెబుతుంది. ఆ తర్వాత తులసి కూడా వెళ్లి బ్రతిమాలుతుంది. కానీ, ప్రేమ్‌ను తిరిగి ఇంటికి తీసుకుని వస్తేనే తింటానని చెబుతుంది. మరోవైపు, ప్రేమ్, శృతి అద్దె ఇంటిని క్లీన్ చేసుకుంటూ రొమాన్స్ చేస్తుంటారు. ఇక, ఆఫీస్ నుంచి వచ్చిన నందూ.. దివ్యను పరామర్శించడానికి వెళ్లగా.. అతడికామె ప్రశ్నలతో షాకిస్తోంది.

తులసి మీద కంప్లైంట్ చేసిన దివ్య
కూతురి బాగోగులు చూడడానికి వెళ్లిన నందూతో దివ్య ‘ఎవరి పంతాలు వారివి.. ఎవరి పట్టింపులు వారివి.. మేమేమైనా ఎవ్వరికీ పట్టడం లేదు' అని అంటుంది. దీనికి నందూ ‘అలా ఏం లేదమ్మా' అంటాడు. అప్పుడు దివ్య ‘మామ్ మాత్రం ప్రేమ్ అన్నయ్య మీద ధ్వేషం పెంచుకుంది. ప్రేమ్ అన్నయ్య వస్తేనే కానీ.. నేను భోజనం చేయను' అంటుంది. అప్పుడు లాస్య ‘ఈ మాట మీ అమ్మకు చెప్పలేదా దివ్య' అని అడుగుతుంది. దీనికామె ‘ఎందుకు చెప్పలేదు.. చెప్పినా వినడం లేదు. ఒప్పుకోవడం లేదు. కాకమ్మ కథలు చెప్పి నాకు తినిపించడానికి ప్రయత్నిస్తోంది' అంటుంది.

రెచ్చగొట్టిన లాస్య.. నందూ కోపంగా
దివ్య దగ్గర మంచి మార్కులు కొట్టేయాలని భావించిన లాస్య.. తులసి మీద లేనిపోనివి చెప్తుంది. ‘తులసి ఎందుకు ఇలా తయారైంది నందూ. దివ్య.. ప్రేమ్ మీద బెంగ పెట్టుకుంది' అంటూ రెచ్చగొడుతుంది. దీంతో నందూ కోపోద్రిక్తుడు అవుతాడు. అప్పుడు నందూ ‘దివ్య.. నన్ను నమ్ము. నేను ఎలాగైనా మీ అమ్మను ఒప్పించి ప్రేమ్‌ను ఇంటికి తీసుకొస్తాను' అని దివ్యకు మాటిస్తాడు. ఆ వెంటనే బయటికి వచ్చి తులసి.. తులసి అంటూ అరుస్తాడు. అంతేకాదు, ‘నా మీద కోపాన్ని ఎందుకు పిల్లల మీద చూపిస్తున్నావు' అంటూ ఆమెపై రంకెలు వేస్తాడు.

తులసికి ప్రామిస్ చేసేసిన నందూ
తులసితో నందూ ప్రేమ్ ఎక్కడున్నాడో ఫోన్ చేసి కనుక్కొని పిలవచ్చు కదా అని అంటాడు. దీనికామె ‘ఆ పని మీరు చేయొచ్చు కదా. మీరు ప్రేమ్‌కు ఫోన్ చేయొచ్చు కదా. మీరెందుకు ఆ పని చేయలేకపోయారు' అంటుంది. దీంతో నందు షాక్ అవుతాడు. అప్పుడు లాస్య ‘అదేంటి తులసి.. ప్రేమ్‌ను ఇంట్లో నుంచి పంపించింది నువ్వు.. ఇప్పుడు పిలవాల్సింది కూడా నువ్వే' అంటుంది. దీంతో తులసి ‘సరే.. పిలుస్తాను. ప్రేమ్‌తో ఇక నుంచి గొడవలు పెట్టుకోను అని మాటిస్తారా' అని అడుగుతుంది. దీనికి నందూ సరే మాటిస్తాను అంటూ ప్రామిస్ చేస్తాడు.

కండీషన్ పెట్టగా... మళ్లీ మొదటికి
ప్రేమ్‌తో గొడవ పడనని మాటిచ్చిన నందూ.. ఒక కండీషన్ పెడతానని అంటాడు. ‘ఇంటికి తిరిగొచ్చాక.. ప్రేమ్ ఎప్పుడూ నాతో గొడవ పెట్టుకోడని నువ్వు నాకు మాటివ్వాలి' అంటాడు. దీంతో ‘సరే.. మీరే ఫోన్ చేసి మాట్లాడండి. ప్రేమ్‌ను ఫోన్ చేసి రమ్మనండి' అంటుంది. దీంతో నందూ ‘నేను ఎలా ఫోన్ చేస్తాను. వాడు నా షర్ట్‌ను పట్టుకున్నాడు. నా ఆత్మాభిమానాన్ని దెబ్బ తీశాడు. నేను ఎందుకు ఫోన్ చేస్తాను' అంటాడు. దీంతో తులసి ‘నేను ఫోన్ చేయను' అంటుూ అక్కడి నుంచి కోపంగా వెళ్లిపోతుంది. పరందామయ్య కూడా ఆమె నిర్ణయాన్నే సమర్థిస్తాడు.

ప్రేమ్ కోసం చేయి కలిపిన ఫ్రెండ్స్
ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ప్రేమ్.. తన ఫ్రెండ్‌ను కలుస్తాడు. అందులో ఒకరు ‘దేవుడు ప్రత్యక్షమై ఏ వరం కావాలని కోరుకోవాలని అడిగినా నేను ఏం ఆశ్చర్యపోను కానీ.. మీ అమ్మ ఇలా ఇంట్లో నుంచి గెంటేయడం ఏంటి' అంటాడు. దీనికి ప్రేమ్ ‘తప్పు చేశాను.. శిక్ష వేసింది ప్రిపేర్ అయ్యాను. నేను గతం గురించి కాదు.. భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాను. ఏం చేయాలో తెలియని అయోమయంలో ఉన్నా నేను' అంటాడు. దీనికి ఫ్రెండ్స్ ‘ఇప్పుడు సీజన్ కూడా కాదు. ఈవెంట్స్ కూడా లేవు. మరి.. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావు' అని అడుగుతారు. దీంతో ‘3 వేల రెంట్‌కు ఒక ఇల్లు తీసుకున్నాను. ఇంట్లో సామాన్లు ఏం లేవు. ప్రస్తుతానికి ఏదైనా ఉద్యోగం చూసుకోవాలి' అంటాడు ప్రేమ్. దీంతో వాళ్లు కొన్ని డబ్బులిచ్చి సాయం చేస్తారు.

దివ్యను బుట్టలో పడేయాలని ప్లాన్
దివ్య.. ప్రేమ్ గురించే ఆలోచిస్తూ ఉంటుది. ఇంతలో లాస్య అక్కడికి వస్తుంది. అమ్మా దివ్య అనగానే.. ‘ఆంటి ప్లీజ్ నన్ను విసిగించొద్దు.. ఇరిటేట్ చేయొద్దు. నాకు నీరసంగా ఉంది.. నాకు మాట్లాడే ఓపిక కూడా లేదు. వెళ్లిపోండి ప్లీజ్' అంటుంది. దీనికి లాస్య ‘తెలుసు దివ్య. నీ కన్నతల్లిని కాకపోయినా నీ బాధను నేను అర్థం చేసుకోగలను. నేను వచ్చింది నీకు జ్యూస్ తాగించడానికి కాదు. నీకు సపోర్ట్ ఇవ్వడానికి. నీ ఆలోచనను పంచుకోవడానికి. నిజం దివ్య.. నన్ను నమ్ము. వద్దు ఏడవకు' అంటూ దివ్యను బుట్టలో వేసుకోవాలని ప్లాన్ చేసుకుంటుంది.
Recommended Video

తులసిపై లాస్య.. దివ్య యుద్ధం
దివ్య దగ్గరకు వచ్చిన లాస్య ‘మీ మామ్‌కు తన బాధ, తన కన్నీళ్లు తప్పితే ఎదుటి మనిషి కన్నీళ్లు తెలియవు. ఆ విషయం నీకు ఇప్పుడే తెలుస్తోంది. నాకు ఎప్పుడో తెలుసు' అంటుంది. దీనికి దివ్య ‘పెద్దవాళ్లే మొండిగా ఉంటే ఏం చేయాలి ఆంటి' అంటుంది. అప్పుడు లాస్య ‘ప్రేమ్‌ను నేను తీసుకొస్తాను.. నన్ను నమ్ము.
నువ్వు ఈ నిరాహార దీక్ష మానేస్తే అప్పుడు నువ్వు, నేను కలిసి మీ మామ్‌తో యుద్ధం చేద్దాం. ముందు ఈ జ్యూస్ తాగు. ఏంటి అలా అనుమానంగా చూస్తున్నావు' అంటుంది. దీంతో దివ్య జ్యూస్ తాగుతుంది. మరోవైపు, శృతికి తన ఫ్రెండ్స్ ఇచ్చిన డబ్బును ఇస్తాడు ప్రేమ్. దీంతో అటు తులసి.. ఇటు శృతి సంతోషిస్తారు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











