Intinti Gruhalakshmi Today Episode: ప్రేమ్‌ను సర్‌ప్రైజ్ చేసిన లాస్య.. ఇంటికొచ్చి షాకిచ్చిన మాధవి

తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు మాత్రమే సుదీర్ఘ కాలంగా ప్రేక్షకుల నుంచి భారీ నుంచి అతి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోందన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' సోమవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరు కూడా ఓ లుక్కేయండి మరి!

Photos Courtesy: Star మా and Disney+Hotstar

శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

శనివారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. తన దగ్గరకు వచ్చిన తండ్రితో దివ్య కోపంగా మాట్లాడుతుంది. ప్రేమ్‌ను తీసుకొస్తేనే అన్నం తింటానని అంటుంది. దీంతో నందూ.. తులసితో గొడవకు దిగుతాడు. అప్పుడామె ప్రేమ్ తిరిగొస్తే అతడితో గొడవ పెట్టుకోనని మాట ఇవ్వమని అడుగుతుంది.

అందుకు నందూ ఒప్పుకుంటాడు. కానీ, అతడిని పిలవడానికి మాత్రం ఒప్పుకోడు. మరోవైపు, ప్రేమ్‌కు అతడి స్నేహితులు ఆర్థిక సహాయం చేస్తారు. దీంతో ఇంట్లో కొన్ని సామాన్లు కొనుక్కొంటాడు. చివర్లో దివ్యను బుట్టలో వేసుకుని.. తులసిపై యుద్ధం చేద్దామని ఆమెను రెచ్చగొడుతుంది.

డబ్బులు పంచుకున్న ప్రేమ్ శృతి

డబ్బులు పంచుకున్న ప్రేమ్ శృతి

ప్రేమ్ పరిస్థితి గురించి తెలుసుకున్న అతడి స్నేహితులు.. అతడికి ఆర్థిక సహాయం చేస్తారు. వాటిని ఇంటికి తీసుకొచ్చి 'ఈ ప్రపంచంలో ఇంకా మంచితనం బతికే ఉంది. ఒకప్పుడు నా నుండి సాయం పొందిన ఫ్రెండ్స్ నాకు ఇఫ్పుడు సాయం చేశారు' అని శృతి చెప్తాడు. దీంతో ఆమె 'అందులో నుంచి మూడు వేలు రూపాయలు ఇంటి ఓనర్ కు అడ్వాన్స్ ఇవ్వు. మరో 3 వేలు రూపాయలు ఇచ్చి ఇంట్లో సరుకులు తీసుకురా' అని చెబుతుంది. ఆ తర్వాత మిగిలిన మూడు వేల రూపాయలను అవసరాల కోసం ఉంచుకునేందుకు తన చీర కొంగులో దాచుకుంటుంది.

బ్యూటీ పార్లర్‌కు వెళ్లానన్న శృతి

బ్యూటీ పార్లర్‌కు వెళ్లానన్న శృతి

శృతి మూడు వేల రూపాయలను తన చీరలో దాచుకోవడంతో వాటిని ఏం చేస్తావని ప్రేమ్ అడుగుతాడు. దీనికామె 'బ్యూటీ పార్లర్ కు వెళ్తా.. హెయిర్ ట్రీట్‌మెంట్ చేయించుకోవాలి కదా' అంటుంది. దీంతో సరే అంటాడు ప్రేమ్. అప్పుడు శృతి 'ఊరికే అన్నా ప్రేమ్. ఏవైనా అవసరాలు ఉంటే ఈ మూడు వేలు అవసరానికి వస్తాయి' అని చెబుతుంది. అప్పుడు ప్రేమ్ 'నువ్వు జోక్‌గా అన్నా.. నేను నిజంగానే చెప్పాను. ఎందుకంటే నీకు కూడా కొన్ని అవసరాలు ఉంటాయి కదా. డబ్బు ఉన్నది వాటిని తీర్చుకోడానికే కదా' అంటూ ఆమెకు వివరించి చెబుతాడు.

ప్రేమ్ గురించి రాములమ్మ టెన్షన్

ప్రేమ్ గురించి రాములమ్మ టెన్షన్

ప్రేమ్, శృతి ఇల్లు చూసి పెట్టిన రాములమ్మ.. అడ్వాన్సుగా మూడు వేల రూపాయలు కడతానని ఒప్పుకుంటుంది. ఇక, తులసి ఇంట్లో పని చేస్తోన్న సమయంలో 'ప్రేమ్ బాబు ఇంటికి అడ్వాన్స్ నేనే కడతా అని చెప్పాను. ఇప్పుడు ఆ డబ్బులు లేవు. ఎలా కట్టాలి? ఏమీ తోచడం లేదే' అని తనలో తాను అనుకుంటుంది. ఇంతలో తులసి రావడంతో ఆమెను మూడు వేలు కావాలని అడుగుతుంది. దీంతో ఎందుకు అని అంటుంది. దీనికి రాములమ్మ 'నా బంధువుల అబ్బాయి పెళ్లి చేసుకొని పారిపోయి వచ్చాడు.. అతడికి ఇల్లు చూపించాను.. అద్దె కట్టాలి' అంటుంది. దీంతో డబ్బులు తెచ్చి ఇస్తుంది. ప్రేమ్ కూడా ఇలాగే భార్యతో కట్టుబట్టలతో వెళ్లాడు కదా అని మనసులో అనుకుంటుంది తులసి.

ప్రేమ్, శృతి ఖర్చులు.. కోపంగానే

ప్రేమ్, శృతి ఖర్చులు.. కోపంగానే

సరుకులు తీసుకొచ్చేందుకు బయటకు వెళ్లిన ప్రేమ్.. వాటిని మానేసి శృతి కోసం చీరలు తీసుకొస్తాడు. అవేంటని శృతి అడగ్గా.. 50 శాతం డిస్కౌంట్‌తో ఇస్తున్నారని నీకోసం చీరలు తీసుకొచ్చాను అంటాడు. దీంతో శృతికి కోపం వస్తుంది. 'ఉన్న డబ్బులు మొత్తం చీరలకే కట్టేస్తే.. సరుకుల కోసం ఎలా' అని ప్రేమ్‌పై విరుచుకుపడుతుంది. దీనికి ప్రేమ్ 'సరుకుల కోసం అడ్వాన్స్ డబ్బు ఉంది కదా. దాన్ని ఖర్చు పెట్టా' అంటాడు. మరి అడ్వాన్స్ ఎలా ఇస్తావు అని అడుగుతుంది శృతి. దీంతో నీ దగ్గర 3000 ఉన్నాయి కదా అంటాడు. కానీ, ఆ మూడు వేలతో శృతి.. ప్రేమ్ కోసం డ్రెస్సులు తీసుకుంటుంది.

ప్రేమ్‌కు షాకిచ్చిన మేనత్త మాధవి

ప్రేమ్‌కు షాకిచ్చిన మేనత్త మాధవి

ప్రేమ్, శృతి ఒకరు కొన్న బట్టలు.. ఒకరు చూసుకుంటూ ఉంటారు. అప్పుడు శృతి 'నీ సెలక్షన్ బాగుంది. ఇంటి ఓనర్‌కు ఏం చేస్తావు అనేదే బాధ' అంటుంది. అప్పుడు ప్రేమ్ 'సర్లే.. టైమ్ వచ్చినప్పుడు చూసుకుందాం' అని అంటాడు. ఇంతలో మాధవి వస్తుంది. ప్రేమ్, శృతి.. మాధవిని చూసి షాక్ అవుతారు. ప్రేమ్ 'అత్తయ్య మీకు మేము ఇక్కడ ఉన్నామని ఎలా తెలిసింది' అని అడుగుతాడు. దీనికామె 'మనసు ఉంటే మార్గం ఉంటుందిరా ప్రేమ్. అయినా.. నువ్వు మీ అమ్మ కలిసి పంతాలకు పోయి ఇంట్లో వాళ్లను బాధ పెడుతున్నారు' అంటుంది.

ప్రేమ్‌కు లాస్య ఫోన్.. దివ్య బాధగా

ప్రేమ్‌కు లాస్య ఫోన్.. దివ్య బాధగా

మాధవితో ప్రేమ్ మాట్లాడుతుండగా లాస్య నెంబర్ నుంచి ఫోన్ వస్తుంది. అది కట్ చేద్దామని అనుకుంటున్న సమయంలో లిఫ్ట్ చేయమని మాధవి చెప్తుంది. దీంతో అతడు కాల్ అటెండ్ చేస్తాడు. అప్పుడు దివ్య ఏడుస్తూ మాట్లాడుతుంది. దీంతో ప్రేమ్ షాకై సంతోషిస్తాడు. అప్పుడు ప్రేమ్ 'అమ్మ సంగతి పక్కన పెట్టు.. అమ్మ కోపాన్ని మరిచిపో.. నా కోసం తిను.. నా కోసం మంచిగా ఉండు.

నువ్వు ఇలా చేస్తే నేను కూడా అన్నం తినడం మానేస్తాను' అంటాడు. నువ్వు ఇక రావా అని అడుగుతుంది దివ్య. దీంతో ఎందుకు రాను అంటాడు. రావాల్సిన సమయం వచ్చినప్పుడు వస్తాను అంటాడు. ఆ తర్వాత నువ్వు అన్నం తినకపోతే నా మీద ఒట్టే.. అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు.

Recommended Video

Anchor Anasuya Vs Anchor Manjusha In Jabardasth Comedy Show | Filmibeat Telugu
లాస్యకు దివ్య హగ్.. తల్లితో గొడవ

లాస్యకు దివ్య హగ్.. తల్లితో గొడవ

ఫోన్ కట్ చేయగానే లాస్య 'నువ్వు ప్రేమ్ గురించి ఎందుకు దిగులు పెట్టుకున్నావో.. ప్రేమ్ కూడా నీ గురించి అంతే దిగులు పెట్టుకున్నాడు. మీ ప్రేమ్ అన్నయ్య ఒట్టేసినందుకు అయినా నువ్వు అన్నం తినాలి. మీ అన్నయ్యతో మాట్లాడించాను.. ఇప్పటికైనా ఈ ఆంటి మీద నమ్మకం కుదిరిందా' అని అంటుంది. దీంతో ఆమెను దివ్య కౌగిలించుకుని థ్యాంక్యూ అంటుంది. అది చూసిన తులసి బాధ పడుతుంది. ఆ తర్వాత దివ్య ఇంట్లోకి వచ్చి అన్నం పెట్టమని అడుగుతుంది. అంతలో తులసి వచ్చి వడ్డించబోగా వద్దని అంటుంది. ఆ సమయంలో తల్లితో వాదనకు కూడా దిగుతుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X