Intinti Gruhalakshmi Today Episode: శృతిని ఢీకొట్టబోయిన తులసి.. శాశ్వతంగా కనిపించను అంటూ తల్లితో!

చాలా భాషలతో పోల్చుకుంటే తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు మాత్రమే సుదీర్ఘ కాలంగా ప్రేక్షకుల నుంచి భారీ నుంచి అతి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోందన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' బుధవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరు కూడా ఓ లుక్కేయండి మరి!

Photos Courtesy: Star మా and Disney+Hotstar

మంగళవారం ఎపిసోడ్‌లో జరిగిందిదే

మంగళవారం ఎపిసోడ్‌లో జరిగిందిదే

మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. ప్రేమ్‌తో మాట్లాడించిన తర్వాత దివ్య.. లాస్యపై ఇష్టాన్ని పెంచుకుంటుంది. ఆ తర్వాత నందూతో కూడా మంచిగా మాట్లాడుతుంది. అప్పుడు తన ఫ్రెండ్స్ వస్తున్నారని ఇంట్లో ఉండమని అడుగుతుంది. కానీ, నందూ తనకు పని ఉందని, లాస్య ఉంటుందని చెబుతాడు. మరోవైపు, ప్రేమ్ ఓ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరకు వెళ్లాలని డిసైడ్ అవుతాడు.

ఇక, మాధవి ప్రేమ్‌ను కలిసిన విషయం తులసికి తెలుస్తుంది. చివర్లో తులసిని ఇంట్లో ఉండమని నందూ అడుగుతాడు. కానీ, ఆమె మాత్రం దివ్య చెబితేనే ఉంటానని అంటుంది.

శృతిని ఢీకొట్టబోయిన తులసి స్కూటీ

శృతిని ఢీకొట్టబోయిన తులసి స్కూటీ

ఇంట్లోకి కూరగాయలు తెచ్చుకోవడం కోసం ప్రేమ్, శృతి ఇద్దరూ నడుచుకుంటూ వెళ్తుంటారు. అప్పుడు శృతి 'నీతో ఇలా కూరగాయల కోసం నడుచుకుంటూ వెళ్లి వస్తానని ఎప్పుడూ అనుకోలేదు ప్రేమ్' అని అంటుంది. అప్పుడు ప్రేమ్ కూడా ఆమెతో ప్రేమగా మాట్లాడతాడు. అలా ఇద్దరూ సరదాగా నడుస్తూ వస్తుండగా.. ఇంతలో తులసి స్కూటీ శృతిని ఢీకొనబోతుంది. అది తులసి బండి అని చూసి షాక్ అవుతారు. తులసి కూడా ప్రేమ్‌ను చూసి షాక్ అవుతుంది. ఆ వెంటనే అతడిని జరుగు అంటుంది. నా మీద నీకు ఇంకా కోపం తగ్గలేదా అని సూటిగా ప్రశ్నిస్తాడు.

శాశ్వతంగా వెళ్లిపోవాలని అని అడిగి

శాశ్వతంగా వెళ్లిపోవాలని అని అడిగి

ఎంత ప్రయత్నించినా తులసి తన వైపు చూడకపోవడంతో పాటు మాట్లాడకుండా ఉండడంతో ప్రేమ్ బాధపడతాడు. అప్పుడు 'నేను ఇంట్లో నుంచి వెళ్లిపోయినా నీకు కోపం చల్లారడం లేదా? నీకోసం శాశ్వతంగా ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోమంటావా చెప్పు. నీకోసం ఏదైనా చేస్తాను. నాకు కావాల్సింది మా అమ్మ కోపం తగ్గడం.. నాతో మాట్లాడటం.. అంతే అమ్మ. అంతకంటే ఇంకేం లేదు. ఇప్పుడే మనసులో అనుకున్నా.. అమ్మ కనిపిస్తే బాగుండు అని.. దేవుడు దయతలిచాడు.. నాకు అమ్మను కనిపించేలా చేశాడు' అంటూ తన తల్లికి వివరించే ప్రయత్నం చేస్తుంటాడు ప్రేమ్.

ఆ ప్రేమే మనిషిని నాశనం చేస్తుంది

ఆ ప్రేమే మనిషిని నాశనం చేస్తుంది

ప్రేమ్ మాట్లాడిన తర్వాత తులసి 'వాడి మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటే.. ఏ ఒక్కటీ పట్టించుకోలేదు. పనికిరాని ప్రేమలు.. మనుషులను దగ్గర చేయడానికి సరిపోవు. నిజాయితీ ఉండాలి. ఈ మాట వాడికి చెప్పు శృతి' అంటుంది. అప్పుడామె 'ఇవన్నీ చెప్పకుండానే ప్రేమ్‌ను ఇంతవాడిని చేశారా ఆంటి. ప్రేమ్ చూపించే అభిమానంలో నిజాయితీ కనిపించడం లేదా. నన్ను నమ్మనంటారా' అని ప్రశ్నిస్తుంది. దీనికి తులసి 'ఒకప్పుడు వాడి మీద పట్టలేని ప్రేమ చూపించాను. కానీ.. మనం చూపించే ప్రేమ కూడా ఎదుటి మనిషిని నాశనం చేస్తుందని ఈ మధ్యే తెలుసుకున్నాను. ఇప్పుడు నా హద్దుల్లో నేను ఉన్నాను' అంటుంది.

తులసిని ఆ ఒక్కటి కోరుకున్న ప్రేమ్

తులసిని ఆ ఒక్కటి కోరుకున్న ప్రేమ్

తులసి ఎంతకీ వినకపోవడంతో ప్రేమ్ 'నాన్న పట్ల నేను అలా ప్రవర్తించడం తప్పే కానీ.. దానికి ఉరి శిక్ష కంటే పెద్ద శిక్ష వేశావు కదా. కాని ఒక్కటి.. నువ్వు నన్ను ఇంటికి పిలవకున్నా పర్వాలేదు కానీ.. నేను ఎలా ఉన్నానో అడుగు అమ్మ. కొండంత ధైర్యంతో బతికేస్తాను' అని కోరుకుంటాడు.

దీనికి తులసి 'కనిపించినప్పుడల్లా నీతో మాట్లాడాలి అంటే నా మనసును చంపుకోవాలి. చంపుకోమంటావా.. నీకు కావాల్సింది అదేనా.. చెప్పరా. పక్కకు తప్పుకో' అంటుంది. దీంతో ప్రేమ్, శృతి పక్కకు తప్పుకుంటారు. దీంతో ఆమె అక్కడి నుంచి ఫ్యాక్టరీకి వెళ్లిపోతుంది.

అడ్వాన్స్ కోసం గొడవ.. అవమానం

అడ్వాన్స్ కోసం గొడవ.. అవమానం

ప్రేమ్ ఇంటి ఓనర్ బాబురావు.. పేకాడుతూ కనిపిస్తాడు. బాబు అని పిలుస్తుంది తన భార్య. చేతులు ఖాళీ లేవు.. తర్వాత రాపో అని అంటాడు. అడుక్కునే వారికి ఏం పనిలేదు అని అంటాడు. దీంతో కోపం వచ్చి అక్కడే ఉన్న క్యాన్‌ను విసిరేస్తుంది. రెంట్‌కు ఉన్నవాళ్లు అడ్వాన్స్ ఇచ్చారా అని అడుగుతుంది. దీంతో ఇంకా ఇవ్వలేదు అంటాడు. వెంటనే వెళ్లి అడ్వాన్స్ తీసుకొనిరా అంటుంది. దీంతో కోపంతో ప్రేమ్ ఇంటికి వెళ్లి అడ్వాన్స్ ఇవ్వండి అని అడుగుతాడు. ఆ సమయంలో బాబూరావు భార్య ఎన్నో మాటలు అంటుంది. దీంతో ప్రేమ్‌కు అవమానంగా అనిపిస్తుంది.

వాళ్లకు సాయం చేసిన రాములమ్మ

వాళ్లకు సాయం చేసిన రాములమ్మ

బాబూరావు అడ్వాన్స్ తక్షణమే ఇవ్వమని అడుగుతాడు. కానీ, ప్రేమ్ మాత్రం ఒక రెండు రోజులు ఆగండి అని అంటాడు. దీనికి బాబూరావు 'కుదరదు.. అస్సలు కుదరదు.. అడ్వాన్స్ ఇస్తారా.. లేక ఇల్లు ఖాళీ చేస్తారా. అయినా ఇదంతా రాములమ్మ వల్లనే. రాములమ్మ ఎక్కడున్నావు' అని గట్టిగట్టిగా అరుస్తుంటాడు. దీంతో రాములమ్మ భయంతో పరుగు పరుగున అక్కడకు వస్తుంది. అంతేకాదు, 'ఇదిగోండి మీ అడ్వాన్స్ 3000' అని అతడికి అందిస్తుంది. దీంతో బాబూరావు అవి తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దీంతో థాంక్స్ రాములమ్మ అంటాడు ప్రేమ్.

లాస్య దివ్య ఎంజాయ్.. తులసి అలా

లాస్య దివ్య ఎంజాయ్.. తులసి అలా

తన ఫ్రెండ్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది దివ్య. తన ఫ్రెండ్స్ వస్తున్నారని పరందామయ్య.. యువకుడిలా రెడీ అవుతాడు. ఇంతలో తన ఫ్రెండ్స్ వస్తారు. లాస్య కూడా వస్తుంది. అరేంజ్‌మెంట్స్ అన్నీ చేశాను.. ఎంజాయ్ చేయండి అని అంటుంది లాస్య. మరోవైపు తులసికి శశికళకు 80 లక్షల డబ్బు ఎలా కట్టాలో అర్థం కాదు. టైమ్ దగ్గర పడుతోంది అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో మేనేజర్ వస్తాడు. ఈ చెక్ మీద సైన్ చేయండి మేడమ్ అంటాడు. ఆ తర్వాత ఫ్యాక్టరీ మీద లోన్ తీసుకుందామని సలహా ఇస్తాడు. కానీ, దానికి తులసి ఒప్పుకోదు. అయినా మేనేజర్ ఆమెను ఒప్పించే ప్రయత్నం చేస్తాడు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X