Intinti Gruhalakshmi Today Episode: తులసికి షాకిచ్చిన బ్యాంక్ మేనేజర్.. దివ్య వల్ల బుక్కైన నందూ
దేశంలోని చాలా భాషలతో పోల్చుకుంటే తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు మాత్రమే సుదీర్ఘ కాలంగా ప్రేక్షకుల నుంచి భారీ నుంచి అతి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోందన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' గురువారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరు కూడా ఓ లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే
బుధవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. ప్రేమ్, శృతి కూరగాయల కోసం నడుచుకుంటూ వెళ్తుంటారు. ఆ సమయంలో ఇద్దరూ సరదాగా మాట్లాడుతూ వస్తుండగా.. తులసి వచ్చి శృతిని ఢీకొట్టబోతుంది. అప్పుడు ఒకరినొకరు చూసుకుని షాక్ అవుతారు. ఆ సమయంలో ప్రేమ్.. తన తల్లితో మాట్లాడడానికి ఎంతగానో ప్రయత్నిస్తాడు. కానీ, తులసి మాత్రం దానికి నిరాకరిస్తుంది. ఇక, ఇంటి అడ్వాన్స్ కోసం ఓనర్ గొడవ చేయగా.. రాములమ్మ వచ్చి డబ్బు కట్టేస్తుంది. మరోవైపు, దివ్య తన స్నేహితుల కోసం వేచి చూస్తుంది. పరందామయ్య, అనసూయ కూడా రెడీ అవుతారు.

లోన్ కోసం తప్పుదారి... తులసి ఇలా
లోన్ తీసుకుందామని మేనేజర్ తులసిని ఒప్పిస్తాడు. అందుకు అనుగుణంగానే అతడు లోన్ కోసం ఒక ఆఫీసర్‌ను తీసుకొస్తాడు. తులసి ఫ్యాక్టరీ బ్యాలెన్స్ షీట్ చూసిన బ్యాంక్ మేనేజర్.. ఇప్పటికే దీని మీద లోన్ ఉంది కదా అంటాడు. దీనికి తులసి మేనేజర్ మాకు అడిషనల్ లోన్ కావాలంటాడు. దీనికాయన కుదరదు అంటాడు. అప్పుడు తులసి మేనేజర్ ‘వీళ్లు అలాగే అంటారు మేడమ్ తర్వాత.. మనం పర్సనల్‌గా మాట్లాడితే వాళ్లే లోన్ ఇస్తారు. కాకపోతే మనం కొన్ని డాక్యుమెంట్ల విషయంలో తప్పుడుగా వెళ్లాల్సి వస్తుంది' అంటాడు. అలా అయితే తులసి వద్దు అంటుంది.

దివ్య సందడి.. లాస్యపై నందూ ఫైర్
దివ్య కోసం నందూ కేఫ్ నుంచి లాస్య ఫుడ్ ఆర్డర్ ఇస్తుంది. దీంతో డెలివరీ బాయ్ వెళ్లి నందూకు ఆర్డర్ చెబుతాడు. అంతేకాదు, దానికి అయ్యే డబ్బు 8000 మీరే కడతారని లాస్య మేడమ్ చెప్పింది అంటాడు. దీంతో నందూకు ఆమెపై బాగా చిరాకు వస్తుంది. సరే.. అని చెప్పి ఆ డబ్బు తానే కట్టి ఆర్డర్ పంపిస్తాడు. లాస్య మీద నందూకు కోపం అంతకంతకూ పెరుగుతూనే ఉంటుంది. అప్పుడు ‘కనీసం ఒక్క మాట కూడా చెప్పకుండా లాస్య ఇలా చేసిందేంటి. లాస్యకు వంట రాకపోవడం వల్ల నాకు 8000 బొక్క. తను ఎప్పుడూ ఇలాగే డిసప్పాయింట్ చేస్తుంది' అని అనుకుంటాడు.

లోన్‌కు తులసి... జాబ్ కోసం ప్రేమ్
లోన్ కోసం బ్యాంక్ మేనేజర్‌తో తులసి మరోసారి మాట్లాడుతుంది. కానీ, ఆయన మాత్రం దానికి ఒప్పుకోడు. దీంతో ఏం చేయాలో తులసికి అర్థం కాదు. మరోవైపు ప్రేమ్.. మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి అవకాశం కోసం వెళ్తాడు. ఓ మ్యూజిక్ డైరెక్టర్‌ను కలిసిన తర్వాత ‘పాటలు రాస్తాను.. గిటార్ వాయిస్తాను.. పాటలు పాడుతాను' అంటాడు ప్రేమ్.
దీంతో ఆ డైరెక్టర్ ‘ఆఫీసులో ఆ పని ఈ పని అన్నీ చేయి.. ఆ తర్వాత చూద్దాం' అంటాడు. దీనికి ప్రేమ్ ‘ఆ పని ఈ పని అంటే.. ఆఫీస్ బాయ్‌గానా' అంటాడు. దీనికాయన ‘లేదయ్యా.. డైరెక్ట్‌గా నీకు మ్యూజిక్ డైరెక్టర్ పోస్ట్ ఇస్తారు' అంటూ వెటకారంగా మాట్లాడుతూ హేళన చేస్తాడు. దీంతో ఆ పని చేయలేనని ప్రేమ్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

తులసితో గొడవకు దిగిన కూతురు
ఫ్యాక్టరీ లోన్ కోసం ప్రయత్నించి విఫలమైన తులసి చిరాకుగా ఇంటికి వస్తుంది. వచ్చీ రావడమే తినకుండా వేస్ట్ చేసిన ఫుడ్ కనిపిస్తుంది. ఆ సమయంలోనే నందూ కూడా అక్కడకు వస్తాడు. అప్పుడు తులసి ఏంటి ఇదంతా అని దివ్యను ప్రశ్నిస్తుంది. దీనికామె ‘కనిపించడంలేదా.. మా ఫ్రెండ్స్ వచ్చారు. పుడ్ తిన్నాం. ఎక్కువైంది వదిలేశాం' అని చెబుతుంది. అప్పుడు తులసి ‘ఎందుకు ఇంత ఆర్డర్ చేశారు. తినకుండా వేస్ట్ చేశారు' అని అడుగుతుంది.
దీనికి లాస్య ‘ఏదో కాస్త ఫుడ్ మిగిలిపోతే దాన్ని ఇంత ఇష్యూ చేయాలా' అని అడుగుతుంది. అప్పుడు తులసి ‘పిల్లలకు మంచి చెడ్డలు తెలియనప్పుడు పెద్దవాళ్లు దగ్గరుండి నేర్పించాలి. అంతే కానీ.. సపోర్ట్ చేయడం కాదు' అంటుంది.

దివ్యను చెంపదెబ్బ కొట్టిన తులసి
తులసి మాటలకు దివ్యకు కోపం వచ్చి ‘అసలు నీ ప్రాబ్లమ్ ఏంటి మామ్. కావాలని మామ్ నన్ను ఇన్ సల్ట్ చేస్తుంది. ఏదో ఒక కారణంతో నన్ను ఇంట్లో నుంచి తరిమేయాలని చూస్తోంది. కాదని చెప్పు అమ్మ. అయినా ఎందుకు నువ్వు గింజుకుంటున్నావు. నీ డబ్బులు కాదు కదా. నేను మా డాడీ డబ్బులతో తెచ్చుకున్నాను. అర్థం అయిందా' అని అంటుంది. దీంతో దివ్య చెంప చెళ్లుమనిపిస్తుంది తులసి. అంతేకాదు, ‘అంత పొగరు పెరిగిపోయిందా నీకు. నీ డబ్బులు, నా డబ్బుల, డాడీ డబ్బులు అంటూ వేరు చేసి మాట్లాడుతావా. ఇంకోసారి నీ నోట్లో నుంచి అటువంటి మాట రావాలి పళ్లు రాలగొడుతాను' అంటుంది.

తులసి మీద డబ్బు విసిరిన దివ్య
దివ్యను కొట్టగానే లాస్య ‘ఏంటి నందు ఇది.. నీ కూతురును కొడుతుంటే నువ్వు మాట్లాడవా' అని అడుగుతుంది. దీనికి దివ్య ‘ఏంటి డాడీ ఇది.. మొన్న ప్రేమ్ అన్నయ్యను కొట్టింది. ఈరోజు నన్ను కొట్టింది. మేమేమన్నా చిన్నపిల్లలమా. ఐ హేట్ యూ మామ్. నువ్వు అసలు నాకు నచ్చలేదు.. ఐ హేట్ యూ' అంటూ వెళ్లిపోతుంది. ఆ తర్వాత నందూ ‘దివ్యను కొట్టకుండా ఉండాల్సింది. దివ్య ఫుడ్ వేస్ట్ చేయడం తప్పే.. దానికి నువ్వు అలా వైల్డ్‌గా రియాక్ట్ అవడం కరెక్ట్ కాదు' అంటాడు. ఆ సమయంలో దివ్య మామ్.. ఇదిగో నీ డబ్బులు అని అక్కడ విసిరేస్తుంది.
Recommended Video


డబ్బులు లేకపోతే చచ్చిపోతాను
దివ్య తన దగ్గర ఉన్న డబ్బులు విసిరేసిన తర్వాత ‘చాలా.. ఇంకా కావాలా? నా ఫుడ్ కోసం డాడీ ఖర్చు పెట్టిన డబ్బులు. నా గురించి ఎవ్వరూ ఆలోచించాల్సిన అవసరం లేదు. నాకు ఎవ్వరూ సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. మీ డబ్బులు ఖర్చు పెట్టించినందుకే కదా.. మీరు నాకు సపోర్ట్ చేయలేదు. ఇక నుంచి నాకు ఎవ్వరూ ఏదీ చేయాల్సిన అవసరం లేదు.
నా దగ్గర డబ్బులు ఉంటేనే ఇక్కడ అన్నం తింటాను. లేకపోతే తినను.. పస్తులు ఉంటాను.. అలాగే చచ్చిపోతాను' అంటుంది. మరోవైపు, బాబూరావును అతడి భార్య వెతుక్కుంటూ వస్తుంది. అతడు శృతి ఇంట్లో దాక్కుంటాడు. ఆ తర్వాత బయటకు పిలిచి పిచ్చకొట్టుడు కొడుతుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











