Intinti Gruhalakshmi Today Episode: ప్రేమ్‌కు తులసి సర్‌ప్రైజ్.. ఉద్యోగం రాకపోవడంతో కఠిన నిర్ణయం

చాలా భాషలతో పోల్చుకుంటే తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు మాత్రమే సుదీర్ఘ కాలంగా ప్రేక్షకుల నుంచి భారీ నుంచి అతి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోందన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శుక్రవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరు కూడా ఓ లుక్కేయండి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

గురువారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. ఫ్యాక్టరీ మీద లోన్ తీసుకుందామని మేనేజర్ ఇచ్చిన సలహాతో తులసి బ్యాంక్ వాళ్లతో మాట్లాడుతుంది. కానీ, వాళ్లు మాత్రం అప్పటికే లోన్ ఉండడంతో మళ్లీ ఇవ్వమని అంటారు. మరోవైపు, లాస్య చెప్పిందని నందూ కేఫ్ నుంచి దివ్యకు కొన్ని ఆహార పదార్ధాలను తీసుకు వెళ్తారు. దీంతో నందూకు కోపం వస్తుంది. ఇక, అప్పుడే ఇంటికి వచ్చిన తులసికి దివ్య వాళ్లు పడేసిన ఆహారం కనిపిస్తుంది. దీంతో ఆమె కూతురితో గొడవ పడుతుంది. ఒక సమయంలో కొడుతుంది. ఇక, ప్రేమ్ ఉద్యోగం కోసం వెళ్లి అవమానభారంతో ఇంటికి తిరిగి వచ్చేస్తాడు.

బాబూరావుపై ఘాటుగా ఫైరైన భార్య

బాబూరావుపై ఘాటుగా ఫైరైన భార్య

భార్య వెంబడిస్తుండగా.. శృతి వాళ్ల ఇంట్లో దాక్కుంటాడు ఇంటి ఓనర్ బాబూరావు. ఆ తర్వాత బయటకు వచ్చిన అతడిని భార్య వాళ్ల ముందే పిచ్చకొట్టుడు కొడుతుంది. అప్పుడు ప్రేమ్, శృతి ఆమెను ఆపే ప్రయత్నం చేస్తారు. దీంతో ఆమె '10 లక్షలు తీసుకొని బిజినెస్ పెట్టి లాస్ వచ్చిందని చెప్పి ఇప్పుడు ఖాళీగా రోడ్లు పట్టుకొని తిరుగుతున్నాడు. నిన్ను పెళ్లి చేసుకున్న పాపానికి నీతో పాటు నేను కూడా బాధపడాలా. కడుపు కాలుతున్నప్పుడు ఆలోచించాల్సింది పరువు గురించి కాదు.. కడుపు నింపుకోవడం గురించి' అంటూ బాబురావును ఘోరంగా తిడుతుంది.

ఇంటి ఓనర్లను కలిపిన శృతి, ప్రేమ్

ఇంటి ఓనర్లను కలిపిన శృతి, ప్రేమ్

ఎంత చెప్పినా వినకపోవడంతో శృతి 'ఆంటి.. మీరు చెప్పారు కదా.. బాబాయి ఇక నుంచి ఎలాంటి పొరపాట్లు చేయరు. భార్యాభర్తలు ఒకరిని ఒకరు అర్థం చేసుకొని సర్దుకుపోతే కాపురం సాఫీగా నడుస్తుంది' అంటుంది. అలాగే, ప్రేమ్ కూడా వివరిస్తాడు. దీంతో బాబూరావు 'ఇకపై ఎలాంటి తప్పులు చేయను. అస్సలు అప్పులు చేయను. ఇకపై బుద్ధిగా ఇంట్లోనే పడుంటాను. నన్ను క్షమించవే' అంటూ వేడుకుంటాడు. దీంతో అతడి భార్య కూడా శాంతిస్తుంది. ఆ తర్వాత సరేమ్మా.. వెళ్లొస్తాం.. పదండి అంటుంది తన భార్య. బాబూరావును తీసుకొని వెళ్తుంది.

దివ్యకు అంకిత క్లాస్.. అభి మాటతో

దివ్యకు అంకిత క్లాస్.. అభి మాటతో

తులసి మీద కోపం పెంచుకుంటూ ఉన్న దివ్యతో అంకిత 'నీకు ఆంటీలో కోపం కనిపిస్తోంది కానీ.. తన కూతురు ఎక్కడ దారి తప్పుతుందో అని తెలియడం లేదా' అని నిలదీస్తుంది. దీనికి అక్కడే ఉన్న అభి 'అదేదో తప్పు చేసిందని అందరూ తనకు మామ్‌లా క్లాసులు పీకుతున్నారా? తనను అలా ఉండనివ్వు' అని వెనకేసుకుని వస్తాడు. దీంతో దివ్య 'నన్ను అందరూ విసిగిస్తున్నారు' అంటుంది. అప్పుడు అంకిత 'నువ్వు కూడా దివ్యను చెడగొడుతున్నావు ఎందుకు అభి' అని అడుగుతుంది. అప్పుడు దివ్య 'నాకు ఇప్పుడు ఎవ్వరి మాటలు వినాలని లేదు. దయచేసి నన్ను ఒంటరిగా వదిలేయండి' అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. దీంతో అభి.. అంకితపై మండిపడతాడు.

రాములమ్మతో కష్టం చెప్పిన ప్రేమ్

రాములమ్మతో కష్టం చెప్పిన ప్రేమ్

బాబూరావు భార్య అన్న మాటలను ఆలోచిస్తూ బాధపడుతుంటాడు ప్రేమ్. అంతలో రాములమ్మ వచ్చి 'బాబూ మీకు ఇష్టమని జున్ను తీసుకుని వచ్చాను' అంటుంది. కానీ, ప్రేమ్ మాత్రం అస్సలు పట్టించుకోకుండా ఏదో ఆలోచిస్తుంటాడు. అప్పుడామె పదే పదే పిలుస్తుంది. దీంతో ప్రేమ్ 'నా ఇష్టాల మీదనే నాకు విరక్తిగా ఉంది రాములమ్మ. నా వాళ్లు అంటే నాకు ఇష్టం. కానీ.. నేను ఇప్పుడు అందరికీ దూరంగా ఉన్నాను. చివరకు శృతి అంటే కూడా ఇష్టం. కానీ.. తనను కూడా నాతో పాటే ఇబ్బంది పెడుతున్నాను. అందుకే దేనిపైనా ఇష్టం ఉండకూడదు' అంటాడు.

ఆటోను నడపాలని ప్రేమ్ నిర్ణయం

ఆటోను నడపాలని ప్రేమ్ నిర్ణయం

రాములమ్మతో 'మీ బస్తీలో అద్దెకు ఆటో దొరుకుతుందని చెప్పావు కదా. ఇప్పిస్తావా.. నడుపుకుంటాను' అంటాడు. దీంతో ఆమె 'కార్లలో తిరగాల్సిన వాడివి.. నువ్వు ఆటో నడుపుకోవడం ఏంటి బాబు.. వద్దు' అంటుంది. అప్పుడు ప్రేమ్ 'కానీ.. నాకు ఇష్టమైన సంగీతం ఇప్పుడు నాకు అవకాశాలు ఇవ్వలేనప్పుడు మనం వేరే దారి వెతుక్కోవాలి కానీ.. ప్రయాణం ఆపకూడదు అనే నిజం ఇప్పుడే తెలుసుకున్నాను రాములమ్మ' అంటాడు. దీనికామె 'మీరు ఆటో నడపడం నాకు ఇష్టం లేదు బాబు కానీ.. మీకోసం మాట్లాడుతా. మరి.. శృతి అమ్మకు ఈ విషయం చెప్పారా' అని అడుగుతుంది రాములమ్మ. దీంతో చెప్పలేదు అంటాడు ప్రేమ్. ఇంతలో శృతి వచ్చి.. ఏంటి అని ప్రశ్నించగా.. రాములమ్మ మాట మార్చి వేరే న్యూస్ చెబుతుంది.

నందూను పంపిద్దామన్న అనసూయ

నందూను పంపిద్దామన్న అనసూయ


ఇక, అనసూయ దగ్గరకు వెళ్లిన తులసి 'పిల్లలు బాధపడితే ఓదార్చడానికి అమ్మ ఉంది. మరి.. అమ్మే బాధపడితే ఓదార్చడానికి ఎవరు ఉన్నారు అత్తయ్యా. బయట వాళ్లు ఎలాంటి మాటలు అన్నా మనసు పట్టించుకోదు. అదే మన అనుకున్న వాళ్లు చిన్న మాట అన్నా తట్టుకోలేదు. ఇప్పుడు నా సంఘర్షణ అదే అత్తయ్య. దివ్య నన్ను పూర్తిగా పరాయిదాన్ని చేసింది. దివ్యను నా దారిలోకి తెచ్చుకోవడానికి లేకుండా లాస్య అడ్డం పడుతోంది' అని ఫిర్యాదు చేస్తుంది. దీంతో అనసూయ 'నందూను ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని చెబుదాం. ఎలాగైనా ఆ లాస్యను వదిలించుకోవాలంటే.. నందూను ఇంట్లో నుంచి బయటికి పంపించేయాలి' అంటుంది.

ప్రేమ్ బర్త్‌డే.. అవన్నీ గుర్తు చేసుకుని

ప్రేమ్ బర్త్‌డే.. అవన్నీ గుర్తు చేసుకుని

అర్ధరాత్రి శృతి క్యాండిల్స్ వెలిగించి ప్లమ్ కేక్ తెచ్చి ప్రేమ్‌కు హ్యాపీ బర్త్‌డే చెబుతుంది. దీంతో సంతోషిస్తాడు ప్రేమ్. ఆ తర్వాత కేక్ తినిపిస్తుంది. నా బర్త్‌డే మరిచిపోయావని అనుకున్నా అంటాడు ప్రేమ్. దీంతో 'నా జీవితంలో నిన్ను, నీ మాటలను, నీ బర్త్ డేను ఎప్పటికీ మరిచిపోను. ఒక్క ప్రేమను తప్ప ఇంకేం ఆలోచించకుండా జీవితాంతం భర్త కోసం బతికేదే భార్య.. నేను అలాంటి భార్యనే' అంటుంది. దీంతో ప్రేమ్ తన గత పుట్టినరోజును గుర్తు చేసుకుంటాడు. అప్పుడు తులసితో పాటు అందరూ అతడిని సర్‌ప్రైజ్ చేయడానికి ప్లాన్ చేస్తుంటారు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X