Intinti Gruhalakshmi: దీపక్ రాకతో తులసి ఇంట్లో టెన్షన్.. రొమాన్స్ చేస్తూ దొరికిపోవడంతో!
దాదాపు రెండు మూడు దశాబ్దాలుగా తెలుగు టెలివిజన్‌పై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శనివారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే
శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. లాస్యకు వాసుదేవ్ ఓ పని చెప్పగానే ఆమె చేయడానికి ఒప్పుకోదు. దీంతో నందూ కూడా కోపంగా అరుస్తాడు. అప్పుడు తప్పక ఆమె వెళ్లిపోతుంది. ఆ తర్వాత తులసి గదిలోనే నందూను పడుకోవాలని వాసుదేవ్ అంటాడు. దీంతో చేసేదేం లేక నందూ, తులసి ఒకే చోట నిద్రిస్తారు.
ఆ సమయంలో లాస్య తనలో తానే రగిలిపోతూ ఉంటుంది. అప్పుడే వాసుదేవ్ వచ్చి నిజం తెలిసిపోయిందని పెద్ద గొడవ చేస్తాడు. దీంతో అందరూ షాక్ అవుతారు. అప్పుడే నందూ, తులసి పెళ్లిరోజు అని ఫ్లవర్ బొకేతో విష్ చేసి అందరినీ సర్‌ప్రైజ్ చేసేస్తాడు.

అలాంటోడు పెళ్లికి అనర్హుడు
తులసి ఉదయాన్నే బయట నుంచి వస్తుండగా వాసుదేవ్, అతడి భార్య కలిసి ఆమెను ఆపి ఎక్కడికి వెళ్లావు అని ప్రశ్నిస్తారు. దీంతో తులసి 'సోమవారం కదా అన్నయ్యా. గుడికి వెళ్లి వస్తున్నా' అని చెబుతుంది. దీంతో వాసుదేవ్ 'సోమవారం అని వెళ్ళావా? లేక మ్యారేజ్ డే అని వెళ్ళావా? అయినా పెళ్లి రోజు భర్త పక్కన లేకుండా గుడికి వెళ్లడం ఏంటమ్మా? అయినా మీరు ఇలా పంపించారు' అని ప్రశ్నిస్తాడు.
దీంతో లాస్య ఆయన బిజీగా ఉండడం వల్ల రాను అని చెప్పారు అంటుంది. దీంతో వాసుదేవ్ 'బిజీగా ఉండటం ఏంటి పెళ్లి రోజు భార్య పక్కన లేని మగాడు అసలు పెళ్లి చేసుకోవడానికి అనర్హుడు' అని సీరియస్ అవుతాడు.

తులసికి విడాకులు ఇచ్చేయ్
కోపంతో ఉన్న వాసుదేవ్.. నందూను పిలుస్తాడు. అతడు వచ్చిన వెంటనే 'అర్జెంటుగా నా చెల్లెలికి విడాకులు ఇచ్చేయ్' అంటాడు. దీంతో వాసుదేవ్ భార్య 'శుభమా అని పెళ్లి రోజు చేసుకుంటుంటే.. ఇలాంటి మాటలు ఏంటండీ' అని ప్రశ్నిస్తుంది.
దీంతో అతడు 'మరి వాడు చేసింది ఏంటి? తులసి పిలిచినప్పుడు గుడికి వెళ్లకుండా వాడికి అంతకుమించిన పనులు ఏమున్నాయి? తులసి ఎంత హర్ట్ అయి ఉంటుంది' అని అంటాడు. అప్పుడు లాస్య గంట గంటకు టెన్షన్ పెడుతూ ఆటాడుకుంటున్నాడు అని మనసులోనే అనుకుంటూ ఉంటుంది.

లాస్యకు రాములమ్మ ఝలక్
తర్వాత వాసుదేవ్ 'తులసిని ఇప్పటి నుంచైనా జాగ్రత్తగా చూసుకో' అని అనడంతో సరేనని నందూ మాట ఇస్తాడు. తర్వాత వాసు 'చూడమ్మా తులసి.. వీడు నిన్ను సరిగా చూసుకోకపోతే నాకు ఒక ఫోన్ కాల్ కొట్టు. వెంటనే బిజినెస్ డీల్ క్యాన్సిల్ చేసుకుంటాను' అంటాడు. దీంతో నందూ షాక్ అవుతాడు.
అప్పుడు వాసుదేవ్ దంపతులు తులసి, నందూకు కొత్త బట్టలు ఇచ్చి పెళ్లిరోజు శుభాకాంక్షలు చెబుతారు. తర్వాత 'సాయంత్రం పార్టీ ఉంది. మీరు ఈ బట్టలు కట్టుకోవాలి. లాస్య ఆ పార్టీలో వీళ్ళు బట్టలు వేసుకునేలా చేయాల్సింది నువ్వే' అని అంటారు. ఆ తర్వాత రాములమ్మ 'తులసమ్మ, నందూ బాబు పక్కపక్కన ఉంటేనే మీకు కడుపు మంటగా ఉందే.. అలాంటప్పుడు శాశ్వతంగా తీసుకున్నప్పుడు ఆ అమ్మకు ఎంత కడుపు రగిలిపోవాలి' అంటుంది.

దీపక్ ఎంట్రీ.. టెన్షన్ టెన్షన్
పెళ్లిరోజు జరుగుతూ ఉండగా దీపక్ అక్కడికి రావడంతో అందరూ టెన్షన్ పడుతుంటారు. అప్పుడు వాసుదేవ్, దీపక్‌తో 'మేము వచ్చామని చూడ్డానికి వచ్చావా? లేక మీ అక్క బావ పెళ్లి రోజు అని విషెస్ చేయడానికి వచ్చావా' అని ప్రశ్నిస్తాడు. దీంతో దీపక్‌కు ఏమీ అర్థం కాదు. ఆ సమయంలో అందరి ప్రవర్తన చూసి ఇప్పుడేమీ మాట్లాడకూడదు అనుకుంటాడు.
అనంతరం 'విడాకులు ఇచ్చిన బావగారితో ఎందుకు పెళ్లిరోజు జరుపుకుంటున్నావు' అని తులసిని ప్రశ్నిస్తాడు. అప్పుడు తులసి 'ఎంత కాదనుకున్నా ఆయన నాతో 25 ఏళ్లు కాపురం చేశారు. అలా అని అతని మీద నాకు ప్రేమ లేదు.. ఫీలింగ్ లేదు. అయినా కేవలం నా పిల్లలకు తండ్రి స్థానంలో ఉన్నారు కాబట్టి గౌరవిస్తున్నాను' అని చెబుతుంది.

నేను చిన్నపిల్లను కాదంటూ
తులసి మాటలకు దీపక్ 'మరి భార్యగా నటించడం తప్పు కాదా. కెఫే విషయంలో నువ్వు సపోర్ట్ చేయడం నాకేం నచ్చడం లేదు అక్క' అని ప్రశ్నిస్తాడు. దీంతో తులసి 'నేను ఆయనకు దూరంగా ఉంటే పిల్లలు కూడా ఆయనకు దూరంగా ఉంటున్నారు. తండ్రి పిల్లలను దూరం చేయడం నాకు ఇష్టం లేదు' అంటుంది.
దీంతో దీపక్ నీ ఫీలింగ్స్‌ను వాళ్ళు అర్థం చేసుకోవడం లేదు కదా అక్క అనగా.. అది నాకు అనవసరం అని అంటుంది. దీంతో దీపక్ వాళ్ళ స్వార్థం కోసం నిన్ను వాడుకుంటున్నారు అక్క అని అంటాడు. దీనికామె 'నేనేం చిన్నపిల్లలని కాదు దీపక్. ఎవరి మనసులో ఏది ఉంది అర్థం చేసుకోలేకపోవడానికి' అని అంటుంది.
మరోసారి దొరికిన సంజయ్
ఇక, దివ్య దగ్గరికి ఒక ఆవిడ వచ్చి మీరు 8,000 అవుతుందని చెప్పారు ఇక్కడి వాళ్లేమో 25000 రాశారు అని చెబుతుంది. దీంతో దివ్య ఒక్క నిమిషం ఆగండి ఇప్పుడే వస్తాను అని అక్కడి నుంచి వెళ్తుంది. అప్పుడే సంజయ్ నర్సుతో రొమాన్స్ చేస్తుంటాడు. అంతలోనే దివ్య అక్కడికి వస్తుంది. దీంతో సంజయ్ 'నీకు బొత్తిగా సెన్స్ లేదా? పిలవకుండా అడగకుండా వచ్చి డిస్టర్బ్ చేస్తున్నావు' అని సీరియస్ అవుతాడు.
దీంతో అసలు నా పేషేంట్‌కు మీరెందుకు టెస్టులు రాయించారు అని ప్రశ్నిస్తుంది. అప్పుడు సంజయ్ 'మీకు మాత్రమే పేషెంట్ కాదు.. మా పేషెంట్ కూడా. తనకేం టెస్టులు చేయాలో మేము డిసైడ్ చేస్తాము. ఈ బిల్ విషయంలో నువ్వు ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వకు. నీ పని నువ్వు చూసుకో' అని సీరియస్ అవుతాడు.

విక్రమ్‌ను బ్లాక్‌మెయిల్ చేసి
విక్రమ్‌ను తన చుట్టూ తిప్పుకోవడం కోసం రాజ్యలక్ష్మి దొంగ పూజలు చేస్తుంది. ఆమెకు బసవయ్య వాళ్లు కూడా సహకారం అందిస్తారు. విక్రమ్ వచ్చాడని మరింతగా మాట్లాడుతుంటారు. అప్పుడు రాజ్యలక్ష్మి 'ఎందుకు స్వామి? నేను ఏం తప్పు చేశాను? నా బిడ్డను నాకు దూరం చేస్తున్నావు? నా బిడ్డ నా దగ్గరికి వచ్చే వరకు నేను ఎవరి మాట వినను' అంటూ కళ్ళు తిరిగి కింద పడిపోయినట్టు నటిస్తుంది.
అలా విక్రమ్‌ను ఎమోషనల్‌గా బ్లాక్‌మెయిల్ చేస్తుంది. ఇక, దివ్య.. సంజయ్ గురించి రాజ్యలక్ష్మికి చెప్పాలనుకుంటుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











